దొరసాని.. ఓ స్వాప్నికుడి దృశ్య కావ్యం


దొరసాని.. ఓ స్వాప్నికుడి దృశ్య కావ్యం

దొరసాని..

తెలంగాణ ప్రాంతంలో దొర, దొరసాని అనే మాటలు సర్వసాధారణం. ఇప్పటికంటే ముందు తరాల వారికి గడిలు, దొరలు, దొరసానులు అంటే తెలుసు. కాని ఇప్పటి వారికి అంతగా తెలియదు. కాని ఆనాటి పరిస్థితులను కళ్లముందు పరుస్తూ.. ఒక ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చింది ʹదొరసానిʹ అనే చిత్రం. ఈ సినిమా గురించి ఎంతో మంది ఎన్నో రాస్తూనే ఉన్నారు. వాటిలో ఇది కూడా ఒకటి. మిత్రుడు సుధీర్ కుమార్ తాండ్ర గతంలో వచ్చిన ʹమా భూమిʹ సినిమాను పోలుస్తూ రాసిన ఈ రివ్యూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అది యధాతథంగా..

------------------------------------------------------

చిత్రం:మా భూమి
హీరో రామయ్య,హీరోయిన్ చెంద్రి ల మధ్య సంభాషణ..

ʹఏడికి పోయినవ్ʹ
ʹగడికిʹ
ʹఎందుకు?ʹ
ʹప్రతాపరెడ్డి దొర పిలిపిచ్చిండుʹ
ʹపిలిపిత్తే పోతవాʹ
ʹదొర పిలిపిచ్చినంక పోక తప్పుతదాʹ
ʹఆడేమైంది..?మాట్లాడవేంది..?ʹ
ʹఇంకేమైతది..ఎప్పుడూ అయ్యేదే ఐంది.. రామయ్య నా మాట నమ్ము..నా రొమ్ములు ముట్టుకోనియ్యలే..ʹ
ʹఅంటే..ʹ
ʹరొమ్ములు బిడ్డకు పాలిత్తయ్ గదా..అవి ముట్టుకోవద్దన్న..ఒళ్ళంతా ఏమన్నా జేసుకోమన్న..ʹ

****** ******* *****

ఇంత డెప్త్ ఉన్న డైలాగ్స్ కోసం తెలంగాణ పేరు తోటి అచ్చిన ప్రతీ సినిమాల ఎదురు చూసిన..
ఇప్పటికి నా ఆకలి తీరింది..
ఒకటా..రెండా..కదిలించే మాటలెన్నో దొరసానిలో..
సినిమా ఆద్యంతం కన్నార్పకుండా చూసేలా తీసాడు మహేంద్ర అన్న..

ʹగడీల ఉండే ఆడదానికి ఖాయిష్ ఉంటే బతకనియ్యరమ్మ..అది దాసిదైనా..దొరసానైనా..ʹ
ʹఇదంతా నీకోసం కాదు..దొర కోసం..ʹ
ʹదొరకు పుట్టినోళ్లంతా దొరలైతర్రా.. దొర్సానికి పుడ్తనే దొరైతడు..ʹ
దేవకి రాజుకి నీళ్ల సర్వ ఇచ్చినప్పుడు రాజు పలికే
ʹమేం తాగచ్చ..ʹ

దర్శకుడికి స్పష్టత,అంకితభావం,తన కథ పట్ల విపరీతమైన ఆరాధన ఉంటే తప్ప ఇలాంటి సినిమాలు తీయలేడు.

తెరమీద రాజు గానికే కాదు తెరముందున్న వాళ్లకు కూడా రాజు ప్రేమలో నెగ్గాలని కోరుకుంటారు..
మొదటి పాటలో కిటికీ నుండి దేవకీ నవ్వినప్పుడు ఎంత బాగుందో..
రాజు చాలా సహజంగా నటించాడు..
దొరతో ʹనేను దొరసానిల చూసుకుంటాʹ అన్నప్పుడు అతని ఆత్మస్థైర్యమంతా కళ్లలోనే పలికించాడు..

దొరగా నటించిన వర్మ తన గంభీరమైన చూపులు,గొంతుతో క్రూరత్వాన్ని పలికించాడు..

80 ల్లో తెలంగాణ పల్లెల్లో జరిగిన పెత్తందారీ పాలన,అరాచకాలు, పల్లె ప్రజల బానిసత్వం,పోలీసుల నిర్బంధం, ప్రజలకు అన్నల ఆలంబన.. వీటి గురించి తెల్సిన వాళ్లను ఆ కాలానికి తీసుకుపోతుంది సినిమా..

