include 'men';
?>
రిలియన్స్ పవర్ దుర్మార్గం....ఇద్దరు మృతి, నలుగురు గల్లంతు
రిలయన్స్ కంపెనీ దుర్మార్గానికి ఇద్దరు మరణించగా నలుగురు వ్యక్తుల ఆచూకీ తెలిఅయడం లేదు. నిబందనలు పాటించకుండా ఓ గ్రామ సమీపంలో విద్యుత్ ప్లాంట్ బూడిద వ్యర్థాలు కుమ్మరించడంతో ఆ గ్రామంలో అనేక ఇళ్ళు బూడిదతో కప్పబడిపోయాయి. ఈ దారుణ ఘటనలో ఆ గ్రామానికి చెందిన 6గురు గల్లంతయ్యారు. అయితే రెస్క్యూ టీం బూడిద కుప్పలోంచి 35 ఏళ్ళ వ్యక్తి , 8 ఏండ్ల బాలుడి మృతదేహాలు బైటికి తీసింది. మరో 4గురి జాడ తెలియాల్సి ఉంది. అయితే ఆ నలుగురు కూడా ఆ బూడిద కింద సజీవ సమాధి అయిపోయి ఉంటారని గ్రామస్తులు అంటున్నారు. మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలి జిల్లాలోని బొగ్గు ఆధారిత రిలయన్స్ విద్యుత్ ప్లాంటు శుక్రవారం సాయంత్రం కృత్రిమ చెరువులోకి విడుదలచేసిన బూడిద వ్యర్థాలు ఆ గ్రామాన్ని కప్పేశాయి. నిబంధనలు పాటించకుండా గ్రామ సమీపంలోనే విద్యుత్ ప్లాంట్ బూడిద వ్యర్థాలు కుమ్మరించడంతో ప్రమాదం జరిగిందని జిల్లా కలెక్టర్ కేవీఎస్ చౌధరి అన్నారు. ఈ ఘటనకు బాధ్యత పూర్తిగా రిలయన్స్ సంస్థదే అని ఆ సంస్థ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. స్థానికంగా ఇళ్లను భారీ ఎత్తున బూడిద కప్పేయడంతో 5గురు గల్లంతయ్యారని తెలిపారు. మరో ఇద్దరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలి జిల్లా 21 వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న బొగ్గు ఆధారిత 10 విద్యుత్ ప్లాంట్లతో అత్యంత కాలుష్యమయమైన పారిశ్రామిక ప్రాంతంగా మారింది. ఈ ప్లాంట్ల నుండి వెలువడే బూడిద గ్రామాలను కప్పేయడం సంవత్సర కాలంలో ఇది మూడో సంఘటన. ఇక్కడ పంట పొలాల్లో మేటలు వేసిన బూడిద వ్యర్థాల ఫొటోలు విద్యుత్ ఉత్పత్తి సంస్థల నిర్లక్ష్యాన్ని చూపుతున్నాయి. 2019 ఆగస్టులో ఎన్టీపీసీ నిర్వహణలో ఉన్న ఎస్సార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. నాడు ఘటనా ప్రాంతాన్ని సందర్శించిన గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యులు.. విద్యుత్ కంపెనీలకు నోటీసులు కూడా జారీ చేసింది. వ్యర్థాల నిర్వహణలో పటిష్ట చర్యలు తీసుకుంటామని హామీనిచ్చిన కంపెనీలు అనంతరం వాటిని పట్టించుకోలేదు.
ఈ ప్రమాద ఘటనపై స్పంధించిన రిలయన్స్ పవర్ ఓ ప్రకటన విడుదల చేసింది..: "బూడిద డంప్ యార్డ్ గోడ కూలడం వల్ల ఈ ఘటన జరిగింది. కొన్ని ఇళు మాత్రమే బూడిదతో కప్పబడ్డాయి. కొద్దిగా భూమి ప్రభావితమయ్యింది. ఈ సంఘటనకు గల కారణాలను పరిశీలిస్తున్నాము. సహాయక చర్యలకు అంతరాయం కలిగించని విధంగా ప్లాంట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయిʹʹ అని తెలిపింది.
