నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు

నలమాస

తెలంగాణ ప్రజాఫ్రంట్ (టిపిఎఫ్) ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణ, తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు, తెలుగు యూనివర్సిటీ విద్యార్థి మద్దిలేటిల అరెస్టు చట్టబద్దంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశం పై పోలీసులను, ట్రయల్ కోర్టుల న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టు తీవ్రంగా మందలించింది. వాళ్ళిద్దరిని అరెస్టు చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఆదేశించిన విధానాన్ని ఎందుకు పాటించలేదని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. సోమవారం నాటికి పూర్తి వివరాలను అందించాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది హైకోర్టు.

నలమాస కృష్ణ, మద్దిలేటిలను హైదరాబాద్ భాగ్ లింగంపల్లిలోని ప్రజాఫ్రంట్ కార్యాలయం నుండి ఈ మంగళవారం నాడు పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్ళారు. అయితే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) లోని సెక్షన్ 41 బి కింద, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి, తన నివాసం నుండి తీసుకెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులకు లేదా స్థానిక నాయకుడికి సమాచారం ఇవ్వాలి. ఆ విధమైన పద్దతి పాటించకుండా వాళ్ళిద్దరిని అరెస్టు చేశారని ఆరోపిస్తూ కృష్ణ, మద్దిలేటిల భార్యలు హైకోర్టు లో ధాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ను ఈ రోజు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎ అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
"మీరు అరెస్టు చేసిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు ఇక్కడ ఎటువంటి రుజువు లేదు. స్థానిక బాధ్యతాయుతమైన వ్యక్తి సంతకం కూడా లేదు. అరెస్ట్ మెమోలో ఈ ముఖ్యమైన వివరాలు లేవు. ఇది అరెస్టును చట్టవిరుద్ధంగా నిరూపిస్తుందిది ʹఅని ధర్మాసనం అభిప్రాయపడింది. పోలీసులు పాల్పడిన‌ ఈ అపసవ్య పద్దతులను గుర్తించకుండా జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసిన మేజిస్ట్రేట్ పై కూడా ధర్మాసనం విమర్శలు చేసింది. "దురదృష్టవశాత్తు, ప్రజలను జైలుకు రిమాండ్ చేస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయాధికారులు నిబంధనలను పాటించడం లేదు" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పోలీసులు ఒక వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అతన్ని ఎత్తుకపోవడం అతని వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడమే అన్న ధర్మాసనం ఈ విశ్యంపై కౌంటర్ ధాఖలు చేయాలని ఆదేశింది. కౌంటర్ దాఖలుకు సోమవారం వరకు పోలీసులకు సమయాన్ని ఇచ్చింది.
సిఆర్‌పిసి 41 బిని పోలీసులు పాటించడం తప్పనిసరి చేసిన సుప్రీంకోర్టు తీర్పును కోర్టుకు సమర్పించాలని పిటిషనర్ల న్యాయవాది వి రఘునాథ్‌ను ధర్మాసనం కోరింది.

Keywords : prajafront, maddileti, tvv, high court
(2024-04-24 17:38:18)



No. of visitors : 2068

Suggested Posts


పేదోళ్ల కైనా,ఉన్నోళ్ల కైనా ఒకే బడి ఒకే చదువు కోసం తెలంగాణ‌ విద్యార్ధి వేదిక (TVV) పల్లె బాట

విద్య అనేది సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. విద్య చదువుకున్న వ్యక్తికి ఉపాధిని మాత్రమే కాకుండా, ఈ వ్యక్తి సమాజానికి ఉపయోగపడే విధముగా ఒక సామాజిక దృక్పథం కూడా ఇవ్వలని,విద్య పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసే సరుకుగా ఉండకూడదని తెలంగాణ విద్యార్థి వేదిక కోరుతున్నది.

ఓయూ విద్యార్థి భరత్ అక్రమ అరెస్ట్...విడుదల కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

తెలంగాణ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి చత్తీస్ గడ్ పోలీసులకు అప్పగించిన తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి భరత్ ను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇవ్వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా

పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు

రాష్ట్రంలో ప్ర‌తి ప‌క్షాలు అమ్ముడు పోయాయ‌ని, ఇప్పుడు రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం లేద‌ని, అందుకే ఆ పాత్ర‌ను ప్ర‌జా సంఘాలు పోషిస్తున్నాయ‌ని అన్నారు. విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంపై 2005లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వం నిషేధం విధిస్తే, ఆరోజు కాంగ్రెస్ ప్ర‌భుత్వ తీరును కేసీఆర్ త‌ప్పుబ‌ట్టాడ‌ని గుర్తు చేశారు.

Condemn arrest and onslaught on TVV and others activists - SFS

SFS strongly condemns the premeditated arrest of Telangana Vidyarthi Vedika (TVV), Chaitanya Mahila Secretary (CMS), Student March and other progressive and democratic organizationsʹ activists. The Nallakunta police has raided TVV President Maddiletiʹs house for his alleged link with banned maoist party. Gadwal police arrested two TVV members Naganna a

కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి

ప్రజా జీవితంలో ఉండడం, ప్రజల సమస్యలపై ప్రశ్నించడం పాలకులకు కంటగింపవుతోంది.. ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన పాలకులు రాష్ట్రంలోనూ, దేశంలోనూ ప్రజల పక్షం వహించి ప్రశ్నిస్తున్న బుద్ధిజీవులపై దాడులు, అక్రమ కేసులు, అరెస్టుల పరంపరలోనే జ‌గ‌న్ అరెస్టు జ‌రిగింద‌ని ఆరోపించారు. కేసీఆర్ ప్ర‌భుత్వ నియంతృత్వ దోర‌ణిని ప్ర‌జాస్వామిక వాదులు ముక్త‌కంఠంతో ఖండిం

నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు

గద్వాల పోలీసులు ఇవ్వాళ్ళ పొద్దున హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యాలయంపై దాడి చేసి తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి, ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణలను అరెస్టు చేశారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?

శాతవాహన యూనివర్సిటీలో బీజేపీకి చెందిన బిజ్జల శ్రీనివాస్ అనే వ్యక్తి కారణంగానే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని.. పోలీసులు వెంటనే విచారణ జరిపి అక్కడి గొడవలకు కారణమెవరో తెలుసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ప్రజాసంఘాల నేతలను కోర్టులో హజరుపరచకపోవడంపై హైకోర్టు ఆగ్రహం - రేపటిలోగా హాజరు పరచాలని ఆదేశం

పోలీసులు అరెస్టు చేసిన‌ ప్రజా సంఘాల నేతలను శుక్రవారం ఉదయంలోగా కోర్టులో హాజరు పరచాలని తెలంగాణ‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ ఆదేశించారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


నలమాస