ఈ కశ్మీరీ పండిట్ చెప్పేది ఒకసారి విందామా !


ఈ కశ్మీరీ పండిట్ చెప్పేది ఒకసారి విందామా !

ఈ

(న్యూస్ క్లిక్ వెబ్ సైట్ లో.. కశ్మీరీ పండిట్ అయిన ప్రదీప్ మాగజైన్ అనే జర్నలిస్టు రాసిన ఈ వ్యాసాన్ని రచయిత్రి రమా సుందరి గారు తెలుగులోకి అనువదించి తన ఫేస్ బుక్ వాల్ పై పోస్ట్ చేశారు. ఆ వ్యాసం మీ కోసం...)

ప్రదీప్ మాగజైన్ ఒక కాశ్మీరీ పండితుడు. సీనియర్ పాత్రికేయుడు. ఢిల్లీలో ఉంటారు. ఆర్టికల్ 370 రద్దు, తదితర అంశాలపై ఆయన ప్రతిస్పందన ఇది.

నేను నా మెదడును తొలిచి చూసే ప్రయత్నం చేసినపుడు, నా చిన్నప్పటి జ్నాపకం ఒకటి ఎప్పుడూ బయటకు వస్తుంది. ఈ క్షణంలో కూడా, నా మెదడులో ఉన్న లక్షలాది జ్నాపకాల సమూహంలో ఆ జ్నాపకం ఒకటి. అప్పుడే నడుస్తున్న ఒక పసివాడు, బక్క చిక్కిన ముసలి వ్యక్తి భుజాల మీద కూర్చొని; అతను అన్నీ తిప్పి చూపిస్తుంటే అతన్ని హత్తుకొన్న భద్రతనూ, సౌకర్యాన్నీ అనుభవించిన జ్నాపకం అది. అప్పుడు ఆ వ్యక్తి ముస్లిం అనీ, నేను కాశ్మీరీ పండిట్ అనీ నాకు తెలియదు. నేను ఎప్పటికీ అంచనా వేయలేని ప్రపంచంలో, కాశ్మీరీ పండిట్ గా నేను అందరిలాగే పుట్టానని నాకు తెలియదు. నా స్పృహ ఆ వయసుకి ఇంకా నిద్ర లేవలేదు. అందుకే నా మెదడు అప్పటి చిత్రాలను, అవి ఎలా ఉండాలో అలా కాకుండా, నాకు అప్పుడు ఎలా అర్ధం అయ్యాయో అలా నమోదుచేసింది. అప్పుడు నా చుట్టూ ఇంకా ఏమి జరిగిందో ఆరు దశాబ్దాల తరువాత ఇప్పుడు నాకు ఏ మాత్రం జ్నాపకం లేదు. నా ఏడుపు, ఆ భుజం ఎక్కిన తరువాత నా సంతోషపు నవ్వు తప్ప; ఆ జ్నాపకపు చిత్రంతో నేను ఇతరత్రా ఎలా సంబంధంలో ఉన్నానో నాకు గుర్తు లేదు. ఆ చిన్ననాటి జ్నాపకపు కాలం తరువాత నా జీవితం చాలా దూరం ఎదురీదింది. ఈ కాలంలో ఎన్నో సంతోషకరమైన, అరుచికరమైన జ్నాపక చిత్రాలను నేను చూసాను, గమనించాను, నమోదు చేసుకొన్నాను. ఈ ప్రక్రియలో నా మెదడు భిన్న సంస్కృతుల సమ్మేళనంగా మారింది.

నేను 1960ల మొదటి భాగంలో కాశ్మీర్ లోయను విడిచిపెట్టిన కాశ్మీరీ ప్రవాసిని. మా నాన్నకు ప్రభుత్వ ఉద్యోగం ఉండటం వలన మేమా పని చేయాల్సి వచ్చింది. నా జీవితంలో ఎక్కువ భాగం పంజాబ్ లో గడిపాను. కాబట్టి ఒక రకమైన పంజాబీ యాసతో నేను మాట్లాడతాను. కానీ నా అలవాట్లు, నా నేపథ్యపరంగా నేనిప్పటికీ కాశ్మీరీనే. మా తాతగారి కుటుంబం అక్కడే జీవించటం వలన, కాశ్మీరుతో నాకున్న సాంస్కృతిక సంబంధాలు వేరుబడలేదు. మా అన్నయ్య అక్కడే పాఠశాల విద్య పూర్తి చేశాడు. సెలవల్లో నేను తప్పక కాశ్మీర్ లోని మా యింటికి వెళుతుండేవాణ్ణి.

