పేదోళ్లుగా పుట్టడమే కాదు.. చావడం కూడా నేరమే..!


పేదోళ్లుగా పుట్టడమే కాదు.. చావడం కూడా నేరమే..!

పేదోళ్లుగా

మీరు ఎప్పుడైనా గమనించండి.. తండ్రులకు కూతుర్లంటేనే కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. కూతుర్లకు కూడా తండ్రంటే వల్లమాలిన ప్రేమ ఉంటుంది. నాకైతే నా కూతురుని పుట్టిన వెంటనే నా చేతిలోకి తీసుకున్నాను. ఆ స్పర్శ.. ఆ నవ్వు.. ఆ సువాసన ఈనాటికీ గుర్తు. తన కడుపులో పుట్టిన కూతురంటేనే కాదు ఎవరైనా తల్లిదండ్రులకు ప్రేమే ఉంటుంది.

పిల్లలు పుట్టిన వెంటనే వారి భవిష్యత్ కోసం ఎన్నో కలలు కంటాం. వారిని ఎలా పెంచాలి.. ఎలా చదివించాలి.. వారికి ఒక మంచి భవిష్యత్‌ను ఇవ్వాలని. పెద్దపల్లి జిల్లాకు చెందిన సంపత్‌ కూడా అలాగే అనుకున్నాడు. తనకు పుట్టిన చిన్నారికి కోమలత అని పేరు పెట్టుకున్నాడు. ఎంతో కోమలమైన లతలా ఉందని అలా పేరు పెట్టుకున్నాడేమో..! పుట్టిన దగ్గర నుంచి తనే లోకం. తాను పేదరికం అనుభవిస్తున్నా.. తన కూతురు మాత్రం గొప్పగా ఉండాలని ఎన్నో కలలు కన్నాడు.

కాని, అనుకోకుండా ఏడేండ్ల కోమలత అరుదైన వ్యాది బారిన పడింది. కాలేయం సమస్య ఏర్పడటంతో ఆ పేద తండ్రికి ఏం చేయాలో పాలుపోలేదు. తనకు సర్కారు దవాఖానే గతి. దీంతో కరీంనగర్‌లోని సర్కారీ దవాఖానకు తీసుకొచ్చాడు. కాని ఆసుపత్రిలో డాక్టర్లు ఆ చిన్నారిని రక్షించలేకపోయారు. తను ఎంతో ప్రేమగా, అల్లరు ముద్దుగా పెంచిన ఆ చిట్టితల్లి తండ్రి కళ్ల ముందే చనిపోయింది.

కాని అసలు పేదరికం ఇక్కడే చూశాడు ఆ తండ్రి. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని సంపత్‌కు తన కూతురి మృతదేహాన్ని ఇంటికి ఎలా తీసుకెళ్లాలో అర్థం కాలేదు. ఒక అంబులెన్సును ఎవరైనా ఏర్పాటు చేస్తరేమో అని ఆసుపత్రి డాక్టర్లు, అధికారులను అడిగాడు. కాని ఏవీ అందుబాటులో లేవని వాళ్లు చెప్పారు. అంతే కాదు ఆ కోమలత విగత శరీరాన్ని స్ట్రెచర్‌పై తీసుకొచ్చి ఆసుపత్రి బయట వదిలేశారు.

ఒకవైపు కూతురు మృతదేహం.. మరోవైపు జేబులో రూపాయి కూడా లేని దుస్థితి. తన బాధను పంచుకునే గుండెతడి లేని వ్యక్తులు తన కళ్ల ముందు. ఏం చేయాలో పాలుపోలేదు. తను పుట్టినప్పుడు ఎలాగైతే పొత్తిళ్ల నుంచి ఎత్తుకొని సంతోషంగా బయట తిరిగాడో.. ఇప్పుడు సంపత్ అలాగే విగతజీవిగా మారిన తన కోమలత చేతులపై ఎత్తుకున్నాడు. ఆసుపత్రి నుంచి ఆటోస్టాండ్ వరకు నడిచాడు.

అన్నా.. నా కూతురు చనిపోయిందన్నా.. దయచేసి ఇంటిదాకా తీసుకొని పొండన్నా అంటూ రోదించాడు. ఏ ఒక్కరూ కరుణించలేదు. చివరక ఒక ఆటో డ్రైవర్ అతని బాధ చూసి చలించి పోయాడు. చివరకు సంపత్ సొంత గ్రామమైన కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారానికి తీసుకెళ్లాడు.

