అలుపెర‌గ‌ని విప్ల‌వ బాట‌సారి చంద్రన్న

అలుపెర‌గ‌ని

విప్ల‌వ కారుల‌న‌గానే అత్యంత క‌ర్క‌ష మ‌న‌స్కుల‌నేంత‌గా ప్ర‌ధాన స్ర‌వంతి మీడియా ప్ర‌చార‌ముంటుంది. కానీ... విప్ల‌వ‌కారులు ఎంత‌టి ప్రేమాస్ప‌దులో ఆదివాసీ గూడాన్నీ, మాదిగ వాడ‌నూ అడిగితే తెలుస్తుంది. వాళ్ల మ‌న‌సెంత మెత్త‌నిదో కార్మిక బ‌స్తీని అడిగితే తెలుస్తుంది.

అలాంటి మ‌నుషులు మ‌న జీవితంలోకి వ‌చ్చిన‌ప్పుడు... మ‌నం నూత‌న మాన‌వులుగా ప‌రిణామం చెంద‌డం ఆరంభ‌మ‌వుతుంది. అలా.. కొంద‌రు మ‌న జీవితంలోకి వ‌చ్చి మ‌న‌ల్ని మ‌న‌కు ప‌రిచ‌యం చేస్తారు. మ‌న క‌ర్త‌వ్యాన్ని మ‌న‌కు గుర్తు చేస్తారు. క‌ళ్ల‌ముందు కొన్ని వాస్త‌వాల్ని కుమ్మ‌రించి వెళ్తారు. స‌త్యాన్ని ప‌సిగ‌ట్టే ప‌నిముట్లు మ‌న‌కిచ్చి వెళ్తారు. వాళ్లు వెళ్లిపోయినా... వాళ్ల మాట‌లు మాత్రం చెవుల్లో గింగిరిలు తిరుగుతూనే ఉంటాయి.

చంద్ర‌న్న అలాంటి గుర్తుల‌నే మిగిల్చివెళ్లాడిప్పుడు. మోములో చెద‌ర‌ని ద‌ర‌హాసం. మాట‌ల్లో సౌమ్యం. ప్ర‌తి మాట వెన‌కా లోతైన ఆలోచ‌న‌లు. బీడీలు చుట్టే అక్క‌ను, బొగ్గుగ‌ని త‌మ్ముడిని, కంపెనీ కార్మికుడిని, వ‌ర్సిటీ విద్యార్థిని, ద‌గాప‌డ్డ ద‌ళితుడిని అంతే ఆత్మీయంగా హ‌త్తుకున్నాడు. జీవిత‌మంతా వాళ్ల‌కోస‌మే బ‌తికాడు. అందుకే ఆయ‌న అంద‌రికీ అన్న అయ్యాడు.

నాలుగున్న‌ర‌ ద‌శాబ్దాల‌పైబ‌డిన రాజ‌కీయ జీవితం ఆయ‌న‌ది. న‌క్స‌ల్బ‌రీ, శ్రీకాకుళ ఉద్య‌మాల ప్ర‌భావంలోంచి... సిరిసిల్ల‌, జ‌గిత్యాల రైతాంగ ఉద్య‌మాల వెంట న‌డిచిన విప్ల‌వ భాట‌సారి అత‌ను. చర్చ‌ల చంద్ర‌న్న‌గా పిలుచుకునే చంద్ర‌న్న న‌ల్ల‌గొండ జిల్లా టంగుటూరులో జ‌న్మించాడు. జ‌న‌గాంలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. జ‌న‌గామ జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్‌లో హ‌య్య‌ర్ సెకండ‌రీ స్కూల్ పూర్తి చేసిన చంద్ర‌న్న విద్యార్థి రాజ‌కీయాల్లో చురుకుగా ఉండేవాడు. అప్ప‌ట్లోనే విద్యార్థి సంఘ ఎన్నిక‌ల్లో పోటీచేసి గెలుపొందారు. అలా మొద‌లైన ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం... విప్ల‌వ శిబిరాన్ని చేర‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌లేదు.

హైద‌రాబాద్‌లో Indian Drugs and Pharmaceuticals (IDPL) కార్మికుడిగా మొద‌లైన ఆయ‌న తొలుత ఏఐటీయూసీలో ప‌నిచేశారు. అప్ప‌టికే రాజుకున్న న‌క్స‌ల్బ‌రీ పోరాటం విభిన్న వ‌ర్గాల‌ను విప్ల‌వ రాజ‌కీయాల వైపు న‌డిచించింది. ఎమ‌ర్జెన్సీ త‌రువాత వెల్లువెత్తిన జ‌గిత్యాల‌, సిరిసిల్ల రైతాంగ పోరాటాలు నూత‌నోత్తేజాన్ని నింపాయి. ఆ ఒర‌వ‌డిలో విప్ల‌వ రాజ‌కీయాల వైపు న‌డ‌క‌నారంభించిన చంద్ర‌న్న ఐఎఫ్‌టీయూ నాయ‌కుడిగా త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. 1995లో బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్ హ‌త్య‌గావించ‌బ‌డ్డ మ‌ధుసూద‌న్ రాజ్‌తో క‌లిసి ప‌నిచేసిన చంద్ర‌న్నవేరు వేరు కార్మిక రంగాల‌కు నాయ‌క‌త్వం వ‌హించారు. ఆల్ ఇండియా ఫెడ‌రేష‌న్ ఆఫ్ ట్రేడ్ యూనియ‌న్స్ (ఏఐఎఫ్‌టీయూ) ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అధ్య‌క్షుడిగా రాష్ట్ర‌వ్యాప్తంగా కార్మికుల‌ను కూడ‌గ‌ట్టారు. శ్రామికశ‌క్తి బీడి కార్మికుల సంఘం, సింగ‌రేణి బొగ్గుగ‌ని కార్మికుల సంఘాల‌కు గౌర‌వాధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించారు.

