నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం


నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం

నువ్వు

రెండు రోజులుగా దాడులతో, హింసతో అట్టుడుకుతోంది. ఈశాన్య ఢిల్లీలో అనేక ఇళ్ళు షాపులు తగలబడుతున్నాయి. సీఏఏ కు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి. మరి రెండురోజుల్లో ఎందుకింత హింస ? దాడులు చేస్తున్నది ఎవరు ? దాడులు జరుగుతున్న ప్రాంతానికి న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన టైంమ్స్ ఆఫ్ ఇండియా ఫోటో జర్నలిస్టు అనింద్య చటోపాద్యాయ‌కు ఎదురైన అనుభవాలు చూస్తే ఎవరు ఎవరిపై దాడులు చేస్తున్నారో అర్దమవుతుంది. అసలేం జరిగిందో ఆయన మాటల్లోనే....
ʹʹమౌజ్‌పూర్‌ ఘటనల‌ను కవర్ చేసేందుకు నేను అక్కడికి వెళ్ళాను మౌజ్‌పూర్ మెట్రో స్టేషన్‌కు సోమవారం మధ్యాహ్నం 12:15 గంటలకు చేరుకోగానే హిందూసేనకు చెందిన ఓ వ్యక్తి వచ్చి నా నుదిటిపై బలవంతంగా పొడవాటి బొట్టు పెట్టాడు. " నువ్వు కూడా హిందూ మతానికి చెందినవాడివే. తిలకం నుదుటుపై ఉంటే నీ పని మరింత సులభతరం అవుతుంది" అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నా చేతిలో ఉన్న కెమెరాను చూసి కచ్చితంగా నేను ఒక జర్నలిస్టును అని తెలిసి కూడా అతను ఇలా వ్యవహరించాడు. ఆ తర్వాత‌ 15 నిమిషాలకు ఇరువర్గాలు మౌజ్‌పూర్‌లో రాళ్లదాడికి దిగారు. ఆ సమయంలో మోడీ మోడీ అంటూ నినాదాలు సైతం వినిపించాయి.ʹʹ

ʹʹఅప్పటికే ఒక భవనం నుంచి మంటలు చెలరేగుతుండటంతో దాన్ని కవర్ చేసేందుకు నేను అటువైపు వెళ్ళాను. శివాలయం దగ్గర కొందరు నన్ను అడ్డుకున్నారు. "నువ్వు జర్నలిస్టువు అయితే కావొచ్చు.. కానీ అంతకంటేముందు ఒక హిందువు అని గుర్తించు. అక్కడ నీకేంటి పని.. ఈరోజు హిందువులు మేల్కొన్నారు" అని అడ్డుకున్న వారిలో ఒకరు నాతో చెప్పాడు. ఇక అక్కడి నుంచి పక్కకు వచ్చి చిన్నగా అల్లర్లు జరిగే ప్రాంతానికి వచ్చి ఫోటోలు తీస్తున్నాను. ఆ సమయంలో నలుగురు కర్రలతో నన్ను చుట్టుముట్టి నా కెమెరాను లాక్కునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మరో రిపోర్టర్ నాకు అండగా ఉండి దమ్ముంటే ముట్టుకోవాలని సవాల్ విసిరడంతో వాళ్ళు ఆగిపోయారు. అయితే అక్కడి నుంచి ఆ వ్యక్తులు నన్ను ఫాలో అయ్యారు.ʹʹ

ʹʹవాళ్ళు కాసేపటికి మళ్లీ అడ్డుకున్నారు. నువ్వు హిందువా లేక ముస్లిం మతానికి చెందినవాడివా.. ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నావని ఒక యువకుడు నన్ను ప్రశ్నించాడు. వెంటనే నా ప్యాంట్‌ను కిందికి లాగి నేను ఏమతానికి చెందిన వాడినో నిర్థారించుకునే ప్రయత్నం చేశారు. నేను ఒక ఫోటోగ్రాఫర్‌ను అని చేతులెత్తి నమస్కరించాను. అప్పుడు వాళ్ళు నన్ను బెదిరించి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతించారు. దాంతో నేను వెళ్ళిపోదామని ఓ ఆటో ఎక్కాను.ʹʹ

ʹʹఆటో వెనక వైపు రాసి ఉన్న పేరు చూస్తే ఆటోను అల్లరి మూకలు ఆపుతారని అనుకుంటూనే ఉన్నాను. ఆ సమయంలోనే ఆటోను ఆపారు. నలుగురు కలిసి మా కాలర్లను పట్టుకుని ఆటోలో నుంచి బయటకు లాగారు. నేను మీడియాలో పనిచేసే వ్యక్తినని ఆటో డ్రైవర్‌కు ఏపాపం తెలియదని తమను వదిలివేయాలని ప్రాధేయపడ్డాను. మెల్లెగా ఆటో డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇలాంటి మతపరమైన చేదు అనుభవం నా జీవితంలో ఎన్నడూ ఎదుర్కోలేదు.ʹʹ
అంటూ తన బాధను పంచుకున్నాడు ఆ ఫోటో జర్నలిస్టు.
(timesofindia.indiatimes.com సౌజన్యంతో)

Keywords : delhi, caa, nrc, journalist, rss, hindutva, bjp
(2020-03-31 02:04:47)No. of visitors : 2306

Suggested Posts


లెనిన్‌ ఎవరూ..!?

