పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!


పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!

పెహ్లూఖాన్

ఆవులను అక్రమ రవాణా చేశాడన్న నెపంతో రాజస్తాన్ లో పెహ్లూ ఖాన్ అనే వ్యక్తిని మతోన్మాద‌ మూక కొట్టి చంపిన కేసును రాజస్థాన్‌లోని ఆల్వార్‌ జిల్లా కోర్టు ఈ రోజు కొట్టివేసింది. నిందితులైన ఆరుగురిని నిర్దోషులని కోర్టు ప్రకటించింది. ఓ వీడియోలో ఆరుగురు నిందితులు పెహ్లూ ఖాన్‌ను రోడ్డుపై ఈడ్చుకొని వెళ్తున్న దృశ్యాలు ఉన్నా.. అవి స్పష్టంగా లేవని, ఆ ఆధారం చెల్లదని కోర్టు తేల్చింది. అంతేకాక హెహ్లూఖాన్‌ చనిపోయిన తీరులోనూ సందేహాలు ఉన్నాయని కోర్టు వెల్లడించింది.

ఆస్పత్రి వైద్యులు ఆయన గుండెపోటుతో చనిపోయాడని చెప్పగా, గాయాల వల్ల మరణించినట్లు పంచనామా (పోస్టు మార్టం) నివేదిక తేల్చిందని పేర్కొంది. ఈ కేసులో మొత్తం నిందితులు తొమ్మిది మంది కాగా వీరిలో ముగ్గురు మైనర్లు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. వీరిపై జువైనల్‌ కోర్టులో విచారణ సాగుతోంది. ఈ ఆరుగురు నిందితులపై రాజస్థాన్‌ పోలీసులు విచారణ జరిపి వీరికి క్లీన్‌ చిట్ ఇచ్చారు. దీంతో వారు 2017 సెప్టెంబరు నుంచి బెయిల్‌పైనే ఉన్నారు.

అసలేం జరిగింది...
పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నాడనే నెపంతో 2017 ఏప్రిల్‌ 1న పెహ్లూ ఖాన్‌ (55) అనే హరియాణాకు చెందిన వ్యక్తిని ఓ మూక నిర్దాక్షిణ్యంగా చావ బాదింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని అల్వార్‌ ప్రాంతంలో జరిగింది. తీవ్ర గాయాలతో ఓ ఆస్పత్రిలో చేరిన హెహ్లూ ఖాన్‌ ఏప్రిల్ 3న చనిపోయాడు. భాజపా ప్రభుత్వ హయాంలో ఈ ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి. పెహ్లూఖాన్‌ను చావబాదిన నిందితులపై ఒక కేసు, అక్రమంగా పశువుల రవాణా చేస్తున్నారన్న ఆరోపణలపై ఖాన్‌ సహా ఆయన కుటుంబంపై మరో కేసు నమోదైంది.

పెహ్లూ ఖాన్‌, ఆయన కుమారులు ఆవులను అక్రమ రవాణా చేశారని పేర్కొంటూ ఈ ఏడాది జూన్‌లో రాజస్థాన్‌ పోలీసులు ఓ చార్జిషీటు దాఖలు చేశారు. ఇది రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. ముస్లింలపై ఇలాంటి కేసులను కావాలనే బనాయించారని దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్షలు వచ్చాయి. మళ్లీ జులైలో పెహ్లూఖాన్‌పై నమోదైన కేసును తిరిగి విచారణ చేపట్టాల్సిందిగా స్థానిక కోర్టు పోలీసులను ఆదేశించింది.

Keywords : rajasthan, pehlu khan, court, murder, mob lynching, police
(2019-10-14 06:31:25)No. of visitors : 259

Suggested Posts


సీఎం ఆదేశాలతో...బహిర్భూమికి వెళ్ళిన మహిళల ఫోటోలు తీశారు.. అడ్డుకున్నందుకు కొట్టి చంపారు.

స్త్రీలు బహిర్భూమికి వెళ్తుంటే వాళ్ళ సెల్ ఫోన్లలో ఫోటోలు తీసేవాళ్ళను ఏమంటారు. పోకిరీలు... జులాయీలు... ఈవ్ టీజర్లు.... అలా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తే అట్లాంటివాళ్ళను ఏమనాలి ? బ్లాక్ మెయిలర్స్ అనే కదా అంటారు. అలా ఫోటోలు తీసేవాళ్ళను అడ్డుకుంటే అలా అడ్డుకున్నవాళ్ళను కొట్టి చంపేవాళ్ళను ఏమంటారు ? హంతకులనే కదా ! కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ....

గోవు పేరుతో మరొకరిని కాల్చి చంపిన మతోన్మాదులు... మద్దతు పలికిన మంత్రి

గోరక్షక ముసుగులో ఉన్న మతోన్మాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజస్తాన్‌లో ఆవులను తీసుకెళ్తున్న ఉమర్‌ ఖాన్‌ అనే వ్యక్తిని తుపాకీతో కాల్చిచంపారు. అనంతరం మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశారు. భరత్‌పూర్‌ జిల్లాలోని ఘట్మిక గ్రామానికి చెందిన ఉమర్‌....

Muslim man shot dead by cow vigilantes in Rajasthanʹs Alwar, body thrown onto railway tracks

The family of a Muslim man, whose dismembered body was found on the railway tracks near Govindgarh in Alwar district of Rajasthan on Friday, has claimed that he was thrashed and shot dead by a crowd of cow vigilantes when he was transporting four cows to his native village Ghatmika in Bharatpur....

బీజేపీ,కాంగ్రెస్ సేమ్ టూ సేమ్... గోరక్ష‌కుల మూక దాడిలో చనిపోయిన పెహ్లూ ఖాన్ పై చార్జ్ షీట్

ఇప్పుడు రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. బాధితులపై బీజేపీ ప్రభుత్వం పెట్టిన కేసును ఎత్తి వేసి పెహ్లూ ఖాన్ హంతకులను శిక్షిస్తుందని ఆ కుటుంభం భావించింది. అయితే బీజేపీ కన్నా తామేమీ తక్కువ తినలేదని మరో సారి నిరూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం. చనిపోయిన పెహ్లూ ఖాన్ పై, అతని కొడుకుపై చార్జ్ షీట్ దాఖలు చేశారు.

Search Engine

ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్
ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం
అమేజాన్‌ కార్చిచ్చుకు అసలు కారణం - పి.వరలక్ష్మి
మహాజనాద్భుత సాగరహారానికి ఏడేండ్లు -ఎన్ వేణుగోపాల్
ʹహైకోర్టు తీర్పు ప్రకారం మావోయిస్టుల మృతదేహాలను ABMS కు అప్పజెప్పాలిʹ
మావోయిస్టు అరుణ ఎక్కడ ?
more..


పెహ్లూఖాన్