ఈ గొప్ప ప్రజాస్వామ్యాన్ని చూసి తెలంగాణమా గర్వించు !


ఈ గొప్ప ప్రజాస్వామ్యాన్ని చూసి తెలంగాణమా గర్వించు !

ఈ

తరతరాలుగా తెలంగాణ తనపై జరిగే అన్యాయాలపై పోరాడుతూనే ఉన్నది. నియంతృత్వాన్ని ఎదిరిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యం కోసం పరితపిస్తూనే ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ పోరాటం నీళ్ళూ, నిధులూ, నియామకాల కోసమే కాదు ప్రజాస్వామ్యం కోసం కూడా ఆ పోరాటానికి నాయకత్వం వహించానని, తమది ఉద్యమ పార్టీ అని ప్రతిరోజూ జబ్బలు చరుచుకునే టీఆరెస్ పాలన సమైక్య రాష్ట్రపాలకన్నా కొత్తగా ఏమీ లెదని ప్రతీ రోజూ నిరూపిస్తూనే ఉన్నది. ప్రశ్నించే, నిరసన తెలిపే గొంతులను నులుమడానికి ప్రతి రోజూ ప్రయత్నిస్తూనే ఉన్నది. భిన్నాభిప్రాయాలకు స్థానంలేక పోతే ప్రజాస్వామ్యమే కాదని టీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ స్టేజీల‌ మీద ఉపన్యాసాలు దంచుతాడు మరో వైపు చిన్న సభ పెట్టుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వది హైకోర్టు అనుమతి ఇచ్చినా దాన్ని పట్టించుకోకుండా ప్రజలను అరెస్టులు చేస్తూ సభను జరగనివ్వరు. ఇదీ తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాస్వామ్యం.

ఆదివాసుల పోడు హక్కుల కోసం వరంగల్ లో సభ పెట్టాలనుంది తెలంగాణ ప్రజా ఫ్రంట్. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే ఆ సంఘం హైకోర్టు నుండి అనుమతి తెచ్చుకుంది. ఈ రోజు హన్మకొండలో సదస్సుకు ఏర్పాటు చేసుకున్నది ప్రజాఫ్రంట్. అయితే ఆ సదస్సును జరగనివ్వకుండా తెల్లవారుజామునుండే అరెస్టులు మొదలుపెట్టారు పోలీసులు. సదస్సుకు వస్తున్న ప్రజలను అనేక చోట్ల అరెస్టు చేశారు. స్పీకర్ లను శ్రోతలను అన్ని చోట్ల అరెస్టు చేశారు. హాలు నిర్వాహకులను బెదిరించారు. తెలంగాణ ప్రభుత్వపు ఈ అప్రజాస్వామిక దుర్మార్గపు చర్యపై తెలంగాణ ప్రజాఫ్రంట్ విడుదల చేసిన మీడియా ప్రకటన పూర్తి పాఠం...

పత్రిక ప్రకటన
తేదీ. 25 సెప్టెంబర్, 2019.

పోలీసు నిర్బంధాన్ని, అక్రమ అరెస్టులను ఖండించండి.
ఆదివాసీ, పోడు రైతుల హక్కులకై పోరాడుధాం.

ఈరోజు తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో హన్మకొండ పట్టణంలో ఏకశిలా పార్కు వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు అనుమతి నిరాకరించడంతో సదస్సు గా మార్చుకోవడం జరిగింది.

పొడు భూములకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ తో సదస్సు కూడా నిర్వహించుకోవడానికి వీల్లేదని హాలు నిర్వాహకులను పోలీసులు రాత్రి బెదిరించారు.

ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి వివిధ జిల్లాలలో నుండి వస్తున్న ప్రజలను బెదిరించడం జరిగింది అనేక మంది కార్యకర్తలను వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అరెస్టు చేశారు ఈ అరెస్టు లను తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది.

అరెస్టు అయిన వారిలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర అద్యక్షులు రవి చంద్ర, ప్రధాన కార్యదర్శి మెంచు రమేష్, ఉపాధ్యక్షుడు నలమాసకృష్ణ, ఉపాధ్యక్షులు రమాదేవి, తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సాయన్న, తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లు మద్దిలేటి, సందీప్, tpf అర్బన్ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ , కార్యదర్శి రంజిత్, అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర నాయకులు శాంతక్క, tpf వరంగల్ జిల్లా నాయకులు మురళి, ఉమక్క, pdm జిల్లా అధ్యక్షులు క్రాంతి, tvv నాయకులు సూర్యం,గణేష్, గోపి, tpf గట్ల నర్సింగపూర్ మెరుగు రాజన్న, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు రాజు, తెలంగాణ రైతాంగ సమితి నాయకులు ప్రసాద్ తొపాటు కన్నారం గ్రామ ప్రజలు 20 మంది, tpf పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొమురయ్య, tpf కార్యదర్శి భానోత్ రామారావు, హైదరాబాద్ tpf నాయకులు రాంబాబు, హరికృష్ణ, జనగామ జిల్లా అధ్యక్షులు పాకాల వెంకన్న, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు జైపాల్ మొదలయిన వారిని అరెస్టు చేసి ఖాజీపేట, హసన్ పర్తి, కాకతీయ యూనివర్సిటీ , సుభేదారి, హన్మకొండ మొదలైన పోలీస్ స్టేషన్ లలో మొత్తం 150 మందిని నిర్బంధించారు.

అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని tpf రాష్ట్ర కమిటీ
డిమాండ్ చేస్తోంది.

ఏజెన్సీలో ఆదివాసిల చేతుల్లో ఉన్న భూములను గుంజుకుని బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టడం కొరకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేస్తుంది.

ఉద్యమాభివందనాలతో..
తెలంగాణ ప్రజా ఫ్రంట్.
రాష్ట్ర కమిటీ

Keywords : telangana praja front, warangal, police, trs, arrest
(2019-11-17 20:44:33)No. of visitors : 413

Suggested Posts


నిత్య పోరాట యోధుడు, ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు రాఘవులు సార్ కు జోహార్లు !

తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా గౌరవాధ్యక్షుడు రాఘవులు సార్ ది 40 ఏండ్ల పోరాట చరిత్ర. నిజామాబాద్ జిల్లాలో విప్లవోద్యమం ప్రారంభ దశ నుండి పెద్ద అండ రాఘవులు సార్. ఉపాధ్యాయ ఉద్యమనాయకుడు, ఉపాధ్యాయులను ప్రజల కోసం నిలబెట్టడానికి

Search Engine

Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
more..


ఈ