ఈ అనంతపు గగ్గోలు ఎవరికోసం?

ఈ

దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న మూక దాడులపై , జైశ్రీరాం నినాదాలతో నేర మూకలు చేస్తున్న అరాచకాల‌పై దేశంలోని వివిధ రంగాలకు చెందిన్ 49 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖరాసిన నేపథ్యంలో అనంత శ్రీరాం అనే తెలుగు సినిమా పాటల రచయిత స్పంధిస్తూ లేఖ రాసిన‌ ఆ మేదావులు సకిలిస్తున్నారంటూ దుర్మార్గమైన బాషను ఉపయోగించి అంత కన్నా దుర్మార్గంగా రాతలు రాశాడు. దీనిపై అరవింద్ తన ఫేస్ బుక్ టైంలైన్ పై పెట్టిన పోస్ట్....

"ఓటేస్తావా.. వొళ్ళు కొవెక్కి ఓటేస్తావా.?
అడ్డగాడిదా.. అర్ధమవ్వదా..?"
అంటూ ఓట్లుగా మార్చబడ్డ జనంపై నిసిగ్గుగా, నిర్లజ్జగా పాడితే..
ఎంత మాత్రం సిగ్గులేక ఆ పాట ఓ దేశభక్తి గీతమైనట్లు నిర్లజ్జగా మనమంతా స్టేటస్ లుగా పెట్టుకున్న బట్టెబిజిగాళ్ళమనే విషయాన్ని మరోసారి గుర్తుచేసుకోవడం మరచిపోవద్దేమొ.
తాజాగా..
ఈయన గారు..
దేశవ్యాప్తంగా కొందరు బుద్దిజీవులు, నటులు, మేథావులు వరసగా జరుగుతున్న మూకాదాడులపై, హత్యలపై ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో జైశ్రీరాం నినాదం పేర ఇతర మతస్థులను చిత్రహింసలు పెడుతున్నారని అభిప్రాయ పడ్డారు. అందుకు సంఖ్య కూడా చూపారు. సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈ బుద్దిజీవులు మాత్రమే కాదు. వ్యాపారవేత్తలు, నోబెల్ గ్రహీత సేన్ కూడా ప్రకటించాడు. కొద్ది రోజుల క్రితం "మూకదాడులను నిలువరించాలని, జై శ్రీరాం నినాదం పేర హింసకు పాల్పడడం హేయం" అని బాధితుల పక్షాన స్వయంగా బీజేపీ ఎంపి, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ శాంతియుతంగా ఉండాలని చేసిన ప్రకటన అందరం చూసాం. ఐనప్పటికీ హింస తగ్గలేదు. తగ్గించెందుకు ఏ చర్యలు తీసుకోని సమయంలో దేశంలో నటులు, మరికొందరు ప్రధాన మంత్రికి లేఖ రాశారు. వాళ్ళు జైశ్రీరాం నినాదం పేర హింస జరగడాన్ని అడ్డుకోవాలన్నారు. ఆడవాళ్ళ శరీరాలపై పావులాకు, రూపాయికి పాటలు రాసుకునే ఈయన గారికి మాత్రం.. జై శ్రీరాం నినాదం నిషేదించమన్నారని తాజాగా గగ్గోలు పెడుతున్నారు. సరిగ్గా వినడం చేస్తే సరిగ్గా స్పందించడం వస్తుంది. 40మంది నటులు ప్రస్తావించింది తప్పేననుకుంటే స్వయంగా బీజేపీ ఎంపి గౌతం గంభీర్ ప్రకటన విషయం ఏమిటి మరి.!? నోబెల్ గ్రహీత సేన్ ప్రకటన ఏమిటి.? పార్లమెంట్ లో స్వయంగా ప్రధానమంత్రి మోడీ చేసిన ప్రకటన మాటేమిటి.!?

