జేయూ విద్యార్థిపై బ్యాట్లతో దాడి... జై శ్రీరాం అంటూ నినాదాలు


జేయూ విద్యార్థిపై బ్యాట్లతో దాడి... జై శ్రీరాం అంటూ నినాదాలు

జేయూ

పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ లో ఓ విద్యార్థిపై కాషాయమూక విరుచుకుపడింది. క్రికెట్‌ బ్యాట్లు, వికెట్లతో విచక్షణారహితంగా దాడి చేసింది. మూక నుంచి రక్షించాలని పక్కనే ఉన్న పోలీసులను అర్థించినా.. వారు పట్టించుకోలేదు. చివరకు మరికొందరు విద్యార్థులు ఆ మూక నుంచి బాధితుడిని రక్షించారు.

కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో జాదవ్‌పూర్‌ యూనివర్సిటీకి గురువారం వెళ్లడం.. అదేరోజు వామపక్ష విద్యార్థులపై ఏబీవీపీ సభ్యులు దాడులు చేసి, కార్యాలయాలకు నిప్పుపెట్టి హింసాకాండ సృష్టించారు. ఏబీవీపీకి వ్యతిరేకంగా గురువారం జరిగిన ఓ ప్రదర్శనలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న పవన్‌ శుక్లా పాల్గొన్నాడు. అనంతరం సాయంత్రంపూట వర్సిటీ నుంచి బయటికెళ్లిన పవన్‌ శుక్లా తిరిగి వస్తుండగా.. గేటు నెంబర్‌ 4 దగ్గర కొందరు క్రికెట్‌ బ్యాట్లు, వికెట్లు, కర్రలు పట్టుకుని నిలుచున్నారు. వర్సిటీలోకి వెళ్తుండగా.. బ్యాట్లు, వికెట్లు పట్టుకుని ఇక్కడ ఎందుకు నిల్చున్నారని, ఎవరిని కొట్టేందుకు వచ్చారని ఆ మూకను విద్యార్థి పవన్‌ ప్రశ్నించారు.

అంతే, ఆ మూక జై శ్రీరాం అని నినాదాలు చేస్తూ తనపైనే విరుచుకుపడిందని పవన్‌ వివరించారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే దాదాపు 50 నుంచి 60 మంది బ్యాట్లు, వికెట్లు, కర్రలతో చుట్టుముట్టి కొట్టారని చెప్పారు. పక్కనే ఉన్న పోలీసులను సహాయం కోసం కోరగా.. వారు పట్టించుకోలేదని అన్నారు. కొందరు విద్యార్థులు బహుశా ఏబీవీపీ వైఖరిని నిరసించేవారు కాబోలు.. వచ్చి తనను కాపాడి ఆస్పత్రికి చేర్చారని వివరించారు. కేపీసీ ఆస్పత్రిలో చికిత్స పొందారని, గాయాలకు కుట్లు వేశాక తిరిగి క్యాంపస్‌కు వెళ్లారని చెప్పారు. సన్నిహితులతో కాసేపు గడిపి తిరిగి ఇంటికెళ్లారని వివరించారు. తాను ఏ రాజకీయ విద్యార్థి సంఘ సభ్యుడిని కాదనీ, కేవలం ఏబీవీపీ వైఖరితో విబేధించే ఆ ర్యాలీలో పాల్గొన్నారని తెలిపారు. ఆ ప్రదర్శనలో తనను చూసినవారు ఆ మూకలో ఉండొచ్చని పవన్ అనుమానించారు.

Keywords : west bengal, jadavpur university, abvp, left students
(2019-10-13 06:47:11)No. of visitors : 291

Suggested Posts


అవును... మేమిద్దరం కలిసే పోటీ చేస్తాం - సీపీఎం, బీజేపీ నేతల ప్రకటన‌

సిద్దాంతపరంగా శత్రువులమని చెప్పుకునే సీపీఎం, బీజేపీ లు ఎన్నికల రాజకీయాల్లో మాత్రం దోస్తానా చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడానికి సిద్దాంతాలు అవసరం లేదని భావిస్తున్నట్టున్నాయి ఆ రెండు పార్టీలు. పశ్చిమ బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో త్రుణమూళ్ కాంగ్రెస్ ను ఓడించడం కోసం

కాషాయ మూక దాడిపై భగ్గుమన్న విద్యార్థిలోకం...వేలాదిమందితో ర్యాలీ

జాదవ్ పూర్ యూనివర్సిటీలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియా సహకారంతో ఏబీవీ సృష్టించిన హింసాకాండను వ్యతిరెకిస్తూ... ప్రజాస్వామ్యంపై కాషాయ మూక చేస్తున్న దాడులను నిరసిస్తూ....విద్యార్థిలోకం గర్జించింది. వాళ్ళకు మద్దతుగా ప్రజలు కదం తొక్కారు.

భిన్నాభిప్రాయాలపై దాడికి తీవ్ర‌ ప్రతిఘటన ఉంటుంది.. ప్రాణాలకు తెగించే ప్రజలున్నారు - అమర్త్యసేన్

ప్రజాస్వామ్యమంటే కేవలం మెజారిటీ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే కాదనీ, ప్రజాస్వామ్యంలో అందరి ప్రయోజనాలకు చోటుంటుందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత అమర్త్య సేన్‌ ఉద్ఘా టించారు. కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ తీరుపై విస్మయం వ్యక్తం చేస్తూ.. ఎన్నికల్లో గెలిచినంత మాత్రానా దేశంలోని బహుళత్వాన్ని

కేంద్ర మంత్రి సాక్షిగా జాదవ్‌పూర్‌ వర్సిటీలో ఏబీవీపీ హింసాకాండ !

పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాల యంలో గురువారంనాడు ఏబీవీపీ నిర్వహించిన సెమినార్ కు హాజరైన కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో హాజరయ్యి మైనార్టీల ఉద్దేశాలను తాము పట్టించుకోబోమనీ, వారిని దేశం నుంచి వెళ్లగొడతామని, మూక దాడులను ప్రతిసారీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదనే రీతిలో రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన నేపథ్యంలో విద్యార్థులు ఆగ్రోహోదగ్రులై నిరసన వ్యక్త

Search Engine

మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్
ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం
అమేజాన్‌ కార్చిచ్చుకు అసలు కారణం - పి.వరలక్ష్మి
మహాజనాద్భుత సాగరహారానికి ఏడేండ్లు -ఎన్ వేణుగోపాల్
ʹహైకోర్టు తీర్పు ప్రకారం మావోయిస్టుల మృతదేహాలను ABMS కు అప్పజెప్పాలిʹ
మావోయిస్టు అరుణ ఎక్కడ ?
ఐదు దశాబ్దాల వసంతగానం
మన్యంలో నెత్తురు పారిస్తున్న జగన్ సర్కార్
కశ్మీర్ లో దుర్మార్గం పై మహిళల నివేదిక
ఈ గొప్ప ప్రజాస్వామ్యాన్ని చూసి తెలంగాణమా గర్వించు !
more..


జేయూ