ʹఓయూ విద్యార్థి వొగ్గె భరత్ ను తెలంగాణ, NIA పోలీసులు కిడ్నాప్ చేశారుʹ


ʹఓయూ విద్యార్థి వొగ్గె భరత్ ను తెలంగాణ, NIA పోలీసులు కిడ్నాప్ చేశారుʹ

ʹఓయూ

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి భరత్ ను తెలంగాణ పోలీసులు ఎత్తుకెళ్ళి చత్తీస్ గడ్ పోలీసులకు అప్పజెప్పారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో...భరత్ ను అటు చత్తీస్ గడ్ పోలీసులు ఇటు తెలంగాణ పోలీసులు కాకుండా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కు చెందిన అధికారులు విచారిస్తున్నారని వాళ్ళు ఆయనను తీవ్రంగా వేధిస్తున్నారని తెలుస్తోంది. ఈ విశయంపై పౌరహక్కుల సంఘం తెలంగాణ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఎన్.నారాయణ రావు, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (TDF) కన్వీనర్, ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధన విద్యార్థి కోట శ్రీనివాస్ లు వేరివేరుగా రెండు ప్రకటనలను విడుదల చేశారు. ఆ ప్రకటనల సారాంశం ...

ఓయు విద్యార్థి వొగ్గె భరతను కిడ్నాప్ చేసిన ఎన్ఐఏ పోలీసుల అప్రజాస్వామిక వైఖరిని ఖండిస్తున్నాం ప్రజ‌ల పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో పల్లెలు, ఆదివాసీ గ్రామాలు, విశ్వవిద్యాలయాల్లో కేసీఆర్ పోలీసులు నిర్బంధపు కోరలు రాజ్యమేలుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి వొగ్గే భరత్ ( Msc, MTech) తెలంగాణ విద్యార్థి వేదిక ఓయూ కమిటీ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఉద్యమించారు. ప్రజాస్వామిక తెలంగాణ కావాలని మాట్లాడినందుకు భరత్ తెలంగాణ పాలకులకు కంటగింపు అయ్యాడు. అందుకే అక్రమంగా కిడ్నాప్ చేసి అక్రమ కేసులు బనాయించి చత్తీస్గర్ లోని జగదల్ పూర్ జైల్లో నిర్బంధించారు. దీన్ని తీవ్రంగా పౌరహక్కుల సంఘం ఖండిస్తున్నది,
| టీఆరెస్ పోలీస్ యంత్రాగం చేత వగ్గె భరత్ సరిగ్గా వారం రోజుల క్రితం కిడ్నాప్ కు గురి అయ్యాడు. ఇది కూడా ఢిల్లీలో ప్రొ: సాయిబాబా కిడ్నాప్ లాగే కొనసాగింది.
15 జూలై సోమవారం రోజున తన హాస్టల్ రూమ్ లో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత‌ భరత్ మిత్రుడిని కలిసి వస్తా అని ఓయూ హాస్టల్ నుండి బయటకు వెళ్ళాడు. సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో హిమయత్ నగర్ కేఫ్ లో టీ తాగుతుండగా కరీంనగర్ పోలీసులము అని చెప్పి భరత్ ను బలవంతంగా వ్యాన్లో పడేసి కిడ్నాప్ చేసారు. ఆరోజు రాత్రి హైదరాబాద్ లోనే ఒక గుర్తు తెలియని ఆఫీసులో తీవ్రంగా కొడుతూ తనకు తెలియని విషయాలు ఒప్పుకోమని తాను నేర్చుకున్న టెక్నాలజీని తమ‌కు అందించాలని లేకుంటే చంపేస్తామని, ఆక్సిడెంట్లో ప్రమాదవశాత్తు మరణించాడని చిత్రీకరిస్తామని బెదిరిస్తూ పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు.
మరుసటి రోజు భరత్ ను మంగళవారం రాత్రికల్లా తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ చత్తీస్ఘడ్ రాష్ట్రంకి తరలించి కట్టుకథలు అల్లారు. మాకు తెలిసిన వివరాల ప్రకారం ఊపా వంటి క్రూర చట్టాలతో జైల్లో బంధించినట్లుగా తెలుస్తున్నది, ఆళ్లగూడెం పరిధిలో అన్నారం గ్రామం వద్ద పెట్రోలింగ్ జరుపుతుండగా ఒక వ్యక్తి పోలీస్ ని చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకొని విచారించగా తను వొగ్గే భరత్ MSc, MBC ఓయూ లో చదువుతూ మావోయిస్టులకు గత 4 సంవత్సరాలుగా కమ్యూనికేషన్ రంగంలో శిక్షణ ఇస్తున్నట్లు ఒప్పుకున్నాడని, అతని బ్యాగ్ తనికీ చేయగా ఎలక్ట్రానిక్ డివైజ్ లు, విప్లవ సాహిత్యం లభించిందని కట్టు కథలు సృష్టించడములో ఆరితేరిన తెలంగాణ పోలీస్లు చత్తీస్ఘడ్ పోలీస్ లు కట్టుకథలు అల్లారు.
బుధవారం రోజు ఎంతో క్రూరమైన పద్దతిలో భరత్ ని విచారించారు. భరత్ పై UAPA లాంటి క్రూరనిర్బంధ చట్టాల కింద FIR నమోదు చేసారు. 18న రాయిపూర్ ఆయనను పోలీసులు జగ్దల్ పూర్ జైల్ కి తరలించారు. జైలులో ఉన్న భరత్ ను NIA అధికారులు మానసికంగా వేధిస్తూ బెదిరిస్తున్నారని ములాఖత్ లో కలిసిన తన కుటుంబ సభ్యులకు భరత్ తెలియజేసాడు.
*వాక్, సభా, భావప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తూ భిన్నమైన భావాలను కలిగి ఉండడమే నేరంగా చూస్తున్న‌ ఈ దుర్మార్గపు కేంద్ర, రాష్ట్ర *ప్రభుత్వాల చర్యలను ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు ఖండించాలని కోరుతున్నాము
*హైదరాబాద్లో అక్రమంగా ఎత్తుకెళ్ళి చత్తీస్ గడ్ జగదల్ పూర్ జైలులో పెట్టిన ఓయూ విద్యార్థి వద్దే భరతను వెంటనే విడుదల చేయాలి.
*జైళ్లలలో అక్రమంగా నిర్బంధం చేయబడ్డ ఆదివాసీలను, విద్యార్థులను, రాజకీయ ఖైదీలందరిని విడుదల చేయాలి
*నిర్బంధం మన ఇంటి తలుపు తట్టక ముందే నినదిద్దాం ఐక్యం అయి పౌర ప్రజాస్వామిక హక్కులను కాపాడుకుందాం

