ఈ ఎండాకాలం...ఈ అండాసెల్ లో...బతకగలుగుతాననే నమ్మకం లేదు...ప్రొ.సాయిబాబా


ఈ ఎండాకాలం...ఈ అండాసెల్ లో...బతకగలుగుతాననే నమ్మకం లేదు...ప్రొ.సాయిబాబా

ఈ

అబద్దపు ఆరోపణలతో నాగపూర్ జైలు అండా సెల్ లో మగ్గిపోతున్న ప్రొఫెసర్ జీ.ఎన్.సాయిబాబా ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణిస్తోంది. గతనెల( మే)25న సాయిబాబా ఆరోగ్యం ప్రమాదకర స్థితిలోకి వెళ్ళింది. ఆ సమయంలో కొందరు ఖైదీల సహాయంతో ప్రాణాపాయ స్థితినుంచి బయటపడగలిగారు. తన పరిస్థితిని వివరిస్తూ ఆయన తన సహచరి ఏ.ఎస్.వసంత కుమారికి లేఖ రాశారు.

ప్రొఫెసర్ సాయిబాబా రాసిన లేఖలోని అంశాలు ...
ʹʹ47.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతల నడుమ అండా సెల్ లో ఉండలేకపోతున్నాను. గతనెల 25 వ తేదీన ఉదయం సుమారు 11.15 గంటల ప్రాంతంలో ఛాతీలో తీవ్రమైన నొప్పితో పాటు డీహైడ్రేషన్ ఒకేసారి చుట్టుముట్టాయి. ఆ సమయంలో నేను నా టేబుల్ దగ్గర కూర్చొని రెండు చెంచాల అన్నం నోట్లో పెట్టుకున్నానో లేదో ఇంతలో ఎక్కిళ్ళతో మొదలై ఛాతీలో నొప్పి వస్తోంది. అదే సమయంలో రెండు భుజాల్లో కండరాలు మరీ ముఖ్యంగా ఎడమవైపు కండరం పట్టేయడం మొదలెట్టింది. దాంతో నేను అపస్మారక స్థితిలోకి జారిపోయి అలాగే నేను కూర్చున్న వీల్ ఛైర్లో కుప్పకూలిపోయానుʹʹ.

ʹʹనాబాధనంతా సెల్ బయటినుంచి చూస్తున్న ఇద్దరు ఖైదీలు పరుగున నా వద్దకు వచ్చి నన్ను మంచం మీదికి చేర్చారు. జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. పదినిమిషాల్లో జైలు అధికారులు, డాక్టర్ నా వద్దకు వచ్చారు. నాకు సెలైన్ ఎక్కించారు. ముందుగా నా దగ్గరకు వచ్చింది మాత్రం ఇన్ చార్జి జైలర్. ఆయన నా ప్రాణం కాపాడాడు. ఆ సమయంలో తీవ్రమైన నా అనారోగ్య పరిస్థితిని గమనించి వెంటవెంటనే అవసరమైన అన్నిచర్యలు తీసుకున్నారు. వెంటనే డాక్టర్ నాకు సార్బిట్రేట్ మందు బిళ్ళను ఇచ్చారు.

