పిల్లవాడిని మోసుకొని రోదిస్తూ పరిగెడుతున్న ఆ తల్లి కష్టానికి కారణమెవరు ?


పిల్లవాడిని మోసుకొని రోదిస్తూ పరిగెడుతున్న ఆ తల్లి కష్టానికి కారణమెవరు ?

ఓ తల్లి తన చిన్నారిని ఎత్తుకొని బోరున ఏడుస్తూ పరిగెడుతున్న దృశ్యం హృదయం ఉన్నవాళ్ళెవరికైనా కన్నీళ్ళు తెప్పిస్తుంది. ఆ తల్లి ఎందుకలా పరిగెడుతోంది ?

బీహార్ రాష్ట్రం జెహనాబాద్ జిల్లా లోని షాహోపూర్ గ్రామానికి చెందిన గీరెజ్ కుమార్ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి,ఒక కొడుకు కొడుకుకు మూడేళ్ళు. కొద్ది రోజులుగా కొడుకు రిషుకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళారు. అక్కడి డాక్టర్ పిల్లవాడిని పట్నం తీసుకెళ్ళమని చెప్పాడు. అంబులెన్స్ లు లేకపోవడంతో ఓ టెంపో మాట్లాడుకొని జెహానాబాద్ సదర్ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అప్పటికే చిన్నారి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. కండీషన్ సీరియస్ గా ఉన్నప్పటికీ ఆ పిల్లవాడికి కనీస ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు డాక్టర్లు. పైగా రిషుని పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMCH)కు తీసుకెళ్ళమని చెప్పారు. అంబులెన్స్ కూడా ఇవ్వలేదు. రిషు తల్లి ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఆస్పత్రి ముందు నిలబడ్డ అంబులెన్స్ ల దగ్గరికి వెళ్ళి ప్రతి డ్రైవర్ ను బతిమిలాడుకుంది. అయినా ఎవ్వరూకూడా ఆ పిల్లవాడిని పాట్నా తీసుకెళ్ళడానికి ఒప్పుకోలేదు. లాక్ డౌన్ కారణంగా ఇతర వాహనాలేవీ దొరక లేదు. ఇక చివరకు చేసేదేమీలేక ఆ తల్లి ఆ పిల్లవాడిని ఎత్తుకొని దాదాపు 50 కిలోమీటర్లు నడిచి వెళ్ళడానికి సిద్దపడింది. బోరున ఏడుస్తూ పరుగులాంటి నడకతో పిల్లవాడిని మోస్తూ వెళ్ళింది. వెనక అమ్మాయిని ఎత్తుకొని గీరెజ్ కుమార్ పరిగెత్తాడు. కొద్ది దూరం వెళ్ళగానే చిన్నారి రిషి తల్లి ఒడిలోనే ప్రాణాలు వదిలేశాడు.

ʹʹజెహనాబాద్ ఆసుపత్రి ముందు రెండు మూడు అంబులెన్సులు నిలిపి ఉన్నాయి. కాని మమ్మల్ని పాట్నాకు తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదు. మేము వారిని చాలా బతిమిలాడాం, సహాయం చేయమని కోరాము కాని ఎవరూ సహాయం చేయలేదు. నా కొడుకు చనిపోయాడుʹʹ అని రిషు తండ్రి గిరిజేష్ కుమార్ అన్నారు.

శుక్రవారం సాయంత్రం పిల్లవాడి మరణం గురించి తెలుసుకున్న అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఎడిఎం) ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు జెహానాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ నవీన్ కుమార్ ది టెలిగ్రాఫ్ పత్రికకు తెలిపారు.

"ఒక ADM, సివిల్ సర్జన్ నిర్వహించిన సంయుక్త దర్యాప్తు నివేదికపై ఆధారపడి కాంట్రాక్టు ఉద్యోగి అయిన హాస్పిటల్ మేనేజర్ సేవలను మేము నిలిపివేసాము. ఈ సంఘటన జరిగినప్పుడు విధుల్లో ఉన్న ఇద్దరు వైద్యులు, నలుగురు నర్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము సిఫార్సు చేసాము.ʹʹ అని నవీన్ శనివారం అన్నారు.

ఈ సంఘటనపై జెహానాబాద్ సదర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ʹబాలుడిని చివరి దశలో తీసుకువచ్చారు. అతను బతికే అవకాశాలు చాలా తక్కువ. అంబులెన్స్ డ్రైవర్లు వారిని పాట్నాతీసుకెళ్ళడానికి నిరాకరించింది నిజమే. బహుశా బాలుడు బతకడని గ్రహించి తీసుకెళ్ళకపోవచ్చుʹʹ
కరోనావైరస్ పరీక్షల కోసం ఎందుకు నమూనాలను సేకరించలేదు అని అడిగిన ప్రశ్నకు సూపరింటెండెంట్.. మేము ఏదైనా చేసే లోపే కుటుంబం మృతదేహాన్ని తీసుకెళ్లిందని అన్నాడు.

