ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం


ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం

ఇప్పటికీ

1985 జూలై 17 సరిగ్గా ముప్పైనాలుగేండ్ల‌ కింద ఈ రోజు ప్రకాశం జిల్లా కారంచేడు దళిత వాడ నెత్తుటి కుప్పయ్యింది.... నరనరాన అహంకారం నిండిన కమ్మ భూస్వామ్యం దళితులను ముక్కలు ముక్కలు గా నరికిందక్కడ... అగ్రకుల రాక్షసమూకలు నెత్తిటి ఏరులుపారించారక్కడ..... బరిసెలు, గొడ్డళ్ళు, కత్తులతో దళిత మహిళలను, పిల్లలను, ముసలివారిని, యువకులను వెంటాడి..వేటాడి చంపారక్కడ ... మహిళలను చెరిచారు.... పసి పిల్లలను కింద పడేసి తొక్కారు.... ఆరుగురిని హత్య చేసి, ఎందరో మహిళలపై అత్యాచారాలు చేసి, మరెంతో మందిని నెత్తుటి ముద్దలను చేశారు. ఇదంతా చేసింది ఆ ఊరి కమ్మ భూస్వాములు... అప్పటి ముఖ్యమంత్రి వియ్యంకుడి అద్వర్యంలో ఇదంతా జరిగింది....తెలుగు నేల యావత్తూ బిత్తర పోయి చూసింది. మూగగా రోధించింది.

కమ్మ భూస్వాముల మారణ హోమంలో 1)దుడ్డు వందనం 2) దుడ్డు రమేశ్ 3) తేల్ల మోషే 4) తేల్ల ముత్తయ్య 5) తేల్ల యెహోషువా 6) దుడ్డు అబ్రాహాం లు మరణించారు. అసలు దాడికి కారణమేంటంటే.... కారంచేడులో మాల, మాదిగ, ఎరుకల కులాల వారు ఒకే దగ్గరుంటారు. కొత్త తరం దళిత యువకులు కొందరు పెద్ద చదువులు చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, కమ్మలు చేసే తప్పులను ప్రశ్నించడం అక్కడి కమ్మ భూస్వాములకు కళ్ళమంటగా ఉండేది. వారి కెట్లైనా బుద్ది చెప్పాలని సమయం కోసం కాచుక కూర్చున్నారు. ఆ గ్రామంలోని కమ్మ యువకులు ప్రతి రోజూ దళిత, ఎరుకల యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు. వాళ్ళ ఇళ్ళల్లోకొచ్చి మరీ ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు. వెంకటేషు అనే కమ్మ యువకుడు ఒకరోజు తిరుపతయ్య అనే ఎరుకలతని ఇంటికి వచ్చి అతని కూతురుతో అసభ్యం గా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తిరుపతయ్య అతని భార్య, వెంకటేశ్ ను వారించడానికి ప్రయత్నించడంతో అతను వారిద్దరి పై దాడి చేసి కొట్టాడు. అక్కడే ఉండి ఈ తతంగాన్ని గమనిస్తున్న కొందరు దళిత యువకులు వెంకటేశ్ ను అడ్డుకొని బలవంతంగా అక్కడినుండి పంపించారు. ఇది ఆ ఊరి కమ్మలకందరికి ఆవేశాన్ని తెప్పించింది. అలాగే బహిర్భూమికి పోయే దళిత మహిళల పట్ల కమ్మ యువకులు ప్రతి రోజూ అసభ్యంగా ప్రవర్తించేవారు. ఇటువంటి సంఘటనలు జరుగుతున్న సమయంలోనే ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల్లో నిలబడ్డ దగ్గుబాటి చెంచురామయ్య కొడుకు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావుకు మద్దతివ్వాలని చెంచురామయ్య దళిత కుల పెద్దలను కోరాడు. కానీ వాళ్ళు అతనికి హామీ ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో దళితులంతా కాంగ్రెస్ కు ఓటు వేశారని చెంచురామయ్య భావించాడు.

