మురికి వాడల్లో ఆహారం పంచుతున్న ముస్లిం యువకులపై దాడి...తీవ్ర గాయాలు

ప్రజలకు సహాయం అందించే స్వచ్ఛంద కార్యకర్తలకు ఎవరైనా అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నాటక‌ ముఖ్యమంత్రి బి. ఎస్. యడ్యూరప్ప ప్రకటించిన మర్నాడే బెంగళూరులోని మురికివాడల్లో ప్రజలకు ఆహార పదార్థాలు పంచిపెడుతున్న ముస్లిం యువకులపై దాడి జరిగింది. ఈ దాడిలో 5గురు యువకులు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.
ʹకీ బోర్డ్ జర్నల్ డాట్ కామ్ʹ అనే మళయాలం వెబ్ సైట్, ʹసియాసత్ డాట్ కామ్ʹ అనే ఇంగ్లీష్ వెబ్ సైట్ ల‌ కథనాల‌ ప్రకారం....
లాక్ డౌన్ తో రోజు కూలీ చేసుకునే లక్షలాది మంది తిండి లేక మలమల మాడుతున్న పరిస్థితుల్లో బెంగళూరులో అనేక స్వచ్చంద సంస్థలు పేదలకు ఆహారం అందిస్తున్నాయి. స్వరాజ్ అభియాన్ అనే స్వచ్చంద సంస్థ కూడా బెంగుళూరులోని మురికివాడల్లో ప్రజలకు ఆహారం అందిస్తోంది. స్వరాజ్ అభియాన్ బెంగళూరు జిల్లా కార్యదర్శి సయ్యద్ తబ్రేజ్, కార్యకర్తలు కిరణ్, జునైద్, రియాజ్, ఫిరోజ్, అమ్జాద్ లు బెంగుళూరు నగరంలోని మురికి వాడల్లో రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఏప్రిల్ 4 న వీళ్ళు ఆహారం పంచుతుండగా కొంతమంది వీరిని బెదిరించారు. ఆహారం పంచడాన్ని అడ్డుకున్నారు. అడ్డుకున్న‌ వాళ్ళంతా ఆరెస్సెస్ కు చెందినవాళ్ళుగా స్వరాజ్ అభియాన్ కార్యకర్తలు గుర్తించారు. వారిపై అమృతల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మీకేమీ కాకుండా తాము చూసుకుంటామని చెప్పి పోలీసులు హామీ ఇవ్వడంతో తిరిగొచ్చేశారు. ఏప్రిల్ 6 ఉదయం అదే మురికివాడలో మళ్ళీ ఆహారం పంపిణీ చేస్తున్నట్లు అభియాన్ కార్యకర్తలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆ మురికివాడకు చేరుకున్న ఆరుగురు కార్యకర్తలు ప్రజలకు ఆహారం పంచడం మొదలుపెట్టగానే దాదాపు 20 మంది క్రికెట్ బ్యాట్లు, రాళ్ళతో వీరిపై దాడి చేశారు. మీరు వైరస్ వ్యాప్తి చేయడానికే ఆహారాన్ని పంచుతున్నారని, మీరు ప్రజలకు విషం కలిపిన ఆహారం ఇస్తున్నారని ఆరోపిస్తూ దారుణంగా కొట్టారు. ఐదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని షాంపూర్‌లోని డాక్టర్ అంబేద్కర్ మెడికల్ కాలేజీలో చేర్చారు. దాడి చేసినవాళ్ళంతా ఆరెస్సెస్ కార్యకర్తలేనని బాధితులు గుర్తించారు.
ఈ సంఘటనపై స్వరాజ్ అభియాన్ కార్యకర్త, జరీన్ సియాసత్ పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ తాను గత రెండు సంవత్సరాలుగా స్వరాజ్ అభియాన్తో కలిసి పనిచేస్తున్నానని, విద్య మరియు అనారోగ్యానికి ఆర్థిక సహాయం అవసరమైన వారికి సహాయం చేస్తున్నానని చెప్పారు. దాడికి గురైన‌ వారిలో ముగ్గురు సయ్యద్ తబ్రేజ్, కిరణ్, జునైద్ తలపై, చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని వాళ్ళు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.

(keyboardjournal.com,siasat.com ల సౌజన్యంతో)
(పైన వీడియో ఈ బెంగుళూరు బాధితులు మాట్లాడిన మాటలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా దాడులకు సంబంధించిన వార్తలున్నాయి)

Keywords : karnataka, bengaluru, corona, lockdown, muslims, rss
(2024-04-24 16:50:37)



No. of visitors : 2352

Suggested Posts


ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌

ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్యపై మతోన్మాదులు సోషల్ మీడియాలో దుర్మార్గమైన దాడులకు పాల్పడుతున్నారు. పర్సనల్ మెసేజ్ లు పెట్టి బెదిరిస్తున్నారు. రేప్ చేస్తామని, హత్య చేస్తామని హిందుత్వవాదులు హూంకరిస్తున్నారు.

ఏది ఫేక్ న్యూస్ ? దీనిని ఎవరు ప్రచారం చేస్తున్నారు ?

