ఢిల్లీలో జరిగినవి ఇరు వర్గాల మధ్య అల్లర్లు కావు, బిజెపి,ఆరెస్సెస్ కలిసి చేసిన వ్యూహాత్మక, ప్రణాళికాబద్ధ దాడులు - విరసం

ఢిల్లీలో


ʹఢిల్లీలో జరిగినవి సి.ఎ.ఎ. అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య అల్లర్లు కావు, బిజెపి ప్రభుత్వం, ఆరెస్సెస్ కలిసి చేసిన వ్యూహాత్మక, ప్రణాళికాబద్ధ దాడులుʹ అని అభిప్రాయపడింది విప్లవ రచయితల సంఘం(విరసం). ఈ అంశంపై విరసం విడుదల చేసిన మీడియా ప్రకటన పూర్తి పాఠం..

ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు. వంద‌లాది మంది క్ష‌త‌గాత్రుల‌య్యారు. వంద‌లాది వాహ‌నాలు అగ్నికి ఆహుత‌య్యాయి. బైకులు, కార్లు, జీపులు, రిక్షాలు, తోపుడు బండ్లు, అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజ‌న్లు, షాపులు, మ‌సీదులు, ద‌ర్గాలు, ఇళ్లు, స్కూళ్లు ద‌హ‌న‌మ‌య్యాయి. వేలాది మంది పంటిబిగువున ప్రాణాల్ని పెట్టుకొని భ‌యంనీడ‌న వ‌ణికిపోతున్నారు. పొట్ట‌కూటి కోసం వ‌చ్చిన‌వాళ్లంతా ఢిల్లీని వ‌దిలి సొంత ఊళ్ల‌కు వెళ్లిపోతున్నారు. ఈ విషాదాన్ని చెప్పడానికి మాట‌లు స‌రిపోవు. వాళ్లెప్పుడూ ఊహించి ఉండ‌రు. త‌మ కాళ్ల‌కింది నేలే త‌మ‌కు ప‌రాయిద‌వుతుంద‌నీ, పుట్టిపెరిగిన జాగ‌లోనే దేశ‌భ‌క్తి యాగానికి తాము బ‌ల‌వుతామ‌ని. వాళ్లెప్పుడూ ఊహించి ఉండ‌రు... ఉన్న‌ప‌ళంగా తాము విదేశీయుల‌మ‌వుతామ‌ని, పేరును బ‌ట్టీ, ఆహార్యాన్ని బ‌ట్టీ వెలివేస్తార‌ని. న‌డివీథిలో శిలువేస్తార‌ని. దేశ రాజ‌ధానిలో BJP, RSS మూకలు సృష్టించిన హింస ఇది.

23వ తేదీన బిజెపి నాయకుడు కపిల్ మిశ్రా ఢిల్లీ పోలీసులకు మూడు రోజుల అల్టిమేటం ఇస్తూ సి.ఎ.ఎ. వ్యతిరేక నిరసన శిబిరాలను ఎత్తేయాలని లేకపోతే మేమే ఆపని చేస్తామని మాట్లాడిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఘర్షణ వార్తలు బైటికొచ్చాయి. జాఫ్రాబాద్ లో సి.ఎ.ఎ. వ్యతిరేక నిరసన జరుగుతున్న ప్రాంతానికి దగ్గరగా వచ్చి ఈశాన్య ఢిల్లీ పోలీసు అధికారి సమక్షంలోనే కపిల్ మిశ్రా రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు. అతనిలా మాట్లాడ్డం మొదటిసారి కాదు. గతంలో సి.ఎ.ఎ. వ్యతిరేకులు దేశాద్రోహులని, వాళ్ళను కాల్చి పడేయాలని నినాదాలిచ్చిన అనురాగ్ ఠాకూర్ మీద, షాహీన్ బాగ్ నిరసనకారులపై హింసను రెచ్చగొట్టేలా మాట్లాడిన మరో బిజెపి యంపి పర్వేష్ వర్మ మీద ఏ చర్యా లేదు. పోలీసుల సమక్షంలో నిరసనకారులపై రెండు సార్లు కాల్పులు కూడా జరిగాయి. కేంద్ర ప్రభుత్వమే దీని వెనక ఉందని చెప్పడానికి ఏ అనుమానం అక్కర్లేదు.