గత ఏడాది ఈ ప్రాంతంలోని విద్యుత్ ప్లాంట్ కు వ్యతిరేకంగా స్థానికులు నిరసన ప్రదర్శన చేశారు. "మూడు నెలల క్రితం, రిలయన్స్ పవర్ ప్లాంట్ బూడిద లీక్ చేసినందుకు మేము నిరసన వ్యక్తం చేసాము. ఇకపై ఎటువంటి ఉల్లంఘన జరగదని కంపెనీ మాకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్ తనిఖీలు జరిపారు. ఇకపై ఇలాంటివి జరగవని వారు కూడా మాకు హామీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ప్రమాదం జరిగింది. ఒక్క రిలయన్స్ కంపెనీనే కాదు జిల్లా యంత్రాంగాన్ని కూడా నిందించాలి " అని స్థానికుడు సందీప్ విలేకరులతో అన్నారు.
"ఈ విద్యుత్ ప్లాంట్ల వల్ల వేలాది ఎకరాల భూమి పాడైంది, పంటలు దెబ్బతిన్నాయి. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఇవ్వాళ్ళ ఇద్దరు చనిపోయారు, మరో నలుగురు ఏమయ్యోరో తెలియడం లేదు. ఈ దుర్మార్గంపై విద్యుత్ ప్లాంట్ సిఇఒ, జిల్లా యంత్రాంగంపై కేసులు పెట్టాలి" అని ఆయన అన్నారు.
ఈ సంఘటనలు పొరపాట్లుగానో, ఏదో చిన్న నిర్లక్ష్యంగానో చూడలేం. దేశంలో ప్రజల ప్రాణాల పట్ల, వారి జీవితాలపట్ల పెట్టుబడిదారులకు, వారికి మద్దతుగా నిల్చే ప్రభుత్వాలకు ఎంత చిన్న చూపో ప్రతి రోజూ జరిగే ఇటువంటి సంఘటనలు రుజువు చేస్తాయి.
Keywords : reliance, madhyapradesh, singrur district, power plant
(2025-02-05 15:13:20)
No. of visitors : 1402
Suggested Posts
| ఆదివాసీ యువతిపై దాడి చేశారు...నగ్నంగా ఊరేగించారు..ఓ గుంపు ఓ ఆదివాసీ మహిళ పై అనాగరికంగా.... దుర్మార్గంగా... దాడి చేశారు. ఆమె పట్ల అతి నీచంగా ప్రవర్తించారు. మధ్య ప్రదేశ్ లో మంత్రగత్తె అనే నెపంతో ఓ యువతి పట్ల గ్రామస్తులు... |
| హద్దుల్లేని మత పిచ్చి - మూర్ఖత్వం అనంతం
బస్సో, రైలో, విమానమో నడుపుతున్నది ముస్లిం అని తెలిస్తే మధ్యలో గెంతెయ్యాలి . ఈవీఎం మెషీన్లని తయారుచేసేవాడు ముస్లిమో క్రిస్టియనో అయితే వోటేయ్యడం మానెయ్యాలి. ఇమిగ్రేషన్ కౌంటర్లో వున్నది ముస్లిమో, క్రిస్టియనో అయితే విమానమెక్కకుండా వెనక్కి వచ్చేయాలి. ఇంతకీ క్రిస్టియన్లు కనిపెట్టిన నడుపుతున్న ట్విట్టర్, పేస్బుక్ లను వాడడం మానెయ్యాలి. ముస్లిం దేశాల గాలి సోకకుం |
| లారీతో తొక్కించి జర్నలిస్ట్ ను హత్య చేసిన ఇసుక మాఫియాఈ అవినీతిలో ఉన్న ప్రజా ప్రతినిధుల పేర్లను పూర్తి ఆధారాలతో బయటపెడతానని ఆయన చెప్పారు కూడా. అయితే సోమవారం ఉదయం ఆయన విధులకు వెళ్తున్న క్రమంలో ఓ లారీ ఆయన్ని ఢీ కొట్టింది. వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారొచ్చి సందీప్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. |
| CPI Maoist Extends Support to Peasants On Strike In Madhya PradeshExtending support to the farmersʹ strike in Madhya Pradesh and other states, Outlawed Communist Party of India (Maoist) have dropped pamphlets and put up banners expressing solidarity with the agitating peasants.... |
