మావోయిస్టు పార్టీకి 15 ఏండ్లు...ఏవోబీలో భారీ బహిరంగ సభ‌


మావోయిస్టు పార్టీకి 15 ఏండ్లు...ఏవోబీలో భారీ బహిరంగ సభ‌

మావోయిస్టు

భారత విప్లవోద్యమ చరిత్రలో 2004, సెప్టెంబర్‌ 21 ఓ మైలు రాయి. దేశంలో రెండు పాయలుగా నడిచిన విప్లవోద్యమాలు వాటికి నాయకత్వం వహించి అద్భుత ప్రజా పోరాటాలను నిర్మించిన రెండు విప్లవ పార్టీలు ఒక్కటై అతి పెద్ద విప్లవ పార్టీగా ఆవిర్భవించినరోజు. నక్సల్భరీ వసంత కాల మేఘ గర్జన తర్వాత అదే దారిలో నడుస్తూ శ్రీకాకుళం మీదుగా ఇటు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అటు దండకారణ్యం మీదుగా బెంగాల్ దాకా మిలిటెంట్ ప్రజా ఉద్యమాలు నిర్మించిన సీపీఐ ఎంఎల్ పీపుల్స్ వార్... బీహార్, జార్ఖండ్ లలో అద్భుత పోరాటాలు నడిపిన ఎంసీసీ ఒక్కటిగా కలిసి 2004, సెప్టెంబర్‌ 21న సీపీఐ మావోయిస్టు పార్టీగా ఏర్పడటం భారత విప్లవోద్యమంలో భారీ ముందడుగు. (దీనికన్న ముందు పీపుల్స్ వార్ తో సీపీఐ ఎంఎల్ పార్టీ యునిటీ కలిసింది) (ఆ తర్వాత కేరళలో విప్లవ పార్టీ సీపీఐ ఎంఎల్ నక్సల్బరీ కూడా మావోయిస్టు పార్టీతో కలిసింది) అక్కడి నుండి అనేక ఆటు పోటులను ఎదుర్కొంటూ ముందుకు నడుస్తున్నది పార్టీ. కేంద్రం సాగిస్తున్న గ్రీన్ హంట్, సమాధాన్ దాడులను ప్రజల భాగస్వామ్యంతో సనర్దవంతంగా తిప్పికొడుతూ సాయుధ పోరాటాన్ని తీవ్రతరం చేస్తున్నది.

ఇక సీపీఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భావం జరిగిన‌ సెప్టంబర్ 21 న దేశవ్యాప్తంగా వారోత్సవాలు జరుపుకుంటున్నారు పీడిత పోరాట ప్రజలు. కేరళ నుండి బీహార్ దాకా అనేక ప్రాంతాల్లో సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
ఇందులో భాగంగా ముంచంగిపుట్టు ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మంగళవారంనాడు భారీ బహిరంగ సభ జరిగింది. ఒకవైపు సరిహద్దు ప్రాంతాలపై పోలీసులు నిఘాను పెంచి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు అధిక సంఖ్యలో గ్రేహౌండ్స్ బలగాలను దించారు. కూంబింగను ఉదృతం చెయ్యడమే కాకుండా రాత్రి వేళ పోలీగస్తీ పెంచారు. డాగస్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో ప్రతి రహదారి, కల్వర్టులను క్షుణ్నంగా పరిశీలిస్తూ అనుమానితులను ఆదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
గ్రామాల మీద దాడులు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అయినప్పటికీ వేలాదిగా కదిలి వచ్చిన ప్రజలు పెద బయలు ఏరియా కమిటీ అద్వర్యంలో సభను దిగ్విజయంగా జరుపుకున్నారు.
ఈ భారీ బహిరంగ సభ ప్రాంగణమంతా ఎర్రబ్యానర్లతో, ఎర్ర జెండాలతో ఎరుపెక్కింది.ప్రజల విప్లవ నినాదాలతో అడవి ప్రతిధ్వనించింది.