ఇతగాడు ఈ గగ్గోలు గతంలోను ఓటర్లపై విరుచుకుపడ్డాడు. ఓట్ల రోజుకూడా కూలీకి వేళ్ళకపోతే పూట గడవని పేదరీకం ఈయనకు కనపడదు. ఒట్ల సమయం తప్ప నాయకులు మరెప్పుడు గ్రామాలలోకి రారనే విషయం ఈయనకు భోధపడదు. అసెంబ్లీలలో బ్లు ఫీల్మ్ లు చూస్తు పట్టుబడే నాయకులపై, అవినీతి కేసులలో, మర్డర్ కేసులలో, రేప్ కేసులలో భాగమైన నాయకులపై ఈయన పెతాపం వుండదు. కేవలం ఓటర్లపైననే ఈయన గగ్గోలు. నోట్లకట్టలు పంచేవాడిపై, పసిపిల్లలపై అత్యాచారాలు జరిపేవారిపై, అడవిని ధ్వంసం చేసే మైనింగ్ మాఫియాపై, మతం పేర అల్లకల్లోలం సృష్టిస్తున్న గుంపులపై ఈయన ఒక్క మాట పెకలదు. కలం కదలదు. కానీ, జరుగుతున్న దారుణాలపై, దుర్మార్గలపై స్పందించేవారిపైననే ఈయనగారి పేతాపం. బుద్దిజీవులపై చేసిన వ్యంగ్యంలో పదిశాతమైనా మతం పేర హింసకు పాల్పడుతున్న గుంపులపై చూపగలడా.!? ఎంతోకొంత బుద్ది, ఆలోచన ఉంటే శాంతి కోసం, మానవత్వం కోసం మాట్లాడాలి. అంతేకానీ, శాంతికోసం మాట్లాడినవారిపై పిచ్చి వ్యంగ్యంతో సమాజంలో కల్లోలం రేపడం మనిషి లక్షణం కాదని అనంతం ఇప్పటికైనా గ్రహిస్తాడా.!?
దారుణాన్ని దారుణం అన్నవాడిపైననే
అన్యాయాన్ని అన్యాయం అన్నవాడిపైనన ఈయనగారి వ్యంగం.
పావులాకు, బేడాకు ఆడవాళ్ల శరీరాలపై పచ్చబొట్ల పాటలు రాసేవారి నుండి శాంతిని, మానవతావాద స్పందనను ఆశించడం మన బుద్దితక్కువతనమే అవుతుందనకుంటా.!?

- అరవింద్

Keywords : narendra modi, jaisriram, anantha sriram, tollywood
(2024-04-24 18:05:17)



No. of visitors : 2297

Suggested Posts


ఫోటోకు ఫోజు కోసం జుకర్ బర్గ్ ను లాగేసిన మోడీ !

అమెరికా పర్యటనలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెమెరాలో కనిపించడం కోసం చేసిన ఓ పని ... ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో హల్ చల్ చేస్తోంది....

నరేంద్రమోడీ విదేశీ పర్యటనల ఖర్చెంత ?

భారతదేశపు ప్రధానమంత్రి భారతదేశంలో ఉండి పాలించాలని, పాలిస్తారని ఎవరైనా అనుకుంటారు. కాని నరేంద్ర మోడీ భారతదేశానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ పాలిస్తున్నారని ఆయన మీద పరిహాసాలు వస్తున్నాయి. ఈ పరిహాసాలకు పరాకాష్టగా....

ప్రధాని మోడీ పీజీ చదువు అబద్దమేనా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎమ్.ఏ డిగ్రీ చేశాడన్నది అబద్దమేనా ? మోడీ అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ సంవత్సరం మే వరకు ఉన్న డిగ్రీ వివరాలు జూన్ నెలలో ఎందుకు లేవు ? ఢిల్లీ లా మంత్రి జితేందర్ సింగ్ తోమర్ నకిలీ డిగ్రీ కేసులో.....

బాలికా విద్య పై గుజ‌రాత్‌ గొప్పలన్నీ ట్రాష్

బాలిక‌ల సంక్షేమం, బాలిక‌ల విద్యపై గుజ‌రాత్ ప్ర‌భుత్వం గొప్ప‌లు చెప్పుకుంటున్న‌ది. వాస్త‌వంగా వారి విద్య విష‌యంలో ఆ రాష్ట్రం అట్ట‌డుగున నిలిచింది.బాలిక‌ల బంగారు భ‌విష్య‌త్తు కోసం అంటూ *క‌న్యా కెల‌వ‌నీ* ప‌థ‌కం అమ‌లు చేస్తున్నామ‌ని....