Keywords : bharat, ou, chattisgarh , telangana, police, NIA, arrest, jagadalpur
(2019-08-20 23:20:18)No. of visitors : 497

Suggested Posts


ఓయూ లేకుంటే నా జీవితం లేదు : అల్లం నారాయ‌ణ‌

నేనెప్పుడూ చెప్తుంటా.. నా జీవితంలో రెండు కోణాలున్నాయని. ఒకటి ఉద్యమం. ఇంకోటి సంతోష్‌. అతని నైజం నాకు నచ్చేది. యూనివర్సిటీ మొత్తాన్ని ఆయన ప్రభావితం చేసేవాడు. ఆయన గురించి ప్రతిరోజూ వర్సిటీ చర్చించేది. మాట్లాడుకునేది. ఒక వ్యక్తి ఒక యూనివర్సిటీని అంతలా ప్రభావితం చేసిండంటే.. అది చిన్న విషయం కాదు. కరెంట్‌ ఇష్యూస్‌ మీద ఆయన స్పందించే తీరు ప్రత్యేకం. అదే ..

ఉద్య‌మాల ఉస్మానియా - అమ‌రుల త్యాగాల మార్గం - వ‌ర‌వ‌ర‌రావు

కామ్రేడ్స్‌ అసోసియేషన్‌తో ప్రారంభమై ప్రత్యామ్నాయ రాజకీయాల నూతన ప్రజాస్వామిక స్వప్నం ఆచరణగా రుజువవుతున్న వర్తమానంలో ఎందరో జ్ఞాత, అజ్ఞాత ఉస్మానియా విద్యార్థుల పోరాట భూమిక ఉన్నది. అసంఖ్యాక విద్యార్థులు నిర్వహించిన ఆ పోరాటాలలో నాకు తెలిసిన, నాకు తెలియని ఇంకెందరో విద్యార్థుల ప్రాణత్యాగాల ఫలితాలు ఉన్నాయి.

