ఈ తెలంగాణ మీదే.. మాది కాదు : కేసీఆర్‌కు ఒక ఆర్టీసీ కండక్టర్ బహిరంగ రాజీనామా లేఖ


ఈ తెలంగాణ మీదే.. మాది కాదు : కేసీఆర్‌కు ఒక ఆర్టీసీ కండక్టర్ బహిరంగ రాజీనామా లేఖ

ఈ

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి డ్యూటీలో చేరతాం అని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అనేక చోట్ల ఏడుపులు... శాపనార్దాలు... డిపో మేనేజర్ల కాళ్ళు మొక్కడాలు.... బస్సులకు అడ్డంగా పడుకోవడాలు... ఇవి నిత్య దృశ్యాలయ్యాయి. ఏదేమైనా కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోబోమన్న ప్రభుత్వ నిర్ణయం కార్మికుల్లో అశాంతికి కారణమయ్యింది. ఈ నేపథ్యంలో సూర్యాపేట డిపోకు చెందిన ఎల్. కృష్ణ అనే కండక్టర్... ʹమీరు ఉద్యోగంలో నుండి తీసేయడం కాదు నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానుʹ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశాడు. ఆ లేఖ పూర్తి పాఠం.

గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి,

తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఉద్యోగం చేద్దామనుకున్నా, ఆత్మగౌరవంతో బ్రతుకుదాం అనుకున్నా.. కానీ మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో కాదు కదా కనీసం తెలంగాణలో ఎందుకు పుట్టానురా నాయనా అనే విధంగా తీవ్ర మానసిక వేదనకు గురై నేను ఈ నిర్ణయం తీస్కుంటున్నాను.

మీకు మాట తప్పడం, మాయమాటలు చెప్పి మోసం చెయ్యడం తెలుసు అని మా కార్మిక లోకం లేట్‌గా తెలుసుకుంది. మీరు ఉద్యోగంలో నుండి తీసేయడం కాదు నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను.

దీనికి కారణం లేకపోలేదు సర్. మా తెలంగాణలో నియంతృత్వం చూస్తా అని అనుకోలేదు. 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే మన కేసీఆర్ సర్ ఉన్నారు, ఆంధ్ర పాలకులు నిజంగా మోసం చేశారేమో, మనల్ని బాగా చూసుకుంటారు అనుకున్న. కానీ సర్ మా 20 మంది పైగా కార్మికులు చనిపోతే మీరు కనీసం స్పందించలేదు చూడండి సర్ అప్పుడు అనిపించింది సర్ తెలంగాణ మా కోసం కాదు తెలంగాణా కేవలం మీ లాంటి నాయకుల కోసమే అని. నా అక్క చెల్లెమ్మలు లాఠీ దెబ్బలు తింటారు అని కలలో కూడా ఉహించలేదు సర్ కానీ మీ బంగారు తెలంగాణలో అది సాధ్యం అయింది సర్. నా చెల్లెలు ఏడుస్తుంటే, రోజూ నా సోదరులు బాధ పడుతుంటే తట్టుకోలేక పోతున్న సర్.

కానీ ఒక్కటి మాత్రం నిజం సర్ నా RTC అక్క చెల్లెల ఉసురు కచ్చితంగా మీకు తగులుతుంది సర్. నేను సూర్యాపేట డిపోలో RTC కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న. మీలాంటి ఒక మోసకారి, ఒక మాటకారి ఒక మానవత్వం లేని ఒక నిరంకుశ ప్రభుత్వంలో నా ఆత్మభిమన్నాన్ని చంపుకొని ఉద్యోగిగా పని చేయలేను అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్న. నా పేరు యల్.కృష్ణ నా స్టాప్ నెంబర్ 176822. సూర్యాపేట డిపో సర్.

నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. మీ సంస్థ నుండి నాకు రావాలిసిన బకాయిలను ఇప్పించి నా రాజీనామాను ఆమోదించగలరని నా యొక్క మనవి. అయ్య సీఎం సర్ గారు మీరు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మీ వైఖరి గుర్తు చేసుకోండి. పాపం సర్ RTC వాళ్ళు సర్ మీమ్ములను చాలా అభిమానించారు సర్ కానీ మీరు ఇలా చేస్తారు అని కలలో కూడా ఉహించి ఉండరు సర్. పాపం RTC వాళ్ళు సర్ వాళ్లకు వచ్చే 16000 జీతం తీసుకొని ఫ్యామిలీని చూసుకుంటూ చాలా గౌరవం గా బ్రతుకుతున్నారు సర్. మీరూ వాళ్లకు ఏమి ఇవ్వకున్న కనీసం పిలిచి మాట్లాడి ఉంటే మీ మీద గౌరవంతో ప్రాణాలు ఇచ్చేవారు సర్. కనీసం నేను మీ బంగారు తెలంగాణలో సంతోషంగా లేను. మా తల్లిదండ్రులు సర్ కనీసం వాళ్ళను అయిన సంతోషంగా ఉండేటట్లు నెల నెలా వాళ్ళకి వృద్దాప్య పింఛన్ ఇవ్వండి. ఎందుకంటే మిమ్ములను నమ్మి మీకు మా కేసీఆర్ అని ఓటు వేశారు సర్. వాళ్ళు బాధపడుతుంటే సమాజంలో ప్రతి ఒక్కరు చిన్న చూపు చూస్తుంటే ప్రతి ఒక్కరూ నన్ను దీనంగా చూస్తుంటే తట్టుకోలేక పోయాను సర్.

ప్రతి రోజు ఈ అరెస్టులు ఏంది ఈ లాఠీ దెబ్బలు ఏంది నా RTC సోదరులు ఏమి తప్పు చేశారు అని ఇంకా ఎంత మందిని ఆత్మహత్యలు చేస్కునేట్టు చేస్తారు. అందుకే ఇవన్నీ భరించలేకనే నా ఆత్మభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేను.

అందుకే నేను మీ బంగారు తెలంగాణాలో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని కాదు. మీ మాయ మాటలు నమ్మి మోసపోయిన తెలంగాణ సమాజంలోని వ్యక్తిని. నీ తెలంగాణ రాష్ట్రం లో నిరుద్యోగిగా ఉన్నాను కాబట్టి తక్షణమే నా తల్లిదండ్రులకు వృద్ధాప్య పింఛను ఒక్కటి ఇవ్వండి. పేరు మీద అ సెంటు భూమి లేదు కాబట్టి మూడు ఎకరాల పొలం అలాగే నా పిల్లలకి ప్రభుత్వ స్కూల్లో చదువు, నాకు ఉండడానికి ఇల్లు లేదు కనుక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వండి. ఒకవేళ మీరు ఏమి ఇవ్వకున్న సమాజంలో గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని కోరుతూ అలాగె నా ఉద్యోగ రాజీనామా ను తక్షణమే ఆమోదించగలరు.

ఇట్లు

L కృష్ణ
స్టాఫ్ నెంబర్ 176822
టీఎస్ఆర్టీసీ కండక్టర్ సూర్యాపేట డిపో.

Keywords : RTC Strike, TSRTC, KCR, Open Letter, Conductor, Krishna, Suryapet
(2019-12-07 20:29:08)No. of visitors : 2524

Suggested Posts


0 results

Search Engine

నేను చనిపోయినా వారికి శిక్షపడాలి....ఉన్నావ్ అత్యాచార బాధితురాలి చివరి కోరిక‌
మా పేరు మీద కస్టడీ హత్యలు వద్దు..!
కూలి డబ్బులు అడిగినందుకు దళితుడిని జేసీబీతో తొక్కించి చంపాడు..!
క్షీణించిన వరవరరావు ఆరోగ్యం - ట్రీట్ మెంట్ కోసం పూణే ప్రభుత్వ‌ హాస్పటల్ కు...
రేప్ బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ దాడి చేసిన రేపిస్టులు... సజీవదహనానికి యత్నం
అది ఎన్కౌంటర్ కాదు.. 17 మందిని ఏకపక్షంగా కాల్చి చంపారు : జుడీషియల్ కమీషన్ వెల్లడి
ఇండియాస్ డాటర్స్.. ఇంకెంత కాలం ఈ దారుణాలు..? ఈ డాక్యుమెంటరీ చూడండి..!
20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
ప్రియాంక హత్య : ఢిల్లీలో పగిలిన చిన్ని గుండె !
100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ
దొరతనం గెలుసుడా ఓడుడా? - ఎన్.వేణుగోపాల్
ʹఆకలి, పేదరికంతో చచ్చిపోతున్నాʹ.. కంటతడి పెట్టిస్తున్న ఓ చిన్నారి సూసైడ్ లెటర్
మహిళా కార్యకర్తలపై అక్రమకేసులకు వ్యతిరేకంగా పోరాడుదాం !
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
ఒక ప్రొఫెసర్ - ఏడు కుట్ర కేసులు
ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
more..


ఈ