లాక్ డౌన్: ఆకలితో,దాహంతో 230 కిలోమీటర్లు నడిచి ప్రాణాలు విడిచిన అభాగ్యురాలు
కర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింధనూరు పట్టణంలోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన గంగమ్మ(27) దంపతులు ఉన్న చోట బతుకుదెరువు లేక బెంగళూరుకు వలసపోయి కెంగేరి ఏరియాలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తున్నారు. ఉండీ లేక అలా బతుకులు వెళ్ళదీస్తున్న వాళ్ళపై లాక్‌డౌన్ బండపడింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ తో భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. కూలీలంతా అక్కడి నుండి వెళ్ళిపోవాలని కాంట్రాక్టర్ ఆదేశించాడు. దాంతో అక్కడ ఉండడానికి జాగా కరువైంది. తినడానికి తిండి కరువైంది.
ఇక గంగమ్మ దంపతులతోపాటు కూలీలందరికి స్వంత ఊర్లకు పోవడం తప్ప మరో దారిలేకపోయింది. వెళ్ళడానికి ఏ వాహనం దొరక్క కూలీలందరూ ఓ ట్రాక్టర్ ను మాట్లాడుకొని మార్చి 30వ తేదీన బెంగళూరు నుంచి సింధనూరుకు బయలుదేరారు. వీళ్ళ ట్రాక్టర్ తుమకూరు రాగానే పోలీసులు ట్రాక్టర్‌ను ఆపేశారు. అక్కడి నుండి వెళ్ళడానికి వీలులేదని ఆదేశించారు. ఇక చేసేదేమీ లేక కూలీలంతా కాలి నడకన బయలుదేరారు. 230 కిలోమీటర్ల దూరం ఉన్న బళ్ళారికి ఎండలో మూడు రోజులపాటు నడిచారు. అప్పటికే ప్రజల్లో కరోనా వైరస్ భయం పట్టుకోవడంతో తోవలో ఎక్కడకూడా వీళ్ళకు ప్రజలెవ్వరూ కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు. ఆహారం దొరకలేదు.
ఆకలితో... దాహంతో... మూడు రోజులు నడిచి ఏప్రిల్ 2వ తేదీన బళ్ళారి చేరుకున్నారు కూలీలు. బళ్ళారి చెక్ పోస్ట్ వద్ద వాళ్ళను ఆపేసిన పోలీసులు అక్కడున్న పునరావాస కేంద్రానికి తీసుకెళ్ళారు. అయితే అప్పటికే మూడు రోజులుగా అన్నం, నీరు లేక, నడిచీ నడిచీ వచ్చిన గంగమ్మ తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. దాంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్సపొందుతూనే గంగమ్మ కన్ను మూసింది.
Keywords : gangavva, death, migrant, karnataka, corona, lockdown
(2023-11-28 02:45:33)
No. of visitors : 6009
Suggested Posts
| ఆరెస్సెస్ వారు ఏ హక్కుతో తనిఖీలు చేస్తున్నారు ? ఇది చట్ట విరుద్దం కాదా ?
తెల్ల షర్ట్, ఖాకీ ప్యాంట్, నల్ల టోపీ, చెతులో లాఠీతో రోడ్డుపై పోయేవారి పత్రాలు చెక్ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజల్లో ఆందోళన కలిగించింది. ఆ ఫోటోల్లో ఆరెస్సెస్ వారు వాహనదారులను ఆపి చెక్ చేస్తున్న స్థలంలో పోలీసులు కూడా ఉండటం...వీరికి పోలీసుల అనధికార మద్దతు ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. |
| కరోనా నేపథ్యంలో పోలీసులపై దాడులు ఆపేస్తున్నాం - మావోయిస్టు పార్టీకరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో పోలీసులపై ఎటువంటి దాడులకు పాల్పడబోమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ సమయంలో కరోనా వైరస్ పై ప్రజలను చైతన్యపరుస్తామని మావోయిస్టు పార్టీ మల్కనగిరి- కొరాపుట్ విశాఖ బోర్డర్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం ఓ లేఖ, ఆడియో టేపు విడుదల చేశారు. |
| కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటనలాక్ డౌన్ ప్రకటించే సమయంలో వీరి భద్రత, సంరక్షణ విషయంలో ప్రధానమంత్రి ఎలాంటి ప్యాకేజిని ప్రకటించలేదు. భయకంపితులైన కూలీలు ఒక్కసారి రోడ్ల మీదకు వచ్చి తమ గ్రామాలకు వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వం నిలిపివేసింది. దానితో వేలాది మంది కూలీలు కాలినడకన సుదూర ప్రాంతాలకు తమ పల్లెలు చేరుకోవడానికి కాలినడక ప్రారంభించారు. ప్రజల దయనీయ పరిస్థ |
| లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹకరోనా వైరస్ భయంతో భారత దేశం లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది పేద వలస కార్మికులు నగరాల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నగరాల నుండి తమ గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్ళడానికి వాహనాలు లేక వందలాది కిలోమీటర్లు |
| లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పోలీసుల కారణంగా ప్రజల ప్రాణాల మీదికి తెస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగానే కొనసగుతోంది. |
| మావోయిస్టు పార్టీ ప్రకటన పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి...పౌరహక్కుల సంఘంకరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మావోయిస్టు పార్టీ, పోలీసులపై ఎలాంటి దాడులు చేయబోమని ,స్వీయ నియంత్రణ పాటిస్తామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం.ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది. |
| లాక్ డౌన్ కాలంలో కార్మికులకు వేతనాలు ఇవ్వాల్సిన అవసరంలేదు -పార్లమెంటరీ కమిటీ దుర్మార్గ సిఫార్సులాక్ డౌన్ కాలంలో కార్మికులకు వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని కార్మికుల కోసం ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ గురువారం దుర్మార్గమైన సిఫార్సు చేసింది. |
| వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల కష్టాలు, వారిపై పోలీసుల దౌర్జన్యాలు అంతులేకుండా ఉన్నాయి. గ్రామాల్లో బతకడానికి మార్గం లేక పట్టణాల్లో కూలీ పని చేసుకొని బతుకుతున్న వలస కూలీలు లాక్ డౌన్ తో అష్టకష్టాలు పడుతున్నారు. |
| 8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడకఆమె పేరు యాస్మీన్. ఆమెకు 8 నెలల గర్భం.... తన భర్త వకీల్ తోకలిసి తినడానికి తిండి దొరకక, తాగడానికి గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకక 100 కిలోమీటర్లు నడిచింది. ఆకలితో..అలసటతో...నడక తప్ప మరో దారి లేక నడక...నడక... |
| అత్యవసర డ్యూటీ నుండి వస్తున్న డాక్టర్లపై పోలీసుల లాఠీ చార్జ్... చేయి విరిగిన డాక్టర్మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లోని ఎయిమ్స్ డాక్టర్లు ఇద్దరిని పోలీసులు దారుణంగా కొట్టారు. రీతూ, యువరాజ్ అనే డాక్టర్లు బుధవారం సాయంత్రం ఆస్పత్రిలో అత్యవసర విధులను ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు పోలీసులు దాడి చేశారు. |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
| మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ |
| యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు |
| నేటి నుంచి అమర వీరుల సంస్మరణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
|
| త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల |
| భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! |
| RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
|
more..