ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు
ఈ నెల (జూన్)12 వతేదీన తెలంగాణ కాగజ్ నగర్ మండలంలోని కొలాంగొంది గ్రామం మొత్తాన్ని కూల్చేశారు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వాళ్ళు. ఆదివాసులను జంతువలకన్నా హీనంగా వేంపల్లిలోని ఓ టింబర్ డిపోలో బంధించారు.... పౌరహక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయిస్తే...ఆదివాసుల పట్ల ఇట్లా ప్రవర్తించిన ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది తప్ప అడవి తల్లి ఒడిలో తప్ప వాళ్ళు బతకలేరని... మైదాన ప్రాంతానికి వారిని తరలిస్తే నీళ్ళలో నుండి బైటపడ్డ చేపల తీర్గ వాళ్ళు ఆగమై పోతారని గుర్తించలేకపోయింది.
తమ కన్న తల్లి నుండి వేరు చేసిన ఆ ఆదివాసుల పరిస్థితిని పరిశీలించడానికి ఇవ్వాళ్ళ (18, జూన్) పౌర హక్కుల సంఘం, తెలంగాణ రైతాంగ సమితి మరియు తెలంగాణ విద్యార్థి వేదిక నాయకులు కొలాంగొంది గ్రామానికి ( ఇప్పుడక్కడ గ్రామంలేదు. కూలి పోయిన ఇళ్ళతో స్మశానం తీర్గ ఉంది), ఆదివాసులను వుంచిన వేంపల్లి టింబర్ డిపోకు వెళ్ళారు. పౌరహక్కుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణ రావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమార స్వామి, తెలంగాణ విద్యార్థి వేదిక కాగజ్ నగర్ జిల్లా కన్వీనర్ కుడిమేత శ్రీనివాస్, తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలహండి మధుకర్ కొలాంగొంది గ్రామానికి వెళ్ళినప్పుడు వీళ్ళు గమనించిన విషయాలు....
అక్కడ చుట్టూ పక్కన దక్షిణం వైపు తప్ప ,మూడూ వైపులా గుట్టల మధ్య కొలాంగొంది గ్రామం ఉన్నది. గ్రామానికి దగ్గరలోనే చాలా సారవంతమైన నల్లరేగడి భూములున్నాయి. అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి అధికార పార్టీ స్థానిక నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస స్పందించడం లేదని ఈ బృందం భావించింది.
ఇక వేంపల్లి లో ఆదివాసులను ఉంచిన టింబర్ డిపోకి కూడా ఈ బృందం వెళ్ళింది. అక్కడ ఆ అదివాసుల పరిస్థితి దారుణంగా ఉన్నది. ఉండడానికి సరైన నీడ కూడా లేకుండా...చిన్న పిల్లలతో అష్టకష్టాలు పడుతున్నారు. చిన్న బేసిన్ లో కూర్చో పెట్టి పిల్లలకు స్నానాలు...నేల మీద ఎండలోనే పిల్లల నిద్ర... స్త్రీలకు చిన్న చాటు కూడా లేకుండా... దుర్భరమైన జీవితం అక్కడ ఆదివాసులది.... వాళ్ళతో పౌరహక్కుల సంఘం మాట్లాడింది. అడవిని వదిలి బతకడం ఆ అడవి బిడ్డల వల్ల కాదని అర్దం చేసుకున్నది. ఈ మొత్తం అంశంపై పౌరహక్కుల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది.
