కునాల్ కమ్రాపై ఇండిగో నిషేధాన్నినిరసిస్తూ విమానంలో నిరసనలు


కునాల్ కమ్రాపై ఇండిగో నిషేధాన్నినిరసిస్తూ విమానంలో నిరసనలు

కునాల్

రిపబ్లిక్ టీవీ న్యూస్ యాంకర్ మరియు ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని విమానంలో విసిగించాడనే ఆరోపణలతొ హాస్యనటుడు కునాల్ కమ్రాను విమానాల నుండి నిషేధించాలని ఎయిర్లైన్స్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ సామాజిక కార్యకర్త ప్రియా పిళ్ళై, మరో ముగ్గురు గురువారం వారణాసి‍, ఢిల్లీ ఇండిగో విమానంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

ది టెలిగ్రాఫ్‌లోని ఒక నివేదిక ప్రకారం, పిళ్ళై, మేధా కపూర్, దేబయన్ గుప్తా మరియు మరొక వ్యక్తి ప్లకార్డులతో విమానంలో నిలబడ్డారు. వారు కాసేపు ప్లకార్డులతో నిలబడిన తరువాత, ఇండిగో సిబ్బంది వారి సీట్లలో కూర్చోవాలని కోరగా వెంటనే వాళ్ళు తమ తమ సీట్లలో కూర్చున్నారు. కొంతమంది తోటి ప్రయాణికులు వారిని అభినందించారు, స్పష్టంగా కనిపించేలా బ్యానర్లు ఎత్తమని కోరారు. వారు చేసింది శాంతి యుత నిరసన అని ఇండిగో వర్గాలు అభివర్ణించాయి.

ʹʹనేను ఈ దేశ పౌరుడిగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశాను. విచారణ కూడా లేకుండా ఏకపక్షంగా, తొందరపాటుతో కునాల్ కమ్రాను ఇండిగో నిషేధించిన విధానం (ఇండిగో పైలట్ స్వయంగా తన లేఖ ద్వారా బహిరంగపరిచారు) ఆ తరువాత ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాతో సహా మరికొన్ని సంస్థలు కునాల్ కమ్రాను నిషేధించడం అంటే అభిప్రాయాలు కలిగి ఉండే స్వేచ్చ‌ అసమ్మతిని వ్యక్తం చేసే హక్కును ప్రభుత్వం అణిచివేయడమేʹʹ అని సామాజిక కార్యకర్త పిళ్ళై ʹది వైర్ʹ ప్రతినిధితో అన్నారు

ʹʹఅర్నాబ్ గోస్వామి ఒక ప్రైవేట్ మీడియా హౌస్ కోసం పనిచేస్తున్నాడు . ఈ సంఘటన జరిగిన తర్వాత ఏయిర్ లైన్స్ సంస్థలు సరైన విచారణ కోసం కూడా ఎదురుచూడకుండా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) మార్గదర్శకాలను ఉల్లంఘించారు. అసలు ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా నిషేధించడం ఏమిటి? ప్రభుత్వానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇచ్చే వ్యక్తులను ఎవరూ ప్రశ్నించడం లేదు. ఈ చర్యలు మన రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నందున మేము వాటిని ఖండిస్తున్నాం.ʹʹ అన్నారు పిళ్ళై

కాగా కమ్రాను ఇండిగో సంస్థ నిషేదించడాన్ని ఆ విమానాన్ని నడిపిన పైలెట్ తీవ్రంగా ఖండించారు. తమ యాజమాన్యానికి రాసిన లేఖలో ఆయన కునాల్ కమ్రాపై నిషేధాన్ని ప్రశ్నించాడు. తనను సంప్రదించకుండా, తననుండి రిపోర్ట్ తీసుకోకుండా నిషేధించే నిర్ణయం తీసుకోవడం తనను నిరుత్సాహానికి గురిచేసిందని పైలెట్ చెప్పాడు. కమ్రాను నిషేధిస్తూ ఇచ్చిన లెటర్ లో పేర్కొన్న విధంగా కమ్రా వికృత మాటలతో ప్రవర్తించాడని తాను నమ్మలేదని, కమ్రా తన సీటుకు తిరిగి రావాలని సిబ్బంది ఆదేశాన్ని పూర్తిగా పాటించాడని అతను చెప్పాడు.

Keywords : kunal kamra, CAA, NRC, indigo, arnab goswamy,
(2020-03-28 08:00:41)No. of visitors : 229

Suggested Posts


0 results

Search Engine

ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ
వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!
పాటించాల్సింది సామాజిక దూరం కాదు, భౌతిక దూరం మాత్రమే!
లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !
చింత గుప్ప ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటన ..అమరుల అంత్యక్రియల ఫోటోలు విడుదల‌
ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !
కరోనా: కనిపించని విషాదాలెన్నో
కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?
అతడూ అర్బన్ నక్సలైటే
మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా
ఒకవైపు జనతా కర్ఫ్యూ .... షాహీన్ బాగ్ నిరసన ప్రదేశంలో పెట్రోల్ బాంబులతో దాడి
FREE ALL POLITICAL PRISONERS OF CONSCIENCE
కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు
ఉరి శిక్షలను ఆపేయండి - ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపు!
CPI Maoist Unleash Propaganda Offensive Against Policies Of Fascist Modi Government
CAA,NRC,NPRలకు వ్యతిరేకంగా ఒడిషాలో 402 గ్రామాల‌ తీర్మానం
పేరుకోసం, పదవుల కోసం తనపై తానే దాడి చేసుకున్న ʹహిందూ మక్కల్ కచ్చిʹ నాయకుడు
గొగోయ్ ని రాజ్యసభకు నామినేట్ చేయడంపై ʹసుప్రీంʹ లో పిల్ దాఖలు చేసిన మోడీ మద్దతుదారు
కోవిడ్ కాదు కోవింద్.. గోగోయ్ రాజ్యసభ సీటుపై టెలీగ్రాఫ్ సంచలన కథనం .. పీసిఐ నోటీసులు
ఆవుమూత్రం తాగి ఆస్పత్రిపాలైన వ్యక్తి... మూత్రాన్ని పంచిన బీజేపీ నేతను అరెస్టు చేసిన పోలీసులు
రంజన్ గోగోయ్ తుచ్ఛుడే, మరి మీరేం చేస్తున్నారు మిలార్డ్ - మార్కండేయ కట్జూ
క్విడ్ ప్రో క్వో !
సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుల ఫోటోలతో పోస్టర్లు - సుప్రీంకోర్టులో యూపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ‌
స్వాతంత్ర్య సమర యోధుడు, గాంధేయవాదిపై బీజేపీ దుర్మార్గ దాడి !
CAA,NRC నిరసనలు: జాతీయబ్యాంకుల నుండి తమ డిపాజిట్ లను ఉపసంహరించుకుంటున్న ఖాతాదారులు
more..


కునాల్