అతడూ అర్బన్ నక్సలైటే
ప్రపంచంలో ఎత్తయిన శిఖరం
హిమాలయం అన్నప్పుడు
అతడు
అంతకన్నా మరింత ఉన్నతంగా కనిపిస్తాడు
త్యాగాన్ని
ఏ కొలమానంతో కొలిచినా
అతడు
కొలతకు అందనంత ఎత్తుగా కనిపిస్తాడు
మొగ్గవయసులోనే
మొక్కలకు బదులు తుపాకులు నాటి
తూటాలను
బ్రిటీషు కోటలకు గురిపెట్టినవాడు
పన్నెండేండ్ల ప్రాయంలోనే
జలియన్ వాలాబాగ్ నేలమీద
చిందిన రక్తాన్ని తడిచిన మట్టిని
దోసిళ్ళనిండా నింపుకొని గుండెకు హత్తుకొని
కసిగా
వలసవాదుల ముఖం మీద తుపుక్కున ఉమ్మేసినవాడు
సైమన్ అడుగులకు అడ్డంగా
గో బ్యాక్ గొడ్డలి పదునైనవాడు
ఇరవై మూడేండ్ల యవ్వనంలోనే
వందేండ్ల అనుభవంతో
మన మస్తిస్కాల నిండా
విప్లవాల విత్తులు నాటినవాడు
జైలుగోడల నడుమ
అరవైనాలుగు దినాల దీక్షాదివస్ వెలిగించి
జైలు ఆవరణ నిండా
ఖైదీ హక్కుల పిడికిళ్ళు నాటినవాడు
మార్క్సిజం ఆకురాయి మీద
ఆలోచనలను సానబెడుతూ
నేనెందుకు నాస్తికున్నయ్యానని
మతం ముసుగు లోలోపలి
లొసుగుల్ని వివరించినవాడు
మెడలో వేలాడుతున్న ఉరితాడును
పరిహాసపు చిరునవ్వుతో విసిరికొట్టి
శత్రువుకు
భారతీయుడి అమరత్వాన్ని
కళ్ళారా చూసే అదృష్టాన్ని ప్రసాధించినవాడు
పిడికిలినిండా
ఇంక్విలాబ్ జిందాబాద్
పిడుగులు దాచిపెట్టి మనకిచ్చివెళ్లినవాడు
పెట్టుబడి పాము పడగల్ని
దేశాలు దాటొచ్చి దోచుకుతింటున్న డేగల్ని
సామ్రాజ్యవాదం నశించాలని
చెమట చేతుల్లోని కొడవలికి పదునుపెట్టినవాడు
యువతరం నెత్తురు తరంగం
షహీద్ భగత్ సింగ్
సలాం లాల్ సలామ్
అతడిప్పుడు
భౌతికంగా మనముందుంటే
అతడూ అర్బన్ నక్సలైటే
దేశ అంతర్గత భద్రతకు అత్యంత ప్రమాదకారే
- నాగేశ్వర్
Keywords : bhagat singh, urban naxalite, maoist
(2021-01-24 00:32:46)
No. of visitors : 511
Suggested Posts
| A Powerful Reply from Maoist Leaderʹs Daughter to Home MinisterWhen I was 10, my four-year-old sister Savera and our mother were unreasonably taken into police custody. Due to the unending harassment from your force.... |
| జంపన్న పార్టీకి ద్రోహం చేశాడు..ఏడాది క్రితమే ఆయనను సస్పెండ్ చేశాం..మావోయిస్టు పార్టీ మొన్నటిదాకా మావోయిస్టు పార్టీలో పని చేసి ఇటీవల పోలీసులకు లొంగిపోయిన జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న మావోయిస్టు పార్టీకి ద్రోహం చేశాడని సీపీఐ మావోయిస్టు పార్టీ మండిపడింది. ఆయనను ఏడాది క్రితమే పార్టీ సస్పెండ్ చేసిందని ఆ తర్వాత కూడా ఆయన తప్పులను సరిదిద్దుకోకపోగా ఇప్పుడు శత్రువుకు లొంగిపోయాడని |
| జగదల్ పూర్ జైలు నుండి మావోయిస్టు పద్మక్క లేఖఏళ్లతరబడి జైలులో ఉన్నతరువాత, విడుదలయ్యే రోజున స్వేచ్ఛ నుంచి వంచితురాల్ని చేసి పాత, అబద్ధపు వారంట్లతో అరెస్టు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఇలాంటి స్థితిలో నా అరెస్టుని చట్టవ్యతిరేకమైనదిగా ప్రకటించడానికి ఈ వినతిని ఉన్నత న్యాయ స్థానానికి తీసుకెళ్ళండి..... |
| ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 22 యేండ్లు !అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం మొదలు పెట్టారు. లోపల ఉన్నది ఒకే ఒక వ్యక్తి అతను తేరుకొని ఆత్మరక్షణ కోసం తన దగ్గరున్న తుపాకీతో కాల్పులు మొదలు పెట్టాడు. |
| ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిరసనలకు మావోయిస్టు పార్టీ పిలుపువిప్లవోద్యమం మొదటి నుండి దళితుల పక్షాన నిలిచి దళితులకు అన్ని విధాల రక్షణ కల్పిస్తూ, వారి మౌళిక హక్కుల రక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 25న నిరసన దినాన్ని పాటించాలని అన్ని సెక్షన్ల ప్రజలను కోరుతున్నాము. |
| మావోయిస్టు పార్టీకి పన్నెండేళ్లుసెప్టెంబర్ 21... భారత విప్లవోద్యమంలో చారిత్రక ప్రాధాన్యం గల రోజు. మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా, సీపీఐ ఎంఎల్ (పీపుల్స్‌వార్) విలీనమై.... |
