రెండురోజులు... మూడు కుల దురహంకార హత్యలు !


రెండురోజులు... మూడు కుల దురహంకార హత్యలు !

రెండురోజులు...

చిత్తూరు జిల్లాలో అగ్రకుల అహంకార హత్య జరిగింది. కన్నబిడ్డ ఓ దళితుడుని పెళ్లి చేసుకుందన్న కారణంతో కమ్మ కులానికి చెందిన‌ తల్లిదండ్రులే కూతురు గొంతు కోసారు.

పలమనేరు మండలం ఊసరపెంట గ్రామంలో కమ్మ కులానికి చెందిన భాస్కరనాయుడి కూతురు 23 ఏళ్ల హేమవతి బీటెక్ పూర్తి చేసింది. అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు కేశవ్‌ను ప్రేమించింది. వీరి పెళ్లికి హేమవతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.

దళిత యువకుడిని పెళ్లాడడాన్ని జీర్ణించుకోలేకపోయిన యువతి కుటుంబ సభ్యులు పలుమార్లు వారిపై దాడి చేసి బెదిరించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారు మూడుసార్లు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు.

అయినప్పటికీ దాడులు ఆపకపోవడంతో రెండున్నరేళ్ల క్రితం ఆ దంపతులు ఊరి విడిచి వెళ్లిపోయారు. బెంగళూరు, జంగాల అగ్రహారం తదితర ప్రాంతాల్లో నివసిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో గర్భవతి అయిన హేమవతి ఇటీవల తన భర్త సోదరి ఊరైన బైరెడ్డిపల్లి మండలంలోని చప్పిడిపల్లి వచ్చింది. వారం రోజుల క్రితం పలమనేరు ప్రభుత్వాసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది.

అనంతరం అత్తవారింటికి వెళ్లిన హేమవతి శుక్రవారం బిడ్డకు ఒంట్లో బాగాలేకపోవడంతో భర్త, అత్తతో కలిసి పలమనేరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించింది. అనంతరం అందరూ కలిసి తిరిగి బస్సులో ఇంటికి బయలుదేరారు. ఊసరపెంటలో బస్సు దిగి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా హేమవతి తండ్రి భాస్కరనాయుడు, సోదరుడు చరణ్ వారిని చూశారు.

వెంటనే వారి వద్దకు వెళ్లి హేమవతి భర్త, అత్తలపై దాడి చేశారు. హేమవతి తల్లి వరలక్ష్మి, సోదరుడుభాను ప్రకాశ్, చెల్లెలు నిఖిల కలిసి బాలింత అని కూడ చూడకుండా హేమవతిని బలవంతంగా ద్విచక్ర వాహనం ఎక్కించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నామని, అక్కడికొచ్చి మాట్లాడాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే, బైక్‌ను పొలాల్లోకి తిప్పడంతో అప్రమత్తమైన హేమవతి భర్త కేశవ్ తెలిసిన వారికి చెప్పి, చేతిలో ఉన్న పసిబిడ్డతో బైక్ వెనక పరుగెత్తాడు. అయితే, అప్పటికే వారు మాయమయ్యారు.

హేమవతిని నేరుగా మామిడి తోటలోకి తీసుకెళ్లిన ఆమె తల్లిదండ్రులు గొంతుకు తాడు బిగించి చంపేసి అనంతరం కాళ్లు, చేతులు కట్టేసి లాక్కెళ్లడాన్ని చూసిన కొందరు కేకలు వేశారు. జనం రావడం చూసిన ఆ హంతకులు కత్తులతో వారిని బెధిరించి హేమావతి మృతదేహాన్ని సమీపంలోని బావిలో పడేసి పరారయ్యారు.

ఈ దుర్మార్గం శుక్రవారంనాడు ఆంధ్రప్రదేశ్ లో జరిగితే రేండు రోజుల ముందు మంగళవారంనాడు తమిళనాడులో మరో అగ్రకుల అహంకార మృగాలు మరో జంటను హత్య చేశాయి. ఇక్కడ అమ్మాయి దళితురాలు, అబ్బాయి అగ్రకులం. ఇద్దర్ని చంపింది అబ్బాయి సోదరుడు.

కోయంబత్తూరు మెట్టుపాలయం శ్రీరంగరాయన్ ఓట్టై ప్రాంతానికి చెందిన కరుప్పసామి కుమారుడు కనకరాజ్ అదే ప్రాంతంలో ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో దర్శినిప్రియతో అతనికి పరిచయమై.. ప్రేమగా మారింది. అయితే, దర్శినిప్రియ దళిత సామాజికవర్గం అవడంతో అగ్రకులమైన కనరాజ్ కుటుంభానికి అది నచ్చ లేదు. దీంతో ఇద్దరూ ఇళ్లు వదిలి పారిపోయారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇంతలోనే వారిని వెతికి పట్టుకున్న ఇరుకుటుంబాల పెద్దలు.. పంచాయతీ పెట్టి.. వేరు చేశారు. ఇకపై ఒకరినొకరు కలవకూడదని షరతులు పెట్టారు.

అయినా, ఆ తర్వాత కూడా కనకరాజ్‌, దర్శినిప్రియ తరచూ కలుస్తూ వచ్చారు. అమ్మాయి తక్కువ కులానికి చెందినదని, ఆ అమ్మాయిని కలువకూడదని కనకరాజ్‌ను అతని సోదరుడు వినోద్ హెచ్చరించాడు. అయినా వారు రహస్యంగా కలుస్తూ వస్తుండటంతో ఆగ్రహించిన వినోద్.. గత మంగళవారం సోదరుడు కనకరాజ్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ సమయంలో అతనికి అడ్డువచ్చిన దర్శినిప్రియపై కూడా కిరాతకంగా దాడి చేశారు. ఈ ఘటనలో కనకరాజ్ అక్కడికక్కడే మృతిచెందగా దర్శినిప్రియ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం ప్రాణాలు విడిచింది.


Keywords : chittoor, palamaneru, tamilanadu, dalit, upper cast, murder
(2019-10-21 16:38:26)No. of visitors : 305

Suggested Posts


Love Has No Labels !

While the vast majority of Americans consider themselves unprejudiced, many of us unintentionally make snap judgments about people based on what we seewhether its race, age, gender, religion, sexuality, or disability....

Search Engine

తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్
more..


రెండురోజులు...