ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం

ఆర్టీసీ

ఆర్టీసీ సమ్మె, ఈ రోజు జరిగిన బంద్, ఆందోళనకారులపై పోలీసుల దమనకాండ నేపథ్యంలో పౌరహక్కుల సంఘం, తెలంగాణ ప్రకటన పూర్తి పాఠం

RTC సమ్మెకు మద్దతుగా అఖిలపక్షం అధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ బంద్ (19 అక్టోబరు, 2019 శనివారం) సందర్భంగా జరిగిన అరెస్టులు, నిర్బంధాన్ని ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను పౌర హక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తున్నది....
5 అక్టోబర్ 2019 నుండి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి కార్మికులు, ఉద్యోగులు (దాదాపు అందరూ 50 వేల మంది) సమ్మె చేస్తున్నారు. ముఖ్యముగా ఆర్టీసిని ప్రజా రవాణా శాఖగా గుర్తించి ప్రభుత్వములో విలీనం చేయాలని, పెండింగ్ లో ఉన్న వేతన ఒప్పందం చేయాలని మిగతా 26 డిమాండ్ లతో సమ్మె చేస్తున్నారు.

పారిశ్రామిక వివాదాల చట్టం 1947 ప్రకారముగా నెల రోజుల ముందు నోటీస్ ఇచ్చి చట్ట బద్ధమైన సమ్మె చేస్తున్నారు. దానికి ఆర్టీసి యాజమాన్యము, కార్మిక శాఖ, కార్మిక సంఘాలు చర్చలు జరిపి పరిష్కారముకు ఇరువురు కృషి చేయాలి. కాని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి చట్ట విరుద్ధంగా జోక్యము చేసుకుని ముగ్గురు ఐ.ఎ.ఎస్ లతో కమిటీ వేసి మొక్కుబడిగా చర్చలు జరిపించి, కార్మిక సంఘాలు మొండిగా వ్యవహరించినాయి అని తప్పుడు ప్రచారముతో సమ్మె చట్ట వ్యతిరేక మైనదిగా, ఎస్మా చట్టం ప్రయోగించుతామని బెదిరించి, సమ్మె చేసిన 49 000 వేల మంది కార్మికులను డిస్మిస్ చేసినాడు. ముఖ్యమంత్రి KCR. తీవ్ర ఆందోళనకు గురైన ఇద్దరు RTC కార్మికులు ముఖ్యమంత్రి చేసిన ఉద్యోగల నుండి డిస్మిస్ నిర్ణయానికి శ్రీనివాస్ రెడ్డి సురేందర్ గౌడ్ అనే ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.

చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చి సమ్మె చేస్తున్న RTC కార్మికులను అణిచివేయడానికి నిర్ణయం తీసుకుని KCR రాజ్యాంగ వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ మొండిగా సమ్మె విషయంలో కరడుగట్టిన నియంతగా మారినాడు. అయిన కార్మిక సంఘాలు, తెలంగాణ లోని ప్రజాసంఘాలు సమ్మెను ఉధృతం చేసే భాగంగా సమ్మెను కొనసాగిస్తూనే 19, అక్టోబర్ 2019 న తెలంగాణ బంద్ కు వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, బి.జె.పి, తెలంగాణ జన సమితి, అనుబంధ సంఘాలు, అన్ని ప్రజా, విద్యార్థి, ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల భాగస్వామ్యముతో పిలుపు ఇచ్చినాయి.

అతి ముఖ్యమైన విషయము ఏమంటే ? తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ ʹʹరాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని ప్రజాస్వామిక భావ జాలంతో - ప్రజలు తిరుగబడుతే ఫిలిప్పైన్స్ లో ఏమి జరిగింది? ప్రజాస్వామ్యములో ప్రజలే శక్తిమంతులు, వారు తిరుగబడితే ఎవరూ ఆపలేరు. ప్రజలు ఇప్పటికే ఆర్టీసి కార్మికులకు మద్దతు తెలుపుచున్నారు. మరి కొంతమంది మద్దతు తెలుపుతే అందోళనను ఎవరూ ఆపలేరు. ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన ప్రజా ఉద్యమాలే అందుకు నిదర్శనంʹʹ అనడం జరిగింది.
అలాగే నేడు అంటే 19/10/2019 నాటి ఉదయం 10-30 గంటల కల్లా చర్చలు జరుపండని కూడా గౌరవ హైకోర్ట్ సూచించింది. అయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్య మంత్రి మొండి వైఖరితో ఆర్టీసి సమ్మెను, తెలంగాణ రాష్ట్ర బంద్ ను ఫెయిల్ చేయడానికి చర్యలను వేగిరము చేసినాడు ముఖ్యమంత్రి KCR.

పోలీసులకు అందిన ప్రత్యేక ఆదేశాల మేరకు బంద్ ను విఫలం చేయాలని, తీవ్ర నిర్బందాన్ని, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, CPI CPM తెలంగాణ జన సమితి మరియు న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు అక్రమ అరెస్టులు హౌస్ అరెస్టులు, లాఠీ చార్టీలు, పోలీసులు చేసి న్యూ డేమోక్రసీ నేత పోటు రంగా రావు చేతి బొటన వేలును తెగగొట్టినారు. పౌర హక్కుల సంఘం తెలంగాణ ఈ నిర్బంధాన్ని, అక్రమ అరెస్టులను ఖండిస్తున్నది. అరెస్ట్ అయిన నేతలను బేషరథు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
1. ఆర్.టి.సిని ప్రభుత్వంలో విలీనం చేయాలి.
2. ఆర్.టి.సి కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపి, వాళ్ళ సమస్యలను పరిష్కరించి, సమ్మెను విరమింపచేయాలి.
3. ఆర్.టి.సి కార్మికుల పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ బంద్ సందర్భంగా ప్రభుత్వం కొనసాగించిన అక్రమ
నిర్భంధాలను, పోలీసు దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్ట్ చేసిన వారినందరిని బేషరతుగా వెంటనే
విడుదల చేయాలి.
4. కేంద్ర లేబర్ కమీషనర్, రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం చొరవ చేసి ఆర్.టి.సి కార్మికులకు నాయ్యం చేయాల్సిందిగా
డిమాండ్ చేస్తున్నాం.

పొ॥ జి. లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షులు, పౌరహక్కుల సంఘం
ఎస్. నారాయణరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పౌరహక్కుల సంఘం

Keywords : RTC, Strike, CLC, telangana
(2024-04-24 17:37:50)



No. of visitors : 1205

Suggested Posts


ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ

ఆర్టీసి కార్మికులంతా తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను విరమించకుండా విరోచితంగా పోరాడండి. పోరాడితేనే మన సమస్యలకు అంతిమ పరిష్కారాలుంటాయి. లేదంటే వున్న ఉద్యోగాలు పోయి బజారున పడుతారు. అవసరమైతే త్యాగాలకు సిద్ధం కండి. కార్మికుల న్యాయమైన డిమాండకు అన్ని సెక్షన్ల ప్రజలంతా తమ సంపూర్ణ మద్దతును అందించండి. వారితో భుజం కలిపి పోరాడండి.

ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?

తెలంగాణ ప్రభుత్వం సాలీనా సుమారు 1000 కోట్ల రూపాయలు ఆర్టీసీ నుండి వసూలు చేస్తోంది. 2014 నుండి 2019 వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో 5 వేల కోట్ల రూపాయలు ఆర్టీసి ప్రభుత్వానికి చెల్లిస్తే, ప్రభుత్వం మాత్రం కేవలం 710 కోట్ల రూపాయలు మాత్రం ఆర్టీసికి ఇచ్చి చేతులు దులుపుకుంది.

ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ

ఉచితాలు, రాయితీలు, పింఛన్లు కాకుండా న్యాయమైన హక్కుల కోసం ఆర్టీసీ కార్మికులు పోరాడుతున్నారు. సంస్థను ప్రైవేటీకరించాలనే కుట్రను ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇది ప్రజల పోరాటం. ప్రజా అవసరాలు తీర్చే పోరాటం. ఈ పోరాటానికి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధి జీవులు పూర్తిగా సంఘీభావం ప్రకటించాలి. ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీని బతికించు కోవలసిన అవసరం ప్ర

వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం

ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన చలో టాంక్ బండ్ పిలుపు విజయవంతం అయ్యింది. ఆర్టీసీ కార్మికులు తమ సమస్య పరిష్కారం కోసం, ఆర్టీసీని రక్షించడం కోసం 35 రోజులుగా చేస్తున్న సమ్మె కొనసాగింపుగా ఈ రోజు తలపెట్టిన చలో టాంక్ బండ్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.

దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!

ఇంతకు ఏమడిగిండ్రయా వాండ్లు? ఏమన్న నీ బంగ్లలు ఇమ్మన్నరా, నీ జాగలిమ్మన్నరా, నీ ముల్లెలు ఇమ్మన్నరా? సర్కారు నౌకర్లతోటి సమానంగ తనఖా ఉండాలన్నరు. సర్కార్ల కలుపుమన్నరు. పని కాడ సౌలత్ జూడమన్నరు.

పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా ఈ రోజు చలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎక్కడికక్కడ అరెస్టులు సాగించినా ట్యాంక్ బండ్ కు అన్ని వైపులనుండి కార్మికులు

RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !

సమ్మె కార్మికుని జన్మ హక్కు అయినప్పటికినీ ప్రభుత్వం వారితో చిత్తశుద్దితో చర్చలు చేయకుండా, సమ్మెలో పాల్గొన్నారని వారిని ఉద్యోగాలనుంచి తొలగించివేయడం లాంటి ప్రకటనలు చేయడం వల్ల‌ RTC కార్మికులు వారి కుటుంబాలు తీవ్రమైన అభద్రతకు లోనవతున్నారని, ఆ అభద్రతా బావనల్లోంచే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయని పౌరహక్కుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ

చలో టాంక్ బండ్ కార్యక్రమంలో మావోయిస్టులు పాల్గొన్నారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సంచలన ఆరోపణలు చేశారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఆర్టీసీ