ʹʹనా కొడుకుకు దగ్గు, జ్వరం వచ్చింది. వెంటనే అతన్ని ఆక్సిజన్ మీద ఉంచి పాట్నా ఆసుపత్రికి తీసుకెళ్లాలని జెహానాబాద్ సదర్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. కానీ మాకు రెండు గంటలు వేచి చూసినా అంబులెన్స్ రాలేదు ʹʹ అని గిరిజేష్ విలేకరులతో అన్నారు.
చనిపోయిన పిల్లవాడిని తీసుకొని గిరిజేశ్ మరియు అతని భార్య తిరిగి జెహనాబాద్ ఆసుపత్రికి వెళ్లి వారి గ్రామానికి తిరిగి వెళ్ళడాడానికి అంబులెన్స్ కావాలని అడిగారు. అప్పుడు కూడా వారికి అంబులెన్స్ లభించలేదు.చివరగా ఆ ప్రాంతానికి చెందిన ఒక సామాజిక కార్యకర్త తన‌ వాహనాన్నివీరికి ఇచ్చి ఊరికి పంపించాడు.

Keywords : bihar, corona, lockdown, hospital, mother, son, doctors
(2020-05-31 20:13:00)No. of visitors : 431

Suggested Posts


Leaders Of CPI Maoist In Bihar Seek To Consolidate Their Cadre Base Amidst State Repression

The CPI(Maoist) leaders in Bihar are trying to consolidate their cadre base and moving places to meet their supporters. Central intelligence agencies have alerted the state police on the movement of top Maoist leaders like Vijay Yadav alias Sandeep ji, Nanadlal Yadav alias Nitesh ji, Indal Bhokta and a few others....

ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి

జార్ఖండ్లో గో మాంసం అమ్ముతున్నాడనే నెపంతో గతేడాది జూన్‌ 29న జార్ఖండ్‌ రాంఘడ్‌కు చెందిన అలిముద్దిన్‌ అన్సారీ అనే 40 ఏళ్ళ వ్యక్తిపై 12 మంది దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అతను అక్కిడిక్కడే మృతి చెందాడు. ఈ దాడిలో పాల్గొన్న వారిలో 11 మందికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు మరణశిక్ష విధించింది.

బీహార్ లో మహా కూటమిదే గెలుపు ?

బిహార్ లో నితీష్, లాలూల జోడీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీహార్ వాసులు మహాకూటమికే పట్టం కడతారని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి.....

భూస్వామ్య సేనల పాలిట సింహ స్వప్నం,భూమిపుత్రుడు అరవింద్‌ - రవి నర్ల

భారతదేశంలోని విప్లవశ్రేణులకూ, బీహార్‌లోని రైతులకూ, రైతు కూలీలకూ, పీడిత ప్రజలకూ, ముఖ్యంగా మగధ్‌ ప్రాంతంలోని పీడిత ప్రజానీకానికందరికీ అత్యంత ప్రియమైన విప్లవ నాయకుడు. బ్రహ్మర్షిసేన, భూమిసేన మొదలుకొని రణవీర్‌ సేన వరకు భూస్వామ్య సేనల పాలిట సింహ స్వప్నంగా నిలిచి వాటిని భూస్థానితం చేసిన ఎర్రసైన్యపు సేనాని.

బాలకపై సామూహిక అత్యాచారం చేసిన దుర్మార్గులు... బాధితురాలికి గుండుగీయించి ఊరేగించిన గ్రామ పెద్దలు

బీహార్ గయ జిల్లాలో జరిగిన ఈ నెల 14న జరిగిన ఈ సంఘటన‌ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 14వతేదీన ఇంటి నుండి బైటికి వెళ్ళిన ఈ బాలికను అదే గ్రామానికి చెందిన కొందరు బలిసిన కుటుంభాలకు చెందిన దుర్మార్గులు కిడ్నాప్ చేసి పంచాయితీ భవనంపైకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. స్పృహతప్పిన ఆ బాలికను అక్కడె వదిలేసి వెళ్ళి పోయారు.

This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader

The internet canʹt stop admiring TV9 Bharatvarsh reporter Rupesh Kumarʹs questioning of a self-proclaimed Bharatiya Janta Party leader who broke ICU rules in a Muzaffarpur hospital.

Search Engine

వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
హిందూత్వ లాఠీలు:న్యాయ‌వాదిపై పోలీసుల దాడి - ముస్లిం అనుకొని కొట్టామని సమర్ధన‌
Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన ఇద్దరు ʹపింజ్రా తోడ్ʹ కార్యకర్తల అరెస్టు
కరోనా వైరస్ విపత్తులో కూడా ప్రజల జీవించే హక్కుకు బాధ్యత ప్రభుత్వానిదే - CLC
చిరు వ్యాపారి వద్ద మామిడి పళ్ళు దోచుకున్న జనం....ఆయన దుంఖం చూసి 8లక్షల డొనేషన్ ఇచ్చిందీ జనమే
more..


పిల్లవాడిని