పాలకులారా...! ఈ తల్లి ప్రశ్నలకు జవాబు చెప్పగలరా ?


పాలకులారా...! ఈ తల్లి ప్రశ్నలకు జవాబు చెప్పగలరా ?

నల్లమల అడవుల్లో దొరికే యురేనియం కోసం అక్కడ జీవించే ఆదివాసులను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. యురేనియం తవ్వకాల వల్ల అక్కడ గాలి, నీరుతో సహా వాతావరణం మొత్తం విషతుల్యమైపోయి మనుషులే కాదు ఏ జీవి కూడా బతికే అవకాశం లేకుండా పోతుంది. పర్యావరణం సర్వ నాశనం అవబోతోంది. ఇక అడవి తల్లిని నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసులను అడవి నుండి వెళ్ళగొట్టి వాళ్ళ జీవితాలను ఆగం చేయబోతున్నారు.
అయితే అక్కడి జనం మాత్రం ప్రాణాలు పోయినా సరే నల్లమలను వదిలేసి వెళ్ళేది లేదని తేల్చి చెబుతున్నారు. ఎంతటి పోరాటానికైనా సిద్దమని ప్రకటిస్తున్నారు. ఈ విషయంపై అక్కడి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి పౌరహక్కుల సంఘం వెళ్ళింది. పౌరహక్కుల సంఘం తెలంగాణ శాఖ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణ రావు, ఉపాధ్యక్షులు రఘునాథ్, సహాయ కార్య దర్శులు మాదన కుమార స్వామి, నర్రా పురుషోత్తమ్, రాష్ట్ర కార్యవర్గ సబ్యుడు జె. లింగయ్య, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు సుభాన్, ప్రధాన కార్యదర్శి ఎమ్. తిరుమలయ్య , ఇతర ప్రజాసంఘాల నాయకులు పలు గ్రామాలు పర్యటించారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం,తిర్మలపూర్ గ్రామంలో... తమ ఊరును ఖాళీ చేయిస్తారన్న ప్రభుత్వం ఆలోచనపై ఓ తల్లి తన ఆవేదనను వెల్లడించింది. పాలకులకు కొన్ని ప్రశ్నలు సంధించింది. ఆ వీడియో మీ కోసం...
Keywords : nallamala, amrabad, uranium, narendra modi, kcr, CLC
(2019-08-22 12:11:15)No. of visitors : 1711

Suggested Posts


0 results

Search Engine

నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
ఈ భూమిని వారికి అమ్మకపోతే వాళ్ళు తుపాకులతో సహా రాగలరు...ప్రముఖుడికి లేఖ
ఈ కశ్మీరీ పండిట్ చెప్పేది ఒకసారి విందామా !
more..


పాలకులారా...!