కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?


కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?

కరోనా:
ఈ పోస్టులు పెట్టినవాళ్ళంతా డాక్టర్లు, వైద్య సిబ్బంది. కరోనా వైరస్ నుండి మనను బతికించడానికి పోరాడుతున్నవాళ్ళు.

దేశవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా బాధితులకు తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స చేస్తోన్న వైద్య సిబ్బంది భద్రత గురించి, వారికి కరోనా వైరస్ రాకుండా ఉండే ఎక్విప్ మెంట్ గురించి ప్రభుత్వం కనీసం ఆలోచిస్తోందా ? చప్పట్లు కొట్టండి, లాక్ డౌన్ లు చేయండి పిలుపులియ్యగానే వాళ్ళ బాధ్యత తీరిపోయినట్టేనా ? ఈ ప్రశ్నలు అహర్నిషలు కొరోనాపై అసలైన పోరాటం చేస్తున్న డాక్టర్లు అడుగుతున్నారు. వారికి అవసరమైన చేతుల గ్లౌజులు, ముఖ మాస్కులు, మొత్తం శరీరాన్ని కవర్‌ చేసే బాడీ సూట్లు ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ (వ్యక్తిగత రక్షణ పరికరాలు) లేదా పీపీఈ అని వ్యవహరిస్తారు. అందుబాటులో లేవు.అందుబాటులో లేవు అంటే దేశంలో ఉత్పత్తి అవడం లేదని కాదు. కొనిచ్చే నాధుడు కరువయ్యాడు.

కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో వైద్య సిబ్బందికి పర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లో జనవరి 1వ తేదీన మొదటి కరోనా కేసు వెలుగులోకి వచ్చిన మరుసటి రోజే పర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ ఉత్పత్తుల ఎగుమతిని నిషేధిస్తూ ప్రభుత్తం నిర్ణయం తీసుకుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నెలన్నర రోజులు గడచిపోయినప్పటికీ ఇప్పటి వరకు ఆ పరికరాలను ఉత్పత్తి చేసే సంస్థలకు ఆర్డర్లివ్వడం జరగలేదని పీపీఈలను ఉత్పత్తి చేస్తోన్న సంస్థలకు ప్రాతినిథ్యం వహిస్తోన్నసంఘం అధ్యక్షులు ఆరోపించారు.

ఈ మాస్క్‌ల ఉత్పత్తిదారులతో కేంద్ర జౌళి పరిశ్రమ శాఖ మార్చి 18వ తేదీన ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి మార్చి 8వ తేదీన జారి చేసిన ఆదేశాల మేరకు జౌళి శాఖ ఏర్మాటు చేసిన ఆ సమావేశానికి వైద్యశాఖ ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. సమావేశానికి పలువురు పీపీఈ ఉత్పత్తిదారులతోపాటు వారికి ప్రాతినిథ్యం వహిస్తోన్న రెండు సంఘాల నాయకులు కూడా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన పీపీలను సమీకరించే బాధ్యతను ఆ సమావేశంలో ప్రభుత్వరంగ సంస్థయిన హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ కేర్‌ లిమిటెడ్‌కు అప్పగించారు.