ప్ర‌ధాన స్ర‌వంతి మీడియా మాట్లాడుతున్న‌ట్లు ఇది... ఇరువ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ ఫ‌లితం కానేకాదు. ప్ర‌ణాళికాబ‌ద్ద దాడి. 2002 గుజ‌రాత్ మార‌ణ‌కాండ సమ‌యంలో ʹఏం జ‌రిగినా మౌనంగా ఉండాల‌ʹని రాష్ట్ర హోం శాఖ నుంచి పోలీసులుల‌కు ఆదేశాలు అందాయి. ముస్లింల ఇళ్లు, షాపులు, మసీదుల‌ను ఎంచుకొని దాడి చేశారు. ప్ర‌ణాళికాబ‌ద్ధంగా జ‌రిగిన ఈ దాడిలో 2వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోనూ ఇదే ప‌ద్ద‌తిని అనుస‌రించారు. చాలా స్‌ిష్టంగా దాడికి పాల్ప‌డి వారు మౌజ్‌పూర్‌, జాఫ్రాబాద్, చాంద్‌బాగ్, భ‌జ‌న్‌పురా త‌దిత‌ర ప్రాంతాల్లోని ముస్లిం నివాస స్థ‌లాల‌ను ఎంపిక చేసుకోని మ‌రీ దాడిచేశారు. హెల్మెట్లు ధ‌రించి, క‌ర్ర‌లు, క‌త్తులు, తుపాకులు, పెట్రోల్ బాంబులు, రాళ్లు ప‌ట్టుకొని... ʹజై శ్రీరాం, గోలీ మారో సాలోంకోʹ లాంటి నినాదాలు చేస్తూ వీథుల్లో వీరంగం చేసారు. ముస్లిం నివాసాల‌పై దాడి చేసిన యువ‌కులు... స్త్రీల ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు. ʹచాతి మీద చేతులు వేసి వేధించినʹట్లు బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. కొంద‌రు యువకులు త‌మ ప్యాంట్ల‌ను విప్పి... ʹమీకు ఆజాదీ కావాలా రండిʹ అంటూ... వికృతంగా వ్య‌వ‌హ‌రించార‌ని కూడా మ‌హిళ‌లు వెల్ల‌డించారు.

దారిన పోయేవారిని ఆపి... పేరు, ప్రాంతం అడిగి, గుర్తింపు కార్డులు చూసి ఎవ‌రు హిందువులో, ఎవ‌రు ముస్లింలో గుర్తించి మ‌రీ దాడికి పాల్ప‌డ్డారు. ఏ గుర్తింపు కార్డూ లేక‌పోతే... ప్యాంటు విప్పి మ‌రీ చూసి నిర్ధార‌ణ చేసుకున్నారు. ఓ ప్ర‌ముఖ పాత్రికేయుడికే ఎదురైన అనుభ‌వం ఇది. మ‌రి కొంద‌రైతే త‌మ చేతికి, మెడ‌లో ఉన్నతాళ్లు, రుద్రాక్ష‌లు సాక్ష్యంగా చూపి తాము హిందువుల‌మే అని నిరూపించుకున్నారు. నిరూపించుకోలేని... హిందువులు కూడా ఈ దాడిలో మృతి చెందారు.

పోలీసులు చూస్తూనే ఉన్నారు కానీ ఎక్కడా దాడులను అడ్డుకోలేదు. పైగా ఫాసిస్టు మూక‌ల‌కు రాళ్ల‌ను స‌మ‌కూరుస్తూ స‌హ‌కారాన్ని అందించారు. ప‌లు చోట్ల మూక‌ల‌తో క‌లిసి సాధార‌ణ జ‌నంపై దాడికి పాల్ప‌డ్డారు.
సోష‌ల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు అనేకం వెలుగులోకి వ‌చ్చాయి. వాస్త‌వాల‌ను క‌ప్పిపెట్టేందుకు పోలీసులు సీసీ కెమెరాల‌ను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి.

ఇన్ని ఆధారాలున్నా ప్ర‌ధాన స్ర‌వంతి మీడియా ఈ దాడులను సీఏఏ అనుకూల - వ్య‌తిరేక వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లుగా చూపెడుతున్నది. స్వయంగా మీడియా ప్రతినిధులపైన హిందుత్వ మూకలు భయంకరంగా దాడులు చేసినా, నువ్వు హిందువా, ముస్లిమా అని అడిగి, హిందువులని తెలుసుకొని చంపకుండా వదిలిన ఘటనలున్నా కూడా అది నిజాలను దాస్తున్నది.