| బీజేపీకి వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు జర్నలిస్టులపై దుర్మార్గం - అర్ద నగ్నంగా నిలబెట్టిన పోలీసులుమధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో స్థానిక బీజేపీ శాసనసభ్యుడు కేదార్‌నాథ్ శుక్లాకు వ్యతిరేకంగా వార్తలు రాశారనే కోపంతో ఆయన ఆదేశాలతో పోలీసులు 8 మంది జర్నలిస్టులను అరెస్టు చేశారు. వాళ్ళందరినీ అర్దనగ్నంగా డ్రాయర్లమీద పోలీసు స్టేషన్ లో నిలబెట్టి ఫోటోలు తీశారు. దారుణంగా అవమానించారు. వారిపై అక్రమ కేసు బనాయించారు. |
| దానమడిగినందుకు పసివాణ్ణి తన్నిన మంత్రిఓ వీధి బాలుడు దానం అడిగినందుకు ఆ మంత్రికి కోపమొచ్చింది. ఆ బాలుడిని కాలితో తన్ని వెళ్ళి పోయింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని పశు సంవర్థకశాఖ మంత్రి కుసుమ్ మెహడేలే చేసిన ఈ అమానవీయ చర్య.... |
| ఆర్ఎస్ఎస్ కు భజన చేస్తున్న పోలీసు అధికారులుప్రభుత్వ శాఖలను పూర్తిగా కాషాయమయం చేస్తున్నారంటూ విమర్శలు వినవస్తున్న నేపథ్యంలో ఆ విమర్షలను నిజం చేస్తూ మధ్యప్రదేశ్ నార్కోటిక్స్ విభాగం ఓ క్యాలెండర్ ప్రచురించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కొటేషన్లతో పాటు వారి ఫోటోలను ఈ క్యాలెండర్లలో ప్రచురించి ఆర్ఎస్ఎస్ పై భక్తిని చాటుకున్నారు ఆ పోలిసు అధికారులు....
|
| Custodial Violence in MP:లాకప్ లో ఆదివాసులపై చిత్ర హింసలు, యువకుడి మృతి...భగ్గుమన్న ఆదివాసులుమధ్యప్రదేశ్ ,ఖార్‌గోన్‌లో పోలీసు కస్టడీలో ఓ ఆదివాసీ యువకుడిని తీవ్ర చిత్రహింసలు పెట్టి, హత్య చేసినందుకు నిరసనగా వేలాదిమంది ఆదివాసీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. |
| దళితుడు,RTI కార్యకర్తపై దుర్మార్గమైన దాడి - మూత్రం తాగించే ప్రయత్నం
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన సమాచారం కోరినందుకు 33 ఏళ్ల దళిత సమాచార హక్కు (RTI) కార్యకర్తను ఏడుగురు వ్యక్తులు కొట్టి, బలవంతంగా మూత్రం తాగించారని |
| లాక్ డౌన్ నిబందనలు బేఖాతరు... ఓ స్వామీజీ అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి సహా వేలాది మంది జనంవ్ ప్రభాకర్ శాస్త్రి పూర్తి ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ ఆదివారం చనిపోయారు ఆయన అంఅత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. ఆ అంత్యక్రియల్లో భౌతిక దూరం నిబంధనలను పక్కనపెట్టి వేలాదిగా జనం గుమికూడారు. అంతిమయాత్రలో ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయవర్గీయ, మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కమల్ |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..