ఇలా 1980ల వరకు కొనసాగింది. హటాత్తుగా ఆగ్రహంతో కూడిన సామూహిక తిరుగుబాటు, తీవ్రవాదం చెలరేగి; మమ్మల్ని నిశ్చేష్టులను చేశాయి. భయం, హింసలతో ఇనుమడించిన ప్రవాస పర్వం అప్పుడు ఒక ప్రవాహంగా జరిగింది. అధికారిక లెక్కల ప్రకారం 200 మంది కాశ్మీరీ పండితులు ఆ సమయంలో చనిపోయారు. కొంత మంది ఆ మరణాలు ఇంకా ఎక్కువ ఉండవచ్చునని అంటారు. ఇది జరిగాక మా యింటి తలుపులు మాకు మూసుకొని పోయాయి.

నేను పెరిగే కాలంలో, కాశ్మీర్ లోయలో సమయం గడిపేటపుడు ʹమాకూʹ, ʹవారికీʹ మధ్య విభజనను గమనించాను. కానీ ఆ విభజన అక్కడ నేను గడిపిన జీవితానికి ఒక ఉపఅంశంగానే ఉండిపోయింది. అదే విభజన ఇప్పుడు దురదృష్టకరమైన మలుపులు తీసుకొన్నది. అప్పటి నుండి, కాశ్మీర్ ను నాశనం చేసిన హింస ఒక మైనారిటీ మత సమూహాన్ని (కాశ్మీర్ లోని మైనారిటీ అంటే కాశ్మీర్ పండితులు అని అర్థం చేసుకోవాలి- అను) తన సొంత భూమి నుండి మూలాలతో పెకలించి వేసింది. మెజారిటీ ముస్లిములను తన సొంత రాష్ట్రంలోనే పనికి రాని వాళ్లుగా మిగిల్చింది. ముస్లిములలో వేలాది మంది సాయుధ తుపాకీకో, భద్రతా దళాల చేతిలోనే హత్యకు గురి అయ్యారు.

ఒక దశాబ్ధం వరకూ కాశ్మీర్ మాకు నిషిద్ద ప్రదేశంగా మారింది. మళ్లీ 2000 సంవత్సరం మొదట్లో శ్రీనగర్ కు నా సందర్శనలు మొదలయ్యాయి. అన్ని రకాల ఆచరణాత్మక కారణాల వలన నేను అక్కడ పరాయివాడిని అయినప్పటికీ నన్ను రెండు చేతులు చాచి వారు ఆహ్వానించారు. ఇండియాతో యుద్ధంతో ఉన్న రాష్ట్రంలో నాకు కూడా స్థానం ఉన్నదా అని నేను ఆశ్చర్య పోయాను. ఈ యుద్ధం, నా పరాయి/ ప్రవాసీ పరిస్థితి రెండూ; అక్కడి నా పౌరసత్వాన్నీ నమోదు చేసే గుర్తింపులుగా మారాయి.

మా తాతవాళ్లు నివసించిన శ్రీనగర్ లోని కరణ్ నగర్ ప్రాంతాన్ని నా సందర్శనలలో భాగంగా చూశాను. అక్కడ ఇంకా జీవితం మిగిలే ఉంది. నగరంలో తిష్ట వేసిన అనేక సియార్పిఫ్ దళాలకు అది కేంద్ర స్థానంగా మారింది. మా ఇల్లు చెక్కు చెదరలేదు. అయితే అక్కడ అన్ని పండిట్ల ఇళ్లలాగానే అందులో నివసిస్తున్నది ఇప్పుడు భద్రతా దళాలు. అయితే ఇతర ప్రాంతాల్లో పండిట్లు భయంతో పారిపోయి వదిలేసిన ఇళ్లలో, శ్మశానంలో ఉండేలాంటి భయంకరమైన నిశ్శబ్ధం నాకు స్వాగతం పలికింది. సంరక్షణ, పోషణ కోసం అలమటిస్తూ, పూర్తి నిర్లక్ష్యంతో ఉన్న వాళ్ల ఇళ్లకు తాళాలు ఉన్నాయి.

