ʹనా తండ్రిని పోలీసులు పట్టుకొని హింసలు పెట్టి కాల్చి చంపారుʹ

తన తండ్రిని పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని బుధవారంనాడు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ మరణించిన సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ నాయకుడు లింగన్న కుమారుడు హరిఆరోపించారు. హైకోర్టు ఆదేశం మేరకు లింగన్న మృతదేహానికి శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో రీ పోస్టుమార్టం జరిగింది. గాంధీ సూపరింటెండెంట్‌ శ్రవణ్‌ ఆధ్వర్యంలో ముగ్గురు సీనియర్‌ వైద్యులు లింగన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ప్రక్రియను అధికారులు వీడియో తీశారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య లింగన్న మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన రిపోర్ట్‌ను అధికారులు 5వ తేదీన సీల్డ్‌ కవర్‌లో కోర్టులో సమర్పించనున్నారు.

ఈ నేపథ్యంలో లింగన్న కుమారుడు హరి మీడియాతోతో మాట్లాడుతూ.. తన తండ్రిది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని ఆరోపించారు. తన తండ్రిని అక్రమంగా అరెస్ట్‌ చేసి.. ఆ తర్వాత కాల్చి చంపారని చెప్పుకొచ్చారు. తన తండ్రిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని విమర్శించారు. కుటుంబ సభ్యులకు చెప్పకుండానే తన తండ్రి మృతదేహానికి ఖమ్మంలో పోస్టుమార్టం నిర్వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. తన తండ్రి వద్ద ఎటువంటి ఆయుధాలు లేవని స్పష్టం చేశారు.

కాగా, లింగన్న ఎన్‌కౌంటర్‌ బూటకమని ఆరోపిస్తూ ప్రజా సంఘాల నేతల పలుచోట్ల ఆందోళనకు దిగారు. లింగన్న మృతిపై రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ హైకోర్టులో అత్యవసర ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం లింగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో లింగన్న మృతదేహాన్ని కొత్తగూడెం నుంచి ఈ రోజు తెల్లవారు జామున 4 గంటలకు గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. లింగన్న రీ పోస్టుమార్టం నివేదికను అధికారులు 5వ తేదీన కోర్టుకు సమర్పించనున్నారు.
మరో వైపు లింగన్న మృతదేహాన్ని చూసేందుకు గాంధీ ఆస్పత్రికి వస్తున్న అనేకమందిని పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టులో పిటిషన్ వేసిన పౌరహక్కుల సంఘం నాయకులను కూడా పోలీసులు అడ్డుకొని తిరుమలగిరి పోలీసు స్టేషన్ కు తరలించారు.

Keywords : telangana, fake encounter, linganna, cpi ml new democracy, hyderabad, gandhi hospital
(2024-04-24 18:02:16)



No. of visitors : 1373

Suggested Posts


న్యూడెమాక్రసీ నేత లింగన్నను కాల్చి చంపిన పోలీసులు ... పోలీసులకు ప్రజలకు ఘర్షణ‌

లింగన్నను పోలీసులు కాల్చి చంపిన సమయంలో అక్కడికి చేరుకున్న చుట్టు పక్క గ్రామాల ప్రజలు పోలీసులతో ఘర్షణకు దిగారు. తమ అన్నను అన్యాయంగా కాల్చి చంపారని ఆరోపిస్తూ పోలీసులపైకి వెళ్ళారు. కొద్ది దూరం పోలీసులను తరిమి కొట్టారు. ఈ సమయంలో పోలీసులు గాలి లోకి కాల్పులు జరిపారు. అయినా ప్రజలు వెన్ను చూపలేదు.

న్యూ డెమాక్రసీ నేత లింగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం జరపాలి..హైకోర్టు ఆదేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాల లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన సీపీఐ ఎంఎల్ న్యూ డెమాక్రసీ రాష్ట్ర కమిటీ సబ్యుడు లింగన్న మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గాంధీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని

నాటి ఎమర్జెన్సీ నాటి కంటే ఈ నాటి పరిస్థితులు మరింత ప్రమాదకరం -ప్రొఫెసర్ హరగోపాల్

46 వ ఎమర్జెన్సీ దినం సందర్భంగా సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ "ఎమర్జెన్సీ నాడు - నేడు" అనే అంశం పై జూన్ 26 న ఆన్లైన్ బహిరంగ సభ ను నిర్వహించింది.ఈ సభ కు సీపీఐ (ఎం-ఎల్)న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సాదినేని వెంకటేశ్వరావు

న్యూడెమోక్రసీ నాయకుడు కా॥ ముఖ్తార్ పాష అమర్ రహే! -ఇల్లందులో రేపు వర్ధంతి సభ‌

సి.పి.ఐ. (యం.యల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటి సభ్యుడుగా, ఇ.ఎఫ్.టి.యు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉద్యమ బాధ్యతలు చూస్తున్న కా॥ ముఖ్తార్ పాష 2020 సెప్టెంబర్ 24న, కార్పోరేట్ క్రూర కరోనాతో అమరుడైన విషయం తెలిసిందే.

ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు పోడు రైతులపై సాగిస్తున్న దాడులను, అరెస్టులను ఆపాలి!

అనేక దశాబ్దాలుగా పొడుగొట్టి తమ జీవనాన్ని సాగిస్తున్న పోడు రైతులను ఈనాడు పెద్ద ఎత్తున పోలీసులు ఏజెన్సీ గ్రామాల్లో మోహరించి తీవ్ర భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.అందులో భాగంగానే ఈ రోజు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹనా