పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు


పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు

పోలీస్


ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌శ్నిస్తున్నందుకే కేసీఆర్ ప్ర‌భుత్వం త‌మ‌పై క‌క్ష‌గ‌ట్టింద‌ని ప్ర‌జా సంఘాల నేత‌లు ఆరోపించారు. హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌ని కుమార్ 23 విద్యార్థి, మ‌హిళా, కార్మిక‌, సాహిత్య‌, సాంస్కృతిక‌, హ‌క్కుల‌ సంఘాల‌ను నిషేధిత సంస్థ‌లుగా ప్ర‌క‌టించ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. ద‌శాబ్ధాలుగా ఈ ప్ర‌జా సంఘాల‌న్నీ ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం ప‌నిచేస్తున్నాయ‌ని సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయ స‌మావేశంలో పౌర హ‌క్కుల సంఘం రాష్ట్ర అధ్య‌క్షులు ప్రొఫెస‌ర్ జి. ల‌క్ష్మ‌ణ్ అన్నారు. సామాజిక‌, రాజ‌కీయార్థిక‌, సాంస్కృతిక అంశాల‌పై ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డి పోరాడుతున్న సంఘాల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యంపాలు చేయ‌డ‌మే అన్నారు. తెలంగాణ విద్యార్థి వేదిక స‌హా పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌టించిన సంఘాల వేటిపైనా నిషేధం లేద‌ని, ఆ సంస్థ‌లేవీ చ‌ట్ట విరుద్ధ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌డం లేవ‌ని అన్నారు. ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ‌తంలో ఏడు సంస్థ‌ల‌పై నిషేధం విధించింద‌ని, తెలంగాణ ప్ర‌భుత్వం ఆ నిషేధాన్ని కొన‌సాగిస్తున్న‌ద‌ని గుర్తు చేశారు. కానీ ఓ పోలీస్ అధికారి బాధ్య‌తారాహిత్యంగా ప్ర‌జా సంఘాల‌న్నిటినీ నిషేధిత సంస్థ‌లుగా ప్ర‌క‌టించ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. దీనిపై ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించాల‌ని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్ర‌భుత్వం నియంతృత్వంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, ప్ర‌శ్నించే వారి గొంతునొక్కేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం కార్య‌వ‌ర్గ స‌భ్యుడు ప్రొఫెస‌ర్ కాశీం అన్నారు. పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌టించిన ప్ర‌జాసంఘాలు ద‌శాబ్ధాలుగా ప్ర‌జా సమ‌స్య‌ల‌పై ఆయా రంగాల్లో ప‌నిచేస్తున్నాయ‌ని, వాటిని నిషేధించిన‌ట్లు ప్ర‌క‌టించ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని అన్నారు. రాష్ట్రంలో ప్ర‌తి ప‌క్షాలు అమ్ముడు పోయాయ‌ని, ఇప్పుడు రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం లేద‌ని, అందుకే ఆ పాత్ర‌ను ప్ర‌జా సంఘాలు పోషిస్తున్నాయ‌ని అన్నారు. విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంపై 2005లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వం నిషేధం విధిస్తే, ఆరోజు కాంగ్రెస్ ప్ర‌భుత్వ తీరును కేసీఆర్ త‌ప్పుబ‌ట్టాడ‌ని గుర్తు చేశారు. ఇవాళ అదే కేసీఆర్ ప్ర‌భుత్వం విర‌సంపై నిషేధం అన‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జా సంఘాల‌పై టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం, పోలీసులు చేస్తున్న త‌ప్పుడు ప్ర‌చారాన్ని నిలిపివేయాల‌ని, పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై ప్ర‌భుత్వం స్పందించాల‌ని డిమాండ్ చేశారు.

