వాళ్ళిద్దరి కోసం..!

వాళ్ళిద్దరి

అలన్ సోహైబ్, తాహా ఫజల్ గత యేడాది నవంబర్ ఒకటో తేదీ వరకు ఈ పేర్లు ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మాత్రం ఈ పేర్లు ఒక ఉద్యమం. కేరళలోని కాలికట్ పట్టణంలోని ఓ కళాశాల విద్యార్థులు వాళ్లిద్దరు. వామపక్ష విద్యార్థి సంఘాల్లో , రాజకీయాల్లో పనిచేస్తూ అనేక సామాజిక ఉద్యమాల్లో పనిచేసే విద్యార్థులుగా పట్టణంలోని విద్యార్థులందరికే కాక చాలామంది ప్రజలకు... ముఖ్యంగా అణచివేతకు గురయ్యే ప్రజలకు సుపరిచితులు. గత అక్టోబర్ నెలలో కేరళలోని పాల్ఘాట్ అటవీ ప్రాంతంలో నలుగురు మావోయిస్టుల్ని పోలీసులు ఎదురుకాల్పుల పేరిట అమానుషంగా కాల్చి చంపారు. ఈ ఘటనకి నిరసనగా కేరళ వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు జరిగాయి. ప్రజలు, విద్యార్థులు, మేధావులు ఈ ఘటనని తీవ్రంగా ఖండించారు. ఆ నేపథ్యంలో కాలికట్ లో అలన్ , తాహా లిద్దర్నీ కేరళ పోలీసులు అరెస్ట్ చేసి ఉపా కేసు నమోదు చేయడం సంచలనం కలిగించింది. ఈ ఇద్దరి వద్ద మావోయిస్టుల ఎన్కౌంటర్ ని ఖండించే కరపత్రాలు దొరికాయని, వాళ్ళిద్దరికీ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ అరెస్ట్ ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, రాజకీయ పార్టీలు అన్నీ తీవ్రంగా ఖండించాయి. అధికార పార్టీ కూడా ఖండించింది. ఎందుకంటే ఆ విద్యార్థులిద్దరూ ఎస్.ఎఫ్.ఐ. సభ్యులు. అరెస్టులపై వెల్లువెత్తుతున్న నిరసనకి పినరయ్ విజయన్ ప్రభుత్వం మెత్తబడే సమయంలో ఊహించని రీతిలో NIA రంగప్రవేశం చేసింది.

ఈ విద్యార్థులిద్దరూ ముస్లీంలవ్వడం, మావోయిస్టులతోనే కాక ,ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు వుండొచ్చేమోననే అనుమానం వ్యక్తం చేస్తూ NIA విచారణని తన చేతుల్లోకి తీసుకోవడం తో.. విద్యార్థుల్ని బెదిరించాలని ఉద్దేశంతో ఒక ఆకతాయితనంగా పినరయ్ ప్రభుత్వం చేసిన ఈ అరెస్ట్ ఇప్పుడు దాని పీకకు చుట్టుకుంది. ఈ విద్యార్థుల్ని విడుదల చేయాలని సాగుతున్న ఉద్యమాలు.. రాష్ట్రవ్యాప్తంగా NRC, CAB ,CAA వ్యతిరేక ఉద్యమాలగా పెద్దఎత్తున రూపొందుతున్నాయి. ఆ విద్యార్థుల్ని NIA యాక్ట్ లోని ఇన్వొక్ సెక్షన్ 7 (బి) ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి విడుదల చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. కేరళ వ్యాప్తంగా జరుగుతున్న NRC వ్యతిరేక ఆందోళనలకు ఇప్పుడు ఆ ఇద్దరు విద్యార్థులే కేంద్రబిందువులయ్యారు.

వీళ్ళ విడుదల కోసం ఈ నెల 17వతేదీన రోహిత్ వేముల డే గా కషాయీకరణ కి వ్యతిరేకంగా త్రివేండ్రం లో పెద్దఎత్తున సాంస్కృతిక నిరసన జరగనుంది. విద్యార్థులు, కవులు, కళాకారులు, మేధావులు పెద్దఎత్తున పాల్గొననున్నారు.

- మోహన సుందరం

ఫేస్‌బుక్ లింక్ : https://www.facebook.com/photo.php?fbid=466391067599927&set=a.149253435980360&type=3&theater

Keywords : Kerala, Pinarai Vijayan, Government, Alan Sohaib, Taha Faizal, CAA, NCR, NPR
(2024-04-24 17:17:11)



No. of visitors : 691

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


వాళ్ళిద్దరి