బిజెపి బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఎజెండాలో భాగమే ఈ దాడులు. తక్షణ కారణం దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న సీఏఏ, ఎన్ఆర్‌సీ వ్య‌తిరేక ఆందోళ‌న‌లు. ప్ర‌ధానంగా షాహీన్‌బాగ్‌, జామియా ఆందోళ‌న‌లు వారిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇది క్రమంగా దేశమంతా వ్యాపిస్తోంది. ముస్లిం సమాజం తీవ్ర అభద్రతకు లోనైన మాట, దాన్నుండి ఏనాడూ బైటికి రాని స్త్రీలు కూడా రోడ్డు మీదికి వచ్చిన మాట నిజమే. కానీ బిజెపి విభజన రాజకీయాలు, ఎన్నార్సీ ప్రక్రియ ఇతర సమూహాలను కూడా కదిలిస్తున్నది. విద్వేషానికి వ్యతిరేకంగా ఎక్కడ ప్రజలు ఐక్యమవుతారో అన్న భయంతో బిజెపి, ఆరెస్సెస్ శక్తులు దీనిని ఒక మ‌తానికి సంబంధించిన వ్య‌వ‌హారంగా ప్ర‌చారం చేస్తున్నాయి. స‌మ‌యం చూసుకొని సి.ఎ.ఎ. అనుకూలురు, వ్య‌తిరేకులు సాకు తీసుకొని.. ముస్లిం స‌మాజంపై దాడికి దిగారు.
డిల్లీ ఘర్షణల మీద, పోలీసుల తీరు మీద హై కోర్టు జడ్జి మురళీధరన్ గట్టిగా మాట్లాడేసరికి ఆ కేసును ఆయన నుండి తప్పించి, గంటల వ్యవధిలోనే ఆయనను బదిలీ చేసారు. ఇప్పుడు ఈశాన్య ఢిల్లీ పోలీసు దిగ్బంధంలో ఉంది. అక్కడి వార్తలు బైటికి రానివ్వడం లేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం తన చెప్పుచేతల్లో ఉన్న కేంద్ర నిఘా సంస్థ (ఎన్.ఐ.ఎ.)కు అప్పగించింది. దేశాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ అల్లర్లు రేపి అశాంతి సృష్టించిందని భారత కేంద్ర ఇంటలిజెన్స్ అంటున్నది. రేప్పొద్దున దేశ‌మంతా ఢిల్లీని త‌ల‌పించ‌డానికి వారికి ఇలాంటి సాకులు ఉండనే ఉంటాయి. ఈ స్థితిలో బిజెపి, ఆరెస్సెస్ హింసోన్మాద రాజకీయాలను ఎండగడుతూ, ముస్లిం సమాజం పక్షాన దేశమంతా నిలవాల్సిన అవసరం ఉంది.

-అరసవెల్లి కృష్ణ (అధ్యక్షుడు), రివేరా (సహాయ కార్యదర్శి), బాసిత్ (ఉపాధ్యక్షుడు)
విప్లవ రచయితల సంఘం

Keywords : delhi, rss, bjp, attacks, muslims, hindus, virasam
(2024-04-24 17:03:13)



No. of visitors : 1608

Suggested Posts


లెనిన్‌ ఎవరూ..!?

భగత్‌సింగ్‌ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్‌ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్‌ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్‌ యూనియన్‌ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్‌ రిపబ్లిక్‌ అసోషియేషన్‌ʹ

నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం

రెండు రోజులుగా దాడులతో, హింసతో అట్టుడుకుతోంది. ఈశాన్య ఢిల్లీలో అనేక ఇళ్ళు షాపులు తగలబడుతున్నాయి. సీఏఏ కు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్

ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు....

Statement by Sudha Bharadwaj on false allegations aired on Republic TV

I have been informed that Republic TV aired a programme on 4 July 2018, presented by anchor and MD Arnab Goswami as ʹSuper Exclusive Breaking Newsʹ.

ఎమ్మెల్యే మనోడే.. ఎవ్వరూ ఏం చేయలేరు..వారిని తగులబెట్టండి...

ʹఎమ్మెల్యే మనతో ఉన్నారు.. ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు.. వారిని తగలబెట్టండి..ʹ అక్బర్‌ఖాన్‌ను, అతని స్నేహితుడిని కొడుతూ గోరక్షకులు చేసిన వ్యాఖ్యలివి. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన అక్బర్‌ఖాన్‌ స్నేహితుడు అస్లామ్‌ పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలను పేర్కొన్నాడు.

ఈ చిన్నారుల ఆకలి కేకల సాక్షిగా... వాళ్ళను మనమే హత్య చేశాం !

అమ్మా ఆకలి అన్నా అన్నం పెట్టలేని స్థితిలో అమ్మ...బాబూ ఓ ముద్దేయండంటూ రోడ్డు మీద బోరుమన్నా పట్టించుకోని జనం... మూడు రోజుల పాటు ఆకలితో ఏడ్చీ ఏడ్చీ ఆ ముగ్గురు చిన్నారులు చనిపోయారు.

అవును,దళిత బాలిక‌ కాబట్టే అత్యాచారం చేసి హత్య చేశాం -ఒప్పుకున్న పూజారి,ఇతర నిందితులు

ఢిల్లీ శ్మశానవాటికలో ఒక పూజారి, మరో ముగ్గురితో కలిసి తొమ్మిదేళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో... బాలిక దళితురాలైనందునే ఆమెపై అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

ఏబీవీపీకి భయపడను ‍- అమర జవాను కూతురు

ʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్....

మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్‌యూ ప్రత్యేకత ‍- ఉమర్ ఖలీద్

మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.

కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఢిల్లీలో