అందరు కాశ్మీరు పండిట్లలాగా ఇప్పుడు నేను కాశ్మీర్ కు క్రమం తప్పకుండా వచ్చి, చూసి పోతుంటాను. కానీ శాశ్వత వాపసు ఆలోచన నాలో ఎప్పుడూ రాలేదు. లోయలో చాలా గొంతుకల వెనక్కి రమ్మని పిలుస్తున్నా, తుపాకి భయం మమ్మల్ని ఇంకా వెంటాడుతుంది. మృత్యువు వీధుల్లో తిష్ట వేసిన చోటుకి, స్థానికులే అభద్రతతో ఉన్న చోటుకి, ఆర్ధికంగా మనగలగటానికి ఎలాంటి ఉద్యోగాలు లేని చోటుకి ఎవరు రావాలనుకొంటారు?

అందరు కాశ్మీరీ పండిట్లలాగానే నాకూ కాశ్మీరీ ముస్లిం స్నేహితులు ఉన్నారు. నా విషయంలో ఈ సంబంధాలన్నీ 2000 తరువాత ఏర్పడినవి. నా బాధ వారికి అర్ధం అవుతుంది. వారి బాధ నాకు అర్ధం అవుతుంది. కానీ దురదృష్టవశాత్తు మేము ఏమీ చేయలేము. చరిత్ర పుటలు రక్తంతో మునిగి ఉన్నపుడు; రాజకీయాలు మాత్రమే ద్వేషాన్నీ, విభజననూ వృద్ధి చేసే అన్ని నిర్ణయాల వెనుక చోదక శక్తిగా ఉన్నప్పుడు- ఆ గండిని పూడ్చటం అసాధ్యం. సంక్లిష్ట మానవ ట్రాజెడీని ఇతరులను నిందించే ఆటగా కుదించాలనుకొన్నపుడు, నువ్వు ఏ మతానికి చెందిన వుంటే దాని ప్రకారం నీ ప్రతిస్పందనలు ఉన్నపుడు- నీకు దగ్గరలో ఒక మహా విపత్తు దాగి ఉందని ఖచ్చితంగా తెలుసుకో.

నేను పుట్టినప్పటి నుండి, కాశ్మీర్ ఒక రాజకీయ సమస్యగానే ఉంది. ఆ సమస్య హద్దులను మొదట దేశ విభజన, అంతకు ముందు హరి సింగ్ నాయకత్వంలో డోగ్రాల పాలన నిర్ణయించాయి. తరువాత శకాన్ని చాలా మంది చరిత్రకారులు గ్రంధస్తం చేసినప్పటికీ, చరిత్ర కారిణి మృదు రాయ్ రాసిన పుస్తకం ʹHindu rulers. Muslim subjectsʹ కంటే ఎవరూ బాగా రాయలేదు

కాశ్మీర్ విషయం, తరువాత జరిగిన కాశ్మీరీ పండిట్ల ప్రవాసం విషయంలో నా ప్రతిస్పందనకు మా నాన్న విశాల లౌకిక దృక్పథం ఒక ఆకృతిని ఇచ్చింది. ఆ కాలంలో మాకున్న చాలామంది యువ బంధువులలాగా కాకుండ, మా నాన్నకు ʹఇతరులʹ పట్ల ద్వేషం ఉండేది కాదు. 1947 తరువాతి కాశ్మీర్ మొదటి ప్రధాన మంత్రి, జాతీయ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ అబ్ధుల్లా హిందువుల పాలిటి రక్షకుడు ఆయన దృష్టిలో.

హరి సింగ్ సంతకం చేసిన ʹకాశ్మీర్ సార్వభౌమ అంగీకారంʹ అనేక షరతులతో జరిగింది. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370 అందులో ఒకటి. ఆ ప్రాంతంలో శాంతి నెలకొన్న తరువాత ప్లెబిసైట్ నిర్వహిస్తామనే వాగ్దానం చేశారు. కాశ్మీరీలు వాళ్ల భవిష్యత్ ను నిర్ణయించుకొనే అధికారాన్ని బాలెట్ ద్వారా పొందారు. ఈ నమ్మకంతో కూడిన ఆర్టికల్ ను, జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చిన ఆర్టికల్ ను భారత ప్రభుత్వం ఆగస్టు 5, 2019న ఒక క్రూర సంతకంతో రద్దు చేసింది.