7.25 లక్షల ఓవరాల్‌ బాడీ సూట్లు, 60 లక్షల ఎన్‌–95 మాస్క్‌లు, కోటీ మూడు లేయర్ల క్లినికల్‌ మాస్క్‌లు అవసరమని ఆ సమావేశంలో వైద్యశాఖ ప్రతినిధులు తెలిపారు. అప్పటికే అత్యంత ఖరీదైనా ఫుల్‌ బాడీ సూట్లతోపాటు 10.5 లక్షల ఎన్‌ మాస్క్‌లు, పది లక్షల మూడు లేయర్ల మాస్క్‌ల ఉత్పత్తి కోసం ప్రైవేటు కంపెనీలకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆ సమావేశంలో హెచ్‌ఎల్‌ఎల్‌ అధికారులు తెలిపారు. అయితే నిజానికి అటువంటి ఆదెశాలేవి తమకు అందలేదని ప్రవేటు కంపెనీలు చెబుతున్నాయి. పీపీఈ ఉత్పత్తి కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ʹప్రివెంటీవ్‌ వియర్‌ మానుఫ్యాక్చరర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాʹ చైర్మన్‌ డాక్టర్‌ సంజీవ్‌ రెల్‌హాన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ సభ్యుల్లో ఒకరికి కూడా ఈ ఉత్పత్తి ఉత్తర్వులు అందలేదని ఆయన మీడియాతో చెప్పారు. ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వడం అబద్దమని ఏ ఒక్క కంపనీకి ఆ ఉత్తర్వులు అందలేదని ఓ ఆంగ్ల పత్రిక మార్చి 21వ తేదీన వార్త ప్రచురించడంతో అధికారులు అర్జెంట్ గా కదిలారు. ఆ రోజు మధ్యాహ్నం అత్యవసరంగా 80 వేల పీస్‌లు కావాలంటూ తమ అసోసియేషన్‌ సభ్యులైన 14 కంపెనీలకు హెచ్‌ఎన్‌ఎల్‌ నుంచి ఈ మెయిల్స్‌ ద్వారా ఉత్తర్వులు అందాయని డాక్టర్‌ సంజీవ్‌ వివరించారు. ఇది మార్చ్ 21 న జరిగింది అదే రోజు హెచ్‌ఎల్‌ఎల్‌ వెబ్‌సైట్లో మూడు టెండర్‌ డాక్యుమెంట్లు ప్రత్యక్షమయ్యాయి. మొదటి డాక్యుమెంట్‌లో మార్చి 5వ తేదీన టెండర్లు పిలిచినట్లు మార్చి 16న టెండర్లు ముగుస్తున్నట్లు, రెండో డాక్యుమెంట్‌లో 16వ తేదీన టెండర్‌ ముగింపును మార్చి 20 వరకు పొడిగిస్తున్నట్లు, మూడవ డాక్యుమెంట్‌లో టెండర్‌ ముగింపును మార్చి 25కు పెంచుతున్నట్లు మార్చారు. అసలు అటువంటి టెండర్ల గురించే తమకు తెలియదని కవరాల్‌ మాస్క్‌లను ఉత్పత్తిచేసే ʹమెడిక్లిన్‌ʹ పీపీఈ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్మితా షా ఆరోపించారు. ఈ విషయంపై హెచ్‌ఎల్‌ఎల్‌ డైరెక్టర్‌ టీ. రాజశేఖర్ మాత్రం విచిత్రంగా స్పందించారు. కేంద్ర ఆరోగ్య శాఖ పూర్తి పర్యవేక్షణలో తాము 24 గంటలు అవిశ్రాంతంగా పని చేస్తున్నామని ఆయన సమాధానం ఇచ్చారు. అంతకుమించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. అంటే ఏం జరిగినా భాద్యత తమది కాదు కేంద్ర ఆరోగ్య శాఖదే అన్నట్టే కదా!

ఏదేమైనా దేశంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా పీపీఈలు ముఖ్యంగా ఫుల్‌ బాడీ సూట్లు అందుబాటులో లేకపోవడం వైద్య సిబ్బందిని ఏ పరిస్థితుల్లోకి నెట్టేస్తోందో ఎవరైనా ఊహించగలరా ? ఈ పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే జరిగే నష్టాన్ని అంచనా వేయగలమా ? తప్పు హెచ్‌ఎన్‌ఎల్ దా? కేంద్ర ఆరోగ్య శాఖదా ? మొత్తంగా కేంద్ర ప్రభుత్వానిదా? తప్పెవరిదైనా ఫలితం మాత్రం వైద్య సిబ్బంది అనుభవించాల్సిందే కదా !
(scroll.in, caravanmagazine.in, సాక్షి సౌజన్యంతో)

Keywords : corona, doctors, lock down, personal-protective,
(2020-07-01 13:39:54)No. of visitors : 482

Suggested Posts


లాక్ డౌన్: ఆకలితో,దాహంతో 230 కిలోమీటర్లు నడిచి ప్రాణాలు విడిచిన అభాగ్యురాలు

కర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింధనూరు పట్టణంలోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన గంగమ్మ(27) దంపతులు ఉన్న చోట బతుకుదెరువు లేక బెంగళూరుకు వలసపోయి కెంగేరి ఏరియాలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తున్నారు.

ఆరెస్సెస్ వారు ఏ హక్కుతో తనిఖీలు చేస్తున్నారు ? ఇది చట్ట విరుద్దం కాదా ?

తెల్ల షర్ట్, ఖాకీ ప్యాంట్, నల్ల టోపీ, చెతులో లాఠీతో రోడ్డుపై పోయేవారి పత్రాలు చెక్ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజల్లో ఆందోళ‌న కలిగించింది. ఆ ఫోటోల్లో ఆరెస్సెస్ వారు వాహనదారులను ఆపి చెక్ చేస్తున్న స్థలంలో పోలీసులు కూడా ఉండటం...వీరికి పోలీసుల అనధికార మద్దతు ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కరోనా నేపథ్యంలో పోలీసులపై దాడులు ఆపేస్తున్నాం - మావోయిస్టు పార్టీ

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో పోలీసులపై ఎటువంటి దాడులకు పాల్పడబోమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ సమయంలో కరోనా వైరస్ పై ప్రజలను చైతన్యపరుస్తామని మావోయిస్టు పార్టీ మల్కనగిరి- కొరాపుట్ విశాఖ బోర్డర్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం ఓ లేఖ, ఆడియో టేపు విడుదల చేశారు.

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

లాక్ డౌన్ ప్రకటించే సమయంలో వీరి భద్రత, సంరక్షణ విషయంలో ప్రధానమంత్రి ఎలాంటి ప్యాకేజిని ప్రకటించలేదు. భయకంపితులైన కూలీలు ఒక్కసారి రోడ్ల మీదకు వచ్చి తమ గ్రామాలకు వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వం నిలిపివేసింది. దానితో వేలాది మంది కూలీలు కాలినడకన సుదూర ప్రాంతాలకు తమ పల్లెలు చేరుకోవడానికి కాలినడక ప్రారంభించారు. ప్రజల దయనీయ పరిస్థ

లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పోలీసుల కారణంగా ప్రజల ప్రాణాల మీదికి తెస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగానే కొనసగుతోంది.

