నేను చనిపోయినా వారికి శిక్షపడాలి....ఉన్నావ్ అత్యాచార బాధితురాలి చివరి కోరిక‌


నేను చనిపోయినా వారికి శిక్షపడాలి....ఉన్నావ్ అత్యాచార బాధితురాలి చివరి కోరిక‌

నేను

ఉత్తరప్రదేస్ లోని ఉన్నావ్‌ అత్యాచార ఘటనలో బాధితురాలు శుక్రవారం మృతి చెందింది. 90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. గతేడాది డిసెంబర్‌లో మృతురాలిపై అత్యాచారం జరుగగా, విచారణ నేపథ్యంలో గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు.

కాలిన గాయాలతో బాధితురాలు కేకలు వేసుకుంటూ కిలోమీటరు వరకు పరుగులు పెట్టింది. అనంతరం ఆమెను లక్నోలో ఓ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన ఎయిర్‌ అంబులెన్స్‌లో ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూనే చనిపోయే ముందు బాధితురాలు మెజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.

ఉన్నావ్ అత్యాచారం కేసులో బాధితురాలు మరణించే ముందు చివరిసారి తన సోదరుడితో చెప్పిన మాటలు ఆమె పట్టుదలను సూచిస్తున్నాయి. ఆమె మరణించే ముందు సఫ్దర్‌గంజ్‌ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో చివరిసారిగా తన సోదరుడితో మాట్లాడారు. ʹʹనాపై సామూహిక అత్యాచారం చేసి, నిప్పంటించిన నిందితులను విడిచి పెట్టవద్దుʹʹ అని ఉన్నావో బాధితురాలు తన సోదరుడిని కోరింది. తనకేమైనా అయినా నిందితులకు శిక్ష పడేలా చేయి అని బాధితురాలు మరణించే ముందు చివరిసారి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్న సోదరుడు కన్నీరుముననీరుగా రోదిస్తున్నారు.

ఈ కేసు దర్యాప్తునకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అత్యాచార బాధితురాలు శుక్రవారం రాత్రి మరణించిన నేపథ్యంలో యూపీ సర్కారు ఈ కేసు విచారణపై మంత్రి ఓ ప్రకటన జారీ చేశారు. ʹʹఉన్నావో కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని తాము సంబంధిత కోర్టును కోరతాం.ఈ కేసును రోజువారీ ప్రాతిపదికన దర్యాప్తు చేస్తాంʹʹ అని యూపీ న్యాయశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ వెల్లడించారు. ఉన్నావ్ అత్యాచారాలకు రాజధానిగా మారడంపై విలేఖరులు అడిగిన ప్రశ్నపై మంత్రి బ్రజేష్ పాఠక్ మాట్లాడుతూ ʹʹఈ కేసులను రాజకీయం చేయవద్దు, నిందితులు ఎంత శక్తివంతులైనా వారిని విడిచిపెట్టకుండా వారిపై కఠినచర్యలు తీసుకుంటాంʹʹ అని చెప్పారు. ఉన్నావ్‌లో గత 11 నెలల్లో 86 అత్యాచారాలు నమోదయ్యాయని, దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారని, దోషులు తప్పించుకోలేరని మంత్రి చెప్పారు.

Keywords : uttarapradesh, unnao, yogi adityanath, rape victim
(2020-01-26 23:32:43)



No. of visitors : 591

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది

నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మ‌ల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

పోలీసుల దుర్మార్గం...బాలిక గ్యాంగ్ రేప్ !

రక్షక భటులు ఓ బాలికను కాటేశారు. కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర గోవింద్‌నగర్లో పదవతరగతి చదువుతున్న ఓ బాలికను ఇన్స్‌పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్‌లు....

