అవును నేను మావోయిస్టునే..!


అవును నేను మావోయిస్టునే..!

అవును

(రచయిత మోహన సుందరం తన ఫేస్ బుక్ టైంలైన్ పై పోస్ట్ చేసిన ఈ ఆర్టికల్ మీకోసం...)

అవును
అతడి పేరు మావోయిస్టు
అతడి ఊరు మావోయిస్టుల చిరునామా.

అవును
అతడు చీకటి చట్టాల సాక్షిగా నిందితుడు
అతడు చెదలుబారిన రాజ్యాంగం సాక్షిగా రాజద్రోహి.

అభయ్ జాక్సన్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఓ ఆదివాసీ మేధావి. మారుమూల అటవీ గ్రామాన్నుండీ అతికష్టం మీద చదువుకొని ఢిల్లీ జె ఎన్ యు లో సోషల్ సైన్స్ మాస్టర్ డిగ్రీ చేసిన మేధావి.రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ప్రకారం అతనికి మంచి ఉద్యోగం, హోదా , సుఖవంతమైన జీవితం దొరికుండేవి. కానీ అతడు తన వేళ్ళని తన అడవి నుంచి, తన శిథిల గ్రామాన్నుండీ, తన ఛిద్ర బాల్యం నుండీ పెకలించుకోలేక పోయాడు. అందుకే ఆనవాలు కోల్పోతోన్న తన అడవికోసం గొంతెత్తాడు. "ఆదివాసీ మేధావుల ఫోరం" నిర్మించి అడవి మీద ప్రభుత్వం చేస్తోన్న దాడిని , దమనకాండని బయటి ప్రపంచానికి తెలిసేలా ఎలుగెత్తడం ప్రారంభించాడు. అంతే రాజ్యం అతడ్ని మావోయిస్టుగా గుర్తించి, అతడి మీద దాడి మొదలు పెట్టింది. వందలాది కేసులు, చిత్రహింసలు, ఆంక్షలు... లెక్కలేదు. ఇప్పుడు అతడు తాను పుట్టి పెరిగిన తన ఆదివాసీ గ్రామానికి బహిష్కృతుడు. తన పుట్టుక వల్లే కాక తన పేరువల్లా అతడు పోలీసుల దృష్టిలో ఆజన్మ నేరస్థుడు. మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరు నే అతడు కలిగివుండటం వల్ల ఆ అభయ్ పై నమోదు అయ్యే కేసులన్నింటిలో ఈ అభయ్ జాక్సన్ విచారణ ని ఎదుర్కోవాల్సి రావడం విషాదం.

అవును నేను ముమ్మాటికీ మావోయిస్టునే అంటున్నాడు జాక్సన్. 1927 నాటి ఆటవిక అటవీ చట్టాలనే అనుసరిస్తోన్న సిగ్గులేని ప్రభుత్వాలు అడవిమీద ఆదివాసీలకు హాక్కు లేకుండా చేస్తున్నందుకు ప్రాణాలు కోల్పోయిన , కాళ్ళూ చేతులు కోల్పోయిన, మాయం చేయబడిన, జైళ్లలో కుక్కబడిన తన సహోదరుల సాక్షిగా తాను మావోయిస్టు ననే ప్రకటిస్తున్నాడు. 15 ఏళ్లక్రితం 10 ఏళ్ల తన తమ్ముడ్ని పోలీసులు అరెస్ట్ చేసి పెట్టిన తీవ్ర చిత్రహింసల సాక్షిగా తాను మావోయిస్టునేనని స్పష్టం చేస్తున్నాడు. బహుళజాతి కంపెనీల కోసం 40 శాతం ధ్వంసమైన తన అడివి సాక్షిగా తాను కచ్చితంగా తాను మావోయిస్టునేనని ఎలుగెత్తుతున్నాడు.

