include 'men';
?>
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాటమే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్యతిరేక ప్రజాస్వామిక పోరాటంʹ
(ఆర్టీసీ సమ్మెను బలపరుస్తూ విప్లవ రచయితల సంఘం విడుదల చేసిన మీడియా ప్రకటన పూర్తి పాఠం)
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఉద్యమాన్ని బలపరుద్దాం
ఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాటమే కాదు... కేసీఆర్ నియంతృత్వ వ్యతిరేక ప్రజాస్వామిక పోరాటం
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కేవలం తమ జీతభత్యాల కోసమే కాదు ప్రజా సంస్థగా ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యమిస్తున్నారు. వాళ్లవి అత్యంత న్యాయమైన డిమాండ్లు. ఉద్యోగులుగా కనీస సంక్షేమం కోరుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమమప్పుడు, ఎన్నికల సమయంలో ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని స్వయంగా కేసీఆర్ ప్రకటించాడు. ఇప్పుడు కార్మికులు అవే అడుగుతున్నారు. దీన్ని కేసీఆర్ భరించలేకపోతున్నాడు. అడిగితే, ప్రశ్నిస్తే వినే సంస్కృతి బూర్జువా ప్రభుత్వాలకు బొత్తిగా ఉండదు. అందునా కేసీఆర్ పద్ధతి ఎలా ఉంటుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి చూస్తున్నాం. అందుకే ఉద్యమం చేస్తున్న కార్మికులతో చర్చించదల్చుకోవడం లేదు. సమస్యలు పరిష్కరించడం అనే కనీస ప్రజాస్వామ్య పాలనా పద్ధతిని ఆయన పాటించదల్చుకోలేదు. సమ్మె చేయడమే చట్ట వ్యతిరేమని బరితెగించి మాట్లాడుతున్నారు. ఈ కారణం మీదే ఏకంగా 48,000 మంది ఆర్టీసీ కార్మికులను తొలగించేందుకు సిద్ధమయ్యాడు. ఎస్మా ప్రయోగిస్తానని బెదిరిస్తున్నాడు. దాదాపుగా సంస్థలోని సిబ్బంది మొత్తాన్ని తీసేసి, ప్రైవేట్ ఉద్యోగులతో సంస్థను నడిపిస్తానని అంటున్నాడు. గత రెండు రోజులుగా ఆ పని ఆచరణలో పెట్టాడు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను, మద్దతుగా పాల్గొన్న వివిధ పార్టీల, ప్రజాసంఘాల వాళ్లను అక్రమంగా అరెస్టు చేయించాడు. ఇదంతా ఆయన తన ఫ్యూడల్ దురహంకారానికి, ప్రజాస్వామ్యం ముసుగులోని బూర్జువా నియంతృత్వానికి నిదర్శనం.
కార్మికులు తమ సంక్షేమం, హక్కుల కోసమే కాకుండా ఆర్టీసీ పరిరక్షణ కోరుకుంటున్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని అడుగుతున్నారు. కానీ కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేటీకరించాలనుకుంటున్నాడు. అందుకే నష్టాల్లో ఉందని తప్పుడు ప్రచారానికి పూనుకున్నాడు. మొత్తానికి ఆర్టీసీని వదిలించుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ప్రభుత్వ రాజకీయార్థిక విధానం. ఆర్టీసీ కార్మికులు దీన్ని సమరశీలంగా ఎదిరించి పోరాడుతున్నారు. ఉచితాలు, రాయితీలు, పింఛన్లు కాకుండా న్యాయమైన హక్కుల కోసం ఆర్టీసీ కార్మికులు పోరాడుతున్నారు. సంస్థను ప్రైవేటీకరించాలనే కుట్రను ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇది ప్రజల పోరాటం. ప్రజా అవసరాలు తీర్చే పోరాటం. ఈ పోరాటానికి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధి జీవులు పూర్తిగా సంఘీభావం ప్రకటించాలి. ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీని బతికించు కోవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉన్నది. అందుకు వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి వారికి అన్నివిధాలుగా అండగా నిలబడదాం.