ఖనిజ దోపిడీని ప్రతి ఒక్కరూ అడ్డు కోవాలని, నల్లమల అడవుల్లో యురేనియం తవ్వ కాలు జరపవద్దని ఈ సందర్భంగా మావోయిస్టు పార్టీ పెదబయలు ఏరియా కమిటీ కమాండర్ సుధీర్ డిమాండ్ చేశారు. అడవిపై ఆదివాసులదే హక్కు అని అడవి సంపదను దోచుకోజూస్తున్న పాలకులపై పొరాటాన్ని ఉదృతం చేయాలని, పల్లె పల్లెనా మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

మరో వైపు తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ అనేక ప్రాంతాల్లో కరపత్రాలు అంటించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, వాజేడు, గణపురం మోట్లగుడెం ఏరియాల్లో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాఁష్ట కమిటి పేరిట కరపత్రాలు అంటించారు. బ్రాహ్మణీయ్ అహిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను జరుపుకుందాం అంటూ ఆ కరపత్రాల్లో పిలుపునిచ్చారు

Keywords : cpi maoist party, charumajundar, cpi ml peoples war, mcc, telangana, andhrapradesh, bihar, bengal
(2019-12-16 02:45:32)No. of visitors : 1226

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

Search Engine

హైదరాబాద్‌ను తాకిన ʹజామియాʹ నిరసన సెగ.. వందలాది మంది విద్యార్థుల ఆందోళన
జామియా విద్యార్థులకు అండగా నిల్చిన వీసీ - పోలీసులపై కేసు నమోదు చేస్తామని ప్రకటన‌
నేను ముస్లింను కాను కానీ పోరాటంలో ముందుభాగాన ఉన్నాను, అందుకే నన్ను టార్గెట్ చేశారు
కామ్రేడ్ రామన్న మరణంపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
అలుపెర‌గ‌ని విప్ల‌వ బాట‌సారి చంద్రన్న
నేను చనిపోయినా వారికి శిక్షపడాలి....ఉన్నావ్ అత్యాచార బాధితురాలి చివరి కోరిక‌
మా పేరు మీద కస్టడీ హత్యలు వద్దు..!
కూలి డబ్బులు అడిగినందుకు దళితుడిని జేసీబీతో తొక్కించి చంపాడు..!
క్షీణించిన వరవరరావు ఆరోగ్యం - ట్రీట్ మెంట్ కోసం పూణే ప్రభుత్వ‌ హాస్పటల్ కు...
రేప్ బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ దాడి చేసిన రేపిస్టులు... సజీవదహనానికి యత్నం
అది ఎన్కౌంటర్ కాదు.. 17 మందిని ఏకపక్షంగా కాల్చి చంపారు : జుడీషియల్ కమీషన్ వెల్లడి
ఇండియాస్ డాటర్స్.. ఇంకెంత కాలం ఈ దారుణాలు..? ఈ డాక్యుమెంటరీ చూడండి..!
20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
ప్రియాంక హత్య : ఢిల్లీలో పగిలిన చిన్ని గుండె !
100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ
దొరతనం గెలుసుడా ఓడుడా? - ఎన్.వేణుగోపాల్
ʹఆకలి, పేదరికంతో చచ్చిపోతున్నాʹ.. కంటతడి పెట్టిస్తున్న ఓ చిన్నారి సూసైడ్ లెటర్
ఈ తెలంగాణ మీదే.. మాది కాదు : కేసీఆర్‌కు ఒక ఆర్టీసీ కండక్టర్ బహిరంగ రాజీనామా లేఖ
మహిళా కార్యకర్తలపై అక్రమకేసులకు వ్యతిరేకంగా పోరాడుదాం !
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
ఒక ప్రొఫెసర్ - ఏడు కుట్ర కేసులు
ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
more..


మావోయిస్టు