| ఫిబ్రవరి 5న తెలంగాణ, దండకారణ్యం బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపుదోపిడీ పాలకులైన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుపార్టీని నిర్మూలించే లక్ష్యంతో గ్రీన్ హంట్ 3వ దశలో భాగంగా సమాధాన్, ప్రహార్-2 పేరుతో కొనసాగిస్తున్న ఫాసిస్టుదాడికి వ్యతిరేకంగా, కొత్త భూ సేకరణ చట్టానికి, నిర్వాసితత్వానికి వ్యతిరేకంగా,ఇసుక మాఫియా హత్యలకు, దళితులు ఆదివాసులపై దాడులు, హత్యలు, మహిళలపై లైంగిక అత్యాచారాలు, విద్యార్థుల పై దాడులు, అరెస్టులకు... |
| మావోయిస్టు మున్నా స్తూపాన్ని కూల్చేయాలట !ఏఓబీ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మున్నా స్మారకార్థం కుటుంబ సభ్యులు ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో నిర్మించిన స్తూపాన్ని తొలగించాలంటూ కొంది మందిని డబ్బులు తీసుకొచ్చిన జనాలతో పోలీసులు ర్యాలీ తీయించారు. జిల్లా కలెక్టర్, టంగుటూరు తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. మావోయిస్టులు హింసకు పాల్పడుతున్నారని, పోలీసులు చట్టబద్ద పోరాటంలో ప్రాణాలు కోల్ |
| కామ్రేడ్ రామన్న మరణంపై మావోయిస్టు పార్టీ ప్రకటనసీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రావుల శ్రీనివాస్ ఎలియాస్ రామన్న అనారోగ్యంతో అమరుడయ్యాడని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఆడియో ప్రకటనను విడుదల చేశారు. |
| రాజుకుంటున్న మన్యంవిశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం ఊపందుకుంది. ʹదేశ ఖనిజ సంపదను విదేశాలకు దోచి పెట్టే ఏ చర్యలను మేం ఒప్పుకోబోంʹ అంటూ ప్రకటించిన మావోయిస్టు పార్టీ బాక్సైట్ పోరాటాన్ని ఉదృతం చేసింది. మన్యం ప్రాంతంలో సభలు, సమావేశాలు.... |
| ఫ్యాక్ట్ చెక్: ఎర్ర కోట వద్ద జాతీయ జెండాకు అవమానం జరగలేదు...ఖాలిస్తాన్ జెండా ఎగిరేయలేదు
|
| నిర్బందపు బారికేడ్లను బద్దలుకొట్టిన రైతులు - ఎర్రకోటపై రెపరెపలాడిన రైతు జెండా |
| వ్యవస్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె |
| ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ
|
| అదానీపై కథనానికి అరెస్టు వారెంట్ ! |
| వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్
|
| ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
|
| అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు |
| ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు |
| వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్ |
| సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
|
| పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
|
| సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
|
| తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ? |
| యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు. |
| రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర |
| ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్యలు
|
| ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
|
| ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
|
| మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక |
| రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
|
| రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
|
| రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ స్ట్రీట్ వెండర్స్ |
| హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు |
| రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్ |
more..