సినిమా ఆఖర్లో ప్రజలు తిరగబడతారు అని అన్యాపదేశంగా చెప్పించడం బాగుంది..

సినిమాలో నటించిన స్వర్ణక్క,చేగో అన్న,సంఘ్ వీర్ అన్న పరిధి మేరకు బాగా నటించారు..

మూడేళ్ళ క్రితం ఫేస్ బుక్ లో నేను పెట్టిన కొన్ని గడీల ఫోటోలు చూసి నాకు కాల్ చేసిండు డైరెక్టర్ Kvr Mahendra అన్న.. తను తీయబోయే ʹనిశీధిʹ షార్ట్ ఫిల్మ్ గురించి చెప్పాడు.. దాదాపు గంటన్నరకు పైగా తను నాకు కథ చెప్పాడు.. తాను నాకు ఎలా చెప్పాడో అలాగే అత్యద్భుతంగా తీసాడు..ఆ షార్ట్ ఫిల్మ్ ఎన్నో అంతర్జాతీయ అవార్డులు పొందినప్పుడే సినిమా పట్ల తన దృష్టి కోణం ప్రపంచానికి చెప్పాడు..

తర్వాత కొద్దికాలానికి ఫోన్ చేసి దొరసాని లైన్ చెప్పాడు.. అప్పుడే చెప్పా.. ఇది మాభూమి లా తెలంగాణ సినిమా యవనికపై నిలిచిపోతుందని..

తెలంగాణ సినిమా వేసుకున్న తొవ్వలో ఈ సినిమా ఒక మైలురాయి..
తెలంగాణ సోయి ఉన్న సినిమాలు మరెన్నో రావాలని, మన దర్శకులు విజయ బావుటా ఎగరేయ్యాలని ఆశిస్తున్నా..

ఈ సిన్మాకు రేటింగ్స్ ఇద్దామంటే ఐదు చుక్కలు సరిపోవట్లేదు.

- సుధీర్ కుమార్ తాండ్ర

URL : https://www.facebook.com/photo.php?fbid=2519910064728271

Keywords : Dorasani, Movie, Maa Bhoomi, Review, Anand Deverakonda, Shivatmika
(2019-12-14 14:44:34)No. of visitors : 782

Suggested Posts


0 results

Search Engine

కామ్రేడ్ రామన్న మరణంపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
అలుపెర‌గ‌ని విప్ల‌వ బాట‌సారి చంద్రన్న
నేను చనిపోయినా వారికి శిక్షపడాలి....ఉన్నావ్ అత్యాచార బాధితురాలి చివరి కోరిక‌
మా పేరు మీద కస్టడీ హత్యలు వద్దు..!
కూలి డబ్బులు అడిగినందుకు దళితుడిని జేసీబీతో తొక్కించి చంపాడు..!
క్షీణించిన వరవరరావు ఆరోగ్యం - ట్రీట్ మెంట్ కోసం పూణే ప్రభుత్వ‌ హాస్పటల్ కు...
రేప్ బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ దాడి చేసిన రేపిస్టులు... సజీవదహనానికి యత్నం
అది ఎన్కౌంటర్ కాదు.. 17 మందిని ఏకపక్షంగా కాల్చి చంపారు : జుడీషియల్ కమీషన్ వెల్లడి
ఇండియాస్ డాటర్స్.. ఇంకెంత కాలం ఈ దారుణాలు..? ఈ డాక్యుమెంటరీ చూడండి..!
20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
ప్రియాంక హత్య : ఢిల్లీలో పగిలిన చిన్ని గుండె !
100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ
దొరతనం గెలుసుడా ఓడుడా? - ఎన్.వేణుగోపాల్
ʹఆకలి, పేదరికంతో చచ్చిపోతున్నాʹ.. కంటతడి పెట్టిస్తున్న ఓ చిన్నారి సూసైడ్ లెటర్
ఈ తెలంగాణ మీదే.. మాది కాదు : కేసీఆర్‌కు ఒక ఆర్టీసీ కండక్టర్ బహిరంగ రాజీనామా లేఖ
మహిళా కార్యకర్తలపై అక్రమకేసులకు వ్యతిరేకంగా పోరాడుదాం !
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
ఒక ప్రొఫెసర్ - ఏడు కుట్ర కేసులు
ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
more..


దొరసాని..