చెర‌సాలలో చెలికాడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు


చెర‌సాలలో చెలికాడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

చెర‌సాలలో

హేమ్ మిశ్రా... జేఎన్‌యూ ప‌రిశోధ‌క విద్యార్థి, సాంస్కృతిక కార్య‌క‌ర్త‌. 2013లో మహారాష్ట్ర, గడ్చిరోలి జిల్లా పోలీసులు హేమ్‌ను అరెస్ట్ చేశారు. త‌న‌పై త‌ప్పుడు కేసును బ‌నాయించారు. ఆ కేసుకు మ‌రిన్ని అభూత క‌ల్ప‌ల‌న‌లు జోడిస్తూ ప్ర‌ముఖ పాత్రికేయుడు ప్ర‌శాంత్ రాహి, ఢిల్లీ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ జి.ఎన్‌. సాయిబాబాను సైతం అందులో ఇరికించారు.

ఉత్తరాఖండ్‌కి చెందిన హేమ్ ప‌రిశోధ‌క విద్యార్థి మాత్ర‌మే కాదు.. సాంస్కృతిక కార్య‌క‌ర్త‌, గాయ‌కుడు. అల్మోరాలో ʹప్రోగ్రెసివ్‌ స్టూడెంట్‌ ఫ్రంట్‌ సభ్యుడుగా హేమ్ ప్ర‌జా ఉద్య‌మాల్లో చురుగ్గా పాల్గొనే వాడు. రాజ‌కీయ‌, సామాజిక అంశాల‌పై ప్ర‌ద‌ర్శించే వీధి నాట‌కాల్లో పాల్గొనే వాడు. గ్రాడ్యుయేష‌న్ త‌రువాత‌... న్యూఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జేఎన్‌యూలో ప్ర‌వేశ పరీక్షలు రాశాడు. ఎమ్‌ఎస్‌సీ, మేథమెటిక్స్‌, చైనీస్‌ భాషా సాహిత్యాల అధ్యయనం కోర్సులలో త‌న‌కు అవ‌కాశం ల‌భించింది. కానీ తాను చైనీస్‌ భాషా సాహిత్యాల అధ్యయనం వైపే మొగ్గుచూపాడు. హేమ్‌... చ‌దువంటే.. పుస్త‌కాల్లో అక్ష‌రాల‌ను బ‌ట్టీ ప‌ట్ట‌డం కాద‌ని న‌మ్మిన‌వాడు. స‌మాజ మార్పులో భాగ‌మ‌వ్వాల‌నుకున్న వాడు. అందుకే... అధ్య‌య‌నంతో పాటు పోరాటంలోనూ భాగ‌మ‌య్యాడు. సంగీతం, సాహిత్యాల ప‌ట్ల ఆస‌క్తి ఉన్న హేమ్ మిశ్రా జేఎన్‌యూలోనూ సాంస్కృతిక కార్య‌క‌ర్త‌గా క్రియాశీల పాత్ర‌పోషించాడు.

2013 ఆగస్టులో వైద్యం కోసం డాక్టర్‌ ప్రకాశ్‌ ఆమ్టేను క‌లిసేందుకు మ‌హారాష్ట్ర‌కు వెళ్లిన హేమ్‌ను గ‌డ్చిరోలి జిల్లా అహేరిలో పోలీసులు అరెస్టుచేశారు. ప్రొపెసర్‌ జి.ఎన్‌.సాయిబాబా ఆదేశాల‌తో గడ్చిరోలి అడవుల్లో ఉన్న మావోయిస్టు నాయకులకు స‌మాచారాన్ని అందజేయడానికి హేమ్‌ వెళుతుండగా అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు త‌ప్పుడు కేసు బ‌నాయించారు. ఇదే కేసులో ప్రశాంత్ రాహి పేరును సైతం జోడించారు. ఈ త‌ప్పుడు కేసులో హేమ్‌మిశ్రా, ప్ర‌శాంత్ రాహీ, జిఎన్‌. సాయిబాబాను దాదాపు రెండేళ్లు జైళ్లో నిర్బంధించింది రాజ్యం. ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు కుట్ర‌ప‌న్నార‌నే ఆరోప‌ణ‌ల‌పై జి.ఎన్. సాయిబాబా, హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహీ స‌హా మ‌హేష్ టిర్కి, పాండ్ నరోటే లకు యావజ్జీవ కారాగార శిక్ష, విజయ్ టిర్కి కి పది సంవత్సరాల శిక్ష విధించింది కోర్టు. ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డి... ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తున్న నేరానికి ప్ర‌జాస్వామిక వాదులు, ర‌చ‌యిత‌లు, మేథావులు, క‌ళాకారుల‌పై రాజ్యం ప్ర‌యోగిస్తున్న నిర్భందానికి ఓ ఉదాహ‌ర‌ణ ఈ కేసు.