మావోయిస్టు ఎజెండానే మా ఎజెండా అని ప్ర‌క‌టించిన కేసీఆర్ ఇవాళ మావోయిస్టు పార్టీ పేరు చెప్పి ప్ర‌జా సంఘాల‌పై నిర్భంధాన్ని ప్ర‌యోగిస్తున్నాడ‌ని పౌర హ‌క్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కార్య‌ద‌ర్శి నారాయ‌ణ రావు అన్నారు. దేశ వ్యాప్తంగా ద‌ళిత, మైనార్టీ, ఆదివాసుల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను ప్ర‌జా సంఘాలు ప్ర‌శ్నిస్తున్నాయ‌ని, ఈ ప్ర‌శ్న‌ను స‌హించ‌లేకే ప్ర‌భుత్వం ఇలాంటి త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని కుల నిర్మూల‌న పోరాట స‌మితి రాష్ట్ర కార్య‌ద‌ర్శి అభిన‌వ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం రాజీలేని పోరాటం చేసిన సంస్థ‌లపై నిషేధం విధించ‌డం అప్ర‌జాస్వామిక‌మ‌న్నారు. నాడు ఈ ప్ర‌జా సంఘాల‌తో క‌లిసి ప‌నిచేసిన వాళ్లే ఇవాళ ప్ర‌భుత్వ ప‌ద‌వుల్లో కొన‌సాగుతున్నార‌ని, వాళ్లంతా ఈ విష‌యంలో స్పందించాల‌ని డిమాండ్ చేశారు. ఈ స‌మావేశంలో తెలంగాణ ప్ర‌జాస్వామిక వేదిక క‌న్వీన‌ర్ చిక్కుడు ప్ర‌భాక‌ర్‌, తెలంగాణ ప్ర‌జా ఫ్రంట్ అధ్య‌క్షుడు ర‌విచంద్ర‌, సీఆర్‌పీసీ క‌న్వీన‌ర్ బ‌ల్లా ర‌వీంధ‌ర్‌, చైత‌న్య మ‌హిళా సంఘం అధ్య‌క్షురాలు అనిత‌, తెలంగాణ విద్యార్థి వేదిక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మెంచు సందీప్‌, డీఎస్‌యూ అధ్య‌క్షుడు బ‌ద్రీ, టీవీఎస్ కార్య‌ద‌ర్శి స‌మీర్, ప్ర‌జా క‌ళా మండ‌లి అధ్య‌క్షుడు జాన్, కార్య‌ద‌ర్శి కోటి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Keywords : virasam, telangana, kcr, maoist, tvv
(2020-01-16 20:57:31)No. of visitors : 634

Suggested Posts


పేదోళ్ల కైనా,ఉన్నోళ్ల కైనా ఒకే బడి ఒకే చదువు కోసం తెలంగాణ‌ విద్యార్ధి వేదిక (TVV) పల్లె బాట

విద్య అనేది సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. విద్య చదువుకున్న వ్యక్తికి ఉపాధిని మాత్రమే కాకుండా, ఈ వ్యక్తి సమాజానికి ఉపయోగపడే విధముగా ఒక సామాజిక దృక్పథం కూడా ఇవ్వలని,విద్య పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసే సరుకుగా ఉండకూడదని తెలంగాణ విద్యార్థి వేదిక కోరుతున్నది.

ఓయూ విద్యార్థి భరత్ అక్రమ అరెస్ట్...విడుదల కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

తెలంగాణ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి చత్తీస్ గడ్ పోలీసులకు అప్పగించిన తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి భరత్ ను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇవ్వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా

నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు

తెలంగాణ ప్రజాఫ్రంట్ (టిపిఎఫ్) ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణ, తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు, తెలుగు యూనివర్సిటీ విద్యార్థి మద్దిలేటిల అరెస్టు చట్టబద్దంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశం పై పోలీసులను, ట్రయల్ కోర్టుల న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టు తీవ్రంగా మందలించింది.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?

శాతవాహన యూనివర్సిటీలో బీజేపీకి చెందిన బిజ్జల శ్రీనివాస్ అనే వ్యక్తి కారణంగానే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని.. పోలీసులు వెంటనే విచారణ జరిపి అక్కడి గొడవలకు కారణమెవరో తెలుసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Condemn arrest and onslaught on TVV and others activists - SFS

SFS strongly condemns the premeditated arrest of Telangana Vidyarthi Vedika (TVV), Chaitanya Mahila Secretary (CMS), Student March and other progressive and democratic organizationsʹ activists. The Nallakunta police has raided TVV President Maddiletiʹs house for his alleged link with banned maoist party. Gadwal police arrested two TVV members Naganna a

నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు

గద్వాల పోలీసులు ఇవ్వాళ్ళ పొద్దున హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యాలయంపై దాడి చేసి తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి, ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణలను అరెస్టు చేశారు.

కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి

ప్రజా జీవితంలో ఉండడం, ప్రజల సమస్యలపై ప్రశ్నించడం పాలకులకు కంటగింపవుతోంది.. ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన పాలకులు రాష్ట్రంలోనూ, దేశంలోనూ ప్రజల పక్షం వహించి ప్రశ్నిస్తున్న బుద్ధిజీవులపై దాడులు, అక్రమ కేసులు, అరెస్టుల పరంపరలోనే జ‌గ‌న్ అరెస్టు జ‌రిగింద‌ని ఆరోపించారు. కేసీఆర్ ప్ర‌భుత్వ నియంతృత్వ దోర‌ణిని ప్ర‌జాస్వామిక వాదులు ముక్త‌కంఠంతో ఖండిం

ప్రజాసంఘాల నేతలను కోర్టులో హజరుపరచకపోవడంపై హైకోర్టు ఆగ్రహం - రేపటిలోగా హాజరు పరచాలని ఆదేశం

పోలీసులు అరెస్టు చేసిన‌ ప్రజా సంఘాల నేతలను శుక్రవారం ఉదయంలోగా కోర్టులో హాజరు పరచాలని తెలంగాణ‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ ఆదేశించారు.

Search Engine

ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్
మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి
వాళ్ళిద్దరి కోసం..!
జేఎన్‌యూ తర్వాత‌...ఇప్పుడు మరో యూనివర్సిటీ విద్యార్థులపై దాడి
మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి - రాష్ట్రపతికి లేఖ రాసిన ʹఉనాʹ దళితులు
JNU పై దాడి చేసిందెవరో తేల్చి చెప్పిన వార్డెన్ల నివేదిక‌
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ కు బెయిల్...నెల రోజులు సహరన్ పూర్ లోనే ఉండాలని కండీషన్
మోడీషా రాజ్య నిర్బంధంలో మగ్గుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విడుదలకై ఉద్యమిద్దాం
విద్వేషం అతని మతం.. అణచివేత అతని ఆయుధం..!
మీరు చేస్తే గొప్ప పని ప్రజలు చేస్తే హింసనా జగ్గీ గారు
ఈ ప్రభుత్వమే నిర్బంధ కేంద్రాల్లోకి నెట్టబడే రోజొస్తుంది : అరుంధతి రాయ్
మన చేతుల మీది నెత్తుటి మరకలు కడగడానికి ఎన్ని సముద్రాలు కావాలి?
నిజం ఎప్పటికి బయటకు వస్తుంది?
విరసం అధ్యక్ష కార్యదర్శులుగా అరసవెల్లి కృష్ణ,కాశీం
50 ఏళ్ల.. దుఃఖం, నిర్భంధం, ధిక్కారం, స్పూర్తి... 50 ఏళ్ల విరసం మహాసభలు
విరసం 50 ఏళ్ళ సభలు...నోమ్ ఛామ్ స్కీ సందేశం
సృజ‌నాత్మ‌క ధిక్కారం.. విర‌సం 50 ఏళ్ల స‌భ‌లు ప్రారంభం
విరసం 50 ఏళ్ల సభలు.. పూణే జైలు నుంచి వరవరరావు సందేశం
CPI (Maoist) oppose Citizenship Amendment Act, calls to intensify mass campaign against it
అమిత్ షాకు బహిరంగ లేఖ‌ !
50 ఏళ్ళ ధిక్కారస్వరం...ఈ నెల11,12 తేదీల్లో విరసం రాష్ట్ర‌ మహాసభలు
నెత్తుటి ఏరులు పారినా ఎత్తిన జెండా దించకుండా... మళ్ళీ పిడికిలెత్తిన జేఎన్‌యూ
Cotton University Students Hoist Black Flags, Express Solidarity with JNU
JNU: బాధితులపై బీజేపీ నేతల చవకబారు వ్యాఖ్యలు
more..


పోలీస్