ʹఆకలి, పేదరికంతో చచ్చిపోతున్నాʹ.. కంటతడి పెట్టిస్తున్న ఓ చిన్నారి సూసైడ్ లెటర్
ఆ ఇంటిలో అతనే అందరి కంటే చిన్నాడు. వయసు కేవలం 17 ఏండ్లు మాత్రమే. యవ్వనంలో ఎన్నో కలలు కన్నాడు. మంచిగా చదువుకోవాలి.. కష్టపడుతున్న తల్లిదండ్రులు, అన్నయ్యకు తాను కూడా తోడ్పాటు అందించాలని. కాని చాలీచాలని సంపాదనతో ఆ పేద కుటుంబం రోజురోజుకూ ఆర్థికంగా పతనాన్నే చూసింది కాని ఏ రోజూ సంతోషంగా లేదు. ఇవ్వన్నీ ఆ ఇంట్లో చిన్నోడైన దేవేందర్ గమనిస్తున్నాడు. తన లాంటి పేదోడు సమాజానికి ఉపయోగపడటం తర్వాత సంగతి.. బతకడమే కష్టం అని ఒక నిర్ణయానికి వచ్చాడు.
మిర్యాలగూడలోని తాళ్లగడ్డకు చెందిన సోమశంకర్, నాగలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుండగా.. చిన్న కొడుకు దేవేందర్ (17) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు. తల్లిదండ్రుల కూలి, అన్న జీతం అంతా ఇంటి అద్దెలు, జీవనానికే సరిపోవడం లేదు. దీంతో పలు చోట్ల అప్పులు చేయడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. దీంతో దేవేందర్ తాను మరణించి కుటుంబానికి ఒక దారి చూపాలనుకున్నాడు. మంగళవారం తన ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందే తన మనసులో బాధను, ఆక్రోశాన్ని, వేదనను ఒక కాగితంపై పెట్టాడు..
తన ఇంటిలో ఆత్మహత్య చేసుకునే ముందు దేవేందర్ సూసైడ్ నోట్‌లో ఇలా రాశాడు.
ʹʹకోట్లు కూడబెట్టుకుని ధనంవంతులు ఏమి సాధిస్తారు. ఉన్నదాంట్లో మాలాంటి పేదలకు పంచి చూడండి. పేద వారికి సహాయం చేయండి. ఆ ఆనందం తెలుస్తుంది. మా అమ్మ, నాన్న మమ్మల్ని ఎంతగానో కష్టపడి పెంచుతున్నారు.
మాకు సొంత ఇల్లు కూడా లేదు. అమ్మ, నాన్న సంపాదించిన డబ్బులన్నీ ఇంటి అద్దెకే సరిపోతున్నాయి. మాలాంటి పేదవారు చాలామంది ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. కానీ పేదల బతుకులు మాత్రం మారడం లేదు.ʹʹ
దేవేందర్ సంధించిన ప్రశ్నలు మన పాలకులను నిద్ర లేపవు.... ఆకలితో, పేదరికంతో ఆ చిన్నారి వేసిన చావు కేక పాలకుల గుండెలను అసలే తాకదు... మన నాయకులకు పేదరికం ఓట్లు దండుకునే ఓ నినాదం మాత్రమే... పాలకులు అంబానీ, అదానీలకోసం ఇలాంటి అసమానతలు కొనసాగుస్తూనే ఉంటారు. అనేక మంది దేవేందర్ లను చంపేస్తూనే ఉంటారు. మరి మనం ? దేవేందర్ మరణంలో మనకు పాత్ర లేదా ?



Keywords : Devender, Miryalaguda, Suicide, Letter, Poverty, Viral Letter
(2019-12-07 20:56:36)
No. of visitors : 530
Suggested Posts
0 results
| నేను చనిపోయినా వారికి శిక్షపడాలి....ఉన్నావ్ అత్యాచార బాధితురాలి చివరి కోరిక |
| మా పేరు మీద కస్టడీ హత్యలు వద్దు..! |
| కూలి డబ్బులు అడిగినందుకు దళితుడిని జేసీబీతో తొక్కించి చంపాడు..!
|
| క్షీణించిన వరవరరావు ఆరోగ్యం - ట్రీట్ మెంట్ కోసం పూణే ప్రభుత్వ హాస్పటల్ కు... |
| రేప్ బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ దాడి చేసిన రేపిస్టులు... సజీవదహనానికి యత్నం |
| అది ఎన్కౌంటర్ కాదు.. 17 మందిని ఏకపక్షంగా కాల్చి చంపారు : జుడీషియల్ కమీషన్ వెల్లడి |
| ఇండియాస్ డాటర్స్.. ఇంకెంత కాలం ఈ దారుణాలు..? ఈ డాక్యుమెంటరీ చూడండి..! |
| 20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| ప్రియాంక హత్య : ఢిల్లీలో పగిలిన చిన్ని గుండె ! |
| 100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ |
| దొరతనం గెలుసుడా ఓడుడా? - ఎన్.వేణుగోపాల్ |
| ఈ తెలంగాణ మీదే.. మాది కాదు : కేసీఆర్కు ఒక ఆర్టీసీ కండక్టర్ బహిరంగ రాజీనామా లేఖ |
| మహిళా కార్యకర్తలపై అక్రమకేసులకు వ్యతిరేకంగా పోరాడుదాం ! |
| కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి ! |
| ఒక ప్రొఫెసర్ - ఏడు కుట్ర కేసులు
|
| ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
|
| Withdraw the False Case against Veekshanam Editor! |
| వీక్షణం సంపాదకుడిపై UAPA కేసు |
| భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
|
| Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
|
| అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..! |
| కేసీఆర్ అప్రజాస్వామిక పాలన: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు |
| ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్యూ విద్యార్థులు..!
|
| పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన కార్మికులు |
| చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న ఆర్టీసీ జేఏసీ |
more..