మేధావుల మౌనం, నిర్లిప్తతల సాక్షిగా ఈ సోషల్ సైన్టిస్ట్ ఈ రాజ్యం ద్వారా మాయం చేయబడతాడు. ఇప్పటికే రాజద్రోహం తో సహా పలుకేసుల్ని ఎదుర్కొంటున్న ఈ ఆదివాసీ మేధావి కోసం జైళ్ళు నోరు తెరుస్తాయి. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ద్వారా చదువుకోగలిగానని చెప్పే ఈ మేధావి అది తన వాళ్ళందరికీ దక్కేలా చేసేందుకే తన మూలాల్లోకి తిరిగి వెళ్లానని సగర్వంగా చెబుతున్న ఈ మేధావి అంబేద్కరిస్టులకు ఎంతవరకు ఆదర్శం కాగలుగుతాడు. అంబేద్కర్ రాజ్యాంగ ఫలాల్ని అనుభవిస్తున్న ఒక్క మేధావి అయినా ఈ ఆదివాసీ మేధావి కోసం గొంత్తెత్తుతాడా?

పర్లేదు అభయ్,
నీ అడివి ఉంది
నీ ఆకాంక్షలున్నాయి
నిన్ను బతికించుకుంటాయి.
- మోహన సుందరం

Keywords : maoist, abhay jaksan, jharkhand, JNU
(2019-08-24 12:21:27)



No. of visitors : 882

Suggested Posts


Bajrang Dal activists killed my husband: Widow of man lynched in Jharkhand

The wife of the man who was lynched in Jharkhandʹs Ramgarh district on suspicion of carrying beef has alleged that the mob that beat her husband to death mostly included Bajrang Dal activists. ʹThey were rogues owing allegiance to the Bajrang Dal,ʹ Mariam Khatoon told....

Jharkhand: Tribals hold police, district officials hostage in late-night drama

Thousands of tribals armed with traditional weapons held several senior police and administrative officers hostage at Kanki Siladon, a tribal hamlet in Khunti district, through Thursday night.....

Former Jharkhand CM Hemant Soren calls police encounter with Maoist ʹfakeʹ, demands probe

The opposition parties have termed the encounter between police and Maoist guerrillas in Giridih earlier in June as "fake" and demanded a judicial probe. The encounter had claimed one life.....

ప్రభుత్వ హత్య : ఆధార్ కార్డు లేక రేషన్ కార్డు రద్దు... చిన్నారి ఆకలి చావు

జార్ఖండ్‌లోని సిమ్దేగా జిల్లా కరీమతి గ్రామానికి చెందిన 11 ఏళ్ల సంతోషి కుమారి తండ్రి మతిస్థిమితం కోల్పోవడంతో, తల్లి కొయిలీ దేవీనే పిల్లల్ని సాకుతోంది. ఆమెకు సంతోషితోపాటు మరో పాప కూడా ఉంది. దుర్భర పేదరికంలో జీవిస్తోన్న వారి కుటుంబానికి పౌరసరఫరాల శాఖ నుంచి అందే రేషన్‌ సరుకులే దిక్కు....

demanding the immediate release of Damodar Turi

We strongly condemn the unlawful arrest of Damodar Turi (Central Convenor Committee member of Visthapan Virodhi Jan Vikas Andolan) by Jharakhand Police on 15 February 2018. And demand for immediate release for him.

Condemn arrest of Damodar Turi by Jharkhand Police - PPSC

Persecuted Prisonersʹ Solidarity Committee (PPSC) condemns the continued repression on activists and groups associated with peopleʹs struggles in Jharkhand by the police and administration. Damodar Turi, a member of the Central Committee of Visthapan Virodhi Jan Vikas Andolan (VVIVA), was arrested in the evening on 15" February 2018 from Ranchi.

RELEASE ANTI-DISPLACEMENT ACTIVIST DAMODAR TURI

PUDR condemns the arrest of anti-displacement activist and founder member of ʹVisthapan Virodhi Jan Vikas Andolanʹ (VJVA) Damodar Turi, on February 15, 2018 at Ranchi, an hour after the ʹLoktantra Bachao Manchʹ (Save Democracy Forum) organized meeting had ended.

Search Engine

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!
కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు
నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
more..


అవును