కేంధ్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా రచయిత్రి సంచలన నిర్ణయం

ప్రముఖ రచయిత్రి కేంధ్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి వెనక్కి పంపింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామిక వాతావరణం చెడగొడుతూ, సాంస్కృతిక వైవిధ్యానికి తూట్లుపొడిచేవిధంగా పరిపాలిస్తోందని ఆరోపిస్తూ....

జైశ్రీరాం పదం కొందరు నేరస్థులకు ఆయుధమైంది...ఇకనైనా మూక దాడులు ఆపండి...మోడీకి లేఖ రాసిన 49 మంది ప్రముఖులు

మీరు పార్లమెంట్‌లో మూకదాడుల్ని ఖండించారు. కానీ అవి ఆగిపోలేదు. అయితే మీరు వాటిపై తీసుకున్న చర్యలేంటి? ఈ దేశంలో ఒక్క పౌరుడు కూడా భయంతో బతకాడినికి వీళ్లేదు. ʹజై శ్రీరామ్ʹ అనే పదం వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పుడది కొందరు ఆకతాయిలు, నేరస్థులకు ఆయుధమైంది.

రిజర్వు బ్యాంకు తేల్చిన సత్యం...నోట్ల రద్దుతో బ్లాక్ మనీ పోలేదు... వైటై పోయింది !

గతేడాది నవంబర్ 8వ తేదీ నుండి రిజర్వ్ బ్యాంకుకు తిరిగి వచ్చిన 1000, 500 రూపాయలు ఎన్ని అనేది ఇప్పటికి లెక్కలు తేల్చింది రిజర్వ్ బ్యాంక్. ఇప్పటి వరకు ఎవ్వరు ఎన్ని సార్లు అడిగినా నోరుమెదపని రిజర్వ్ బ్యాంక్ ఎట్టకేలకు బుధవారం విడుదల చేసిన వార్షిక రిపోర్టులో ఆ వివరాలు బయటపెట్టింది. 99 శాతం పెద్ద నోట్లు తమ వద్ద డిపాజిట్‌ ....

ʹప్రతిపక్షాల చేతబడి వల్లే బీజేపీ నేతలు చనిపోతున్నారుʹ

బీజేపీ నేతలపై ప్రతిపక్షాలు చేతబడి చేస్తున్నాయని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రఙ్ఞాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేతలు బాబూలాల్ గౌర్, అరుణ్ జైట్లీలకు నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసిన సంతాప సభలో ప్రఙ్ఞా ఈ విధమైన‌ వ్యాఖ్యలు చేశారు.

మోడీ రాజ్యం: మోసాన్ని బహిర్గతం చేసినందుకు ఉద్యోగాలు పోగొట్టుకున్న‌జర్నలిస్టులు !

ఏబీపీ న్యూస్‌ నెట్‌వర్క్‌ మేనేజింగ్‌ ఎడిటర్ మిలిండ్‌ ఖండేకర్‌ తోటి జర్నలిస్ట్‌ పుణ్య ప్రసూన్‌ బాజ్‌పేయి ఏబీపీ టీవీ ఛానెల్‌లో రాత్రి 9 గంటలకు ʹమాస్టర్‌ స్ట్రోక్‌ʹ పేరిట షోను నిర్వహిస్తుంటారు. ఆయన సాధారణంగా ఈ షో ద్వారా ప్రభుత్వ విధానాల్లో ఉన్న తప్పొప్పుల గురించి సమీక్షింస్తుంటారు.

Is the Real Reason why Narendra Modiʹs Helicopter did not Land at Bahraich, the Absentee Crowd ?

Was this, the poor response from his party and the people, then, the real reason why Modiʹs chopper did not land, not the weather but the absence of an enthusiastic cheering crowd?....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఈ