దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!


దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!

దొర

(వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ రాసిన ఈ సంపాదకీయ వ్యాఖ్య‌ నవంబర్ 2019 సంచికలో ప్రచురించబడినది)

ఎర్రబస్సంటె ఇప్పుడు బుట్టిందా, అప్పుడు బుట్టిందా. పుట్టి బుద్దెరిగినకాడ్నించి ఎర్రబస్సు ఎక్కనే బడ్తిమి. గద్దె మీద ఎక్కిన ప్రతి కొత్తోడు రాంగనె రాంగనె బస్సుల రంగు బదలాయించె, పేర్లు బదలాయించె, ఇటున్న బస్సు అటేశె, కొత్త కొత్త ఊళ్లకు బస్సులేశె, డిపోలు గట్టె, బస్టాండులు గట్టె, ఆర్టీసీ దొరలకు బంగ్లలు గట్టె. ఎన్ని జరిగినా బస్సులు బోయినయా? మా చిన్నప్పుడు ఊళ్ల వాగుల్నించి ఉశికె దోడ్కబోయే లారీ మీద కూసోని పోతుంటిమి, గీ నడిమిట్ల ఆటోలొచ్చె. కాని బస్సు జాగ బస్సుదే గద. బస్సును ఇడ్శిపెడ్తమా? డైవర్లతోని కొట్లాడ్తిమి, కండక్టర్లతోని కొట్లాడ్తిమి, గని ఎన్నడన్న వాండ్ల కడుపుమీన కొడితిమా? నైటాల్ట్ బస్సంట ఊళ్లెకొస్తె డైవర్లను కండక్టర్లను అర్సుకోలేదా? బస్సులు రాకపోతె, తక్కువ బస్సులొస్తె డిపో మేనేజర్ల దగ్గరికి ఊరోల్లమంత బొయ్యి నిలదియ్యలేదా? తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఆర్టీసీ మజ్దూర్లు గుడ బందులు పెట్టలేదా? ఇయ్యాటిదా నిన్నటిదా ఆర్టీసీ చరిత్ర. గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్టు దొర ఇచ్చిత్రం జెయ్యబట్టె. నోట్ల బెల్లంగడ్డ పెట్టుకున్నరా ఏంది, నోరున్నోడు ఎవ్వడు మాట్లాడకపాయె. ఏందుల్లో ఈ తికమక. దొర గుడ్లురుమాలంటె ఎంతమంది లేరు. రూపాయి ఖర్చుకు పది రూపాలు వసూలు జేసె దొంగ కాంట్రాక్టర్ల మీద గుస్సా వద్దా? ఎకరాల్లల్ల గొని గజాల్లల్ల అమ్ముకుంట కోట్లకు పడిగెత్తినోల్ల మీద గుస్సా వద్దా? చిన్న పనికి పెద్ద పనికి చెయ్యి జాపుకుంట జెనిగెల తీర్గ నెత్తురు పిండుతన్న సర్కారు నౌకర్ల మీద గుస్సా వద్దా? తెలంగాణొస్తె ఇగ కొలువొస్తది, అగ కొలువొస్తది అని ఎగురుకుంట కొట్లాటల దిరిగి, ఇప్పుడు ఐదేండ్ల నుంచి ఎల్లెలుకల పండుకున్న పొల్లగాండ్లకు పని దొరకకుంట జేసినోని మీద గుస్స వద్దా?ఆంధ్రోని రోజుల కన్న అన్నాలంగ మన తెలంగాణ జనాన్ని కాల్చుక తింటన్న మన తెలంగాణ పోలీసు దొరల మీద గుస్స వద్దా? అన్ని వదిలిపెట్టి దొర బస్సుల మీదనే పడ్డడు గద, డైవర్లను కండక్టర్లను మెకానిక్కులను ఆర్టీసీ మజ్దూర్లందర్ని అరిగోస పెట్టుకుంటాండు గద. ఇంతకు ఏమడిగిండ్రయా వాండ్లు? ఏమన్న నీ బంగ్లలు ఇమ్మన్నరా, నీ జాగలిమ్మన్నరా, నీ ముల్లెలు ఇమ్మన్నరా? సర్కారు నౌకర్లతోటి సమానంగ తనఖా ఉండాలన్నరు. సర్కార్ల కలుపుమన్నరు. పని కాడ సౌలత్ జూడమన్నరు. అయ్య, గదే నేరమా బాంచెన్. గట్ల గుడ్లురిమితె ఎట్ల బాంచెన్. అస్సల్ ముచ్చట వేరే ఉన్నదట గద. బస్సులన్ని నీ దగ్గరోల్లవే నడువాలన్నవట గద. రోడ్లన్ని ఆల్లకే రాసిస్తనన్నవట గద. ఆర్టీసీకి తెలంగాణ మొత్తంల ఏడేడ జాగలుంటె ఆడాడ అమ్మి పారెయ్యటానికి కంకణం కట్టుకున్నవట గద. నివద్దె బాంచెన్. దసరా రోజు ఏదో గట్టి పని జేయుటానికి కంకణం కట్టుకోవాలె. గదే రివాజు. అయితే ఈసారి గీ కంకణం గట్టుకున్నవా? కని దొరా, ఒక్క ముచ్చట మర్శిపొయినట్టున్నవ్. దసర రోజు నువ్వొక్కనివె గాదు, ప్రతి ఒక్కలు కంకణం కట్టుకుంటరు. జమ్మిచెట్టెక్కి దాశిపెట్టిన ఇసిరెలన్ని దింపుతరు. ఇగ యుద్ధం తప్పదని బరిగీస్తరు. ఈ దసర పండుగరోజు గదే కత మొదలైనట్టున్నది. మా చిన్నప్పటి కాటికాపలోని తీర్గ నువ్వు నోట్లె నుంచి బంగారి గుండ్లు తియ్యి, గారడోని తీర్గ తాడు మీద చెంగడబింగడ ఎగురు, యుద్ధం మొదలైనాక ఏ కంకణాలు నిల్వవు. తెలంగాణది మాదండి చరిత్ర. నీకెరికె. ఎంతెంత అవ్వల్ దర్జ దొరలను గుడ ఉరికిచ్చిన రివాజు తెలంగాణది. పాపం, ప్యాదలు, ఆర్టీసీ మజ్దూర్లు ఆల్ల మీద నీ ప్రతాపం జూపకు. నాకు అడ్డు లేదని పూలహారం మెళ్ల ఏస్కోని తిర్గుతానవేమో, కాలం కలిసి రాకపోతే తాడే పామైతదనే సామెత నీకు తెలిసే ఉంటది.

Keywords : RTC Strike, Telangana, KCR,
(2020-06-03 19:23:54)No. of visitors : 681

Suggested Posts


ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ

ఆర్టీసి కార్మికులంతా తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను విరమించకుండా విరోచితంగా పోరాడండి. పోరాడితేనే మన సమస్యలకు అంతిమ పరిష్కారాలుంటాయి. లేదంటే వున్న ఉద్యోగాలు పోయి బజారున పడుతారు. అవసరమైతే త్యాగాలకు సిద్ధం కండి. కార్మికుల న్యాయమైన డిమాండకు అన్ని సెక్షన్ల ప్రజలంతా తమ సంపూర్ణ మద్దతును అందించండి. వారితో భుజం కలిపి పోరాడండి.

ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?

తెలంగాణ ప్రభుత్వం సాలీనా సుమారు 1000 కోట్ల రూపాయలు ఆర్టీసీ నుండి వసూలు చేస్తోంది. 2014 నుండి 2019 వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో 5 వేల కోట్ల రూపాయలు ఆర్టీసి ప్రభుత్వానికి చెల్లిస్తే, ప్రభుత్వం మాత్రం కేవలం 710 కోట్ల రూపాయలు మాత్రం ఆర్టీసికి ఇచ్చి చేతులు దులుపుకుంది.

ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ

ఉచితాలు, రాయితీలు, పింఛన్లు కాకుండా న్యాయమైన హక్కుల కోసం ఆర్టీసీ కార్మికులు పోరాడుతున్నారు. సంస్థను ప్రైవేటీకరించాలనే కుట్రను ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇది ప్రజల పోరాటం. ప్రజా అవసరాలు తీర్చే పోరాటం. ఈ పోరాటానికి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధి జీవులు పూర్తిగా సంఘీభావం ప్రకటించాలి. ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీని బతికించు కోవలసిన అవసరం ప్ర

వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం

ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన చలో టాంక్ బండ్ పిలుపు విజయవంతం అయ్యింది. ఆర్టీసీ కార్మికులు తమ సమస్య పరిష్కారం కోసం, ఆర్టీసీని రక్షించడం కోసం 35 రోజులుగా చేస్తున్న సమ్మె కొనసాగింపుగా ఈ రోజు తలపెట్టిన చలో టాంక్ బండ్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.

ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం

పారిశ్రామిక వివాదాల చట్టం 1947 ప్రకారముగా నెల రోజుల ముందు నోటీస్ ఇచ్చి చట్ట బద్ధమైన సమ్మె చేస్తున్నారు. దానికి ఆర్టీసి యాజమాన్యము, కార్మిక శాఖ, కార్మిక సంఘాలు చర్చలు జరిపి పరిష్కారముకు ఇరువురు కృషి చేయాలి. కాని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి చట్ట విరుద్ధంగా జోక్యము చేసుకుని ముగ్గురు ఐ.ఎ.ఎస్ లతో కమిటీ వేసి మొక్కుబడిగా చర్చలు జరిపించి, కార్మిక సంఘాలు మొండిగా

పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా ఈ రోజు చలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎక్కడికక్కడ అరెస్టులు సాగించినా ట్యాంక్ బండ్ కు అన్ని వైపులనుండి కార్మికులు

RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !

సమ్మె కార్మికుని జన్మ హక్కు అయినప్పటికినీ ప్రభుత్వం వారితో చిత్తశుద్దితో చర్చలు చేయకుండా, సమ్మెలో పాల్గొన్నారని వారిని ఉద్యోగాలనుంచి తొలగించివేయడం లాంటి ప్రకటనలు చేయడం వల్ల‌ RTC కార్మికులు వారి కుటుంబాలు తీవ్రమైన అభద్రతకు లోనవతున్నారని, ఆ అభద్రతా బావనల్లోంచే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయని పౌరహక్కుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ

చలో టాంక్ బండ్ కార్యక్రమంలో మావోయిస్టులు పాల్గొన్నారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సంచలన ఆరోపణలు చేశారు.

Search Engine

వీవీ,సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీల విడుదలకై వారం రోజుల కార్యక్రమాలు -నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపు
మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి
నోరు మూసుకో....ట్రంప్ కు పోలీసు చీఫ్ హెచ్చరిక‌
తెలంగాణకోసం పోరాడిన వారు జైళ్ళలో మగ్గుతున్నరు
వరవరరావు బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా !
వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
more..


దొర