యాంకర్‌ వేరే మతస్థుడని కళ్లకు అడ్డంగా చేతులు పెట్టుకున్న ʹహమ్ హింద్ʹ వ్యవస్థాపకుడు


యాంకర్‌ వేరే మతస్థుడని కళ్లకు అడ్డంగా చేతులు పెట్టుకున్న ʹహమ్ హింద్ʹ వ్యవస్థాపకుడు

యాంకర్‌

మోడీ 2.0 అధికారంలోకి వచ్చాక విద్వేషం పెరిగిపోతోంది. గతంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉన్నా.. ఆనాడు లేని పరమత విద్వేషం ఈనాడు మరింతగా పేట్రేగి పోయింది. అప్పట్లో పరమత సహనం అనేది భారతీయుల రక్తంలో ఉందంటూ ప్రసంగాలు దంచినోళ్లే.. ఈనాడు అధికారంలోనికి రాగానే మైనార్టీలు అనే వాళ్లు కనీసం కంటి ముందు కనపడకూడదనే నియమం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

నిన్న ఒక ముస్లిం యువకుడు జొమాటో డెలివరీ బాయ్ అని తెలిసి ఆర్డర్ అందుకోవడానికి నిరాకరించిన ఘటన మరువక ముందే తాజాగా న్యూస్ ఛానల్ లైవ్ సాక్షిగా మరో మత విద్వేష ఘటన చోటు చేసుకుంది.

ఒక టీవీ ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న ʹహమ్ హిందూʹ సంస్థ అజయ్ గౌతమ్ ఆ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న యాంకర్ మొఖం నేరుగా చూడను అంటూ చేతులు అడ్డం పెట్టుకున్నాడు. ఇందుకు కారణం సదరు యాంకర్ హిందువు కాకపోవడమే.

జొమాటో విషయంలో జరిగిన మత విద్వేషం విషయంలో జరిగిన చర్చలో ఏకంగా మరో మత విద్వేష ఘటన జరగడం అంటే ఈ దేశంలో హిందూయేతరులను విద్వేషించడం ఎంత ఫ్యాషన్‌గా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే భోపాల్ పోలీసులు సదరు జొమాటో కస్టమర్‌కు తాఖీదులు అందించినా.. అతడిని సపోర్ట్ చేస్తూ న్యూస్24లో అజయ్ గౌతమ్ సదరు యాంకర్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా తన విద్వేషాన్ని ప్రదర్శించాడు. అంతే ఈ హిందూ మతోన్మాదులకు కనీసం చట్టం, రాజ్యాంగంపై కనీస గౌరవం లేదని ఈ ఘటన ద్వారా అర్థం అవుతోంది.

మరోవైపు యాంకర్‌ను అజయ్ అవమానించిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇది సరైన పద్ధతి కాదనే వారు ఒకవర్గం వారైతే, గౌతమ్ చర్యను సమర్థించే వారు మరోవర్గంగా చీలిపోయారు. సోషల్ మీడియా వేదికగా దీనిపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి.

Keywords : hum hind, zomato, news 24, anchor, muslim, other religion
(2020-02-16 04:21:27)No. of visitors : 357

Suggested Posts


0 results

Search Engine

ట్రంప్ కు భారత్ లో పేదలు కనబడొద్దట - 7అడుగుల ఎత్తు గోడను కడుతున్న బీజేపీ ప్రభుత్వం
కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి
CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం
ఆప్ గెలుపుతో ఢిల్లీలో పెరిగిన బిర్యానీ సేల్స్... బీజేపీ అభిమానుల అసహనం
ʹఅర్బన్ నక్సల్ʹ అంటే ఎంటో, ఎవరో మాకు తెలియదు - కేంద్ర ప్రభుత్వం
క్యాంపస్‌లోకి చొరబడి అమ్మాయిలపై గూండాల‌ వికృత చేష్టలు...భగ్గుమన్న విద్యార్థి లోకం
ఢిల్లీ జామియా విద్యార్థులపై పోలీసుల దుర్మార్గ దాడి - అనేకమందికి గాయాలు
షాహీన్ బాగ్: అంబులెన్స్, స్కూల్ బస్ లను ఆపుతున్నదెవరు ?
కునాల్ కమ్రాపై ఇండిగో నిషేధాన్నినిరసిస్తూ విమానంలో నిరసనలు
భక్తులే కాదు బాస్ కూడా వాట్సప్ యూనివర్సిటీయే
ʹనా కొడుకు మోడీ, అమిత్‌షాల మద్దతుదారుడుʹ
గృహనిర్బంధం ముగిసే కొన్ని గంటల ముందు వీళ్ళద్దరిపై దుర్మార్గమైన కేసులు
In Death, A Starʹs Dawn – GauriLankesh on Com Saketh Rajan
బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖ‌
CAA,NRCలకు వ్యతిరేకంగా గ్రామపంచాయితీ సంచలన తీర్మానం
నీ లోపలి దెయ్యాన్ని పెరగనివ్వకు..
నకిలీ వీడియోలు తయారు చేస్తున్న బీజేపీ... ప్రచారం చేస్తున్న మీడియా
దేశంలో లవ్ జీహాద్ లేదు...పార్లమెంటుకు చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
CAAకు వ్యతిరేకంగా సియాటెల్‌ నగర కౌన్సిల్‌ తీర్మానం
పంజాబ్: CAAకు వ్యతిరేకంగా 20వేలమంది రైతులు, మహిళల ర్యాలీ
దేశమంతటా ʹషాహీన్ బాగ్ʹ లు పుట్టుకురావాలి..!!
రాజకీయ నాయకుల దుర్మార్గం : అక్కా చెల్లెళ్లను తాళ్ళతో కట్టేసి ఈడ్చుకెళ్లారు
మా దొర అవ్వల్ దర్జ, మాటంటె తల గోసుకుంటడు - ఎన్.వేణుగోపాల్
మానవత్వంపై మళ్ళీ మతోన్మాద తూటా...షహీన్ బాగ్ ఉద్యమకారులపై కాల్పులు
CAA, NRC నిరసనల్లో హిందూ చైర్మన్ ఎన్.రామ్
more..


యాంకర్‌