- పాణి,
కార్యదర్శి, విరసం
Keywords : RTC, Strike, kcr, virasam, workers, unions
(2024-04-24 17:41:14)
No. of visitors : 1394
Suggested Posts
| ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ ఆర్టీసి కార్మికులంతా తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను విరమించకుండా విరోచితంగా పోరాడండి. పోరాడితేనే మన సమస్యలకు అంతిమ పరిష్కారాలుంటాయి. లేదంటే వున్న ఉద్యోగాలు పోయి బజారున పడుతారు. అవసరమైతే త్యాగాలకు సిద్ధం కండి. కార్మికుల న్యాయమైన డిమాండకు అన్ని సెక్షన్ల ప్రజలంతా తమ సంపూర్ణ మద్దతును అందించండి. వారితో భుజం కలిపి పోరాడండి. |
| ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?తెలంగాణ ప్రభుత్వం సాలీనా సుమారు 1000 కోట్ల రూపాయలు ఆర్టీసీ నుండి వసూలు చేస్తోంది. 2014 నుండి 2019 వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో 5 వేల కోట్ల రూపాయలు ఆర్టీసి ప్రభుత్వానికి చెల్లిస్తే, ప్రభుత్వం మాత్రం కేవలం 710 కోట్ల రూపాయలు మాత్రం ఆర్టీసికి ఇచ్చి చేతులు దులుపుకుంది. |
| ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహంపారిశ్రామిక వివాదాల చట్టం 1947 ప్రకారముగా నెల రోజుల ముందు నోటీస్ ఇచ్చి చట్ట బద్ధమైన సమ్మె చేస్తున్నారు. దానికి ఆర్టీసి యాజమాన్యము, కార్మిక శాఖ, కార్మిక సంఘాలు చర్చలు జరిపి పరిష్కారముకు ఇరువురు కృషి చేయాలి. కాని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి చట్ట విరుద్ధంగా జోక్యము చేసుకుని ముగ్గురు ఐ.ఎ.ఎస్ లతో కమిటీ వేసి మొక్కుబడిగా చర్చలు జరిపించి, కార్మిక సంఘాలు మొండిగా |
| వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన చలో టాంక్ బండ్ పిలుపు విజయవంతం అయ్యింది. ఆర్టీసీ కార్మికులు తమ సమస్య పరిష్కారం కోసం, ఆర్టీసీని రక్షించడం కోసం 35 రోజులుగా చేస్తున్న సమ్మె కొనసాగింపుగా ఈ రోజు తలపెట్టిన చలో టాంక్ బండ్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. |
| దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!ఇంతకు ఏమడిగిండ్రయా వాండ్లు? ఏమన్న నీ బంగ్లలు ఇమ్మన్నరా, నీ జాగలిమ్మన్నరా, నీ ముల్లెలు ఇమ్మన్నరా? సర్కారు నౌకర్లతోటి సమానంగ తనఖా ఉండాలన్నరు. సర్కార్ల కలుపుమన్నరు. పని కాడ సౌలత్ జూడమన్నరు. |
| పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన కార్మికులుతెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా ఈ రోజు చలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎక్కడికక్కడ అరెస్టులు సాగించినా ట్యాంక్ బండ్ కు అన్ని వైపులనుండి కార్మికులు |
| RTC కార్మికులారా ఆత్మహత్యలు వద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !సమ్మె కార్మికుని జన్మ హక్కు అయినప్పటికినీ ప్రభుత్వం వారితో చిత్తశుద్దితో చర్చలు చేయకుండా, సమ్మెలో పాల్గొన్నారని వారిని ఉద్యోగాలనుంచి తొలగించివేయడం లాంటి ప్రకటనలు చేయడం వల్ల RTC కార్మికులు వారి కుటుంబాలు తీవ్రమైన అభద్రతకు లోనవతున్నారని, ఆ అభద్రతా బావనల్లోంచే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయని పౌరహక్కుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. |
| చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న ఆర్టీసీ జేఏసీచలో టాంక్ బండ్ కార్యక్రమంలో మావోయిస్టులు పాల్గొన్నారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..