ఉన్నావ్ అత్యాచార బాధితురాలి హత్యకు కుట్ర...ఇద్దరి మరణం..బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని 19 ఏండ్ల బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆమె తండ్రినే అరెస్టు చేసి హింసించడంతో ఆయన పోలీస్ కస్టడీలోనే మరణించారు. బాధితురాలు కూడా ముఖ్యమంత్రి యోగి ఇంటి ముందే ఆత్మాహుతికి యత్నించింది.
ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేసినా అతను బెయిలుపై బయటకొచ్చాడు. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో కేసును సీబీఐ విచారణకు అప్పగించారు. తాజాగా బాధితురాలు, ఆమె బందువులైన ఇద్దరు మహిళలు, లాయర్‌తో కలిసి రాయ్‌బరేలీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మహిళలు మరణించగా, బాధితురాలు, లాయర్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో మరణంతో పోరాడుతున్నారు. ఈ ప్రమాదం సమయంలో బాధితురాలితో ఉండాల్సిన భద్రతా సిబ్బంది ఎందుకు లేరు ? కారును ఢీకొట్టిన లారీ నెంబర్ కనపడకుండా నల్ల రంగు ఎందుకు పూశారు ? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆమెను చంపేందుకే ఈ ప్రమాదం చేయించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ ఆక్సిడెంట్ ఓ కుట్రగా అబివర్ణించాయి.
మరో వైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ మాత్రం ఇది ఆక్సిడెంటేనని ఇందులో ఎలాంటి కుట్ర లేదని సోమవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రక్కు అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని చెప్పారు.
అయితే అన్ని వైపులనుండి పెరుగుతున్న విమర్షలు, ఒత్తిడిలతో మధ్యాహ్నానికల్లా బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్, ఆయన సోదరుడు మనోజ్ సింగ్ సెంగార్, మరో 8 మందిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అత్యాచార ఆరోపణలపై కులదీప్ సింగ్ సెంగార్ ప్రస్తుతం జైలులో ఉండగా, ఆయనపైన, ఇతరులపైన తాజా ఘటనలో హత్యాయత్నం, నేరపూరిత కుట్ర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన మామ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.
Keywords : unnav, uttarapradesh, bjp, rape victim, accident, police case
(2021-02-27 23:46:30)
No. of visitors : 1545
Suggested Posts
| అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లలకేమో చావుకేకలు !ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక 63మంది చిన్నారుల ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు .... |
| అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి |
| రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే - బీజేపీ నేత రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు. |
| అది మనువాదపు కసాయి రాజ్యం - ప్రేమంటే నరనరాన ద్వేషంఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు.... |
| యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు.... |
|
యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి.... |
| అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?
విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది.... |
| ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీతఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి. |
| ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారపర్వాలు కొనసాగుతున్నాయి. హథ్రాస్ ఉదంతం మరవకముందే బదూన్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. |
| పోలీసుల దుర్మార్గం...బాలిక గ్యాంగ్ రేప్ !రక్షక భటులు ఓ బాలికను కాటేశారు. కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర గోవింద్నగర్లో పదవతరగతి చదువుతున్న ఓ బాలికను ఇన్స్పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్లు.... |
| కార్మిక హక్కుల కార్యకర్త నవ్ దీప్ కు బెయిల్
|
| మరింత ప్రమాదంలో సాయిబాబా ఆరోగ్యం - ʹమహాʹ ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యుల లేఖ
|
| దీనికి బెయిల్ అని పేరు పెట్టడమే విచిత్రం -విరసం |
| అమరుల అంత్య క్రియలు - మావోయిస్టు సైన్యం కవాతు |
| వరవర రావుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్... ముంబైలోనే ఉండాలని ఆదేశం
|
| టీ షాప్ నడుపుకుంటున్న ముస్లిం యువతిపై ʹహిందూ జాగరన్ మంచ్ʹ మూక దాడి
|
| Dr. G. N. Saibaba tested Covid positive: Family demands monitoring and shifting to a private hospital |
| జి. ఎన్. సాయిబాబాను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి మార్చాలి..... సాయిబాబా భార్య డిమాండ్ |
| ప్రొఫెసర్ సాయిబాబాకు కరోనా - ఆయన ప్రాణాలకు ప్రమాదం
|
| ʹమోడీప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్ʹ హ్యాష్ ట్యాగ్ తీయబోం - కేంద్రానికి స్పష్టం చేసిన ట్విట్టర్
|
| రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
|
| రైతుల ఉద్యమం: జర్నలిస్టు అరెస్టు ఖండించిన CASR |
| రాకేశ్ తికాయత్ కన్నీళ్ళతో కూడిన పశ్చాత్తాపం పాత గాయాలను మాన్పుతుందా ? |
| రేప్ చేస్తానంటూ మహిళా జర్నలిస్టును బెదిరించిన ఏబీవీపీ కార్యకర్త అరెస్ట్ |
| ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన |
| రైతుల ఉద్యమం....నిజాలు రాస్తున్నందుకు జర్నలిస్టు అరెస్ట్
|
| రిపబ్లిక్ డే నాడు నిరసనల్లో పాల్గొన్న 100 మంది రైతులు మిస్సింగ్ |
| CDRO strongly condemns the continuing targeting and intimidation of the farmersʹ protests/ foisting false cases against farmersʹ leaders and arrest of protesting farmers |
| నిరసనల్లో ఉన్న రైతులను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ బోరున విలపించిన రైతు నాయకుడు |
| జనవరి 30 న తెలంగాణ వ్యాప్తంగా నిరహార దీక్షలు - రైతు సంఘాల ప్రకటన
|
| రైతులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న పోలీసులు..... వెనక్కి తగ్గేది లేదంటున్న రైతులు |
| కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన
|
| నిన్న డిల్లీలో జరిగి సంఘటనల వెనక అసలు కథ !
|
| ఫ్యాక్ట్ చెక్: ఎర్ర కోట వద్ద జాతీయ జెండాకు అవమానం జరగలేదు...ఖాలిస్తాన్ జెండా ఎగిరేయలేదు
|
| నిర్బందపు బారికేడ్లను బద్దలుకొట్టిన రైతులు - ఎర్రకోటపై రెపరెపలాడిన రైతు జెండా |
more..