అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !


అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !

అనారోగ్యంతో

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఓడిపోయి జగన్ ముఖ్యమంత్రి కాగానే రాష్టంలో ప్రజాస్వామ్యం షరిడవిల్లుతుందనే నమ్మకం ఎవ్వరికీ లేదు. అయితే తానూ ఆ తానులోని ముక్కనే అని జగన్ నిరూపించుకోవడానికి చంద్రబాబుతో పోటీ పడుతున్నాడు.
గత సంవత్సరం డిశంబర్ లో హైదరాబాద్ లో చైతన్య మహిళా సంఘం కార్యకర్తలైన అనూష, అన్నపూర్ణ, భవానీ లను వాళ్ళ ఇంటి నుండి కిడ్నాప్ చేసి మావోయిస్టులనే కేసు బనాయించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనూషకు బెయిల్ రాకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఆమె తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నా వైద్య సదుపాయంలేకుండా వేధిస్తున్నారు. తన పరిస్థితిపై విశాఖ జైల్లో ఉన్న అనూష రాసిన లేఖ పూర్తి పాఠం....

ప్రజల పక్షాననిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సహించని రాజ్యం ప్రజాసంఘాలపై ఉక్కు పాదం మోపుతుంది. అందులో భాగంగానే... అనారోగ్యంతో ఉన్న నన్ను మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు హైదరాబాద్ లోని మా ఇంట్లోకి చొరబడి అక్రమంగా అరెస్ట్ చేసి విశాఖ జైల్లో నిర్బంధించారు. నడవలేని స్థితిలో వున్న నాకు జైల్ అధికారులు ఒక కొత్త వీల్ చైర్ ఇచ్చి. వీల్ చైర్ నెట్టడానికి ఒక మనిషిని కూడా పెట్టారు కానీ,... నన్ను పేషెంట్ గా మాత్రం గుర్తించడంలేదు. నాకు సరైన వైద్యం అందించాలని కొట్లాడగా KGH హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అక్కడి డాక్టర్లు కూడా నాకు సరైన వైద్యం అందించలేదు. KGH డాక్టర్ల, అలాగే జైల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల కోర్టులో పిటీషన్ వేస్తే, ఖచ్చితంగా వైద్యం అందించాలని KGH హాస్పిటల్ కి, జైల్ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. KGH హాస్పిటల్ వాళ్ళు స్పందించి నన్నుఅడ్మీట్ అవ్వమన్నారు కానీ, జైల్ వాళ్ళు మాత్రం ఎస్కార్టు లేదని అడ్మీట్ చెయ్యలేదు మళ్ళీ కోర్టులో కంప్లైంట్ చేశాను. ఇలా కంప్లైంట్ చేసినప్పుడు మాత్రమే ఒకరోజు హాస్పిటల్ కి తీసుకెళ్ళడం మళ్లి రొజునుంచి పట్టించుకోక పోవడం జరుగుతుంది. జాయింట్ పెయిన్స్ వల్ల నా చేతులు ప్రస్తతం నేను నడవడానికి ఉపయోగపడుతున్న స్టిక్కుని కూడా పట్టుకోలేక పోతున్నాయి ఈపరిస్థతిని వివరిస్తూ మళ్ళీకోర్టు లో ఫిర్యదు చేశాను. ఇలా కోర్టుకి వెళ్లిన ప్రతిసారి కంప్లైంట్ చేస్తున్నానని దాదాపు రెండు నెలల నుంచి కోర్టుకు కూడా తీసుకెళ్లడంలేదు. వీటన్నిటినీ నిరసిస్తూ 24 గంటలు నిరాహార దీక్ష కూడా చేసాను. కానీ జైలు వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేదు ఇంతలోనే కండిషనల్ బెయిల్ వచ్చింది. పాడేరు, జి. మాడుగుల, పెద్దబైలు ఈ మూడు పోలీస్ స్టేషన్లలో 10 గం౹౹ల నుండి 2 గం౹౹ ల లోపు సంతకాలు పెట్టాలి. ఈ మూడు ప్రాంతాలకు బస్ సౌకర్యం గాని, ఆటో సౌకర్యం గాని అంతగా లేవు. ఐదు కేసులకు పది శూరిటీలు పెట్టాలన్నారు. పది శూరిటీలు పెడితే శూరిటీలు వెరిఫికేషన్ చేయాలని చెప్పి వెరిఫికేషన్ పేరుతో శురిటీలు పెట్టేవారిని బెదిరించారు. శూరిటీలు పెడితే మీ కుటుంబాలను నక్సలైట్ కుటుంబంగా పరిగణిస్తామని,మాకుటుంబం మొత్తం నక్సలైట్ల కుటుంబమని, ఆస్తులను జప్తు చేస్తామని, మీకు ఆడపిల్లలు ఉన్నారు మీకు మీ కూతుర్లు అవసరంలేదా అని బెదిరించారు. దానితో కొంతమంది భయపడి శూరిటీలు పెట్టడానికి రామన్నారు. అరెస్ట్ అయిన ప్రతి వ్యక్తికి బెయిల్ తీసుకొని బయటికి వచ్చే హక్కు ఉంటుంది. కానీ, పోలీసులు మాత్రం అవి ఏవి పట్టించుకోకుండా నా ఆనారోగ్యస్థితిని నిర్లక్ష్యం చేస్తూ, బెయిల్ వచ్చినప్పటకి నావిడుదలకు ఆటంకాలు కల్పిస్తూ.... శారీరకంగా, మానసికంగా నన్ను హింసిస్తున్నారు.

***విశాఖ సెంట్రల్ జైలు నుండి అనూష.***

Keywords : andhrapradesh, anusha, maoists, police, jagan
(2019-11-18 05:30:06)No. of visitors : 881

Suggested Posts


మనిషులింకా మాయం కాలేదు - జోసఫ్ లాంటి వాళ్ళున్నారు

మనుషులు మాయమైపోతున్న చోట ఇలాంటి కొంత మంది ఇంకా ఉండటం వల్లనే సమాజంలో ఇంకా కొన్ని విలువలు మిగిలి ఉన్నాయి. ఎంతో మంది ప్రభుత్వ ఉపాద్య్హాయులు విద్యార్తులకు బోధనం చేయడం.....

చైతన్య మహిళా సంఘం కార్యకర్తలపై పోలీసుల దుర్మార్గపు దాడి

ఇవ్వాళ్ళ విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం దగ్గర చైతన్య మహిళా సంఘంతో సహా ఇతర ప్రజా సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. దాంతో అసలు నిజాలు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయో అని భయపడిన చంద్రబాబు పోలీసులు అదే స్థలంలో కొందరు కిరాయి మనుషులతో పోటీ ధర్నాకు దిగారు. ప్రజలను కాపాడాల్సిన తమ బాధ్యతను వదిలేసిన పోలీసులు....

Search Engine

Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
more..


అనారోగ్యంతో