ప్ర‌శ్నించే ప్ర‌తి ఒక్క‌రిపైనా ఇవాళ మావోయిస్టు ముద్ర వేస్తోంది రాజ్యం. హేమ్ మిశ్రాతో మొద‌లైన ఈ దాడి.. ఇవాళ బీమా కోరేగావ్‌ వ‌ర‌కు చేరింది. మావోయిస్టుల‌తో సంబంధాలున్నాయ‌నే సాకుతో.. వ‌ర‌వ‌ర‌రావు, సుధా భ‌ర‌ద్వాజ్‌, సురేంద్ర గాడ్లింగ్‌, షోమా సేన్‌, అరుణ్ ఫెరెరా, వెర్న‌న్ గోంజాల్వెజ్‌, మ‌హేష్ రౌత్‌, సుధీర్ దావ్లే, రోనా విల్స‌న్‌ల‌ను జైల్లో నిర్బంధించింది. ఆనంద్ తేల్‌తుమ్డే, స్టాన్‌స్వామీ, గౌత‌మ్ న‌వ‌లాఖ వంటి మేధావుల‌ను అర్బ‌న్ మావోయిస్టుల పేరుతో వేధిస్తోంది. ఎనిమిది ప‌దుల వ‌య‌సులో కూడా ఈ నిర్బంధ కాలాన్ని చిరున‌వ్వుతో ఎదురీదుతున్న వ‌ర‌వ‌ర‌రావు, సుధా భ‌ర‌ద్వాజ్, సాయిబాబా, హేమ్ మిశ్రా లాంటి వాళ్లే ఇవాళ మ‌న‌కు స్ఫూర్తి.

చుట్టూ అలుముకున్న చీక‌ట్ల‌లోనూ చిరున‌వ్వు దివ్వెల్ని వెలిగిస్తున్న హేమ్ మిశ్రాకు, తెలుగు సాహిత్యంపై వ‌ర్గ‌పోరాట ప‌తాకాన్నెగ‌రేసిన విర‌సం పుట్టిన రోజు సంద‌ర్భంగా వ‌ర‌వ‌ర‌రావుకు శుభాకాంక్ష‌లు.
- క్రాంతి

Keywords : varavararao, hem mishra, jnu, maoists, pilice, arrest
(2019-07-16 11:55:26)No. of visitors : 163

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

చలసాని స్మృతిలో... - కే.కుమార్ వర్మ

బొడ్డపాడు నడిబొడ్డులో అమరవీరులను స్మరిస్తూ ఎర్ర జెండా చేతబట్టి తామాడ గణపతి ఇంటిముందునుండి దండుగా కదులుతున్నట్లుంది...

Search Engine

ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ
TISS క్యాంపస్ మూసివేత పై మండి పడుతున్న విద్యార్థులు...రేపు పౌరహక్కుల సంఘం మీడియా సమావేశం
తనకు నచ్చ‌ని పెండ్లి చేసుకుందని... కన్న బిడ్డను నరికి చంపిన దుర్మార్గపు తండ్రి
ఆ జంటకు సపోర్ట్ చేస్తే దేశవ్యతిరేకమే....యూపీ బీజేపీ నేత కూతురు పెండ్లి వ్యవహారంపై మరో నేత‌ కామెంట్ !
The "SINE-DIE" Suspension of academic activities in TISS HYD is oppressive and tyrannical.
అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
ఆ త్యాగానికి ఐదు దశాబ్దాలు...జూలై18న సభ‌
ఏపీ సీఎం జగన్‌కు ʹఅర్బన్ నక్సలైట్లʹ లేఖ..!
దొరసాని.. ఓ స్వాప్నికుడి దృశ్య కావ్యం
ʹదొరసానిʹ ఏం చెప్తోంది.. తెలంగాణ జీవనం వెండితెరపై ఆవిష్కరించిందా..?
ʹనక్సలైట్ల పేరిట అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలిʹ
యోగీ రాజ్యం.. ʹఏపీ, యూపీ పోలీసులు అర్దరాత్రి మా ఇంటిపై దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేశారుʹ
మారుతీరావునే మించిండు..కూతురు దళితుడిని పెండ్లి చేసుకుందని అల్లుడిని పోలీసుల ముందే చంపిండు..!
వేయిరూపాయల అప్పు తీసుకున్న పాపానికి పదేళ్ళుగా భానిస జీవితం..వృద్దుడి హృదయవిదారక గాథ‌
అమ్మ‌ కోసం అల్లాడుతున్న చిన్నారులు... జైలు ముందే పడిగాపులు
రండి... ఏ గుర్తింపూ లేని జీవితాల్లోకి చూపుసారిద్దాం
దళిత యువకుడిని పెళ్ళి చేసుకున్న బీజెపి ఎమ్మెల్యే కూతురు.. ʹనాన్నా ప్లీజ్ మమ్మల్ని చంపకండిʹ అంటూ వేడుకోలు
మావోయిజం నేరంకాదు, మావోయిస్టు భావజాలాన్ని విశ్వసించేవాళ్ళు నేరస్తులు కాదు..కేరళ హైకోర్టు
Kerala High Court says Maoism not a crime, upholds Rs 1 lakh fine on police
నిత్య పోరాట యోధుడు, ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు రాఘవులు సార్ కు జోహార్లు !
ʹʹఅంబేద్కర్, వరవర రావు గాక మాకోసం నిలబడినోళ్లు ఎవురున్నారు సార్ʹʹ
రాయలసీమకు జరిగిన అన్యాయాలను జగన్‌ సరిదిద్దుతాడా ?
వరవరరావు పై మరో కేసు - పూణే జైలు నుండి కర్ణాటకకు తీసుకెళ్ళిన పోలీసులు
పోడు భూముల సమస్య శాంతి భద్రతల సమస్యగా మార్చొద్దు...టీడీఎఫ్
more..


చెర‌సాలలో