ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్


ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్

ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని

మన దేశంలో దేశ ద్రోహ చట్టం దుర్వినియోగమవుతోందని, దాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ గుప్తా అన్నారు. ప్రలీన్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన లాయర్స్ వర్క్ షాప్ లో ʹదేశ‌ద్రోహ చట్టము... ‍భావ ప్రకటనా స్వేచ్చʹ అనే అంశంపై జస్టిస్ గుప్త ప్రసంగించారు.

ప్రభుత్వాన్ని, న్యాయ వ్యవస్థని, చివరకు ఆర్మీని కూడా విమర్శించడం దేశద్రోహం కాదని ఈ సందర్భంగా జస్టిస్ దీపక్ గుప్తా అన్నారు. విమర్శలు చేసినవారందరిపై కేసులు పెట్టి అణిచివేయాలని చూస్తే భారత దేశం పోలీసు రాజ్యంగా మారుతుంది కానీ ప్రజాస్వామ్య దేశంగా మనలేదన్నారు. భావప్రకటనా స్వేచ్చకు విలువనిచ్చే చాలా దేశాలు దేశద్రోహ చట్టాన్ని రద్దు చేసాయని చెప్పిన జస్టిస్ గుప్తా మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులైన అధికరణం19(1) భావ ప్రకటన స్వేచ్ఛకు హామీ ఇస్తుందని తెలిపారు. అధికరణం 21 ప్రకారం ప్రతి వ్యక్తికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉందని తెలిపారు అధికరణం 25 మత స్వేచ్ఛకు హామీ ఇస్తుందని ఆయన తెలిపారు ఎవరికి ఇష్టమైన విశ్వాసాలను వారు ఆచరించేందుకు ప్రచారం చేసుకునేందుకు ఈ అధికారులు హామీ ఇస్తుందని భావప్రకటనా స్వేచ్ఛకు హామీ ఇచ్చిన తర్వాత ఆషామాషీగా దేశద్రోహం కేసు నమోదు చేసిన మాత్రాన అది చెల్లుబాటు కాదని ఆయన స్పష్టం చేశారు.
వ్యక్తులే వ్యవస్థలు కాదని, దేశం అంటే ఓ వ్యక్తి కంటే ఎంతో పెద్దది అని చెప్పిన గుప్తా అత్యవసర పరిస్థితి( ఎమర్జన్సీ)కాలంలో 1975, 77ల్లో ఓ పార్టీ అధ్యక్షురాలు దేశానికి నాయకురాలిగా వ్యహరించారని, అప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నమే జరిగిందని అయితే ఆ ప్రయత్నం విఫలం అయిందని గుర్తుచేశారు. భవిష్యత్తులో ఆ ప్రయత్నం ఎవరు చెయ్యబోరన్న నమ్మకం తనకు ఉందని అన్నారు దేశం అంటే ఓ వ్యక్తి కంటే ఎంతో పెద్దది అని ఆయన అన్నారు.

మనం సమస్యలని లేవనెత్తకపోతే, పాతబడిపోయిన వ్యవస్థలని ప్రశ్నించకపోతే కొత్త వ్యవస్థలను నిర్మించలేం. బుద్దుడు, జీసస్ క్రైస్ట్, కబీర్, రాజారాంమోహన్ రాయ్, స్వామీ దయానంద సర్స్వతి, కార్ల్ మార్క్స్, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ప్రశ్నించడం ద్వారానే కొత్త దారులు వేశారని జస్టిస్ గుప్తా అన్నారు.
(inputs: indianexpress.com, deccanherald.com, scroll.in, livelaw.in)

Keywords : Justice Deepak Gupta , Supreme Court judge, sedition
(2019-10-14 19:51:51)No. of visitors : 482

Suggested Posts


0 results

Search Engine

RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్
ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం
అమేజాన్‌ కార్చిచ్చుకు అసలు కారణం - పి.వరలక్ష్మి
మహాజనాద్భుత సాగరహారానికి ఏడేండ్లు -ఎన్ వేణుగోపాల్
ʹహైకోర్టు తీర్పు ప్రకారం మావోయిస్టుల మృతదేహాలను ABMS కు అప్పజెప్పాలిʹ
మావోయిస్టు అరుణ ఎక్కడ ?
ఐదు దశాబ్దాల వసంతగానం
మన్యంలో నెత్తురు పారిస్తున్న జగన్ సర్కార్
more..


ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని