నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌


నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

నల్లమల

నల్లమల ప్రాంతంలో కేంద్రప్రభుత్వం యురేనియం తవ్వకాలు జరపాలని నిర్ణయించడాన్ని నిరసిస్తూ తవ్వకాలకు వ్యతిరేకంగా నల్లమల ప్రజలు చేపట్టిన పోరాటానికి తమ మద్దతును ప్రకటిస్తూ సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ మీడియాకు ప్రకటన విడుదల చేసింది ఆ ప్రకటన పూర్తి పాఠం మీ కోసం...

అణుబాంబుల కోసమే యురేనియం త్రవ్వకాలు,

నల్లమల యురేనియం త్రవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడండి.

నల్లమల అడవి ప్రాంతంలో అమ్రాబాద్,పదర తదితర ప్రాంతంలోని ప్రజలను నిర్వాసితులను చేస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్ట‌నున్న యురేనియం త్రవ్వకాలను సి.పి.ఐ మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.యురేనియం త్రవ్వకాల ప్రయత్నాలు వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నాము. విద్యుత్ అవసరల పేరుతో అణుథ‌ర్మల్ విద్యుత్ ఉత్పత్తి అనివార్యమని కేంద్ర ప్రభుత్వం ప్రజలను పక్కతోవ‌ పట్టించేలా ప్రయత్నిస్తుంది. దేశంలో తయారువుతున్న విద్యుత్ ను సరిగ్గా ఉపయోగించుకోలేని పాలకులు,మానవాళిని వినాశనం చేసే అత్యంత ప్రమాదకరమైన యురేనియం ఖనిజంను వేలికితీయడం దుర్మార్గమైన‌ చర్య, యురేనియం విద్యుత్ ఉత్పత్తి చేయడం ఎంత‌ ప్రమాదకరమో జార్ఖండ్ రాష్ట్రంలో జాదుగూడ,తమిళనాడులోని కూడం కులంలో చూడవచ్చు. 1986 రష్యాలో చెర్నోబిల్ ప్రమాదం నుండి మొదలుకొని 2011జపాన్లో పుకుషిమా ప్రమాదం వరకు ఈ త్రవ్వకాలు ఎంత మారణహెమాన్ని సృష్టిస్తాయో ప్రపంచం ముందు కనిపిస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో హిరోషిమా పై ప్రయోగించబడిన అణ్వాయుధం వల్ల లక్షలాది మంది ప్రజలు విగతజీవులైనారు. అణ్వాయుధ బలాన్ని బట్టి మిలటరీ శక్తిని గొప్పగా భావించే సామ్రాజ్యవాద‌ దళారీ పాలకులు యురేనియంను అణుబాంబుల తయారీకి ఉపయోగించి మానవాళి విద్వంసానికి పూనుకుంటున్నారు. నల్లమ‌ల ప్రజలను బలవంతంగా అడవి నుండి తరలించే ప్రయత్నాలను తెలంగాణ ప్రభుత్వం మానుకోకపోతే తగిన రీతిలో ప్రజా వ్యతిరేకతకు గురికాక‌ తప్పదు. ప్రత్యమ్నాయ‌ ఇందన వనరులు వదిలి అణువిద్యుత్ విధానం చేపట్టడమే కుట్ర, నల్లమల ప్రాంతం జీవ వైవిధ్యానికి ప్రసిద్ధిచెందింది. ఆదివాసీలకు రాజ్యంగం కల్పించిన రక్షణలను ఉల్లంగిస్తూ నల్లమలను అణుక్షేత్రంగా మార్చివేయడాన్ని ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. కృష్ణా జలాలను అణు ప్రమాదానికి గురిచేసే దుర్మార్గాన్ని నల్లమల పరిసర ప్రాంతమైన ఆంధ్రా, తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు యువత్ దేశ ప్రజలు కూడా ఖండించాలని కోరుతున్నాము. నల్ల‌మల ప్రాంతంలో జరిగిన ప్రజాపోరాటాల ఫలితంగా అడవిని, అటవీ సంపదను ఖనిజ సంపదను ప్రజలు రక్షిస్తున్నారు. నల్లమల విప్లవోద్యమాన్ని నెత్తుటేరులో పారించిన పాలక వర్గాలు ఇదే అదనుగా ఖనిజల కోసం అడవి బిడ్డలను, అడవిని వినాశనం చేస్తున్నారు. భారత అణదార్శిక సంస్థ, భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అణుబాంబుల కోసం అడవిని ఆక్రమించే కుట్రలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయాలని న‌ల్లమల ప్రజలకు పిలుపునిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా అణుదార్మిక ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడుస్తుండగా భారత ప్రభుత్వం మాత్రం దుర్మర్గపు విదానాన్ని చేపట్టింది. 2003లో నాగార్జునసాగర్ ప్రాంతంలో యురేనియం త్రవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు రాజీలేని పోరాటం సాగించి విజయం సాధించారు. అదే సూర్తితో యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియాను నల్లమల నుండి తరిమి కొట్టాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తుంది. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నల్లమల ప్రజలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు ప్రకటిస్తుంది. పర్యావరణ వేత్త‌లు, ప్రజా సంఘాలు, తెలంగాణ ప్రజలు నల్లమల ప్రజలకు అండగా నిలబడాలని పిలుపునిస్తున్నాము.
విప్లవాభివందనాలతో
జగన్
మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి

Keywords : nallamala, uranium, maoist party, statement
(2019-09-19 10:24:01)No. of visitors : 1017

Suggested Posts


పాలకులారా...! ఈ తల్లి ప్రశ్నలకు జవాబు చెప్పగలరా ?

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం,తిర్మలపూర్ గ్రామంలో... తమ ఊరును ఖాళీ చేయిస్తారన్న ప్రభుత్వం ఆలోచనపై ఓ తల్లి తన ఆవేదనను వెల్లడించింది. పాలకులకు కొన్ని ప్రశ్నలు సంధించింది. ఆ వీడియో మీ కోసం...

Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?

ప్రజల ప్రాణాలు కాపాడాలంటే అర్బన్ నక్సలైటా ? పర్యావరణం నాశ‌నమవుతుంది అంటే దేశద్రోహా ? నల్లమలను కాపాడాలంటే చైనా ఏజెంటా ? అవునట !

పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి

నల్లమలలో యురేనియం తవ్వకాల గురించి మాట్లాడే ముందు కడప జిల్లా తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టు నిర్వాకం గురించి యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యు.సి.ఐ.ఎల్‌.) సమాధానం చెప్పాలి.

Search Engine

తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరా..?
పోరాడితే పోయేదేమీ లేదు...పోరాడి హక్కులు సాధించుకున్న విద్యార్థినులు
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ ను వెంటనే విడుదల చేయాలి... మేధావులు, లాయర్లు, విద్యార్థుల డిమాండ్
పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి
ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్
కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
యుద్ధం - శాంతి.
యురేనియం దెబ్బకు జీవాలు గడ్డి తినడంలే.. బురుగులు కక్కి సస్తున్నాయి..!
కశ్మీర్ లో 80 మందికి పెల్లెట్ గాయాలు, బాలుడు మృతి... జాతీయ వార్తాసంస్థల వెల్లడి
ఆమె పోరాటమే.. తమిళనాడు ప్రభుత్వాన్ని కదిలించింది..!
స్కూలు పిల్లలకు భోజనంలోకి కూరకు బదులు ఉప్పు...బైట పెట్టిన జర్నలిస్టుపై కేసు
పేదోళ్లుగా పుట్టడమే కాదు.. చావడం కూడా నేరమే..!
more..


నల్లమల