ఆ తర్వాత కొద్ది రోజులకు దళితులు నీళ్ళు తాగే చెరువులో ఇద్దరు కమ్మ యువకులు తమ బర్రెలను కడుగుతూ కుడితిని పారబోయటాన్ని అక్కడికి మంచినీళ్ళ కోసం వచ్చిన మున్నంగి సువార్త అనే మాదిగ మహిళ ప్రశ్నించింది. దాంతో వాళ్ళ అగ్రకుల అహానికి దెబ్బతగిలి ఆమెను చెర్నకోలాతో కొట్టారు. సువార్త కూడా తన బిందెతో వారికి సమాధానం చెప్పింది. వేల ఎకరాల భూములున్న భూస్వాములను, కోట్లాది రూపాయల బిజినెస్ లున్న వ్యాపారులను, సినీ రాజకీయ రంగాలను ఏలుతున్న వారిని, అందులోనూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టీ.రామారావు కులం వారిని,చుట్టాలను, ఓ దళిత మహిళ ఎదిరించడమా ? కమ్మలందరూ రగిలి పోయారు.... కూడబలుక్కున్నారు.... చుట్టుపక్కల గ్రామాల్లోని తమవారికి సమాచారం పంపించారు.

1985 జూలై 17 వ తేదీన వేలాది మంది కమ్మ అగ్రకుల దురహంకారులు కారం చేడు దళిత వాడ పై దాడి చేశారు. మానవత్వం నశించిన ఆ దుర్మార్గులు రాక్షసుల వలె ప్రవర్తించారు. పశువులు కూడా అసహ్యించుకునే రీతిలో మహిళపై అత్యాచారాలు చేశారు. హత్యలు చేశారు. కత్తులతో, బరిశెలతో వీరంగం సృష్టిస్తూ వికటాట్టహాసాలు చేశారు. ఇది మొత్తం దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు తండ్రి, ఎన్,టీ,రామారావు వియ్యంకుడు అయిన దగ్గుబాటి చెంచురామయ్య అద్వర్యంలో,కనుసన్నలో సాగింది. ప్రభుత్వం మాత్రం ఈ కేసుకు సంభంధించి ఎఫ్ఫైఆర్ లో చెంచురామయ్య పేరును కూడా చేర్చలేదు. ఆ తరువాత ఈ మారణ హోమానికి వ్యతిరేకంగా, హంతకులను శిక్షించాలనే డిమాండ్ తో విప్లవ, దళిత ఉధ్యమకారులు చాలా కాలంపాటు ఉధ్యమాలు చేశారు. ఆ ఉధ్యమాల మూలంగా దేశం యావత్తూ కారం చేడు వైపు చూసింది. ఆ ఉధ్యమకారణంగా ఆ తరువాత దళిత ఉధ్యమం ఒక కొత్త చరిత్రను లిఖించింది. ఆ తర్వాత కొంత కాలానికి ఇప్పుడు మావోయిస్టు పార్టీగా పేరు మార్చుకున్న అప్పటి పీపుల్స్ వార్ పార్టీ చెంచురామయ్యను చంపేసింది.

Keywords : andhrapradesh, karamchedu, dalits, daggubati chenchuramayya, daggubati venkateshvara rao, upper cast
(2019-08-18 23:44:16)No. of visitors : 474

Suggested Posts


Shocking video of two naked ‘Dalit women’ being thrashed by ‘upper caste’ women

A shocking video of two ʹDalit womenʹ being subjected to merciless thrashing and public humiliation allegedly women from upper caste has gone viral on social media platforms....

ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన దళితులు ‍- పరారైన శివసేన మూక

పంజాబ్ లోని పగ్వారా పట్టణంలో ముస్లింల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన శివసేన గుంపును సిక్కులు, దళితులు, ముస్లింలు ఐక్యంగా ఎదుర్కొన్నారు. కాశ్మీర్ కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు బుధవారంనాడు ర్యాలీ నిర్వహించారు ఈ సంధర్భంగా...

