రండి... ఏ గుర్తింపూ లేని జీవితాల్లోకి చూపుసారిద్దాం


రండి... ఏ గుర్తింపూ లేని జీవితాల్లోకి చూపుసారిద్దాం

రండి...

ముంబై... వెలుగు జిలుగుల క‌ల‌ల న‌గ‌రం. త‌మ‌ది కానీ జీవితాల్ని గ‌డిపే వేలాది మంది వ‌ల‌స కూలీల‌కు ముంబై మురికి వాడ‌లే కేరాఫ్ అడ్ర‌స్‌. ఉన్న ఊరును.. అయిన వాళ్ల‌ను వ‌దిలి పొట్ట‌చేత‌ప‌ట్టుకొని వచ్చే అభాగ్యులెంద‌రో తార‌స‌ప‌డ‌తార‌క్క‌డ‌. బ‌తుకు పోరులో... నెట్టుకురావ‌డం త‌ప్ప వాళ్ల‌కు ఏ ఉనికీ ఉండ‌దు. అలాంటి వ‌ల‌స జీవితాల క‌థ ఇది.

వ‌ల‌స దాని అనేకానేక ప‌ర్య‌వ‌సానాలు ఎలా... మ‌నిషికి ఒక గుర్తింపును అనివార్యం చేస్తాయో చెప్పే క‌థ‌. క‌రువు క‌ర‌ళా నృత్యం చేస్తున్న‌ప్పుడు.. కార్పోరేట్ కంపెనీ కాళ్ల‌కింది నేలను కాజేసిన‌ప్పుడు... యుద్ధం వెంటాడుతున్న‌ప్పుడు.... అణ‌చివేత బుస‌లు కొడుతున్న‌ప్పుడు... ఊరు పొలిమేర దాటిన ల‌క్ష‌లాది జీవితాలు... అనామ‌కంగా ఏ మురికి వాడ‌లోనో పోగుప‌డ‌తాయి. అలాంటి జీవితాల్లోని విధ్వంసాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చిత్రించారు ద‌ర్శ‌కులు క‌మ‌ల్ కె. ఎం.

ఉద్యోగం కోసం సిక్కిం నుంచి ముంబైకి వ‌చ్చిన చారూ... అంధేరీలోని స్నేహితురాలి ఫ్లాట్‌లో ఉంటుంది. ఓ రోజు, ఇంట్లో పెయింటింగ్ ప‌ని చేయ‌డానికి వ‌చ్చిన వ్య‌క్తి అకస్మాత్తుగా ప‌డిపోతాడు. అప‌స్మార‌క స్థితికి చేరిన పెంయింట‌ర్‌ను చారూ ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుంది. అత‌డి సంబంధికుల‌కు స‌మాచారం ఇచ్చేందుకు అత‌డిని పంపిన కాంట్రాక్ట‌ర్‌ను సంప్ర‌దిస్తుంది. కానీ... ఆ కాంట్రాక్ట‌ర్ ఆ పెంయింట‌ర్ గురించి నాకెలాంటి స‌మాచారం తెలీద‌ని చేతులెత్తేస్తాడు. ఈ లోగా ఆసుప‌త్రిలో పెయింట‌ర్ మృతి చెందుతాడు.

చేసేది లేక సెల్ ఫోన్‌లో పెయింట‌ర్ మృత‌దేహం ఫొటో తీసుకొని.. అత‌డి స‌బంధీకుల కోసం అన్వేష‌ణ మొద‌లు పెడుతుంది చారూ. ఈ అన్వేష‌ణ... త‌న‌ను ముంబై మురికి వాడ‌ల వైపు న‌డిపిస్తుంది. ఎన్నో దుర్భ‌ర జీవితాల‌ను ప‌రిచ‌యం చేస్తుంది. ఈ సినిమా చూస్తుంటే... అంకురం సినిమాలో స‌త్యం కోసం సింధూర సాగించిన అన్వేష‌ణ గుర్తుకు వ‌స్తుంది. ఒక ఉద్వేగం.. వెంటాడుతుంది.

రండి..
వ‌ల‌స బ‌తుకుల్లో విధ్వంసాన్ని అర్థం చేసుకునునేందుకు.
I.D. Movie Screening Followed By Discussion
I.D.చిత్రాన్ని క‌లిసి చూద్దాం.

14 జూలై 2019 (ఆదివారం), సాయంత్రం 7గంట‌ల‌కు,
లామ‌కాన్‌, బంజారాహిల్స్ , హైద‌రాబాద్‌

నిర్వ‌హ‌ణ : Dialogue డైలాగ్

Keywords : i.d., mumbai, movie, screening, dialogue
(2020-01-16 20:54:23)No. of visitors : 255

Suggested Posts


0 results

Search Engine

ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్
మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి
వాళ్ళిద్దరి కోసం..!
జేఎన్‌యూ తర్వాత‌...ఇప్పుడు మరో యూనివర్సిటీ విద్యార్థులపై దాడి
మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి - రాష్ట్రపతికి లేఖ రాసిన ʹఉనాʹ దళితులు
JNU పై దాడి చేసిందెవరో తేల్చి చెప్పిన వార్డెన్ల నివేదిక‌
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ కు బెయిల్...నెల రోజులు సహరన్ పూర్ లోనే ఉండాలని కండీషన్
మోడీషా రాజ్య నిర్బంధంలో మగ్గుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విడుదలకై ఉద్యమిద్దాం
విద్వేషం అతని మతం.. అణచివేత అతని ఆయుధం..!
మీరు చేస్తే గొప్ప పని ప్రజలు చేస్తే హింసనా జగ్గీ గారు
ఈ ప్రభుత్వమే నిర్బంధ కేంద్రాల్లోకి నెట్టబడే రోజొస్తుంది : అరుంధతి రాయ్
మన చేతుల మీది నెత్తుటి మరకలు కడగడానికి ఎన్ని సముద్రాలు కావాలి?
నిజం ఎప్పటికి బయటకు వస్తుంది?
విరసం అధ్యక్ష కార్యదర్శులుగా అరసవెల్లి కృష్ణ,కాశీం
50 ఏళ్ల.. దుఃఖం, నిర్భంధం, ధిక్కారం, స్పూర్తి... 50 ఏళ్ల విరసం మహాసభలు
విరసం 50 ఏళ్ళ సభలు...నోమ్ ఛామ్ స్కీ సందేశం
సృజ‌నాత్మ‌క ధిక్కారం.. విర‌సం 50 ఏళ్ల స‌భ‌లు ప్రారంభం
విరసం 50 ఏళ్ల సభలు.. పూణే జైలు నుంచి వరవరరావు సందేశం
CPI (Maoist) oppose Citizenship Amendment Act, calls to intensify mass campaign against it
అమిత్ షాకు బహిరంగ లేఖ‌ !
50 ఏళ్ళ ధిక్కారస్వరం...ఈ నెల11,12 తేదీల్లో విరసం రాష్ట్ర‌ మహాసభలు
నెత్తుటి ఏరులు పారినా ఎత్తిన జెండా దించకుండా... మళ్ళీ పిడికిలెత్తిన జేఎన్‌యూ
Cotton University Students Hoist Black Flags, Express Solidarity with JNU
JNU: బాధితులపై బీజేపీ నేతల చవకబారు వ్యాఖ్యలు
more..


రండి...