మోడీ గెలిస్తే ఇక్కడ బతకలేం...ఊరు విడిచి వెళ్ళి పోవాల్సిందే !


మోడీ గెలిస్తే ఇక్కడ బతకలేం...ఊరు విడిచి వెళ్ళి పోవాల్సిందే !

మోడీ

కళ్ళ నిండా నీళ్ళతో వాళ్ళు పాత రోజులు గుర్తు చేసుకుంటారు. గ్రామంలో అందరు అన్నదమ్ముల తీర్గ ఎట్లా కలిసిమెలిసి ఉండేవాళ్ళో ఇప్పటికీ ఙాపకం చేసుకుంటారు. ʹఒకప్పుడు మా పిల్లలు(ముస్లిం), వారి పిల్లలు(హిందువులు) కలిసి ఆడుకునే వారు. పండుగలను కూడా కలిసే జరుపుకునే వాళ్లం. ఏ కుటుంబంలో ఐనా ఓ వ్యక్తి అనారోగ్యానికి గురయినా.. చనిపోయినా గ్రామస్తులంతా వారికి తోడుగా నిలిచేవారు. ఒకరినొకరం వరసలతో పిల్చుకుంటూ.. ఆనందంగా గడిపేవాళ్లం.ʹ పాత మధుర స్మృతులను నెమరువేసుకున్నాడు ఓ గ్రామస్తుడు.

అయినా అదంతా గతం... మోడీ, ఆదిత్యానాథ్ ల రాజ్యం రాకపూర్వపు అపురూప సమయం అది. ʹʹఎప్పుడైతే బీజేపీ అధికారంలో వచ్చిందో అప్పటి నుంచి పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పు రావడం ‍ప్రారంభించింది. హిందూ - ముస్లింల మధ్య అనుబంధం క్రమంగా తగ్గడం ప్రారంభమయ్యింది అంతేకాక యోగి ఆదిత్యనాథ్‌ యూపీ సీఏంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా పరిస్థితి మరీ దిగజారి పోయింది. యోగి తీసుకువచ్చిన ʹహిందూ ఫస్ట్‌ నినాదంʹ.. మా బతుకులను ఇబ్బందుల్లోకి నెట్టిసింది. క్రమంగా మా మధ్య దూరం ప్రారంభమయ్యింది. మాట తీరులో కూడా తేడా వచ్చేసింది. హిందూ - ముస్లింలను విడదీయడమే మోదీ, యోగిల ఏకైక అజెండాʹ

ʹʹఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబరులో జరిగిన మూక హత్య మా రెండు వర్గాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. గ్రామంలో దాదాపు 4 వేల మంది జనాభాలో మా సంఖ్య కేవలం 400 మాత్రమే. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ మా గ్రామంలో ఉండటం మంచిది కాదు అనిపిస్తుంది. మమ్మల్ని మేం రక్షించుకోవడం కోసం ఊరు విడిచి వెళ్తున్నాం. ఆర్థిక పరిస్థితులు బాగా ఉన్న కుటుంబాలన్ని ఇప్పటికే గ్రామాన్ని వదిలి వెళ్లాయి. ఈ సారి కూడా బీజేపీనే అధికారంలోకి వస్తే.. మిగతా కుటుంబాలు కూడా గ్రామం విడిచిపెట్టి వెళ్తాయి.ʹʹ ఉత్తరప్రదేశ్ లోని నయాబన్స్ గ్రామస్తుల వేదన ఇది.

4వేల మంది ఈ గ్రామ జనాభాలో ముస్లింలు 4 వందల మంది. గత సంవత్సరం డిశంబర్ లో ముస్లింలు ఆవును చంపారనే ఆరోపణలు చేసి కాశాయ మూక గ్రామస్తులను రెచ్చగొట్టింది. ఆ మూక నాయకత్వంలో వందలాది మంది ముస్లింలపై దాడికి దిగారు. పెద్ద ఎత్తున హింసాకాండ జరిగింది. ఆ మూక హైవేను బ్లాక్ చేసి అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. రాళ్ళదాడికి పాల్పడ్డారు. ఈ మూక చేసిన దాడిలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసను ఆపడానికి ప్రయత్నించిన పోలీసులపైనా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఓ పోలీసు అధికారి కూడా చనిపోయాడు.

కాషాయ మూక చేసిన దాడితో అనేక మంది ముస్లింలు గ్రామం విడిచి వెళ్ళి పోయారు. ఇంకొందరు వెళ్ళిపోవడానికి సిద్దమవుతున్నారు. ఈ దేశాన్ని ఈ ఐదేళ్ళు ఎవరు పాలించబోతున్నారో రేపు తేలబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ గ్రామ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇండియా టుడే టీం ఆ గ్రామంలో పర్యటించింది. అనేక మందితో ఇంటర్వ్యూలు చేసింది. ʹʹఈ సారి మళ్ళీ బీజేపీ గెలిస్తే మేమిక ఈ గ్రామంలో ఉండలేం. ఎక్కడికైనా సురక్షిత ప్రాంతానికి వెళ్ళి పోతాంʹʹ దుఖంతో పూడుక పోయిన గొంతుతో ఆ గ్రామస్తుడు చెప్పిన మాటలు నిజమవుతాయా ? అసలు వాళ్ళకు దేశంలో ఎక్కడైనా సురక్షితమైన స్థలముందా ?