ఈ నెల 2న దళితులు నిర్వహించిన భారత్ బంద్ లో జరిగిన సంఘటనలపై కూడా చెడ్డీ గ్యాంగ్ ఫేక్ న్యూస్ ప్రచారం మొదలు పెట్టింది. ఓ పోలీసును దళితులు కొట్టి చంపారని చెబుతూ దళితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంపై విషం చిమ్ముతూ ప్రచారం మొదలుపెట్టారు.

ఆ న్యాయమూర్తిని హత్య చేసిందెవరు ?

మరణవార్త చెప్పిన ఆర్‌ ఎస్‌ ఎస్‌ కార్యకర్తే మూడు రోజుల తర్వాత లోయా మొబైల్‌ ఫోన్‌ తెచ్చి కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఆ ఫోన్‌లో డాటా అంతా చెరిపేయబడి ఉంది. ఆయనను బలవంతపెట్టి నాగపూర్‌కు తీసుకువెళ్లిన సహన్యాయమూర్తులు మృతదేహంతోనూ రాలేదు, అంత్యక్రియలకూ ...

సాదువుల హత్య కేసు:101 మంది అరెస్ట్‌... ఒక్క ముస్లిం కూడా లేడు

సాదువుల హత్య కేసులో ఇప్పటివరకు 101 మందిని అరెస్ట్ చేశామని మహారాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. వారంతా హిందువులేనని, అందులో ముస్లింలు ఒక్కరు కూడా లేరని రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్ముఖ్‌ బుధవారం తెలిపారు.

తలలు నరకడానికి శిక్షణ ప్రారంభం !

యోగీ ఆధిత్యానాథ్ నాయకత్వంలో ఆయోధ్యలో రామ మందిరం నిర్నిస్తామని, దానికి ఎవరైనా అడ్డొస్తే తలలు నరికి వేస్తామని మూడు రోజుల కింద ప్రకటించిన ఆయన అందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. దూల్ పేటలో సాయుధ శిక్షణ ప్రారంభించాడు....

51 University VCs Attend RSS Workshop on Making Education More Indian

Over 721 academicians and experts including 51 Vice Chancellors of various central and state universities attended a two-day workshop organised by the RSS over the weekend hosted in the national capital....

దేశానికి రానున్నవి చీకటిరోజులు

భారతదేశంలో హిందువులలోనూ ముస్లింలలోనూ అత్యధికులు మతతత్వానికి గురైనవాళ్లేనని నా అభిప్రాయం. నా చిన్నతనంలో నా హిందూ బంధువులూ మిత్రులూ చాల మంది ముస్లింల మీద విషం కక్కుతుండడం నేను చూశాను. కాకపోతే వాళ్లు అలా మాట్లాడుతున్నప్పుడు పక్కన ముస్లిం లేకుండా చూసే జాగ్రత్త తీసుకునేవారు. ఇవాళ ఒక ముస్లింను కొట్టి చంపేశారంటే చాలమంది హిందువులకు అది పట్టడమే లేదు. బహుశా కొందరు

వాహనాలను తనిఖీ చేసిన ఆరెస్సెస్ కార్యకర్తలను విమర్షించినందుకు ప్రొఫెసర్ ను తొలగించిన యూనివర్సిటీ

తెలంగాణ రాష్ట్రం యాదగిరి భువనగిరిజిల్లాలో హైదరాబాద్ వరంగల్ హైవేపై ఖాకీ ప్యాంట్, వైట్ షర్ట్ వేసుకొని చేతిలో లాఠీలు పట్టుకున్న‌ ఆరెస్సెస్ కార్యకర్తలు రోడ్డుపై వెళ్తున్న‌ వాహనాలను ఆపి చెక్ చేసిన ఘటనపై పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది.

సావర్కర్ పుట్టినరోజున స్కూలు పిల్లలకు కత్తులు పంచిన హిందూ మహాసభ‌ !

ʹరాజకీయాలను హిందూమయం చేయడం హిందువులను సాయుధలను చేయడం సావర్కర్ కల మొన్నటి ఎన్నికల్లో అద్భుత విజయం ద్వారా సావర్కర్ కల లోని మొదటి భాగాన్నిమోడీ పూర్తి చేశాడు. రేండోది మేము చేస్తున్నాంʹʹ

జై శ్రీరాం అనలేదని అన్సారీని కొట్టి చంపినవాళ్ళే మరో వ్యక్తిని రైల్లో నుండి తోసేశారు.

దక్షిణ 24 పరగణా లోని కానింగ్ నుండి హుబ్లీకి రేల్లో వెళ్తున్న 26 ఏండ్ల హఫీజ్ మహ్మద్ షారూఖ్ హల్దర్ అనే యువకుడిపై ఓ మూక డాడి చేసి దారుణంగా కొట్టింది. హఫీజ్ ప్రయాణిస్తున్న రైలులో కొందరు జై శ్రీరాం నినాదాలిస్తూ ఇతన్ని చూసి వెక్కిరించడం ప్రారంభించారు. చివరకు శృతి మించి హఫీజ్ ను కూడా జై శ్రీరాం అనే నినాదాలివ్వాలని బలవంతం చేశారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మురికి