మా నాన్న నాకు ఏమి చెప్పాడో ఆ విషయాలను అన్వయించుకోవటానికి నా చిన్ననాటి జ్నాపకాలు, కాశ్మీర్ కు నేను చేసిన పర్యటనలు ఉపకరించాయి. నేను నా అంతటిగా నేను చూసి తెలుసుకొన్నది ఏమిటంటే కాశ్మీరీ ముస్లిములకు అనేక బాధలు ఉన్నాయి. వారి హృదయంలో ఆజాదీ కాంక్ష ఉన్నది. మేము చిన్న సమూహం అయినప్పటికి, కాశ్మీరీ పండిట్లగా కాశ్మీర్ లోయలో రాజ ప్రసాదాల్లాంటి ఇళ్లలో జీవించాము. బ్యూరోక్రసీనీ (అధికారులను), కాలేజీలనూ, ఆసుపత్రులనూ నియంత్రించాము. ఇదంతా 1989 తరువాత మారింది. అన్ని అవకాశాలు ఉన్న మైనారిటీ వర్గం (హిందూ పండిట్లు) శరణార్ధులుగా మారారు. హిందూత్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాశ్మీర్ ప్రాముఖ్యత భారత మాప్ లో ఒక బిందువుగా కుదించబడింది.

ఈ లక్ష్యం ఏ పద్దతిలో సాధించబడింది అనే సంగతి నన్నూ, నాలాంటి వారినీ విచారానికీ, షాక్ కు గురి చేస్తుంది. ఎల్లప్పుడూ వసుదైక కుటుంబం అని ఎప్పుడూ నమ్మే దేశపు అశేష ప్రజానీకపు మద్దతుతో, శత్రువుల పట్ల కూడా దయను ఆచరిస్తే నిర్వాణం పొందగలమని నమ్మిన బుద్ధుడు పారాడిన నేలపై ఇలా జరగటం ఇంకా బాధ పెడుతోంది.

బయట ప్రపంచంతో సంబంధాలు విరిచివేసి ; ఒక రాష్ట్రపు అశేష ప్రజానీకాన్ని వారి ఇళ్లలో బంధించటం, వారి రాజకీయ నాయకులను అరెష్టు చేయటం, ఎలాంటి నిరసనలనైనా అణగదొక్కటానికి వేలాది బలగాలని పంపటం, తరువాత వారిని పరిగణలోకి తీసుకోకుండా వారి భవిష్యత్తును నిర్ణయించటం – ఊహించలేని పిరికిపని. తీవ్రంగా ఖండించదగ్గ చర్య.

తమ భవిష్యత్తు ఏమి కానున్నదో అని ఇళ్లలో తిరుగాడుతూ, భయంతో జీవిస్తున్న లక్షలాది మంది ఆందోళనలను తలచుకొన్నపుడు- నా బెదురు బాల్యపు క్షణాలలో, నాకు సహాయం చేసిన ముసలి మనిషి జ్నాపకం మళ్లీ మొలకెత్తింది. అయితే నేనిప్పుడు అతని కళ్లలోకి చూడలేను.
- ప్రదీప్ మాగజైన్
తెలుగు అనువాదం రమా సుందరి

Keywords : kashmir, pandits, muslims, army, article 370
(2019-10-23 15:06:11)No. of visitors : 885

Suggested Posts


మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు....

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే.....

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

నెత్తురోడుతున్న కాశ్మీర్ - పోలీసు పెల్లెట్లకు 11ఏండ్ల విద్యార్థి బలి

శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం రాత్రి ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరమంతా పెల్లెట్ల గాయాలతో నిండి ఉన్నది. శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది....

కాశ్మీరీ చిన్నారుల విషాదం - ʹచదువన్నాఆగుతుంది కానీ చావు ఆగదు..ʹ

ʹమా కోసం చదువన్నా ఆగుతుంది కానీ చావు ఆగదు. ఓ ఇండియా... నీకోసం సింధు వెండిని తీసుకొస్తే.. ఇక్కడ(కాశ్మీర్‌లో) నీకోసం బంగారమే ఉందిʹ అని హిష్మా నజీర్ పలికింది. ఇలాంటి వ్యాఖ్యలతో సంజీవ్ సిక్రి డైరెక్ట్ చేసిన వీడియో....

బుర్హాన్ వని ఎన్ కౌంటర్ పై సారీ చెప్పండి - పోలీసులకు సీఎం ఆదేశం

కాశ్మీర్ లో బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌పై ప్రజలకు క్షమాపణ చెప్పాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబాబూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రోడ్లు, వీధుల్లో కూడా పోలీసులు కనిపించరాదంటూ ఆమె ఆదేశాలిచ్చినట్టు....

Search Engine

తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్
more..


ఈ