కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి


కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి

కేసీఆర్


విప్లవ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడు, స్టూడెంట్ మార్చ్‌ పత్రిక సంపాదకుడు, సికింద్రాబాద్ పి. జి కాలేజీలో అర్థశాస్త్రం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కె. జగన్‌ను గద్వాల పోలీసులు అరెస్టు చేయడాన్ని విప్లవ రచయితల సంఘం ఖండించింది. జ‌గ‌న్‌పై పోలీసులు అక్ర‌మ కేసు బ‌నాయించి చ‌ట్ట విరుద్ధంగా అదుపులోకి తీసుకున్నార‌ని విర‌సం కార్య‌ద‌ర్శి పాణి ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో నిర్వ‌హించిన పాత్రికేయ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... జ‌గ‌న్ విద్యార్థి ద‌శ నుంచి తెలంగాణ కోసం రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంలో కీల‌కంగా ప‌నిచేశార‌ని, ప్ర‌జాస్వామిక తెలంగాణ ద్వారానే ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేరుతాయ‌ని నేటికీ త‌న ర‌చ‌న‌ల ద్వారా ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అరశాస్త్రంలో డాక్టరేట్ పొందిన జ‌గ‌న్ సూడెంట్ మార్స్ పత్రికకు సంపాదకుడిగా విప్లవ రచయితల సంఘంలో కార్యవర్గ సభ్యునిగా పనిచేస్తున్నార‌ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నల్లమలలో జరుపతలపెట్టిన యూనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ వ్యాసాలతో స్టూడెంట్ మార్చ్ ప్రత్యేక సంచికను తీసుకువ‌చ్చాడ‌ని తెలిపారు. ప్రజా జీవితంలో ఉండడం, ప్రజల సమస్యలపై ప్రశ్నించడం పాలకులకు కంటగింపవుతోంది.. ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన పాలకులు రాష్ట్రంలోనూ, దేశంలోనూ ప్రజల పక్షం వహించి ప్రశ్నిస్తున్న బుద్ధిజీవులపై దాడులు, అక్రమ కేసులు, అరెస్టుల పరంపరలోనే జ‌గ‌న్ అరెస్టు జ‌రిగింద‌ని ఆరోపించారు. కేసీఆర్ ప్ర‌భుత్వ నియంతృత్వ దోర‌ణిని ప్ర‌జాస్వామిక వాదులు ముక్త‌కంఠంతో ఖండించాల‌న్నారు.

పాల‌క విధానాల‌ను ప్ర‌శ్నించే ప్రజా సంఘాల బాధ్యులపై ప్ర‌భుత్వం అక్ర‌మ కేసులు మోపుతోంద‌ని విర‌సం కార్య‌వ‌ర్గ స‌భ్యుడు ప్రొఫెస‌ర్ కాశీం అన్నారు. వారం క్రితం తెలంగాణ విద్యార్థి వేదిక (టివివి) నాయకులు నాగన్న, బలరాంలను అరెస్టు చేసిన గ‌ద్వాల పోలీసులు వారిపై అక్ర‌మ కేసులు బ‌నాయించార‌ని, అదే ఎఫ్ ఐఆర్‌లో జ‌గ‌న్‌, చైత‌న్య మ‌హిళా సంఘం కార్య‌ద‌ర్శి శిల్ప‌, టీవీవీ అధ్య‌క్షుడు మ‌ద్దిలేటి పేర్ల‌ను సైతం చేర్చార‌ని తెలిపారు. ఆ క్రమంలోనే అక్టోబర్ 10న విరసం కార్యవర్గ సభ్యుడు కె. జగను గద్వాల పోలీసులు తమ అదుపులోకి తీసుకొని, ఇంట్లో సోదాలు చేసి ఆయన ల్యాప్ టాప్‌, ఫోను స్వాధీనం చేసుకున్నార‌ని అన్నారు. బుద్ధి జీవులపై జరుగుతున్న ఈ దాడులను కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని కోరారు. త‌న కొడుకును వెంట‌నే విడుద‌ల చేయాల‌ని జ‌గ‌న్ త‌ల్లి ల‌క్ష్మి న‌ర్స‌మ్మ డిమాండ్ చేశారు. జగన్ సహా అరెస్టు చేసిన వారందరిపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేసి, వారిని బేషరతుగా విడుదల చేయాలని తెలంగాణ సాహితి ప్ర‌తినిధి భూప‌తి వెంక‌టేశ్వ‌ర్లు డిమాండ్ చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ముఖ క‌వి వ‌ఝుల శివ‌కుమార్ అన్నారు.

Keywords : virasam, jagan, maddileti, tvv, telangana,
(2019-11-12 05:03:36)No. of visitors : 337

Suggested Posts


పేదోళ్ల కైనా,ఉన్నోళ్ల కైనా ఒకే బడి ఒకే చదువు కోసం తెలంగాణ‌ విద్యార్ధి వేదిక (TVV) పల్లె బాట

విద్య అనేది సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. విద్య చదువుకున్న వ్యక్తికి ఉపాధిని మాత్రమే కాకుండా, ఈ వ్యక్తి సమాజానికి ఉపయోగపడే విధముగా ఒక సామాజిక దృక్పథం కూడా ఇవ్వలని,విద్య పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసే సరుకుగా ఉండకూడదని తెలంగాణ విద్యార్థి వేదిక కోరుతున్నది.

ఓయూ విద్యార్థి భరత్ అక్రమ అరెస్ట్...విడుదల కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

తెలంగాణ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి చత్తీస్ గడ్ పోలీసులకు అప్పగించిన తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి భరత్ ను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇవ్వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా

పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు

రాష్ట్రంలో ప్ర‌తి ప‌క్షాలు అమ్ముడు పోయాయ‌ని, ఇప్పుడు రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం లేద‌ని, అందుకే ఆ పాత్ర‌ను ప్ర‌జా సంఘాలు పోషిస్తున్నాయ‌ని అన్నారు. విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంపై 2005లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వం నిషేధం విధిస్తే, ఆరోజు కాంగ్రెస్ ప్ర‌భుత్వ తీరును కేసీఆర్ త‌ప్పుబ‌ట్టాడ‌ని గుర్తు చేశారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?

శాతవాహన యూనివర్సిటీలో బీజేపీకి చెందిన బిజ్జల శ్రీనివాస్ అనే వ్యక్తి కారణంగానే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని.. పోలీసులు వెంటనే విచారణ జరిపి అక్కడి గొడవలకు కారణమెవరో తెలుసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు

తెలంగాణ ప్రజాఫ్రంట్ (టిపిఎఫ్) ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణ, తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు, తెలుగు యూనివర్సిటీ విద్యార్థి మద్దిలేటిల అరెస్టు చట్టబద్దంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశం పై పోలీసులను, ట్రయల్ కోర్టుల న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టు తీవ్రంగా మందలించింది.

Condemn arrest and onslaught on TVV and others activists - SFS

SFS strongly condemns the premeditated arrest of Telangana Vidyarthi Vedika (TVV), Chaitanya Mahila Secretary (CMS), Student March and other progressive and democratic organizationsʹ activists. The Nallakunta police has raided TVV President Maddiletiʹs house for his alleged link with banned maoist party. Gadwal police arrested two TVV members Naganna a

నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు

గద్వాల పోలీసులు ఇవ్వాళ్ళ పొద్దున హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యాలయంపై దాడి చేసి తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి, ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణలను అరెస్టు చేశారు.

Search Engine

కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
more..


కేసీఆర్