Keywords : uttarapradesh, buland shehar, hindu, muslims, police, bjp, modi, yogi adityanth
(2019-06-16 06:52:56)No. of visitors : 448

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

అది విషాదంకాదు నరమేధం... 63 కు చేరిన చిన్నారుల మరణాలు

యోగీ ఆదిత్యానాథ్ రాజ్యంలో చిన్నారుల నరమేధం కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం 63 మంది చిన్నారులను బలితీసుకుంది. గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ లేక నిన్న 31 మంది చిన్నారుఅ ఊపిరి ఆగిపోగా ఇవ్వాళ్ళ ఆ సంఖ్య 63 కు...

పరీక్షలు రాసింది 12 వేల మంది... పాసయ్యింది 20 వేల మంది

12,800 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కానీ పాసయ్యింది మాత్రం 20,089 మంది. చివరి నిమిషంలో ఈ అంకెలు చూసిన అధికారులు షాకయిపోయారు. ఏం చేయాలో అర్దం కాక తలలు పట్టుకొని ఆలోచించి చివరకు పరీక్షా ఫలితాల....

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

నరహంతకుల రాజ్యంలో న్యాయానికి దిక్కేది ?

మురికివాడలో నివసించే పేదలపై బలం ప్రయోగించి, పోష్ కాలనీలోని సంపన్నులకు వత్తాసు పలుకుతున్నారు నేతలు. కేసు ఎలాంటిదయినా, ఒక మంత్రి బెయిలు దొరక్కుండా చేస్తానని బెదిరించడం ప్రజాస్వామ్యం ఏ స్థాయికి పతనమైందో చెప్పే సంఘటన....

గూండాలను అరెస్టు చేసినందుకు యోగీ సర్కార్ ఆమెను అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేసింది

ఉత్తర ప్రదేశ్‌లో అక్రమాలకు పాల్పడుతున్న బీజేపీ కార్యకర్తలకు ఝలక్‌ ఇచ్చిన‌ పోలీస్‌ అధికారిణీ శ్రేష్ట ఠాకూర్ ను యోగీ సర్కార్ అడవుల్లోకి బదీలీ చేసింది.. ఆమె ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న స్యానా సర్కిల్‌ నుంచి బహ్రైచ్‌కి బదీలీ చేశారు. లోకల్‌ బీజేపీ కార్యకర్తల నుంచి ఒత్తిడే ఆమె బదీలీకి కారణమని ప్రచారం జరుగుతోంది....

Posters in Bareilly village ask Muslims to leave

Just days after the Bharatiya Janata Party (BJP) secured a massive victory in the Uttar Pradesh Assembly elections, posters have appeared in a village in Bareilly district asking Muslim residents to ʹleave immediately,ʹ reports the

Search Engine

This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader
ఇవ్వాళ్ళే సభ..అందరికి ఆహ్వానం
తమ‌ను జంతువుల్లా చూశారన్న ఆదివాసులు.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం
ʹవ్యక్తిత్వమే కవిత్వం..వరవరరావు కవిత్వ విశ్లేషణʹ ...17 న సభ‌
83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన
ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !
అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !
యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!
పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
యోగీ ఆదిత్యనాథ్‌పై సుప్రీం ఆగ్రహం.. ఆ జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం
పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు..సుప్రీంను ఆశ్రయించిన జర్నలిస్టు భార్య‌
భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు
One Year of Bhima Koregoan Arrests: Protest Held in Delhi
మానవత్వం యూ టర్న్ తీసుకుంది..!
Condemn the criminal intimidation and threats made on activist Dr. Ram Puniyani
iʹm not sure that I would survive in this Solitary cell during this gruelling summer:prof. Saibaba
ఈ ఎండాకాలం...ఈ అండాసెల్ లో...బతకగలుగుతాననే నమ్మకం లేదు...ప్రొ.సాయిబాబా
రైతు విత్తన హక్కుపై విదేశీ కార్పోరేట్ల దాడి !
నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...
పుణె కోర్టులో తాజాగా – అమానుష తాత్సారం
తెలంగాణ ఎటు పోతోంది.. 32.5 శాతం నిరుద్యోగంతో దేశంలో 5వ స్థానం
క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్
మరొకసారి విద్వేష ప్రభుత్వం...కర్తవ్యం ఏమిటి ?
more..


మోడీ