రణరంగంగా తెలంగాణ

పోలీసుల వలయంలో హైదరాబాద్
ఎక్కడికక్కడ నిర్భందం-అరెస్టుల పర్వం
పదివేల మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఉద్రిక్తంగా మారిన ఓయూ
ప్రొఫెసర్లు, మేధావులు, విద్యార్ధులు, లాయర్లు, జర్నలిస్టులు అరెస్టు
ప్రభుత్వ అణిచివేతను ఎండగట్టిన తెలంగాణ సమాజం

వరంగల్ లో శృతి, సాగర్ ల ఎన్ కౌంటర్ కు నిరసనగా తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక ఇచ్చిన చలో అసెంబ్లీ ఉద్రిక్తంగా సాగింది. బూటకపు ఎన్ కౌంటర్ కు ప్రభుత్వం బాధ్యత వహించడమే కాదు...బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పై 370 ప్రజాసంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. సర్కార్ దమనకాండను ఎండగట్టే ప్రయత్నం చేశాయి. చలో అసెంబ్లీకి పోలీసులు అనుమతిని నిరాకరించడంపై ప్రజాసంఘాల నేతలు, మేధావులు, విద్యార్ధులు తీవ్రంగా ఖండించారు. ఇవ్వకున్నా నిర్వహించి తీరుతామని ప్రకటించడంతో...పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే అరెస్టులు చేపట్టారు. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధులు బయటకు రాకుండా చేశారు. ఓయూను మరోసారి రణరంగంగా మార్చారు. ఉద్యమసమయంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేశారు. తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా అంటూ స్టూడెంట్స్ నిరసన గళం విప్పారు. సర్కార్ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. ఉస్మానియా క్యాంపస్ నుంచి విద్యార్ధులను ఎవ్వరినీ బయటకు రానీయలేదు. మహిళా స్టూడెంట్స్ పైనా పోలీసులు తమ ప్రతాపం చూపారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కూడా కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్చగా తమ నిరసనను తెలుపుకునే హక్కులేదా అంటూ ప్రశ్నించారు.

లెఫ్ట్ పార్టీల నేతలతో పాటు ప్రజాసంఘాల నేతలు గృహనిర్బంధం చేశారు. విరసం, మేధావుల నేతలను ఎవరినీ వదలలేదు. నేతల ఇళ్లపై నిఘా పెట్టి ఎవరు బయటకు వస్తే వారిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లకు తరలించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులతో పాటు మరికొంతమంది కార్యకర్తలు ఉంటే వారిని బయటకు రాకుండా అడ్డుకున్నారు. వచ్చిన వారిని బలవంతంగా వ్యానులో ఎక్కించి స్టేషనకు తీసుకెల్లారు. విరసనం నేత వరవరరావుతో పాటు ప్రొఫెసర్లు, మేధావులు, అందరినీ అదుపులోకి నిరసన తెలపకుండా కట్టడి చేశారు. మరోమారు తెలంగాణలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణం అయ్యేలా పోలీసులు, పాలకులు వ్యవహరించారు. అయినా కొంతమంది అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. సుమారు 20 మంది విరసం, టీవీవీ కార్యకర్తలు అసెంబ్లీ గేటును తాకడమే కాదు లోపలికి పోవడానికి ప్రయత్నించారు. ఇంత నిర్బంధం ఉన్నప్పటికీ పదుల సంఖ్యలో ప్రజాస్వామ్య వేదిక కార్యకర్తలు అసెంబ్లీ వరకు పోలీసులకు ఓ రకంగా వణుకు పుట్టించింది. ఓ యువకుడు గన్ పార్కులోని అమరవీరుల స్థూపం దగ్గర ఆత్మాహుతికి యత్నించడం మరోమారు ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్ చుట్టూ 15 ప్రాంతాల నుంచి అసెంబ్లీ ముట్టడించేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అక్కడే నిలువరించారు. ఓ రెండు టీంలు మాత్రం అసెంబ్లీ వరకు వచ్చేందుకు ప్రయత్నించాయి. అందులో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు తెలుగుయూనివర్సిటీకి వరకు రాగా పోలీసులు వారిని అరెస్టుచేశారు. మిగతా ఒక టీం మాత్రం అసెంబ్లీ గేటు వరకు వెళ్లింది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 10వేల మందికిపైగా అరెస్టు చేసి వివిధ స్టేషన్లకు తరలించారు.
పోలీసుల దమనకాండకు నిరసనగా గురువారం తెలంగాణవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు విద్యార్ధి నేతలు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోనే కాదు ఇదే తరహా నిర్బంధం జిల్లాలోనూ కొనసాగింది. వామపక్ష పార్టీలతో పాటు ప్రజాసంఘాల నాయకులు, విద్యార్ధులు హైదరాబాద్ రాకుండా అదుపులోకి తీసుకున్నారు. రాజధానికి వచ్చే రహదారుల్లో ప్రత్యేక చెక్ పోస్టులను పెట్టి మరీ అరెస్టులకు దిగారు. దాంతో చాలా మంది వామపక్ష పార్టీ కార్యకర్తలు, నేతలు రైల్వేస్టేషన్ల ఎదుటనే తమ నిరసన గళం వినిపించారు. మరోవైపు... వరంగల్ ఎన్ కౌంటర్ దురదృష్టకరమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలన్నారు.

Keywords : Encounter, Chalo Assembly, Police, Left Parties, Students, Arrest
(2024-05-06 11:16:26)



No. of visitors : 2305

Suggested Posts


AKHIL GOGOI’S LETTER FROM JAIL

Inside the cell, I can watch news only on the governmental channel. Therefore my communication with the people of Assam is restricted only through the newspapers. The public intellectuals in Assam have also condemned and warned the people against this conspiracy.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రణరంగంగా