కాగజ్ నగర్ మండలం కొలాంగొంది ఆదివాసులను వాంకిడికి తరలించాలన్న హైకోర్టు తీర్పును ఆదివాసులకు వ్యతిరేక తీర్పు గా భావిస్తున్నాం
నిన్న16-6-2019 న హైదరాబాద్ లో హైకోర్టు ఇఛ్చిన తీర్పు పూర్తిగా కొలాంగొంది అదివాసులకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుగా పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ భావిస్తున్నది. ఆరు దశాబ్దలుగా అక్కడ జీవిస్తున్న ఆదివాసుల ను ఫారెస్ట్ భూమి హద్దులు దాటరంటూ,29 కుటుంబాలను ఫారెస్ట్ అధికారులు బలంతంగా నివాసలను ధ్వంసం చేసి వాంకిడికి తరలించే కుట్రలోనే కొలాంగొంది గ్రామం నుండి నిర్వాసితులను చేసి కాగజ్ నగర్ దగ్గర లోని వేంపల్లి కలప డిపోలో 12-6-2019 న బుధవారం ఉంచారు.15-6-2019 న పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ వేంపల్లి లోని ఆదివాసులని కలిసి వారిని కొలాంగొంది గ్రామంలోనే ఉంచాలని,వాంకిడికి తరలించకూడదని,ప్రెస్ ద్వారా ప్రభుత్వానికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు విజ్ఞప్తి చేసినాము.అదే రోజు 15-6-2019 న హైద్రాబాద్ హై కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ నమోదు చేస్తే, 16-6-2019 న సాయంత్రం 5 గంటలకు తమ నివాసంలో 69 మంది ఆదివాసులను ప్రవేశపెట్టాలని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఆదేశించిన నేపధ్యంలో, నిన్న 16-6-2019 బెంచ్ ముందు హాజరైన ఆదివాసులతో మాట్లాడిన బెంచ్, బలవంతంగా ఆదివాసులను ఫారెస్ట్ వారు వేంపల్లి కి తరలించిన విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా, అడివిలో అదివాసులు పొడుచేసుకొని జీవించే తమ న్యాయమైన హక్కును కాదని ,వాంకిడిలోకి తరలించి సౌకర్యాలు కల్పించాలనే హై కోర్ట్ తీర్పు ఆదివాసులతో పాటు పౌర హక్కుల సంఘం వ్యతిరేకిస్తోంది.కోర్టు హెబియస్ కార్పెస్ పిటిషన్ లోని పరిమితి మేరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బలంతంగా తమను 60 ఏండ్లుగా అక్కడ నివాసిస్తున్నామని బెంచ్ కుఏడుస్తూ అదివాసులు చెప్పిన కూడా బెంచ్ పట్టించుకోకుండా ,ఫారెస్ట్ హద్దుదాటి ప్రవేసించారని, వాంకిడిలో సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి చెప్పడం, ఆదివాసులను అటవిప్రాంతంలో నుండి వెళ్లగొట్టే ప్రభుత్వ నిర్ణయం మేరకే నిన్నటి తీర్పు.ఈ తీర్పును పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ వ్యతిరేకిస్తోంది.2006 అటవీ హక్కుల చట్టం ,గ్రామ సభ తీర్మానం ఇతర రాజ్యాంగ బద్ధమైన హక్కుల ఉల్లంఘలో బాగంగానే నిన్నటి తీర్పు.తెలంగాణ ప్రభుత్వం మొన్నటి 17 వ పార్లమెంట్ ఎన్నికల్లో పొడువ్యవసాయం వారికి పట్టాలిస్తామని చెప్పి ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, కోర్ట్ ద్వారా ఆదివాసులను బలవంతంగా వారి జీవించే హక్కును,సంసృతిని ధ్వంసం చేస్తున్నది.ఈ చర్యను పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ వ్యతిరేస్తున్నది.
Keywords : adivasi, kagaznagar, farest depart ment, high court
(2025-01-15 23:43:44)
No. of visitors : 2878
Suggested Posts
| ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది. |
| ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. |
| సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘంGDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. |
| జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల |
| CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన పాలకులపై పోరాడుదాం
ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే. |
|
ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹచత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు. |
| మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టుపెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది. |
| ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన
14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది. |
| ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడలో పౌరహక్కుల సంఘం సభవిజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర..... |
| అడవి బిడ్డలను అరిగోస పెడ్తున్నరు తల్లిని విడిచి తాము ఉండలేమని , తమను మళ్ళీ అడవిలోనే వదిలివేయాలని అధికార్ల కాళ్ళా వేళ్ళా పడ్డారు ఆదివాసులు. బోరున విలపించారు కొందరు... తమను తమ అడవితల్లి దగ్గరికి చేర్చేదాంక అన్నం ముట్టబోమని ఏ ఒక్కరూ అన్నం తిన లేదు. ʹమాకు మీ ఇళ్ళొద్దు...మీ భూములొద్దు మా ఊరికి పంపించండిʹ అంటూ ఆ అడవి బిడ్డల రోదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది పాలకులకు తప్ప. |