అది విషాదంకాదు నరమేధం... 63 కు చేరిన చిన్నారుల మరణాలు

యోగీ ఆదిత్యానాథ్ రాజ్యంలో చిన్నారుల నరమేధం కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం 63 మంది చిన్నారులను బలితీసుకుంది. గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ లేక నిన్న 31 మంది చిన్నారుఅ ఊపిరి ఆగిపోగా ఇవ్వాళ్ళ ఆ సంఖ్య 63 కు...

పరీక్షలు రాసింది 12 వేల మంది... పాసయ్యింది 20 వేల మంది

12,800 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కానీ పాసయ్యింది మాత్రం 20,089 మంది. చివరి నిమిషంలో ఈ అంకెలు చూసిన అధికారులు షాకయిపోయారు. ఏం చేయాలో అర్దం కాక తలలు పట్టుకొని ఆలోచించి చివరకు పరీక్షా ఫలితాల....

ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

ఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి.

Search Engine

వీక్షణం పై పాలకుల దుర్మార్గపు ప్రచారాన్ని ఖండిద్దాం ... ప్రజా పత్రికకు అండగా నిలబడదాం
ʹమాపై వీసీనే దాడి చేయించాడుʹ...వీసీపై కేసు నమోదు చేసిన‌ విద్యార్థులు
ʹకేంద్రం ఎన్ని ఎత్తుగడలు వేసినా ʹమహా ʹ ప్రభుత్వం భీమా కోరేగావ్ కేసులో నిజాలను బైటికి తీస్తుందిʹ
ʹతెలంగాణలో నియంతృత్వం రాజ్యమేలుతుంది...ఈ అవమానాన్ని మర్చిపోంʹ
భీం ఆర్మీ చీఫ్‌ ఆజాద్‌ను అరెస్టు చేసి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించిన హైదరాబాద్ పోలీసులు
ఇండియా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోంది : CAA పై తీర్మానం ప్రవేశపెట్టిన‌ యూరోపియన్ యూనియన్
గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలో చిత్తుగా ఓడిన ఏబీవీపీ ... వామపక్ష, దళిత‌ విద్యార్థి సంఘాల‌ విజయం
దేశవ్యాప్తంగా ʹషహీన్ బాగ్ʹ లు...విజయవాడలో శాంతి బాగ్ ప్రారంభం
మోడీ షా దుర్మార్గం.... భీమా కోరే గావ్ కేసును NIA కు బదిలీ చేసిన కేంద్రం
మేదావులపై భీమాకోరేగావ్ కేసు ఓ కుట్ర... సీఎం కు శరద్ పవార్ లేఖ
ʹతుక్డే తుక్డే గ్యాంగ్ʹ అంటే ఏంటి ? అందులో సభ్యులెవరు ? హోం శాఖకు కూడా తెలియదట !
కశ్మీర్ బహిరంగ చెరసాల... 24న పుస్తకావిష్కరణ‌
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఢిల్లీకి రావొచ్చు.. అనుమతించిన కోర్టు
సీఏఏకు వ్యతిరేకంగా షహీన్‌బాగ్ నిరసనల్లో కాశ్మీరీ పండితులు
ప్రొఫెసర్ సాయిబాబాకు ముకుందన్ సీ మీనన్ అవార్డు 2019 ప్రకటించిన NCHRO
నా కొడుకు ఏ తప్పూ చేయలేదు.. పేదల కోసం, తెలంగాణ కోసం కొట్లాడిండు : కాశీం తల్లి వీరమ్మ‌
నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు
Condemning arbitrary arrest of Prof. C. Kaseem
జ్యుడీషియల్ రిమాండుకు ప్రొఫెసర్ కాసీం.. చీఫ్ జస్టీస్ ఇంట్లో ముగిసిన విచారణ
తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ʹజాషువా పద్యంʹ వినిపించిన కాశీం...!
ప్రొఫెసర్ కాసీం అరెస్టు.. తెలంగాణ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
కామ్రేడ్ కాశీం కోసం... ప్రజాస్వామిక హక్కుల కోసం అందరం గొంతు విప్పుదాం
కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!
ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ
ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
more..


నేను