జూన్ 25 వే తేదీ వరకూ ఈ వేసంకాలం ఇలాగే కొనసాగుతుందంటున్నారు. ఈ వేడిని అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని నేను బతకగలుగుతాననే నమ్మకం లేదు. నా ఆరోగ్య పరిస్థితి లాగే నా వీల్ చైర్ కూడా సరిగా లేదుʹʹ. ఇదీ ప్రొఫెసర్ సాయిబాబా పరిస్థితి.
ఇటువంటి పరిస్థితుల్లో తనేం చేయాలో పాలుపోక వసంతకుమారి ఎంతో ఆవేదన చెందారు. తానేం చేయాలో సలహా ఇవ్వండంటూ ఆమె ఫేస్ బుక్ లో పెట్టిన ఫోస్ట్ పెట్టారు.
మనం ఎంత నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నామో, ఎంత దుర్మార్గమైన వ్యవస్థలో బతుకుతున్నామో తల్చుకుంటే కోపమూ, కసి కలగలిపి వస్తున్నాయి. ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపిన కాలంలో, మేదావులను, ప్రజాస్వామిక వాదులను జైళ్ళల్లో బంధించే పాలనలో , గొంతెత్తడమే దేశ‌ద్రోహమైన మతోన్మాద ఏలికలున్న వ్యవస్థలో, నిరసనతెలపడమే ప్రాణాంతకమైన పరిస్థితుల్లో బతుకులీడ్చ‌డం.....ఎంత కాలమిలా ? ఫాసిజం పడగ‌ విప్పి బుసకొడుతున్న ఈ దేశంలో ధైర్యంగా ప్రశ్నించి...ఫాసిజాన్ని ఎధిరిస్తూ....అత్యంత అణిచివేతకు గురవుతున్న ఆదివాసులు, దళితులు, స్త్రీలు, మైనార్టీలకోసం... మనందరి బతికే హక్కు కోసం పోరాడుతున్న మేధావులను అక్రమ కేసులతో జైల్లపాలు చేస్తూంటే ...నేరమే అధికారమైన చోట నోరుండీ ఊరక కూర్చున్న ప్రతి ఒక్కరమూ నేరస్తులమే కదా !

Keywords : gn saibaba,health, nagpur, jail, police, bjp, maoists
(2019-10-22 17:32:28)No. of visitors : 490

Suggested Posts


సాయిబాబాను చంపేస్తారేమో !

సాయిబాబాని మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైల్లో కలిసాను. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు కనిపించింది. ఆయన ప్రాణానికే ప్రమాదం ఉందనిపించింది. జైలు అధికారులు ఎటువంటి...

A Complaint lodged to NHRC for deteriorating health of Dr. G.N. Saibaba by Defend in India

Most humbly this is to bring to your notice that I came to know from the wife of Professor Saibaba that on 22nd February 2017, Prof. G. N. Saibaba was admitted in ICU of a hospital for a mild chest pain and breathlessness and a severe pain in abdomen....

Prof. G N Saibabaʹs emotional letter from jail to his wife

Now you are the lone fighter fighting for my freedom. Donʹt get disheartened in these dark days we should not lose our hopes and dreams for the darkness canʹt permanently overshadow the light. These are not empty words.....

ʹరాముడికి వ‌ర్తించే న్యాయం ప్ర‌జ‌ల‌కు వ‌ర్తించ‌దాʹ

"సాయిబాబ‌ను క‌లిసేందుకు ఈనెల 13న నాగ్‌పూర్ సెంట్ర‌ల్ జైలుకు వెళ్లాను. జాలీ ములాఖ‌త్‌. కేవ‌లం 15 నిమిషాలు మాత్ర‌మే మాట్లాడే అవ‌కాశం ల‌భించింది. రెండు వైపులా మ‌స‌క‌బారిన అద్దాలు. వాటి గుండా చూస్తే అవ‌త‌లి వైపు మ‌నుషులు అంతంత మాత్రంగానే క‌నిపిస్తారు. మాట్లాడేది స‌రిగ్గా వినిపించ‌దు కూడా. సాయిబాబ చాలా బ‌ల‌హీనంగా ఉన్నారు....

Saibabaʹs health worsening - Delegation seeks NHRC intervention

A delegation headed by Delhi University professor G N Saibabaʹs wife, Vasantha Kumari, on Thursday sought the intervention of the National Human Rights Commission to ensure proper medical care for the jailed academic. The condition of Saibaba...

iʹm not sure that I would survive in this Solitary cell during this gruelling summer:prof. Saibaba

Now it is 47.5 degrees C. On 25th May at around 11.15 am I suffered severe chest pain, syncope attack and high-level dehydration together all at the same time. I was sitting at my table and had just started eating. I hardly took two spoonfuls of rice into my mouth.

Freedom and Justice for GN Saibaba!

The Popular Resistance – Left Anti-imperialist Cooperation condemns this decision of the Indian court. We send our unequivocal support to GN Saibaba, his comrades and the movement of support that grows in India....

RELEASE G.N. SAIBABA IMMEDIATELY - TVV

When judiciary itself starts bypassing its role, then it points towards a dying democracy. It is ironic that even while holding these six people are so dangerous that they should be incarcerated for major part of their lives, the judgment fails to point out...

Search Engine

తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్
more..


ఈ