కాళేశ్వ‌రం ప్రాజెక్టు చూడడం నేరమా.... 54 మంది టీచర్లను అరెస్టు చేసిన పోలీసులు


కాళేశ్వ‌రం ప్రాజెక్టు చూడడం నేరమా.... 54 మంది టీచర్లను అరెస్టు చేసిన పోలీసులు

కాళేశ్వ‌రం

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఎన్ని వేల ఎకరాల భూమికి నీరందుతుందో,ఎంత మంది రైతుల కళ్ళల్లో వెలుగులు నిండుతాయో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి మరీ తెలంగాణ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. పాలకాభిమానులు సోషల్ మీడియాలో వ్యాసాలు రాసి పడేస్తారు. అంత అద్భుతమైన‌ కాళేశ్వరం ప్రాజెక్టు చూసి రావడానికి బస్సులు పెట్టి మరీ జనాలను పంపిస్తారు. దాన్ని పెద్ద టూరిస్టు ప్లేస్ గా చేయడానికి కృషి చేస్తుంటారు. ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న జనాల గురించి పెద్ద ప్రాజెక్టుల వల్ల కలిగే పర్యావరణ నష్టాన్నిపక్కన పెట్టి వాళ్ళు చేసేదంతా కరెక్టేనని ఒప్పుకుందాం. మరి ఓ 54 మంది టీచర్లు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు చూసి రావడానికి బయలు దేరితే వాళ్ళందరినీ ఎందుకు అరెస్టు చేసినట్టు ? ఈ అరెస్టుల వెనక‌ ఉన్న మతలబు ఏంది ?

తెలంగాణ ఉద్యమంలో టీచర్లను, విద్యార్థులను వేలాదిగా కదిలించి ఉద్యమానికి ఊపిరిలూదిన డెమాక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఈ నెల 20, 21, 22 న మంచిర్యాలలో తన సభ్యుల కోసం అధ్యయన తరగతులు నిర్వహించింది. 22 మధ్యాహ్నం 54 మంది టీచర్లు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి బస్సులో బయలుదేరారు. బస్సు కొద్ది దూరం వారిని అడ్డుకున్న పోలీసులు బస్సుతో సహా మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. వాళ్ళను అడ్డుకోవడానికి, అరెస్టు చేయడానికి లేదా అదులోకి తీసుకోవడానికి కారణం కూడా చెప్పలేదు. ( బంగారు తెలంగాణలో కారణాలు చెప్పకుండా అరెస్టు చేయడం, అక్రమ కేసులు బనాయించడం మామూలే కదా) కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి టీచర్లను ఎందుకు అనుమతించరు ? ఆ ప్రాజెక్టులో ఏమైనా అక్రమాలు జరుతున్నాయా ? వీళ్ళు అక్కడికి వెళ్తే బయటపడతాయని భయమా ? లేదా ఆ ప్రాజెక్టుతో నష్టాలేమైనా ఉన్నాయా ? అసలు ఈ టీచర్లు చూస్తే ఏం జరుగుతుందని బంగారు తెలంగాణ పాలకుల భయం ?
వీటికి జవాబుకోసం ప్రతి ఒక్కరం ఆలోచించాలె. ముఖ్యంగా తెలంగాణ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలె.

టీచర్ల అరెస్టు వ్యవ‌హారంపై తెలంగాణ పౌరహక్కుల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన పూర్తి పాఠం మీకోసం....

మంచిర్యాలజిల్లా మంచిర్యాల లో, డి.టి.ఎఫ్ సంఘ ఉపాధ్యాయులు అధ్యయన తరగతులు మే, 20 ,21 మరియు22 తేదీలలో జరుపుకొని ఈరోజు "మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్" అధ్యయనానికి బయలుదేరిన 54 మంది డి. టి. ఎఫ్ ఉపాధ్యాయుల బృందాన్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి బస్సుతో సహా మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది . .కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనానికి కూడా నిర్బంధం అయితే కాలేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వవిజయమా లేక అధికార పార్టీ మోసకారితనమో టిఆర్ఎస్ పార్టీ స్పష్టం చేయాల్సి ఉంది. ప్రజల డబ్బుతో నిర్మించబడుతున్న ఏ ప్రాజెక్టు అయిన ప్రజలకు వాస్తవాలు తెలుసుకొనే హక్కు ఉంది.ఈశాన్య రాష్ట్రాలలో నిర్మించబడ్డ ప్రాజెక్టులను ఇప్పటికి,మేధావులు,ప్రజాస్వామిక వాదులు మరియు హక్కుల సంఘాల నాయకులు ప్రజలకు ఎంత వరకు ప్రాజెక్టులు ఉపయోగమో పర్యావరణానికి ఎంత మేరకు విధ్వంసం చేస్తున్నాయని అధ్యయనం చేస్తున్నారు. నాగార్జునసాగర్ నేటికీ అధ్యయనం చేసి ఎడమ మరియు కుడి కాలువల నిర్మాణాలు & ఆయకట్టు సాగు అంతరాలు కనుగొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టును ఉపాధ్యాయులు అధ్యయనం చేస్తే ప్రభుత్వం పడిపోతుందా లేక మోసాలు బహిర్గతమవుతాయా? ఇది ప్రజాస్వామ్య లక్షణం కాదు. అక్రమంగా అరెస్టు చేసిన 54 మంది డిటిఎఫ్ అధ్యాపకులను వెంటనే విడుదల చేసి మేడిగడ్డ కాళేశ్వరం అధ్యయనానికి ఉపాధ్యాయులకు మరియు చూసే ఏ వ్యక్తి లేదా సంస్థకు ఆటంకాలు కల్పించవద్దని ఈ అప్రజాస్వామిక చర్యలు,చట్టవ్యతిరేకమైన నిర్బందాలను మానుకోవాలని, చట్టబద్ద పాలన కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాము.

1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అధ్యక్షులు పౌరహక్కుల సంఘం,తెలంగాణ రాష్ట్రం.

2.ఎన్. నారాయణ రావు ప్రధాన కార్యదర్శి పౌరహక్కుల సంఘం,తెలంగాణ రాష్ట్రం

3.మాదన కుమారస్వామి,రాష్ట్ర సహాయ కార్యదర్శి,పౌరహక్కుల సంఘం,తెలంగాణ రాష్ట్రం.

4.బుద్దె సత్యం.convener,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ,పౌర హక్కుల సంఘం.

5.సారయ్య ,co convener,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ, పౌర హక్కుల సంఘం.

6.పోచన్న,co convener,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ, పౌర హక్కుల సంఘం.

Keywords : telangana, kaleshvaram, teachers, DTF, manchiryal
(2019-08-24 06:17:09)No. of visitors : 2615

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

Search Engine

పోలీసుల దుర్మార్గం - వింటేనే ఒళ్లు జ‌ల‌ద‌రించే చిత్ర‌హింస‌లు
కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!
కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు
నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
more..


కాళేశ్వ‌రం