పీపుల్స్‌వార్స్‌, జ‌న‌శ‌క్తి పార్టీల‌తో వైఎస్ఆర్ ప్ర‌భుత్వం జ‌రిపిన చ‌ర్చ‌ల్లో చంద్ర‌న్న జ‌న‌శ‌క్తి పార్టీ త‌రుపున ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రించారు. 2004 అక్టోబ‌ర్‌లో జ‌రిగిన శాంతి చ‌ర్చ‌ల్లో సీపీఐ (ఎం- ఎల్‌) పీపుల్స్ వార్ పార్టీ త‌రుపున రామ‌కృష్ణ‌, సుధాక‌ర్‌, గ‌ణేష్, సీపీఐ (ఎం- ఎల్‌) జ‌న‌శ‌క్తి పార్టీ త‌రుపున అమ‌ర్‌, రియాజ్ పాల్గొన్నారు. ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రిపేందుకు పీపుల్స్‌వార్ పార్టీ త‌రుపున వ‌ర‌వ‌ర‌రావు, క‌ళ్యాణ‌రావు, గ‌ద్ద‌ర్, జ‌న‌శ‌క్తి త‌రుపున చంద్ర‌న్న‌, చ‌ల్ల‌ప‌ల్లి శ్రీనివాస‌రావు ప్ర‌తినిధులుగా పాల్గొన్నారు. కార్మికోద్యమ‌ ప్ర‌తినిధిగా చ‌ర్చ‌ల్లో పాల్గొన్న చంద్ర‌న్న శాంతి - స్వావ‌లంబ‌న - దున్నేవాడికే భూమి కోసం తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వం ముందుంచారు.

మొద‌టి ద‌శ చ‌ర్చ‌ల అనంత‌రం ప్ర‌భుత్వం కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించి 2005 జ‌న‌వ‌రిలో తిరిగి ఎన్‌కౌంట‌ర్ల‌ను ప్రారంభించింది. చ‌ర్చ‌ల సంద‌ర్భంగా విప్ల‌వోద్య‌మ ఆనుపానుల‌పై నిఘావేసిన పోలీసులు ఆ త‌రువాత విప్ల‌వోద్య‌మంపై అణ‌చివేత‌ను ముమ్మ‌రం చేశారు. రాజ్యం కుట‌ల నీతికి శాంతి చ‌ర్చ‌ల ప్ర‌తినిధినే బ‌లితీసుకుంది. జ‌న‌శ‌క్తి పార్టీ త‌రుపున చ‌ర్చ‌ల్లో పాల్గొన్న రియాజ్‌ను 2005 జూలై 1న హైద‌రాబాద్‌లో ప‌ట్టుకొని క‌రీంన‌గ‌ర్‌లో హ‌త్య‌చేసింది ప్ర‌భుత్వం. విప్ల‌వోద్య‌మ అణ‌చివేత కోస‌మే ప్ర‌భుత్వం చ‌ర్చ‌ల నాట‌కానికి తెర‌తీసింద‌ని రియాజ్ ఎన్‌కౌంట‌ర్ సంద‌ర్భంగా చంద్ర‌న్న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కార్మికోద్య‌మ నాయ‌కుడిగా రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా ప‌లు ఉద్య‌మాల్లోనూ పాల్గొన్నాడు చంద్ర‌న్న‌. ప‌లు రాష్ట్రాల్లో కార్మికోద్య‌మాల‌తో క‌లిసి ప‌నిచేశారు. పీడీఎఫ్ ఐ స‌భ్యుడిగా దేశ‌వ్యాప్తంగా తిరిగారు. 2009 త‌రువాత ద‌ళిత బ‌హుజ‌న ఉద్య‌మాల వెంట న‌డిచారు. ద‌ళిత‌, బ‌హుజ‌న, మైనార్టీల ఐక్య‌త‌కు కృషి చేశారు. 12 డిసెంబ‌ర్ 2019 రాత్రి తుదిశ్వాస విడిచే వ‌ర‌కూ న‌మ్మిన విశ్వాసాల కోస‌మే నిల‌బ‌డ్డారు.

జీవిత‌మంతా ప్ర‌జ‌ల కోస‌మే జీవించిన చంద్ర‌న్న మృతి ప్ర‌జా ఉద్య‌మాల‌కు నిజంగా వెలితి. ఆయ‌న న‌డిచిన దారిలో ఎన్నో గాయాల‌ను చ‌విచూశాడు. ఎన్నో జ్ఞాప‌కాల‌ను మిగిల్చివెళ్లాడు. త‌లుచుకుంటే... కంట నీరు. త‌ర‌మెళ్లిపోతున్న‌ప్పుడు... గుండెను అదిమిప‌ట్టుకోవ‌డం కూడా ఎంత క‌ష్ట‌మో.

- క్రాంతి

Keywords : Chandranna, Revolution, Janasakti Party
(2024-04-24 17:30:48)



No. of visitors : 1198

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అలుపెర‌గ‌ని