మావోయిస్టు పార్టీ ప్రకటన పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి...పౌరహక్కుల సంఘం

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మావోయిస్టు పార్టీ, పోలీసులపై ఎలాంటి దాడులు చేయబోమని ,స్వీయ నియంత్రణ పాటిస్తామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం.ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.

8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌

ఆమె పేరు యాస్మీన్. ఆమెకు 8 నెలల గర్భం.... తన భర్త వకీల్ తోకలిసి తినడానికి తిండి దొరకక, తాగడానికి గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకక 100 కిలోమీటర్లు నడిచింది. ఆకలితో..అలసటతో...నడక తప్ప మరో దారి లేక నడక...నడక...

లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ

కరోనా వైరస్ భయంతో భారత దేశం లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది పేద వలస కార్మికులు నగరాల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నగరాల నుండి తమ గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్ళడానికి వాహనాలు లేక వందలాది కిలోమీటర్లు

వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల కష్టాలు, వారిపై పోలీసుల దౌర్జన్యాలు అంతులేకుండా ఉన్నాయి. గ్రామాల్లో బతకడానికి మార్గం లేక పట్టణాల్లో కూలీ పని చేసుకొని బతుకుతున్న వలస కూలీలు లాక్ డౌన్ తో అష్టకష్టాలు పడుతున్నారు.

అత్యవసర డ్యూటీ నుండి వస్తున్న డాక్టర్లపై పోలీసుల లాఠీ చార్జ్... చేయి విరిగిన డాక్టర్

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లోని ఎయిమ్స్ డాక్టర్లు ఇద్దరిని పోలీసులు దారుణంగా కొట్టారు. రీతూ, యువరాజ్ అనే డాక్టర్లు బుధవారం సాయంత్రం ఆస్పత్రిలో అత్యవసర విధులను ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు పోలీసులు దాడి చేశారు.

Search Engine

పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
బొగ్గు గని కార్మికుల మూడు రోజుల సమ్మెకు ప్రజా ఫ్రంట్ మద్దతు
తూచ్..మేము మందు కనిపెట్టలేదు...కరోనా మందుపై యూ టర్న్ తీసుకున్న పతంజలి
జ్యుడిషియల్ టీం పై పోలీసుల వేధింపులు... పోలీస్ స్టేషన్‌ను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశం
అఖిల్ గొగొయ్ ని విడుదల చేయాలంటూ1200 మంది ఖైదీల నిరాహార దీక్ష
143 Bangladesh intellectuals demand the release of Varavara Rao
దేశంలో రోజుకు ఐదు కస్టోడియల్ మరణాలు
బొగ్గుగని కార్మికుల దేశవ్యాప్త సమ్మెకు పౌరహక్కుల సంఘం మద్దతు
హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?
జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా....ఇలాంటి హత్యలు ఎన్నో!
పోలీసుల క్రూరత్వం... తండ్రీ కొడుకుల హత్య...మాట‌ల‌కంద‌ని హింస‌
మూడురోజుల పాటు మావోయిస్టుల భారీ బహిరంగ సభ...వేలాదిగా పాల్గొన్న జనం
ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడిపై సినిమా... మతోన్మాద శక్తుల హెచ్చరికలు
అఫ్ఘ‌నిస్తాన్ మావోయిస్టు పార్టీ చైర్మన్ కామ్రేడ్ జియా అమర్ రహే !
ఇప్పుడు పోరాటం ఒక్కటే...మన ఉనికిని నిలబెడుతుంది -అరుంధతీ రాయ్
రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ పంజాబ్ లో ఆందోళనలు...రాష్ట్రపతికి లేఖ‌ !
రమాకాంత్ అమర్ రహే! ఈ విప్లవ యోధుడి అమరత్వానికి ఇరవై నాలుగేళ్లు...
A very worrying letter from Gautamʹs partner Sahba. Remember that Maharashtra is the epicenter of the Covid epidemic.
వరవరరావుతో సహా హక్కుల కార్యకర్త‌లందరినీ విడుదల చేయాలి....500 మంది ప్రముఖుల లేఖ !
ప్రైవేటు కంపనీలకు బొగ్గు తవ్వకాలకు అనుమతిపై నిరసనకు పిలుపునిచ్చిన జార్ఖండ్ జన్ అధికార్ మహాసభ
సిఆర్ పి ఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ర్యాలీ...పోలీసులతో ఘర్షణ
మహారాష్ట్ర సీఎంకు 14మంది ఎంపీల లేఖ‌ - వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన
14 MPs sought better treatment for varavara rao...wrote a letter to Maha CM
CRPF దాడిలో తీవ్రంగా గాయపడిన ఆదివాసులు
more..


కరోనా: