ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు


ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు

ఎడ్సిమెట్ట

వర్షాలు వచ్చే ముందు ఆదివాసులు నాలుగు రోజులపాటు విత్తన పండుగను జరుపుకుంటారు. చత్తీస్ గడ్ రాష్ట్రం భీజాపూర్ జిల్లా ఎడ్సిమెట్ట గ్రామంలో ఆరోజు( May 17, 2013) విత్తన పండుగ చివరి రోజు . ఆ రాత్రి గ్రామానికి చెందిన 100 మంది ఆదివాసులు ఒక్క చోటే గుమిగూడారు. అదే సమయంలో దాదాపు 150 మంది సీఆర్పీఎఫ్ కు చెందిన కోబ్రా బలగాలు ఎడ్సిమెట్ట గ్రామాన్ని చుట్టుముట్టి గ్రామస్తులమీదకు బుల్లెట్ల వర్షం కురిపించారు. దాంతో చెల్లాచెదురైన ఆదివాసులు పుట్టకొకరు చెట్టుకొకరుగా పరుగులు తీశారు. అలా అడవుల్లోకి పారిపోయిన ఆదివాసులు ఉదయాన్నే భయం భయంగా గ్రామం చేరుకొని చూసే సరికి అక్కడ తమ వాళ్ళ శవాలు కనిపించాయి. చెల్లా చెదురుగా దూరం దూరంగా తమవాళ్ళు 8మంది చనిపోయిఉండడాన్ని చూసి బోరుమన్నారు ఆదివాసులు...చనిపోయిన వారిలో 4గురు చిన్నారులు,ఒకరు విత్తన పండుగ జరిపించిన పూజారి. వీళ్ళే కాక ఆ రాత్రి పోలీసులు జరిపిన విచ్చలవిడి కాల్పుల్లో వాళ్ళ కొల్లీగైన ఓ కానిస్టేబుల్ కూడా చనిపోయాడు. చనిపోయిన వాళ్ళు 35 ఏళ్ళ‌ కరమ్ సోములు,35 ఏళ్ళ కరంజోగ, 30 ఏళ్ళ పూనెమ్ సోము, 37 ఏళ్ళ పూజారి కరమ్ పండు, చిన్నారులు 10 ఏళ్ళ కరమ్ గుడ్డు, 16 ఏళ్ళ కరమ్ మాసా, 8 ఏళ్ళ కరమ్ భద్రు, 15ఏళ్ళ పూనెమ్ లక్కు తోపాటు కోబ్రా కానిస్టేబుల్ దేవ్ ప్రకాశ్ లు.

ఇంత దుర్మార్గంగా పోలీసులు నిరాయుధులైన ఆదివాసులపై ఏకపక్షంగా కాల్పులు జరిపి 8 మందిని పొట్ట్నపెట్టుకుంటే పొద్దున పత్రికలు
. ʹʹచత్తీస్ గడ్ రాష్ట్రం భీజాపూర్ జిల్లా ఎడ్సిమెట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సీఆర్పీఎఫ్ కోబ్రా దళానికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 7గురు మావోయిస్టులు ఒక కానిస్టేబుల్ చనిపోయారుʹʹ అని పోలీసుల కట్టు కథను తమ కథనంగా ప్రచురించాయి. ఈ సంఘటనపై ఆదివాసులు, ఆదివాసీ సంఘాలు, హక్కుల సంఘాలు ఆందోళనబాటపట్టడంతో మాట మార్చిన పోలీసులు చనిపోయింది గ్రామస్తులేనని ఒప్పుకుంటూనే అక్కడ ఉన్న మావోయిస్టులు గ్రామస్తులను షీల్డ్ గా ఉపయోగించుకున్నారని అందువల్ల తమకు మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో గ్రామస్తులు చనిపోయారని కొత్త కథను ప్రచారంచేశారు.

అయితే పోలీసులు చెబుతున్న కట్టుకథలు ఈ సమాజానికి కొత్తకాదు.. సమాజంలో ఎవ్వరూ వాళ్ళ కథలను నమ్మలేదు. ఆదివాసులను హత్య చేసిన పోలీసులను శిక్షించాలని దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు జరిగాయి.
మరో వైపు ఈ దుర్మార్గమైన సంఘటనపై పలువురు ప్రజా న్యాయవాదులు న్యాయస్థానాల తలుపుతట్టారు. దిగ్రీ ప్రసాద్ చౌహాన్ అనే మానవహక్కుల కార్యకర్త ఆరేళ్ళుగా న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. హ్యూమన్ రైట్స్ లా నెట్ వర్క్ అనే ఢిల్లీకి చెంది న్యాయ సంష్త ప్రసాద్ కు అండగా నిలబడింది. అన్ని రకాల పోరాటాల మూలంగా ఆదివాసుల, చిన్నారుల హత్యలు జరిగిన ఆరేళ్ళ తర్వాత ఎట్టకేలకుఈ నెల 3వతేదీన‌... ఈ సంఘటనపై స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి ఈ హత్యలపై దర్యాప్తు చేయవల్సిందిగా సుప్రీంకోర్టు సీబీఐ ని ఆదేశించింది. దర్యాప్తు చేసే అధికారులు చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందనివాళ్ళై ఉండాలని సుప్రీం కోర్టు చెప్పింది.

ఆరేళ్ళ తర్వాతనైనా సుప్రీంకోర్టు ఈ విధమైన తీర్పు ఇచ్చినప్పటికీ సీబీఐ చరిత్ర తెలిసినవాళ్ళకు.. ఆ దర్యాప్తు ఎలా జరుగుతుందో , రిపోర్టూ ఏ విధంగా వస్తుందో ఊహించడం పెద్దకష్ట‌మైన పని కాదు కదా !

Keywords : chattisgarh, police, adivasi, murder, firing, maoists
(2019-08-24 15:33:56)No. of visitors : 329

Suggested Posts


0 results

Search Engine

పోలీసుల దుర్మార్గం - వింటేనే ఒళ్లు జ‌ల‌ద‌రించే చిత్ర‌హింస‌లు
కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!
కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు
నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
more..


ఎడ్సిమెట్ట