అయితే ఇక్కడ మనం చర్చించుకుంటుంది కోమలత చావు గురించే కాని.. అసలు తనకు ఈ చావు ఎందుకొచ్చిందని ఆలోచించామా..? ఆరోగ్యశ్రీ అంటూ.. పేదలకు ఉచిత వైద్యమంటూ ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పుకుంటోంది. పేదోడికి కూడా కార్పొరేట్ వైద్యమంటోంది.

వచ్చే రోగానికి తెలియదు తాను పేదోడి శరీరంలోకి ప్రవేశిస్తున్నానా.. ధనవంతుడి శరీరంలోకి పోతున్నానా అని. ధనవంతుడికి రోగం వస్తే ఎంత ఖర్చు పెట్టైనా బాగు చేయించుకోవడానికి ప్రయత్నిస్తాడు. చావు నుంచి దూరంగా వెళ్లడానికి ఎంత డబ్బైనా పెడతాడు. కాని పేదోడు ఏం చేయగలడు. తెల్లకార్డు, ఒక ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని కార్పొరేట్ ఆసుపత్రుల వెంట తిరగడం తప్ప.

అక్కడైనా వైద్యం అందుతుందా అంటే.. అంతా క్యూ పద్దతి. ఎంత ప్రమాదకరమైన, ప్రాణాపాయ స్థితిలో ఉన్నా లైన్లో రావలసిందే. కాని చావనేది లైన్లో వస్తుందా..?

కోమలత చనిపోతే తండ్రి చేతులతో ఎత్తుకపోవడం ఒక విషాదం అయితే.. అసలు వైద్యమే తనకు అందకపోవడం మరింత దారుణం. ఏ విధంగా చూసుకున్నా సంపత్ దగ్గర డబ్బులు లేక తన కూతురు మరణించలేదు. పేదలను అసలు మనుషులుగా చూడని ప్రభుత్వ వైఖరి వల్లే తను చనిపోయింది. చనిపోయిన తర్వాత కూడా కోమలత పార్థీవ శరీరం ఇంటికి వెళ్లలేని దురావస్థ.

అప్పుడెప్పుడో ఒడిషాలో.. జార్ఖండ్‌లో ఇలాంటి ఘటనలు జరిగాయంటే చదివిన గుర్తు. అక్కడ అన్ని సౌకర్యాలు ఉండవు.. అయినా అదంతా ఎక్కడో మారుమూల జరిగి ఉంటాయని అనుకొని సర్థుకుపోయాను. కాని ధనికరాష్ట్రంగా చెప్పుకుంటున్న తెలంగాణలో.. అందులో కరీంనగర్ వంటి పెద్ద నగరంలో ఇలాంటి ఘటన జరుగుతుందని అస్సలు ఊహించలేదు.

ఆ ఘటన గురించి చదువుతుంటేనే గుండె తరుక్కుపోయింది. మరి మన సర్కారు ఏం చేస్తోంది. మన దేశంలో పేదలకు కనీసం చనిపోయే అర్హత కూడా లేదు.. అంతే కాదు.. చనిపోయిన తర్వాత ఆ శవానికి కనీస మర్యాద కూడా దక్కదు.


(స్క్రీన్ షాట్.. వెలుగు ఈ-పేపర్ నుంచి తీసుకున్నది)

Keywords : Karimnagar, Komalatha, Sampath, Dead, Dead Body, No Money, మృతదేహం, శవం, ఎత్తుకెళ్లడం, చేతులు
(2020-06-04 03:19:33)No. of visitors : 514

Suggested Posts


0 results

Search Engine

వరవరరావు బెయిల్ పిటిషన్ పై విచారణ మళ్ళీ వాయిదా
రాజస్తాన్ లో అమెరికా లాంటి ఘటన....వ్యక్తిని కిందపడేసి మోకాలితో తొక్కిన పోలీసులు
రాబోయేవి మరింత దుర్భర దినాలు
అమెరికాలో వివక్ష గురించి మాట్లాడేవారు భారత్ లో వివక్ష గురించి ఎందుకు మాట్లాడరు ?
తెలంగాణ మంత్రులకు ప్రొఫెసర్ హరగోపాల్ లేఖ‌ !
వీవీ,సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీల విడుదలకై వారం రోజుల కార్యక్రమాలు -నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపు
మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి
నోరు మూసుకో....ట్రంప్ కు పోలీసు చీఫ్ హెచ్చరిక‌
తెలంగాణకోసం పోరాడిన వారు జైళ్ళలో మగ్గుతున్నరు
వరవరరావు బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా !
వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
more..


పేదోళ్లుగా