భగత్‌సింగ్‌ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్‌ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్‌ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్‌ యూనియన్‌ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్‌ రిపబ్లిక్‌ అసోషియేషన్‌ʹ

ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్

ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు....

ఎమ్మెల్యే మనోడే.. ఎవ్వరూ ఏం చేయలేరు..వారిని తగులబెట్టండి...

ʹఎమ్మెల్యే మనతో ఉన్నారు.. ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు.. వారిని తగలబెట్టండి..ʹ అక్బర్‌ఖాన్‌ను, అతని స్నేహితుడిని కొడుతూ గోరక్షకులు చేసిన వ్యాఖ్యలివి. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన అక్బర్‌ఖాన్‌ స్నేహితుడు అస్లామ్‌ పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలను పేర్కొన్నాడు.

కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు....

ఈ చిన్నారుల ఆకలి కేకల సాక్షిగా... వాళ్ళను మనమే హత్య చేశాం !

అమ్మా ఆకలి అన్నా అన్నం పెట్టలేని స్థితిలో అమ్మ...బాబూ ఓ ముద్దేయండంటూ రోడ్డు మీద బోరుమన్నా పట్టించుకోని జనం... మూడు రోజుల పాటు ఆకలితో ఏడ్చీ ఏడ్చీ ఆ ముగ్గురు చిన్నారులు చనిపోయారు.

Statement by Sudha Bharadwaj on false allegations aired on Republic TV

I have been informed that Republic TV aired a programme on 4 July 2018, presented by anchor and MD Arnab Goswami as ʹSuper Exclusive Breaking Newsʹ.

నా బిడ్డకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు - నిర్భయ తండ్రి

ʹʹనా బిడ్డకు న్యాయం జరగ లేదు., జరుగుతుందన్న నమ్మకం కూడా లేదుʹʹ ఇవి మూడేళ్ల క్రితం సామూహిక అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన ʹనిర్భయʹ తండ్రి దుంఖంతో అన్నమాటలు. ఈ దారుణం జరిగి మూడేళ్లయినా నిందితుల్లో ఇంకా నలుగురికి ఉరిశిక్ష అమలుచేయలేదని, మరో నిందితుడిని త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని.....

ఏబీవీపీకి భయపడను ‍- అమర జవాను కూతురు

ʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్....

మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్‌యూ ప్రత్యేకత ‍- ఉమర్ ఖలీద్

మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.

ఈ దేశం మతోన్మాదులదేనా ? మనుషులకు బతికే హక్కులేదా?

గుర్‌మెహర్ పై కాశాయ కసాయి మూకలు నీచమైన దాడి చేస్తున్నాయి రేప్ చేస్తామంటూ బెధిరించారు..అయినా సరే తన నిరసనను కొనసాగిస్తానని ప్రకటించిన‌ గుర్‌మెహర్ కౌర్ చివరకు కేంధ్రమంత్రులు కూడా ఏబీవీకి మద్దతుగా ఆ అమ్మాయిపై దాడికి దిగడంతో .తన నిరసనను ఇక్కడితే ఆపేయనున్నట్లు...

Search Engine

ఎంత కష్టం: విరిగిన కాలు...అయినా ఊరికి చేరాలంటే నడకే మార్గం
వరవరరావు, షోమా సేన్‌లకు బెయిల్ తిరస్కరణ
కరోనాతో చంపకండి...ఖైదీలను విడుదల చేయండి -విరసం
రోడ్డు మీదికొచ్చినవాళ్ళు దేశద్రోహులు...వాళ్ళను తుపాకులతో కాల్చండి...బీజేపీ ఎమ్మెల్యే
8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌
పోలీసులు ఎవ్వరినైనా కొట్టొచ్చు...అదే లాఠీ వాళ్ళ కుటుంబ‌ సభ్యులపై పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడండి
లాక్‌డౌన్: నడిచీ...నడిచీ...ఊరికి చేరుకోకుండానే ప్రాణం పోయింది
లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ
ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ
వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!
పాటించాల్సింది సామాజిక దూరం కాదు, భౌతిక దూరం మాత్రమే!
లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !
చింత గుప్ప ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటన ..అమరుల అంత్యక్రియల ఫోటోలు విడుదల‌
ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !
కరోనా: కనిపించని విషాదాలెన్నో
కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?
అతడూ అర్బన్ నక్సలైటే
మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా
ఒకవైపు జనతా కర్ఫ్యూ .... షాహీన్ బాగ్ నిరసన ప్రదేశంలో పెట్రోల్ బాంబులతో దాడి
FREE ALL POLITICAL PRISONERS OF CONSCIENCE
కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు
ఉరి శిక్షలను ఆపేయండి - ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపు!
CPI Maoist Unleash Propaganda Offensive Against Policies Of Fascist Modi Government
CAA,NRC,NPRలకు వ్యతిరేకంగా ఒడిషాలో 402 గ్రామాల‌ తీర్మానం
పేరుకోసం, పదవుల కోసం తనపై తానే దాడి చేసుకున్న ʹహిందూ మక్కల్ కచ్చిʹ నాయకుడు
more..


నువ్వు