నూట యాభై రోజులు...!


నూట యాభై రోజులు...!

నూట

ఫోటో - మాయం చేయబడిన బిడ్డ ఆచూకీ కోసం పోలీసుల బూట్లని వంటి మీది దుప్పట్టాతో తుడుస్తూ వేడుకుంటున్న కాశ్మీరీ తల్లి

(రచయిత మోహన సుందరం తన ఫేస్ బుక్ టైం లైన్ పై పెట్టిన పోస్ట్ మీ కోసం...)

ఇప్పుడు ఇక్కడున్నది..
మన రక్తమాంసాలకు చెందిన దేశం కాదు
ఇప్పుడు ఇక్కడున్న వృక్షాలు
మన ఎముకులకు సంబంధించినవి కావు
ఇప్పుడు ఇక్కడున్న గొర్రెలు
మన తెల్లని పర్వతసానువుల గీతాల్లోని గొర్రెలు కావు
ఇప్పుడు ఇక్కడున్న దారులు
మన ఇళ్ళకి తప్ప అన్ని ఇళ్లకూ తీసుకుపోతాయి
మనదైన దేశం కోసం
మనదైన స్వేచ్ఛ కోసం
మనం మరణించాల్సి ఉంటే
మరణిద్దాం..!

---- మహమూద్ దార్వీష్

కాశ్మీర్ లో కాళ్ళకింద నేల మాయమైపోయి, కళ్ళముందు వెలుగు మాయమైపోయి, గొంతులు మూగబోయి నేటికి నూట యాభై రోజులు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇంకా 90 శాతం ప్రాంతాల్లో ఇంటర్నెట్ పునరిద్దరించబడలేదు. కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది. 3600 గంటలగా కమ్యూనికేషన్ బ్లాక్ అయిపోయింది. 2.4 బిలియన్ రూపాయల నష్టం వాటిల్లింది. 57 వేల ఎకరాల భూమిని ఇండస్ట్రీయల్ ఎస్టేట్ లుగా మార్చేందుకు గుర్తించారు. ఇప్పటికే 727 హెక్టార్లని కంపెనీలకు కేటాయించారు. అభివృద్ధి పేరుతో 1847 అరుదైన వృక్షాల్ని నేలకూల్చారు. ఆగస్టు5 నుంచి ఇప్పటివరకు 5, 161 మందిపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఆంక్షలు పెట్టిన కొన్ని వార్తా సంస్థలపై ఆంక్షల్ని ఎత్తివేశారు.

ప్రభుత్వ లెక్కలే ఇలావుంటే వాస్తవాలు మరింత కఠోరంగా ఉన్నాయి. కటిక నిర్బంధం, ఆంక్షల మధ్య కాశ్మీర్ ప్రజల జీవితం కల్లోలంగా ఉంది. కంచెలు, కర్ఫ్యూలు, కాల్పుల మధ్య కాలం గడుస్తోంది. అక్రమంగా లక్షలాదిమంది నిర్బంధించబడ్డారు. కేవలం పదివేల మంది మైనర్లు నిర్బంధించబడ్డారు. వారి జాడ తెలియక తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. ఎలాంటి సమాచార సౌకర్యం పునరిద్దరించబడలేదు. నాయకులంతా గృహానిర్బంధం లొనే వున్నారు. పునరిద్దరించబడిన ఒకటి రెండు వార్తాపత్రికలు పూర్తిగా పోలీసుల ఆంక్షల మధ్యే వెలువడుతున్నాయి. పలువురు జర్నలిస్టులు కాశ్మీర్ నుంచి బహిష్కరించబడ్డారు. ప్రతీ ఇల్లూ ఓ నాజీ క్యాంపులాగా, ప్రతీ కదలిక తుపాకుల మొనల చివరే వున్నా ఒక్క కాశ్మీరీ పౌరుడు కూడా తలవంచలేదు. ఆ నిర్బంధాల మధ్య నుంచే, ఆ నిషేధాల మధ్య నుంచే బలమైన స్వేచ్ఛా ఆకాంక్ష ప్రపంచాన్ని వెచ్చగా తాకుతూనే ఉంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రపంచం అంతా కాశ్మీర్ వైపే నిలబడి ఉంది.

#Stand With Kashmir

- మోహన సుందరం

Keywords : jammu kashmir, article 370, NRC,CAA,CAB, modi, bjp, rss
(2020-01-28 07:04:32)No. of visitors : 321

Suggested Posts


మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు....

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే.....