ఉస్మానియా నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీ

ఆర్ట్స్‌ కాలేజీకి ముగ్గువోసినపుడు నాకు పదేండ్లుంటయ్‌. మా అయ్యతోటి గల్సి కంకర గొట్టిన. రాళ్లు మోసిన. ఆర్ట్స్‌ కాలేజీకెదురుంగ కోంటోని బిల్లింగుండె(బీ హాస్టల్‌ భవనం). ఇప్పుడున్న ఠాగూర్‌ ఆడిటోరియం అడుగున అప్పట్ల సిల్మా ఆలుండె. దాని కట్టనీకి ఇటికెల్ని మూసిల్నించి తెచ్చేది....

ఓయూలో విద్యార్థి చ‌ల‌నాలు - సి. కాశీం

ఓయూ కేంద్రంగా 2009 నవంబర్‌ 29న ఏర్పడిన విద్యార్థి జాక్‌కు ఆర్ట్స్‌కాలేజీ జీవం పోసింది. ఆర్ట్స్‌ కాలేజీ ముందు వెలసిన టెంట్‌ తెలంగాణ ఉద్యమాన్ని శాసించింది. తెలంగాణ ప్రజలందరు ఓయు వైపు చూసారు. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 2010 జనవరిలో 5 లక్షల మంది విద్యార్థులతో ఆర్ట్స్‌ కాలేజీ ముందు స్టూడెంట్‌ జాక్‌ సభ నిర్వహించింది....

యూనివర్సిటీలో పోలీసు జోక్యంపై పోరాడి విజయం సాధించిన ఉస్మానియా విద్యార్థులకు శెల్యూట్స్ !

దాదాపు 20 గంటలకు పైగా తిండి , నిద్ర మానేసి విద్యార్థులు వీసీ కార్యాలయంలోనే బైటాయించి పోలీసులకు, వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిట్టచివరకు దిగి వచ్చిన వీసీ విద్యార్థుల డిమాడ్లను అంగీకరించాడు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఓ సర్క్యులర్ జారీ చేశాడు, అందులో... యూనివర్సిటీ అధికారుల అనుమతితో విద్యార్థులు

రండి "వసంత కుమారి"తో మాట కలుపుదాం....!!

"పుట్టింది ఒక చోట...తిరిగింది మరో చోట...విప్లవ ప్రభుత్వాన్ని నిర్మించిందీ ఇంకో చోట" అని ʹచే గువేరాʹగురించి తరచూ అనుకునే మాటలు ఇవి. ఈ మాటలు సరిగ్గ సరిపోతాయి ఢిల్లీ ప్రొఫెసర్ డా.జి.ఎన్. సాయిబాబాకు...

భావోద్వేగాల కూడ‌లి ఉస్మానియా యూనివ‌ర్సిటీ - నందిని సిధారెడ్డి

ఆ తర్వాత కొద్ది రోజులకే రమీజాబీ సంఘటన జరిగింది. అడిక్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌కు రమీజాబీ, ఆమె భర్త న్యాయం కోసం వచ్చిండ్రు. భర్త ముందే పోలీస్‌స్టేషన్‌లో రమీజాబీపై అత్యాచారం జరిగింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి. ఆ సంఘటన మీద పెద్ద నిరసన. విద్యార్థులు, విప్లవ కారులు రోడ్డు మీదికొచ్చిండ్రు. అటు పోలీసులు, ఇటు విద్యార్థులు విద్యానగర్‌లో ఒక యుద్ధంలాగా జరిగింది.

Open Letter To President of India - OU Students

However the university has become a subject of negligence in the hands of the successive governments including the present Telangana government. The students while struggling for separate statehood have raised many issues that have been impeding the progress of the university in fulfilling its responsibility towards the people of the country...

కేటీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేసిన ఓయూ విద్యార్థులు

రాష్ట్రంలో ప్రైవేట్‌ వర్సిటీల బిల్లును ప్రవేశపెడతామని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఓయూలో విద్యార్థులు మంత్రి కేటీఆర్‌ దిష్టిబొమ్మను దహ నం చేశారు.....

Search Engine

నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
ఈ భూమిని వారికి అమ్మకపోతే వాళ్ళు తుపాకులతో సహా రాగలరు...ప్రముఖుడికి లేఖ
ఈ కశ్మీరీ పండిట్ చెప్పేది ఒకసారి విందామా !
more..


ʹఓయూ