TISS క్యాంపస్ మూసివేత పై మండి పడుతున్న విద్యార్థులు...రేపు పౌరహక్కుల సంఘం మీడియా సమావేశం


TISS క్యాంపస్ మూసివేత పై మండి పడుతున్న విద్యార్థులు...రేపు పౌరహక్కుల సంఘం మీడియా సమావేశం

TISS

టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్ (TISS) యాజమాన్యం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక చర్యలకు నిరసనగా విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. యాజమాన్యం స్పంధించకపోవడంతో ఆమరణ నిరహార ధీక్షలకు పూనుకున్నారు. దీంతో యాజమాన్యం దుర్మార్గమైన చర్యకు పూనుకుంది. మొత్తం క్యాంపస్ నే మూసేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ క్యాంపస్‌(టిస్‌) తొలుత రాజేంద్రనగర్‌లో ఉండేది. ఇటీవల ఈ క్యాంపస్‌ను అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లికి అద్దె బిల్డింగుల్లోకి తరలించారు. అక్కడ బీఏ, ఎంఏ, ఎంఫిల్‌ కోర్సులను బోధిస్తున్నారు. ఆయా కోర్సుల్లో సుమారు ఐదు వందల మంది విద్యార్థుల వరకు చదువుతున్నారు. అయితే 15 వేలుగా ఉన్న‌ మెస్‌ చార్జీలను ఒకే సారి 54 వేలకు పెంచారు. గతంలో 15 వేలు కూడా మూడు విడతలుగా చెల్లించే వీలుండేది. ఇప్పుడు 54 వేలు ఒకే సారి చెల్లించాలన్న నిబంధ‌న విధించారు. గతంలో ఈ బిల్లు చెల్లింపులో ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థులకు మినహాయింపు ఉండగా, ఈ విద్యా సంవత్సరం ఆ వెసులుబాటును తొలగించారు.
దేశంలోని అనేక ప్రాంతాల నుండి చదుకోవడానికి వచ్చే పేద మధ్యతరగతి పిల్లలు ఇంత మొత్తం ఒకే సారి చెల్లించడం అసాధ్యమే.

దీంతో విద్యార్థినీ విద్యార్థులు మెస్‌ చార్జీలతో పాటు భారీగా పెంచిన‌ డిపాజిట్లను తగ్గించాలని, మెస్‌ కాంట్రాక్ట్‌కు సంబంధించిన టెండర్లను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. యాజమాన్యం ఈ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా.. వారిపై చర్యలకు ఉపక్రమించింది. విద్యార్థులు తమ ఆందోళనలతో ప్రాంగణ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని పేర్కొంటూ నిన్న (16 జూలై) ʹసైన్‌–డైʹ ఆఫ్‌ క్యాంపస్‌కు యాక్టింగ్‌ రిజిస్ట్రార్‌ ఎంపీ బాలమురగన్‌ నోటీసు జారీ చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఫ్యాకల్టీ సహా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నోటీసులు పంపింది. దీంతో విద్యార్థులంతా క్యాంపస్‌ను ఖాళీ చేసి రోడ్డుపైకి వచ్చారు. ఇక్కడ చదువుతున్న వారిలో హైదరాబాద్‌ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్థులు ఉన్నారు. తీరా సాయంత్రం క్యాంపస్‌ ఖాళీ చేయించడంతో ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలోపడ్డారు. స్వంత ఊళ్ళకు వెళ్ళాలన్నా కష్టమే ఇక్కడే ఉండాలన్న కష్టమైన పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ నోటీసులను రద్దు చేయాలని లేదంటే భవిష్యత్తులో భారీ ఆందోళనలకు సైతం వెనుకాడబోమని విద్యార్థి జేఏసీ నాయకురాలు కరీష్మాహెచ్చరించారు.
దీనిపై స్పంధించిన పౌరహక్కుల సంఘం టిస్ విద్యార్థుల ఆందోళనకు మద్దతు నిచ్చింది. ఈ విధంగా ʹటిస్ʹ క్యాంపస్ ను మూసేయడం అక్రమం అని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. యాజమాన్యం విద్యార్థుల సమస్యలను కనీసం వినకుండా వారితో చర్చించకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించిందని పౌరహక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై రేపు (17 జూలై) మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు పౌరహక్కుల సంఘం తెలిపింది. మధ్యాహ్నం 1 గంటకు సోమాజీ గూడా ప్రెస్ క్లబ్ లో జరిగే ఈ సమావేశానికి పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ జీ.లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణ రావు, ప్రొఫెసర్ లక్ష్మినారాయణ, ప్రొఫెసర్ పద్మజా షా, వీ. రఘునాథ్, ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు, టిస్ విద్యార్థి జేఏసీ నాయకురాలు కరిష్మా, పీఎమ్.రాజు, ఇస్మాయిల్ తదితరులు పాల్గొంటారని పౌరహక్కుల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.

Keywords : TISS, Students, CLC, Telangana
(2019-08-21 13:00:07)No. of visitors : 248

Suggested Posts


The "SINE-DIE" Suspension of academic activities in TISS HYD is oppressive and tyrannical.

The students of the Tata Institute of Social Sciences, Hyderabad are protesting against the exorbitant hostel fees which is pushing many underprivileged students to dropout of the course entirely.

Search Engine

నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
ఈ భూమిని వారికి అమ్మకపోతే వాళ్ళు తుపాకులతో సహా రాగలరు...ప్రముఖుడికి లేఖ
ఈ కశ్మీరీ పండిట్ చెప్పేది ఒకసారి విందామా !
more..


TISS