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

నెత్తురోడుతున్న కాశ్మీర్ - పోలీసు పెల్లెట్లకు 11ఏండ్ల విద్యార్థి బలి

శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం రాత్రి ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరమంతా పెల్లెట్ల గాయాలతో నిండి ఉన్నది. శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది....

కాశ్మీరీ చిన్నారుల విషాదం - ʹచదువన్నాఆగుతుంది కానీ చావు ఆగదు..ʹ

ʹమా కోసం చదువన్నా ఆగుతుంది కానీ చావు ఆగదు. ఓ ఇండియా... నీకోసం సింధు వెండిని తీసుకొస్తే.. ఇక్కడ(కాశ్మీర్‌లో) నీకోసం బంగారమే ఉందిʹ అని హిష్మా నజీర్ పలికింది. ఇలాంటి వ్యాఖ్యలతో సంజీవ్ సిక్రి డైరెక్ట్ చేసిన వీడియో....

బుర్హాన్ వని ఎన్ కౌంటర్ పై సారీ చెప్పండి - పోలీసులకు సీఎం ఆదేశం

కాశ్మీర్ లో బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌పై ప్రజలకు క్షమాపణ చెప్పాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబాబూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రోడ్లు, వీధుల్లో కూడా పోలీసులు కనిపించరాదంటూ ఆమె ఆదేశాలిచ్చినట్టు....

Search Engine

వీక్షణం పై పాలకుల దుర్మార్గపు ప్రచారాన్ని ఖండిద్దాం ... ప్రజా పత్రికకు అండగా నిలబడదాం
ʹమాపై వీసీనే దాడి చేయించాడుʹ...వీసీపై కేసు నమోదు చేసిన‌ విద్యార్థులు
ʹకేంద్రం ఎన్ని ఎత్తుగడలు వేసినా ʹమహా ʹ ప్రభుత్వం భీమా కోరేగావ్ కేసులో నిజాలను బైటికి తీస్తుందిʹ
ʹతెలంగాణలో నియంతృత్వం రాజ్యమేలుతుంది...ఈ అవమానాన్ని మర్చిపోంʹ
భీం ఆర్మీ చీఫ్‌ ఆజాద్‌ను అరెస్టు చేసి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించిన హైదరాబాద్ పోలీసులు
ఇండియా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోంది : CAA పై తీర్మానం ప్రవేశపెట్టిన‌ యూరోపియన్ యూనియన్
గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలో చిత్తుగా ఓడిన ఏబీవీపీ ... వామపక్ష, దళిత‌ విద్యార్థి సంఘాల‌ విజయం
దేశవ్యాప్తంగా ʹషహీన్ బాగ్ʹ లు...విజయవాడలో శాంతి బాగ్ ప్రారంభం
మోడీ షా దుర్మార్గం.... భీమా కోరే గావ్ కేసును NIA కు బదిలీ చేసిన కేంద్రం
మేదావులపై భీమాకోరేగావ్ కేసు ఓ కుట్ర... సీఎం కు శరద్ పవార్ లేఖ
ʹతుక్డే తుక్డే గ్యాంగ్ʹ అంటే ఏంటి ? అందులో సభ్యులెవరు ? హోం శాఖకు కూడా తెలియదట !
కశ్మీర్ బహిరంగ చెరసాల... 24న పుస్తకావిష్కరణ‌
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఢిల్లీకి రావొచ్చు.. అనుమతించిన కోర్టు
సీఏఏకు వ్యతిరేకంగా షహీన్‌బాగ్ నిరసనల్లో కాశ్మీరీ పండితులు
ప్రొఫెసర్ సాయిబాబాకు ముకుందన్ సీ మీనన్ అవార్డు 2019 ప్రకటించిన NCHRO
నా కొడుకు ఏ తప్పూ చేయలేదు.. పేదల కోసం, తెలంగాణ కోసం కొట్లాడిండు : కాశీం తల్లి వీరమ్మ‌
నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు
Condemning arbitrary arrest of Prof. C. Kaseem
జ్యుడీషియల్ రిమాండుకు ప్రొఫెసర్ కాసీం.. చీఫ్ జస్టీస్ ఇంట్లో ముగిసిన విచారణ
తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ʹజాషువా పద్యంʹ వినిపించిన కాశీం...!
ప్రొఫెసర్ కాసీం అరెస్టు.. తెలంగాణ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
కామ్రేడ్ కాశీం కోసం... ప్రజాస్వామిక హక్కుల కోసం అందరం గొంతు విప్పుదాం
కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!
ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ
ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
more..


నూట