గోముసుగు దౌర్జన్యాలపై దళితుల యుద్దభేరి - భగ్గుమంటున్న గుజరాత్

దళితులు భగ్గుమంటున్నారు... తమపై హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. గుజరాత్ లో గోరక్షకులు చేస్తున్న అమానుష అరాచకలాను ఎదిరిస్తూ ఆందోళనలకు దిగారు. గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచిన...

గోరక్షకుల రాజ్యంలో.. ఆకలితో 500 ఆవులు మృత్యువాత !

బీజేపీ పాలిత రాజస్తాన్ లోని గోసంరక్షణ శాలలో పట్టించుకునే వారు కరువై ఆకలి, అపరిశుభ్రంతో రెండు వారాల్లో దాదాపు 500 ఆవులు మృత్యువాతపడ్డాయి. జైపూర్‌లోని హింగోనియా గోశాలలో దాదాపు 250 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి.. దళిత బాలుడి పై అగ్రకుల అమానుషం !

కొంతమంది అగ్రకులస్థులు ఓ దళిత బాలుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ....

నీళ్ళు తాగనివ్వని అగ్రకుల అహంకారం - బావిలో పడి దళిత బాలుడి మృతి

మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లా ఖమరియా కలాన్ గ్రామంలో మూడవతరగతి చదువుతున్న వీరన్ అనే దళిత బాలుడు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్ళు తాగడానికి....

ఢిల్లీ లో దళితులపై హిందుత్వ సంస్థల దాడి !

ఢిల్లీలో శాంతి యుత ప్రదర్శన నిర్వహిస్తున్న దళితులపై హిందుత్వ శక్తులు దాడి చేశాయి. గుజరాత్ లో దళితులపై దాడికి నిరసనగా ఆదివారంనాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యూత్ ఫర్ బుద్దిస్ట్ ఇండియా అనే సంస్థ అద్వర్యంలో దళితులు ధర్నా.....

వాళ్ళకు కమ్మోళ్ళ రక్తమే కావాలట !

హైదరాబాద్ మాక్స్ క్యూర్ హాస్పటల్ లో చికిత్సపొందుతున్న ఓ మూడేళ్ళ చిన్నారికి రక్తం అవసరం వచ్చింది. బ్లడ్ డోనర్స్ ఇండియా అనే ట్విట్టర్ లో ఓ కుల గజ్జి మహానువుడు కమ్మోళ్ళ రక్తం కావాలని ట్వీట్ చేశాడు....

ముందుకు సాగుతున్న ʹఛలో ఉనాʹ - కదం తొక్కుతున్న గుజరాత్ దళితులు

గుజరాత్ దళితులు కదం తొక్కుతున్నారు. వారితో ముస్లింలు చేతులు కలుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు, విప్లవ, ప్రజా సంఘాలు ఒక్కటై కదులుతున్నారు. ఆగస్టు 5 న అహ్మదాబాద్ లో బయలు దేరిన ఛలో ఉనా ర్యాలీ అనేక పల్లెలు, పట్టణాలు....

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి దళిత విద్యార్థుల గెంటివేత

వాళ్ళు దళితులు.... రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంభాల నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు... ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చ‌దువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు చ‌దువు రావడం లేదని పదో తరగతికి ప్రమోట్ చేయకుండా 34మంది విద్యార్థులను స్కూల్ నుండి గెంటేశారు....

Search Engine

నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
ఈ భూమిని వారికి అమ్మకపోతే వాళ్ళు తుపాకులతో సహా రాగలరు...ప్రముఖుడికి లేఖ
ఈ కశ్మీరీ పండిట్ చెప్పేది ఒకసారి విందామా !
more..


ఇప్పటికీ