ది గ్రేట్ ఇండియన్ రేప్ ట్రిక్..!

ది

పూలన్ దేవి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు శేఖర్ కపూర్ బండిట్ క్వీన్ అనే సినిమా తీశారు. ఆ సినిమాకు సంబంధించిన అరుంధతీ రాయ్ రాసిన రివ్యూ అప్పట్లోనే సంచలనం సృష్టించింది. ది గ్రేట్ ఇండియన్ రేప్ ట్రిక్ పేరిట రాసిన ఈ రివ్యూ సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపింది. సత్యాన్ని సమాధి చేస్తూ సినిమా ఎలా తీశారో చూపించారని తన రివ్యూలో రాసుకొచ్చింది. ఆ రివ్యూ తన బ్లాగ్‌లో ఉంది. ఇంగ్లీషులో ఉన్న ఆ రివ్యూని మోహన సుందరం తెలుగులో అనువాదం చేశారు. ఆ అనువాదం యధాతథంగా..

----------------------------------------------------

1994... అప్పటికి "అరుంధతి రాయ్ " అంటే ముంబై లోని కొంత మంది టెలివిజన్ ప్రొడ్యూసర్స్‌కి, సినిమా ఓ ఫ్యాషన్ గా బతుకు తెరువు కోసం పెనుగులాడుతున్న యువక బృందంలోని ఓ బక్క పల్చని అమ్మాయి గా కొందరికి మాత్రమే పరిచయం ఉన్న పేరు. అప్పటికే ప్రపంచ ప్రసిద్ధి చెందిన డైరెక్టర్ గా పేరుపొందిన శేఖర్ కపూర్ మాలాసేన్ రాసిన పూలన్ దేవి పుస్తకం ఆధారంగా ʹబాండిట్ క్వీన్ʹ సినిమా తీశాడు. ఆ సినిమా సంచలనం కలిగించింది. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. అంత సంచలనం సృష్టించిన ఆ సినిమాలో "సత్యం " ఎలా సమాధి చేయబడిందో సోదాహరణంగా చెబుతూ ఆ సినిమా మీద వచ్చిన రివ్యూ " ది గ్రేట్ ఇండియన్ రేప్ ట్రిక్ ".

రచయిత అరుంధతి రాయ్. సినిమా, సాహిత్యాల పట్ల అభిరుచి ఉన్న మాలాంటి సమూహాలని అప్పట్లో ఆ రివ్యూ కుదిపేసింది. ఆ రచయిత పేరు అప్పటిదాకా పెద్దగా తెలియదు. ఆర్కిటెక్చర్ అంశంపై తీసిన అంతగా విజయవంతం కాని ఓ సినిమాకి స్క్రీన్ ప్లే రచనకు గానూ జాతీయ అవార్డు పొందిన అమ్మాయిగా తెలుసు. 1996 లో ఆమె రాసిన ʹ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ʹ నవలకు బుకర్ ప్రైజ్ రావడంతో ఆమె ప్రపంచానికంతటికీ పరిచితురాలు అయ్యారు.

"బాండిట్ క్వీన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా శేఖర్ కపూర్ మాట్లాడుతూ ʹ ఈ సినిమాలో సత్యం, సౌందర్యం అనే అంశాల్లో నేను సత్యానికే ప్రాముఖ్యం ఇచ్చాను ʹ అని చెప్పారు. కానీ అది ఎలాంటి సత్యం అంటే లారీలు, ట్రక్ ల వెనుక రాసుకునే ʹగాడ్ ఈజ్ లవ్, లైఫ్ ఈజ్ హార్డ్, ట్రూత్ ఈజ్ ఫ్యూర్, సౌండ్ హారన్ʹ లాంటి సత్యం.. " అంటూ ధ్రిగ్భ్రాంతికర వ్యాఖ్య తో మొదలయ్యే ఆ రివ్యూ లో ఓ కథలో గానీ, ఓ వ్యాసంలో కానీ, ఓ సినిమాలో కానీ, ఓ సృజనాత్మక ప్రక్రియలో గానీ సత్యం ఎలా పాతిపెట్టబడుతుందో, ఆ సమాధి మీద తీరిగ్గా కూర్చొని తీర్పరులు ఎలాంటి తీర్పుల్ని ఇస్తారో, తమ గుర్తింపుల కోసం ఎలా తాపత్రయ పడతారో సోదాహరణంగా చెబుతూ.... చివరలో పూలన్ దేవి పుస్తక రచయిత మాలాసేన్ జైలులో పూలన్ దేవికి చికిత్స చేసిన డాక్టర్ తో జరిపిన సంభాషణతో రివ్యూ ని ముగిస్తుంది.

రివ్యూ చదవటం మొదలు పెట్టినప్పుడు ఎంత షాక్ అవుతామో , ఆ ముగింపు చదివి అంతకంటే రెట్టింపు షాక్ అవుతాం. జైలులో తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న పూలన్ దేవికి శస్త్రచికిత్స చేసి గర్భసంచిని తొలగిస్తారు. అది తొలగించేందుకు ఆమె అనుమతి తీసుకోరు. ఆమె అనుమతి తీసుకోకుండా అంత అనైతికంగా ఆ ఆపరేషన్ ఎందుకు చేశారు అని అడిగిన రచయిత తో ఆ శస్త్రచికిత్స చేసిన డాక్టర్ ʹ ఆమె సంతానం ఈ పవిత్ర దేశం నేల మీదకు రాకూడదు అనుకున్నానుʹ అని సమాధానం చెబుతాడు.

ఎప్పుడో పాతికేళ్లనాటి ఈ సినిమా రివ్యూ ఎందుకు గుర్తుకువచ్చిందంటే ఇప్పుడు సత్యాన్ని సృజనాత్మకంగా సమాధి చేసే సృజనకారులు, ఆ సమాధుల మీద కూర్చొని తీర్పుల్ని లిఖిస్తోన్న ఉద్యమకారుల, మేధావుల హడావుడి ఎక్కువైపోయింది. ముఖ్యంగా వాళ్ళ తీర్పులతో , శల్య శోధనలతో ఈ ఎఫ్బి కిక్కిరిసిపోతోంది. వాళ్లకు ఈ సమూహాల్ని, సమాజాల్ని మించిన తమదైన లక్ష్యాలు వేరే వుంటాయి. సమాజాన్ని ముంచెత్తుతున్న కల్లోలాల మీద ఓ ప్రకటనో, ప్రదర్శనో చేసేసి ఓ పనైపోయింది అనుకుంటూ తీరిగ్గా తమ తీర్పరి స్థానాలకి చేరుకొని తిరిగి ది గ్రేట్ ట్రిక్ ల్ని సందర్భాలకి అనుకూలంగా ప్రారంభించేస్తారు. ఈ విషయాన్ని పాతికేళ్ల క్రితమే పసిగట్టి చెప్పిన అరుంధతి రాయ్ కి మరొక్కమారు కృతజ్ఞతలు..!

( ʹది గ్రేట్ ఇండియన్ రేప్ ట్రిక్ ʹ రివ్యూ చాలా పెద్దది. అనువాదం చేయడం శ్రమతో కూడుకున్నది. ఇంట్రెస్ట్ ఉన్నవారు అరుంధతి బ్లాగ్ లో చదవొచ్చు... )

- మోహన సుందరం

సోర్స్ : https://www.facebook.com/story.php?story_fbid=451102409128793&id=100026871128416

Keywords : Bandit Queen, Sekhar Kapoor, Arundhati Rai, Movie Review, The Great Indian Rape Trick
(2024-12-01 10:52:01)



No. of visitors : 4089

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ది